Tuesday, November 20, 2012

స్టాక్ మార్కెట్లు అంటే ఏమిటి..?

ఈక్విటీస్‌లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేసిన సందర్బాలలో బుల్ మార్కెట్ మరియు బీర్ మార్కెట్ అనే పదాల గురించి వినే ఉంటారు. మార్కెట్ రంగంలోకి తొలిసారి వెళ్లినప్పుడు ఈ పదాలను అర్దం చేసుకోవడం కొంచెం కష్టం.

షేర్ అంటే వాటా అని అర్ధం. ఒక కంపెనీ/పరిశ్రమ అభివృది కోసం ఆసక్తి ఉన్నవారి నుంచి పెట్టుబడి స్వీకరిస్తారు. అంటే అలా పెట్టుబడి పెట్టినవారు ఆ కంపెనీలో షేర్ హోల్డర్స్ అన్న మాట. వారందరికి కంపెనీలో వాటా ఉన్నట్టు. కంపెనీకి లాభాలు వస్తే వాటిని షేర్ హోల్డర్స్ కు పంచుతారు. ఆ విధంగా షేర్ విలువ పెరుగుతుంది. ఈ విధంగా బిఎస్ఈ లో నమోదు చేసుకున్న కంపెనీలలో ఎక్కువ కంపెనీల షేర్లు లాభాలలో ఉంటె సెన్సెక్స్ లాభాల బాట పడుతుంది. దీనినే బుల్స్ అంటారు. ఎక్కువ కంపెనీల షేర్లు నష్టాలలో ఉంటె సేన్సెక్స్ గీత కిందికి చూపిస్తుంది. దీనినే బేర్స్ అంటారు.

బుల్ మార్కెట్:
బుల్ మార్కెట్ అనేది పెట్టుబడిదారులు మరియు వ్యాపారులకు మార్కెట్ ధరల ధోరణి ఏవిధంగా పెరుగుతుంది అవే విషయాలను ఆశావాద వీక్షణ ద్వారా తెలుపుతుంది.

బీర్ మార్కెట్: షేర్ ధరలు పడిపోతాయని ఆశించే పెట్టుబడిదారులు మరియు వ్యాపారులను బీరీష్ ట్రేడర్‌గా పిలుస్తారు. మార్కెట్లలో దీర్ఘకాలం డ్రాప్ పరిస్థితులు ఉంటే బీర్ మార్కెట్ అంటారు. బీర్ మార్కెట్ ఉందంటే బయ్యర్స్ ఎవరూ లేరని.. అదే విధంగా ధరలు తగ్గు ముఖం పట్టాయని అర్దం చేసుకోవాలి. ఐతే ఈ మార్కెట్ ట్రెండ్స్‌కు ఇలా జంతువుల పేర్లు ఎందుకు పెట్టారనేది తెలియని విషయం. ప్రత్యర్దులపై ఈ రెండు జంతువులు ఏ విధంగా ఎటాక్ చేస్తాయో దానిని దృష్టిలో పెట్టుకోని ఈ పేర్లు పెట్టి ఉంటారనేది పలువురి నిపుణుల అంచనా.

ఉదాహారణ: బుల్ (ఎద్దు) తన కొమ్ములను గాలిలోకి పైకి లేపి ఉంచడం అనేది మార్కెట్లు పెరుగుతున్నదానికి.. బీర్ (ఎలుగుబంటి) తన చేతులను రెండింటిన క్రిందకు ఉంచడం మార్కెట్లు తగ్గుతున్న దానికి చిహ్నాలుగా వాడుతున్నారు.

Thursday, November 15, 2012

గోల్డ్ ఈ టి ఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం లాభామా ?

గోల్డ్‌ ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తాయి. ఈ ఇ.టి.ఎఫ్‌ ల ద్వారా సమీకరించిన మొత్తాన్ని బంగారంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వినియోగిస్తారు. నేరుగా బంగారంలో ఇన్వెస్ట్‌ చేయకుండా ఇ.టి.ఎఫ్‌ లలో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయాలి అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.

ఫిజికల్‌ గోల్డ్‌ కొనుగోలుతో పోలిస్తే, ఇ.టి.ఎఫ్‌ రూపంలో అయితే ఎవరూ దొంగిలించే వీలుండదు, ఇన్వెస్ట్‌మెంట్‌ సేఫ్‌గా వుంటుంది అన్నది ప్రధానమైన కారణం, ఇక ఇ.టి.ఎఫ్‌ లు గోల్డ్‌లో ట్రేడింగ్‌ కూడా చేస్తాయి కాబట్టి, రిటర్న్స్‌ కొంతమేరకు ఎక్కువగా వుంటాయి అన్నది రెండవ ప్రధాన కారణం. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ వీక్‌ అవుతూ వుండడం, ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ పెరుగుతూ వుండడం వంటివి బంగారం పెట్టుబడులకు సంబంధించిన అనుకూలాంశాలు.

