Tuesday, March 2, 2010

సామాజిక బాధ్యతలో కొత్త పుంతలు

సామాజిక బాధ్యతలో కొత్త పుంతలు

అభివృద్ధి చెందిన దేశాలు, ఆ దేశాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తి ప్రక్రియలో వివిధ సామాజిక అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటాయి. బాలకార్మికత అంశాన్నే ఉదాహరణగా తీసకుంటే, ఆయా సంస్థలు తమ కార్యకలాపాల్లో బాలకార్మికులు స్థానం కల్పించవు. అంతేగాకుండా, తమకు కావాల్సిన వస్తువులను, ముడిపదార్థాలను సరఫరా చేసే సరఫరాదారులు కూడా బాలకార్మికులను ఉపయోగించరాదనే షరతు విధిస్తాయి. ఆ షరతు సక్రమంగా అమలు అవుతున్నది లేనిదీ తెలుసుకునేందకు ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తాయి. సరఫరాదారులెవరైనా ఈ నిబంధనను ఉల్లంఘించినట్లుగా రుజువైన పక్షంలో వారితో తమ వ్యాపార సంబంధాలను తెంచుకునేందుకు కూడా ఈ సంస్థలు సిద్ధపడుతాయి. ఐఫోన్‌, ఐపాడ్‌, మెకింతోష్‌ కంప్యూటర్‌ తయారీదారు అయిన ఆపిల్‌ సంస్థను, విత్తనోత్పత్తి సంస్థ బాయర్‌ క్రాప్‌సైన్స్‌ లాంటివాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. బాలకార్మికత అంశంపై ఆయా సంస్థలు వ్యవహరించే తీరును పరిశీలిస్తే....



సప్లయర్లు తప్పు చేశారు
appleగత ఏడాది తమ సప్లయర్లు 11 మంది తక్కువ వయస్సు ఉన్న కార్మికులను నియమించుకున్నట్లు ఆపిల్‌ సంస్థ వెల్లడించింది. అది తనకు గల 102 ఉత్పాదన కేంద్రాలను ఆన్‌సైట్‌ ఆడిట్‌ చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. ఆయా దేశాల్లో కనీస ఉపాధి వయస్సు 16 ఏళ్ళుగా ఉన్న సందర్భంలో, మూడు ఉత్పాదన కేంద్రాలు 15 ఏళ్ళలోపు కార్మికులను 11 మందిని నియమించుకున్నట్లుగా వెల్లడైంది. ఆపిల్‌ సంస్థ తన వెబ్‌సైట్‌లో కూడా ఈ నివేదికను ఉదహరించింది. ఆడిట్‌ సమయం నాటికి మాత్రం అలాంటి వారెవ్వరూ కొనసాగడం లేదని స్పష్టం చేసింది. డిసెంబర్‌ 2009 నాటికి, ఆపిల్‌ సంస్థ చైనా, చెజ్‌ రిపబ్లిక్‌, మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, థాయ్‌లాండ్‌, అమెరికాలలోని 190 కేంద్రాలను ఆడిట్‌ చేసింది.

bayer-girl సప్లయర్‌ రెస్పాన్సిబిలిటీ పేరిట రూపొందించిన ఈ నివేదికలో తప్పిదాలకు పాల్పడిన సప్లయర్ల, తయారీ కేంద్రాల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆడిట్‌ సందర్భంగా, 17 ముఖ్యమైన విధాన ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో అధిక భాగం కార్మిక చట్టాలకు, తక్కువ వయస్సు ఉన్న వారిని నియమించడం లాంటివాటికి సంబంధించినవేనని నివేదిక తెలిపింది. సుమారు 60 కేంద్రాల్లో కార్మికులు సాధారణ పనివేళలను మించి కూడా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

bayer-logo 57 కేంద్రాల్లో కార్మికులకు సరైన ప్రయోజనాలు దక్కడం లేదని తేలింది. 24 మంది సరఫరాదారులు తమ సిబ్బందికి కనీసవేతనాల కన్నా తక్కువ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లుగా కూడా నివేదిక పేర్కొంది. వారానికి గరిష్ఠంగా 60 గంటల పాటు పని చేయాలన్నది, వారానికి ఒక రోజు సెలవు ఉండాలన్నది ఆపిల్‌ అనుసరించే విధానం. ఉల్లంఘనలు తరచూ జరిగిన నేపథ్యంలో, ఆయా అంశాలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోనందుకు గాను ఒక సప్లయర్‌తో ఆపిల్‌ తన కార్యకలాపాలను నిలిపివేసినట్లు కూడా ఈ నివేదిక వెల్లడించింది.

