ఉన్నంతలో మంచి రైల్వే బడ్జెట్ : మమత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : కేంద్ర రైల్వే శాఖమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే "వే లాదిగా ప్రజా ప్రతినిధులనుంచి ఇది చెయ్యాలని, అది చెయ్యాలనీ అభ్యర్ధిస్తూ లేఖలు వచ్చాయ''ని, అయితే ఉన్న పరిమితి వనరులతో చేయగలిగినంతా చేశానని ప్రకటించారు.
ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన రైల్వేలైనులే ఇప్పటికీ దిక్కుగా ఉన్నాయని, ఇక నుంచి కొత్త రైలు మార్గాలపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నానని ఆమె చెప్పారు.
ప్రపంచంలో అన్ని దేశాలూ రైలు మార్గాలపై వేల వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, మనం కూడా ఆ దిశగా పయనించాలని ఆమె ఉద్ఘాటించారు. ఈ బడ్జెట్ నేంచే మనం ఆ పయనం ప్రారంభించదలచినట్టు ఆమె పునరుద్ఘాటించారు.