భారత్‌లో గోల్డ్‌ ఇటిఎఫ్‌ లు నిర్వహిస్తున్న ఆరు మ్యూచువల్‌ ఫండ్స్‌:
1. బెంచ్‌మార్క్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
2. యుటిఐ మ్యూచువల్‌ ఫండ్‌
3. కోటక్‌ మహాంద్రా మ్యూచువల్‌ ఫండ్‌
4. రిలయన్స్‌ క్యాపిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
5. క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌
6. యస్ బి ఐ మ్యూచువల్‌ ఫండ్‌.

ఈ ఆరు ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ గోల్డ్‌లోనే ఇన్వెస్ట్‌, ట్రేడ్‌ చేస్తాయి కాబట్టి ఏ స్కీములో ఇన్వెస్ట్‌ చేసినా, ఒకటే తరహా రిటర్న్స్‌ లభిస్తాయి.

గత ఏడాది వ్యవధిలో ఈ ఆరు గోల్డ్‌ ఇటిఎఫ్‌ల లోనూ సుమారు 27 శాతం రాబడి గిట్టుబాటు అయింది. యుటిఐ గోల్డ్‌ ఇటిఎఫ్‌ లో రెండేళ్ళ రాబడి 67 శాతం వరకు వచ్చింది.అంతర్జాతీయ గోల్డ్‌ ఇటిఎఫ్‌ ల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశాలు వున్నాయి,అంతర్జాతీయ ఫండ్స్‌లో గత ఏడాది డిఎస్‌పి బ్లాక్‌రాక్‌ వరల్డ్‌ గోల్డ్‌ ఫండ్‌, ఎఐజి వరల్డ్‌ గోల్డ్‌ ఫండ్స్‌ 35 శాతం రాబడి ఇచ్చినవి. కాబట్టి గోల్డ్‌ ఇటిఎఫ్‌ లను తప్పని సరిగా, మీ పోర్ట్‌ఫోలియోకి జత చేసుకోండి. మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో కనీసం 10 శాతం గోల్డ్‌ ఇటిఎఫ్‌లకు కేటాయించండి. అలాగే ఈ గోల్డ్‌ ఇటిఎఫ్‌లలో స్వల్ప కాలిక లాభాల కంటే దీర్ఘకాలిక లాభాలకోసమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
(మన-ఆంధ్ర.కాం)

2జీ వేలం ఫ్లాప్!


రెండో రోజే ముగింపు...
బిడ్‌ల విలువ రూ. 9,407 కోట్లే...
ప్రభుత్వ లక్ష్యం రూ.40 వేల కోట్లు
దేశవ్యాప్త స్పెక్ట్రం బిడ్డింగ్‌కు టెల్కోలు దూరం
వొడాఫోన్‌కు 14 సర్కిళ్లలో స్పెక్ట్రం
వీడియోకాన్‌కు 6, ఐడియా చేతికి 8 సర్కిళ్లు...
టెలినార్‌కు 6 సర్కిళ్లలో స్పెక్ట్రం...


న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం వేలం ప్రభుత్వ ఆశలపై నీల్లుచల్లింది. భారీగా నిధులొస్తాయని భావించిన కేంద్రానికి టెల్కోల నుంచి గట్టి షాక్ తగిలింది. ఈ-వేలం రెండో రోజైన బుధవారంనాడే ముగిసింది. ముగింపు నాటికి రూ.9,407 కోట్ల విలువైన బిడ్‌లు మాత్రమే వచ్చాయి. 2జీ వేలం ఎంతగా ఫ్లాప్ అయిందనేదానికి ఇదే నిదర్శనం. జీఎస్‌ఎం స్పెక్ట్రం ద్వారా రూ.28,000 కోట్లు, సీడీఎంఏ వేలంను కూడా కలిపితే మొత్తం 2జీ వేలం ద్వారా రూ.40,000 కోట్ల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్త స్పెక్ట్రం లెసైన్స్ కోసం టెలికం ఆపరేటర్ల నుంచి ఒక్క బిడ్ కూడా లేకపోవడం మరో ప్రధానాంశం.