బాల కార్మికుల ఉన్నతికి చైల్డ్‌కేర్‌ ప్రోగ్రామ్‌
పత్తి విత్తనోత్పత్తి క్షేత్రాల్లో సగటున ఎకరానికి ఆరుగురు పిల్లలు పని చేస్తున్నట్లు కొన్ని ప్రభుత్వేతర సంస్థల అధ్యయనాల్లో వెల్లడైంది. బాయర్‌ క్రాప్‌సైన్స్‌ మాత్రం కంపెనీ ఉత్పత్తి ప్రాంతంలో బాలకార్మికత సున్నా స్థాయిలో ఉండేలా చూడగలు గుతోంది. అరుదుగా, ఒక్కోసారి బాలకార్మికులను ఉపయోగి స్తున్న రైతుల ఉదంతాలు బయటపడుతుంటాయి. అలాంటి సంద ర్భాల్లో శిక్షితులైన కంపెనీ సిబ్బంది వెంటనే ఆ సమస్యను పరిష్క రిస్తారు. ఇందుకుగాను సంస్థ ప్రత్యేకించి చైల్డ్‌ కేర్‌ ప్రోగ్రామ్‌ అ మలుకు గాను పూర్తి స్థాయి వనరులతో కూడిన అంతర్గత సంస్థ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ నూతన చైల్డ్‌ కేర్‌ సంస్థ నైపుణ్యవంతమైన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయగలిగింది. తద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రయత్నాల ప్రభావాన్ని, సామర్థ్యాన్ని పెంచగలిగింది.

bayers తద్వారా అది, బాలల హక్కుల రక్షణ కు బాయర్‌ కంపెనీ తన అంకితభావాన్ని చాటుకోవడంలో సుస్థి రదాయక విజయం సాధించేలా చేస్తోంది. అసోసియేషన్‌ ఆఫ్‌ సీడ్‌ ఇండస్ట్రీ (ఏఎస్‌ఐ) తరహాలో రూపుదిద్దుకున్న చైల్డ్‌ లేబర్‌ ఎరాడికేషన్‌ గ్రూప్‌ (సీఎల్‌ఈజీ) వ్యవస్థాపక సభ్యురాలిగా రెండే ళ్ళ పాటు నిలకడతో కూడిన కార్యాచరణ, అవగాహన పెంపు కార్యక్రమాల మూలంగా ఈ కార్యక్రమం బహుళ స్థాయి కార్యా చరణ కార్యక్రమంగా మారింది. 2003-2005 మధ్యకాలంలో, బాలకార్మికతను సంస్థ ఆమోదించబోదనే విషయాన్ని రైతుల హృదయాల్లో స్పష్టంగా నాటుకునేలా చేసేందుకు సంస్థ ముమ్మర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. రైతుల ధోరణిలో మార్పు తెచ్చే ఉద్దేశంతో బాయర్‌ క్రాప్‌సైన్స్‌ ఈ చైల్డ్‌ కేర్‌ ప్రోగ్రామ్‌ను ఆరంభించింది.

bayereఅధునాతన పర్యవేక్షణ కార్యక్రమం, ప్రోత్సాహకాలు కోత విధింపుల పథకం, ఆర్థిక సంస్థల సహకారంతో సూక్ష్మ రుణ కార్య క్రమం, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు, సస్యరక్షణ ఉత్పా దనల సురక్షిత వాడకానికి ఉద్దేశించిన శిక్షణ కార్యక్రమం టార్గెట్‌ 400 లాంటివన్నీ ఈ చైల్డ్‌ కేర్‌ ప్రోగ్రామ్‌లో అంతర్భాగంగా ఉం టాయి. బాలకార్మికతను ఎట్టిపరిస్థితిలోనూ సహించబోమన్న (జీ రో చైల్డ్‌ లేబర్‌) కంపెనీ విధానాలకు అనుగుణంగా, తమ విత్త నోత్పత్తి క్షేత్రాల్లో కేవలం పెద్దవారితో మాత్రమే పని చేయించు కుంటామని ఒప్పందం ద్వారా ధ్రువీకరించిన వారితో మాత్రమే కంపెనీ కలసి పని చేస్తుంది.

బాలకార్మికులు లేని విత్తనోత్పత్తి క్షేత్రాలు ఉండేలా చూసేందుకు, ఎన్నో నియంత్రణ బృందాలు మొత్తం విత్తనోత్పత్తి ప్రాంతాన్ని ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రతి సీజన్‌లోనూ పలుమార్లు ఆకస్మికంగా తనిఖీ చే స్తుంటాయి. ఒకటీ, అరాగా ఎప్పుడైనా ఏదైనా కాంట్రాక్టు విత్తనో త్పత్తి క్షేత్రంలో బాలలెవరైనా పని చేస్తూ కన్పిస్తే, ఆ రైతులను తక్షణం హెచ్చరించి, సమస్య తీవ్రతపై వారికి అవగాహన కల్పి స్తారు. పలు మార్లు గనుక ఈ విధమైన కాం ట్రాక్టు ఉల్లంఘన జరిగితే, రై తులు చివరకు తమ సరఫరా కాంట్రాక్టు రద్దు అయ్యే పరిస్థితి ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంస్థ అనుసరిస్తున్న ప్రోత్సాహకాలు కోత విధింపు పథకం కింద బాలకార్మికులను ఉపయోగించని విత్తనోత్పత్తిదారులు తమ విత్తనాలకు సాధారణ సేకరణ ధరకు అదనంగా బోనస్‌ను పొందగలుగుతారు. బాలకార్మికులను సాధారణ పాఠశాలలకు వెళ్ళేలా సంసిద్ధం చేసేందుకు తాము క్రియేటివ్‌ లెర్నింగ్‌ సెంటర్స్‌ పేరిట బ్రిడ్జ్‌ స్కూల్స్‌ను కూడా నిర్వహిస్తున్నామని సంస్థ తెలిపింది.