సోమవారం(12న) వేలం ప్రారంభమైన తొలిరోజు రూ.9,225 కోట్ల విలువైన బిడ్‌లు రావడం తెలిసిందే.
కాగా, బిడ్డింగ్ ముగిసినట్లు ప్రకటించిన టెలికం మంత్రి కపిల్ సిబల్... గతంలో 2జీ కేటాయింపుల కారణంగా ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు కాగ్ పేర్కొన్న అంచనాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ‘వాస్తవాలేమిటో ఇప్పుడు ప్రజలకు స్పష్టమైంది. 3జీ వేలం ధర ప్రకారం ప్రస్తుత 2జీ స్పెక్ట్రంకు రూ. లక్ష కోట్లు రావాలి. అయితే, రూ.9,407 కోట్లే వచ్చాయి. దీనిబట్టి మార్కెట్ పరిస్థితేంటో తేలిపోయింది’ అని పరోక్షంగా కాగ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కయిందన్న ఆరోపణలను సిబల్ కొట్టిపారేశారు.

వొడాఫోన్ జోరు...
ప్రాథమిక సమాచారం ప్రకారం... జీఎస్‌ఎం 2జీ వేలంలో వొడాఫోన్ 14 సర్కిళ్లలో అదనపు స్పెక్ట్రంను దక్కించుకొని టాప్‌లో నిలిచింది. వీడియోకాన్‌కు 6, ఐడియాలు 7 సర్కిళ్లలో స్పెక్ట్రంను దక్కించుకున్నాయి. ఇక నార్వే టెలికం దిగ్గజం టెలినార్ ఆంధ్ర ప్రదేశ్‌తో సహా 6 సర్కిళ్లలో స్పెక్ట్రం లెసైన్స్‌ను కైవసం చేసుకుంది. ఎయిర్‌టెల్ మాత్రం ఒక్క సర్కిల్(అసోం)లో మాత్రమే అదనపు స్పెక్ట్రం లెసైన్స్‌ను దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 2జీ లెసైన్స్(ఒక్కో సర్కిల్‌లో 5 మెగాహెర్ట్జ్) కోసం ప్రభుత్వం నిర్ణయించిన రూ.14,000 కోట్ల ప్రారంభ(బేస్) ధర చాలా ఎక్కువని, వేలానికి స్పందన కరువయ్యేందుకు ఇదే కారణమని జీఎస్‌ఎం ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) పేర్కొంది. కాగా, 2010లో జరిగిన 3జీ స్పెక్ట్రం వేలం దాదాపు 35 రోజుల పాటు హోరాహోరీగా కొనసాగింది. అంతేకాకుండా ప్రభుత్వ అంచనాలను మించి దాదాపు రూ.67,719 కోట్ల బంపర్ ఆదాయం ఖజానాకు సమకూరింది కూడా.

‘సుప్రీం’ రద్దు ఎఫెక్ట్...

సుప్రీంకోర్టు 2జీ స్కామ్‌పై విచారణలో భాగంగా... 2008లో అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా హయాంలో ఇచ్చిన 9 కంపెనీలకు చెందిన 122 లెసైన్స్‌లను రద్దు చేయడం(22 సర్కిళ్లలో) తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాజాగా వేలాన్ని నిర్వహించింది. 2001 నాటి ధరకు ముందొచ్చినవారికి ముందు ప్రాతిపదికన స్పెక్ట్రంను కట్టబెట్టడంవల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు 2010లో కాగ్ లెక్కతేల్చడంతో 2జీ కుంభకోణం వెలుగుచూసింది. 3జీ వేలం బిడ్డింగ్ ధరల ఆధారంగా కాగ్ ఈ అంచనాలు వేసింది. తాజా వేలానికి దేశవ్యాప్తంగా జీఎస్‌ఎం బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం బేస్ ధరను ప్రభుత్వం రూ.14,000 కోట్లుగా నిర్ణయించింది. గతంలో కేటాయించిన రూ.1,658 కోట్లతో పోలిస్తే ఇది 7 రెట్లు ఎక్కువ. కాగా, సుప్రీం తీర్పుతో లెసైన్స్‌లు కోల్పోయిన 8 కంపెనీల్లో మూడు(ఐడియా, వీడియోకాన్, టెలినార్) మాత్రమే తాజాగా లెసైన్స్‌ల కోసం పోటీలో నిలిచాయి.

వీటితో పాటు పాత టెల్కోలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ కూడా వేలంలో పాల్గొన్నాయి. అయితే, ఒక్కో సర్కిల్‌లో ఈ రెండు కంపెనీలు గరిష్టంగా 2 బ్లాక్‌లకే బిడ్ చేసుకునే అవకాశం కల్పించారు. మరోపక్క, సీడీఎంఏ స్పెక్ట్రం వేలం నుంచి టాటా టెలీ, వీడియోకాన్‌లు వైదొలగడంతో ఇక దీనికి బిడ్డర్లే లేకుండా పోయారు. మరోపక్క, జీఎస్‌ఎం స్పెక్ట్రం ప్రారంభ ధర కంటే సీడీఎంఏ స్పెక్ట్రం రేటును 1.3 రెట్లు అధికంగా కేంద్రం నిర్ణయించడంతో కంపెనీలేవీ బిడ్డింగ్‌కు ముందుకురాలేదు. దీంతో ఇక 2జీ సీడీఎంఏ స్పెక్ట్రం వేలం దాదాపు లేనట్టే. దీని ప్రకారం రూ.40,000 కోట్ల మొత్తం ఆదాయ లక్ష్యాన్ని అందుకోవడంలో కేంద్రం అత్యంత ఘోరంగా చతికిలపడినట్లయింది. ద్రవ్యలోటును 5.3 శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం లక్ష్యం... స్పెక్ట్రం వేలం వైఫల్యం కారణంగా సాధ్యం కాకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

ఖజానాకు వచ్చేది నిల్...!
2008లో స్పెక్ట్రం లెసైన్స్‌లు పొందిన కంపెనీలు సుప్రీం తీర్పుతో వాటిని కోల్పోయిన కారణంగా... వాటికి లెసైన్స్ ఫీజును వెనక్కి ఇచ్చేయనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. లేదంటే ఇప్పుడు తాజా వేలంలో పాల్గొనే వాటికి బిడ్డింగ్‌లో గెలిచిన ధరమేరకు సర్దుబాటు చేస్తామని కూడా చెప్పింది. వేలంలో రూ.10,000 కోట్లకు లోపే రావడంతో... లెసైన్స్ ఫీజును ఇందులోంచి తీసేస్తే ఖజానాకు నికరంగా సమకూరిందేమీ లేనట్టే లెక్క. దేశవ్యాప్త స్పెక్ట్రంకు నిర్ణయించిన రూ.14,000 కోట్ల బేస్ ధరలో 40 శాతం వాటా మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలదే. దీంతో ఈ రెండు సర్కిళ్లకు ఒక్క కంపెనీ కూడా బిడ్డింగ్ చేయకపోవడం గమనార్హం. ఇక చాలా వరకూ సర్కిళ్లలో బేస్ ధరకు కాస్త అటూఇటూగానే బిడ్డింగ్ జరిగినట్లు పరిశ్రమ సమాచారం.

Monday, November 12, 2012

ముందే 'పేలుతున్నాయి'


టపాసుల ధరలు తారాజువ్వలా పెరగటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూసిస్తున్నాయి. దాంతో కాల్చకుండానే ధరలు పేలుతున్నాయి.
ఎంతో సంబరంగా జరుపుకునే వెలుగుల పండుగ దీపావళికి ధరాఘాతం తగిలింది. పండుగకు ప్రత్యేక శోభ కలిగించే టపాసులు ప్రియంగా మారాయి. టపాసుల ధరలు తారాజువ్వలా పెరగటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూసిస్తున్నాయి. దాంతో కాల్చకుండానే టపాసులు పేలుతున్నాయి. సుమారు వెయ్యిరూపాయలు చెల్లిస్తేగానీ బాణాసంచా దుకాణాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఈ ప్రభావం వ్యాపారాలపైనా పడింది.

గత ఏడాదికన్నా ఈ ఏడాది పటాసుల ధర సుమారు 40 శాతం పెరిగింది. దీంతో విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీపావళికి రెండు రోజుల ముందు నుంచే టపాసుల విక్రయాలు మొదలయ్యేవి. దీపావళికి ముందు సుమారు 60 శాతం వరకు బాణసంచా అమ్ముడయ్యేది.

ప్రస్తుతం హైదరాబాద్ నగర మార్కెట్లో రూ.10 మొదలుకొని రూ.16వేల విలువైన వివిధ రకాల బాణాసంచా పేలుడు సామగ్రి అందుబాటులో ఉంది. పదిరోజుల క్రితమే బాణాసంచా హోల్‌సేల్ దుకాణాలు తెరచినా విక్రయాలు ఇంకా ఊపందుకోక పోవడం వారిలో ఆందోళనను మరింత పెంచుతోంది. పండుగకు ఒక్కరోజే సమయమున్నా దుకాణాలు వెలవెలబోతున్నాయి.

గత ఏడాది దీపావళికి రెండు రోజుల ముందే సందడి మొదలుకాగా ఈ ఏడు అంతంత మాత్రంగా ఉంది. ఏటా పిల్లలకు సుమారు వెయ్యి రెండు వేలు వరకు టపాసులు కొని ఇచ్చే తల్లిదండ్రులు వారికి సర్దిచెప్పి 500 నుంచి వెయ్యి లోపే కొనుగోలు చేస్తున్నారు. విడిగా బాణసంచా కొనుగోలు చేసేకన్నా అన్నీ కలిపి ఉండే గిఫ్ట్‌బాక్స్‌లను పలువురు కొనుగోలు చేసేవారు.

గిఫ్ట్‌బాక్స్‌ల ధర విపరీతంగా పెరగడంతో వాటి గిరాకీ తగ్గింది. గత ఏడాది గిఫ్ట్‌బాక్స్ రూ. 200 నుంచి రూ. 1200ల వరకు ఉండేది. ఈసారి వీటి ధర రూ. 350 నుంచిరూ. 2500 వరకు పెరగడంతో కొనుగోలుదార్లు కరువయ్యారు. దీంతో టపాసుల దుకాణాల్లో గిఫ్ట్‌బాక్స్‌లు కుప్పలుగా కనిపిస్తున్నాయి.

మరోవైపు వ్యాపారస్తులు సిండికేట్ గా మారి బాణసంచా ధరలను పెంచేశారు. గత ఏడాది కన్నా రెట్టింపు ధరలతో విక్రయిస్తుండటంతో పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. బాణసంచా కొనేందుకు ఉత్సాహంగా వచ్చిన పిల్లలు, పెద్దలు ధరలను చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. టపాసులు కొనాలంటే జనం భయపడిపోతున్నారు.

విపరీతంగా పెరిగిన ధరలు, పండగ ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. దీంతో దీపావళి పండుగ కళ తప్పుతోంది. 'చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళీ' అనేది ఒకప్పటి నానుడిగా మారిపోయింది. ప్రకృతి... ప్రమాదాలు... పన్ను భారం... వెరసి ఈసారి బాణాసంచా వ్యాపారులకు, వినియోగదారులకు చీకటినే పంచుతోంది. ధరలు ఇలాగే పెరిగితే ... భవిష్యత్తులో జనాలు.... పండగ దండగ అనుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యపోవల్సిన పనిలేదు.

గోల్డ్ రష్ @ ధన్‌తేరాస్

గోల్డ్ రష్ @ ధన్‌తేరాస్

* ఈటీఎఫ్‌లలో రికార్డు స్థాయి లావాదేవీలు
* చేతులు మారిన 4,441 కేజీల బంగారం
* దీని విలువ రూ.1,337 కోట్లు
* రాష్ట్రంలో రూ. 500 కోట్ల పసిడి విక్రయాలు జరుగుతాయని అంచనా
* దేశవ్యాప్తంగా అమ్మకాలు 30 శాతం అప్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి ధన్‌తేరాస్ సందర్భంగా నేరుగా బంగారం కంటే పేపర్‌గోల్డ్‌పైనే దృష్టిసారించారు. గత సంవత్సరంతో పోలిస్తే దేశవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్ లావాదేవీల్లో 110% వృద్ధి నమోదైతే, రాష్ట్రంలో బంగారం అమ్మకాల్లో స్వల్పంగా వృద్ధి నమోదయినట్లు తెలుస్తోంది. ఇంత వరకు ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజులో రూ.1,337 కోట్ల లావాదేవీలు గోల్డ్ ఈటీఎఫ్‌లలో నమోదైనట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ధన్‌తేరాస్ సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించగా రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి.

గత సంవత్సరం ధన్‌తేరాస్ నాడు ఎన్‌ఎస్‌ఈలో రూ. 636 కోట్ల లావాదేవీలు జరగ్గా ఈసారి 110 శాతం పెరిగి రూ. 1,137 కోట్లకు చేరింది. అదే పరిమాణం పరంగా చూస్తే గత సంవత్సరం కంటే 81 శాతం అధికంగా 4,441 కేజీల బంగారం చేతులు మారినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియచేసింది. మొత్తం 70,440 మంది ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (జనవరి-జూలై) సగటున రూ.1,195 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2011-12 నాటికి రూ.23,039 కోట్ల విలువైన బంగారం ఈటీఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం 14 మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈటీఎఫ్‌లను అందిస్తున్నాయి.

రాష్ట్రంలో రూ.500 కోట్ల లావాదేవీలు
ఉత్తరాది రాష్ట్రాలో బాగా ప్రాచుర్యం పొందిన ధన్‌తేరాస్ ఇప్పుడిప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. గత సంవత్సరం ఈ పర్వదినం నాడు రాష్ట్రంలో రూ.300 కోట్లు జరగ్గా అది ఈ సంవత్సరం రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రాష్ట్ర బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. మన రాష్ట్రంలో అక్షయ తృతీయ నాడు బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయని, అప్పుడు జరిగిన అమ్మకాల్లో ధన్‌తేరాస్ నాడు కేవలం 30 శాతం కూడా జరగవని సీఎంఆర్ డెరైక్టర్ రామారావు పేర్కొన్నారు.

ఈ సారి ఒకటి రెండు పెద్ద షాపుల్లో మినహా మిగలిన వాటిల్లో అమ్మకాలు నీరసించాయని, దీనికి ప్రధాన కారణం గోల్డ్ ఈటీఎఫ్‌లకు తోడు పెరిగిన బంగారం ధరలు దోహదం చేశాయన్నారు. అప్పుడే అమ్మకాలు ఎంత జరిగాయో చెప్పలేం కానీ గత సంవత్సరం జరిగిన అమ్మకాల్లో 70 శాతం జరిగితే చాలు అనుకుంటున్నట్లు జంటనగరాల బులియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సతీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్‌లలో పన్నులు తక్కువగా ఉండటంతో ఈ పర్వదినాల్లో బంగారం కొనాలనుకునే వారు పేపర్ గోల్డ్‌కు మొగ్గు చూపడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని రామారావు తెలిపారు.

‘ధన్‌తేరాస్ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఉత్సాహాన్ని చూపించారు. ముఖ్యంగా చిన్న చిన్న ఆభరణాలకే మొగ్గు చూపారు. బంగారం ధర పెరగడం, తుపాను ప్రభావమే దీనికి కారణంగా కనపడుతోంది. దుకాణాల్లోకి వచ్చే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఏమాత్రం తగ్గలేదు. ఆర్‌ఎస్ బ్రదర్స్ గ్రూపుకు చెందిన జువెల్లరీ షాపుల న్నింటిలో కలిపి 50 కేజీల దాకా బంగారం అమ్ముడైంది. ఇక మొత్తం మీద హైదరాబాద్‌లో ఇది సుమారు 300 కేజీలు ఉండొచ్చని అంచనా. గతేడాది ధంతేరాస్‌కు 400 కేజీల బంగారం విక్రయాలు జరిగాయి’ అని ఆర్‌ఎస్ బ్రదర్స్ జువెల్లర్స్ జీఎం టి.భద్రీనారాయణ చెప్పారు.

తగ్గని డిమాండ్...
ధన్‌తేరాస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు 30% పుంజుకున్నట్లు ముంబై, ఢిల్లీ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ పెళ్లి ఆభరణాల డిమాండ్ కారణంగా అమ్మకాలు 30%మేర పుంజుకున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై తదితర మార్కెట్లలో పసిడి ధరలు 10 గ్రాములు రూ. 32,000 సమీపంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధిక ధరల నేపథ్యంలో ధన్‌తేరాస్ అమ్మకాల పట్ల అంత ఆశాజనకంగా లేమని పీసీ జువెల్లర్స్ ఎండీ బలరామ్ గార్గ్ చెప్పారు. అయితే తమ అంచనాలను మించుతూ 30% అమ్మకాలు నమోదుకావడం విశేషమని వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రధానంగా పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేసే ఆభరణాల అమ్మకాలు దోహదపడ్డాయనితెలిపారు.

పీసీ జువెల్లర్స్ దేశవ్యాప్తంగా 30 షోరూములను నిర్వహిస్తోంది. ఇక పీపీ జువెల్లర్స్ డెరైక్టర్ పవన్ గుప్తా సైతం ధన్‌తేరాస్ అమ్మకాలపట్ల ఇదే విధంగా స్పందించారు. గరిష్ట స్థాయికి చేరిన ప్రస్తుత ధరల్లోనూ పసిడికి డిమాండ్ కొనసాగిందని తెలిపారు. వెరసి ఈ ధన్‌తేరస్‌కు జువెలరీ అమ్మకాలు 25-30% వరకూ పెరగవచ్చునని అంచనా వేస్తున్నామని చెప్పారు. ధన్‌తేరాస్‌గా పిలిచే ధనత్రయోదశి రోజున శుభసూచకంగా పసిడి కొనుగోలుకి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తుండటం విదితమే. ఈ ధన్‌తేరస్‌కు వినియోగదారులు బంగారం, వెండి కాయిన్లకంటే ఆభరణాల కొనుగోళ్లకే మొగ్గుచూపారని మరికొంతమంది రిటైలర్లు చెప్పారు.

సోమవారం మధ్యాహ్నం వరకూ...
ఈ ఏడాది ధన్‌తేరాస్ రోజున అంచనాలకుమించి డిమాండ్ పుంజుకున్నదని ముంబైలోని యూటీ జవేరీ రిటైల్ చైన్ అధిపతి కుమార్ జైన్ చెప్పారు. అమ్మకాల పరిమాణంలో 25-30% మధ్య వృద్ధి నమోదుకావచ్చునని చెప్పారు. ముంబై జువెల్లర్స్ అసోసియేషన్‌కు జైన్ వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. గతేడాది ధన్‌తేరాస్‌తో పోలిస్తే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఆభరణాలకు భారీ డిమాండ్ కనిపిస్తున్నదని త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ మార్కెటింగ్ హెడ్ కిరణ్ దీక్షిత్ చెప్పారు. దీపావళి మర్నాటినుంచే పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నదని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలవరకూ ధన్‌తేరాస్ కొనసాగనున్నదని, అప్పటివరకూ పుత్తడిలో కొనుగోళ్లు జరుగుతాయని వివరించారు.

Friday, November 9, 2012

కింగ్‌ఫిషర్.. అకౌంటింగ్ స్కామ్?

క్యూ2లో రూ. 754 కోట్ల నికర నష్టం; 61% అప్
అకౌంటింగ్‌పై కంపెనీ ఆడిటర్ల సందేహాలు...
సరైన ప్రమాణాలు పాటిస్తే... నష్టం రూ.1,032 కోట్ల వరకూ ఉండేదని నివేదిక


ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లోనూ ‘సత్యం’ తరహా అకౌంటింగ్ మోసాలు జరుగుతున్నాయా? కంపెనీ ఆడిటర్ల సందేహాలు చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా ఆమోదనీయమైన అకౌంటింగ్ ప్రమాణాలను గనుక కింగ్‌ఫిషర్ పాటించి ఉంటే... క్యూ2 నష్టం మరింత భారీగా రూ.1,032 కోట్లుగా ఉండేదని(కంపెనీ ప్రకటించింది రూ.754 కోట్లు) ఫలితాలపై సమర్పించిన సమీక్షా నివేదికలో ఆడిటర్లు పేర్కొన్నారు. దీంతో ఖాతాల్లో అవకతవకలు జరిగిఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో లాభాలను పెంచిచూపితే... కింగ్‌ఫిషర్‌లో నష్టాలను తగ్గించి చూపుతున్నారన్న వాదనలు తెరపైకి వస్తుండటం గమనార్హం.

23 క్వార్టర్లు... నాన్‌స్టాప్ నష్టాలు...

ఇప్పటికే పీకల్లోతు అప్పులు, లెసైన్స్ సస్పెన్షన్‌తో మూలన కూర్చున్న కింగ్‌ఫిషర్... మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్, క్యూ2)లో కంపెనీ నికర నష్టం 61% ఎగబాకి రూ.754 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నష్టం రూ.469 కోట్లు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన ఈ నష్టజాతక ఎయిర్‌లైన్స్... వరుసగా... 23వ క్వార్టర్‌లోనూ నష్టాలను చవిచూడటం గమనార్హం. వెరసి సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ మొత్తం నష్టాలు దాదాపు 9,000 కోట్లకు పేరుకుపోయాయి. కంపెనీ క్యూ2 ఆదాయం కూడా ఏకంగా 87 శాతం పడిపోయి రూ.200 కోట్లుగా మాత్రమే నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,553 కోట్లు. 2006లో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఒక్కసారి మాత్రమే కంపెనీ రూ.9.6 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అయితే, ఇప్పటిదాకా పూర్తి ఏడాదికి ఎన్నడూ లాభాలను నమోదు చేయకపోవడం గమనార్హం.

పునరుద్ధరణకు కసరత్తు...
కార్యకలాపాలకు ఆటంకం, భారీ రుణ భారం, అధిక పన్ను చెల్లింపులు, నిర్వహణ-పునర్‌వ్యవస్థీకరణ వ్యయాలు వంటివన్నీ నష్టాలు మరింత పెరిగిపోయేలా చేస్తున్నాయని కింగ్‌ఫిషర్ పేర్కొంది. కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు వీలుగా సమగ్ర ప్రణాళికపై కసరత్తు చేస్తున్నామని కూడా తెలిపింది. బ్యాంకర్లు, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్‌ఏవియేషన్(డీజీసీఏ)కు తమ పునరుద్ధరణ ప్రణాళికను సమర్పిస్తామని, త్వరలోనే కార్యకలాపాలను పునఃప్రారంభించగలమని కూడా కంపెనీ పేర్కొంది. కాగా, సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను సమర్పించడానికి కింగ్‌ఫిషర్‌కు నిర్దిష్ట గడువేమీ నిర్దేశించలేదని డీజీసీఏ చీఫ్ అరుణ్ మిశ్రా గురువారం హైదరాబాద్‌లో చెప్పారు. త్వరలో ప్రణాళికను ఇస్తామని కంపెనీ చెప్పిందని, సంబంధిత ప్రతిపాదనల్లోని అంశాలన్నీ పరిశీలించాకే లెసైన్స్ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, రూ.7,000 కోట్లకు పైగానే రుణాలిచ్చిన బ్యాంకులు కూడా ప్రమోటర్లు మూలధనాన్ని సమకూరిస్తేనే విమానాలు నడిచేపరిస్థితి ఉందని, తాజాగా మరిన్ని రుణాలిచ్చే సమస్యేలేదని తేల్చిచెప్పాయి కూడా.

డైజియోకు యునెటైడ్ స్పిరిట్స్‌లో వాటా ?
యునెటైడ్ స్పిరిట్స్‌లో వాటా విక్రయానికి ప్రపంచ లిక్కర్ తయారీ దిగ్గజం డయాజియోతో విజయ్‌మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యునెటైడ్ స్పిరిట్స్‌లో ఎంత పరిమాణంలో వాటా విక్రయాలు జరుగుతున్నాయి, దీని విలువ ఎంత వంటి అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు వచ్చిన వార్తలపై స్పందించడానికి యూబీ గ్రూప్ ప్రతినిధి నిరాకరించారు. అయితే 51 శాతం వాటా అమ్మకాలకు అవగాహన కుదిరిందని, ఈ డీల్ విలువ 1-2 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండవచ్చని తెలుస్తోంది.


Wednesday, November 7, 2012

డిసెంబర్‌కల్లా 51కి రూపాయి

ఇటీవలి కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ మళ్లీ పతనబాట పట్టినప్పటికీ... డిసెంబర్ చివరికల్లా 51 స్థాయికి పుంజుకునే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్(బీఓఎఫ్‌ఏ) ఒక నివేదికలో పేర్కొంది. భారత్ వద్దనున్న అధిక ఫారెక్స్ నిల్వలు రూపాయి విలువ రికవరీకి కీలకం కానుందని తెలిపింది. అయితే, రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) జోక్యం చేసుకోనంతవరకూ... 50 స్థాయికి మించి బలపడటం సాధ్యంకాకపోవచ్చని కూడా నివేదిక అభిప్రాయపడింది.


ప్రస్తుతం రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్ట స్థాయిలో 54.70 వద్ద కదలాడుతున్న సంగతి తెలిసిందే. 2008 మధ్యకాలం నుంచి ఆర్‌బీఐ విక్రయించిన 65 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలను తిరిగి చేజిక్కించుకుంటే తప్ప... డాలరుతో రూపాయి మారకం 50 పైకి ఎగబాకే అవకాశాల్లేవనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా. గతేడాది ఆగస్టు నుంచి భారీగా పడిపోవడం, తిరిగి అంతేవేగంగా పుంజుకోవడం... ఇలా రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్న సంగతి తెలిసిందే. 2011 సెప్టెంబర్ నుంచి చూస్తే... 18.5 శాతం పతనమైంది. బ్రెజిల్ కరెన్సీ తర్వాత అత్యంత దారుణంగా క్షీణించింది రూపాయే కావడం గమనార్హం.

టీవీ కన్నా స్మార్ట్ ఫోనే ముద్దు!

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జోరు పెరుగుతోందని గూగుల్ -ఐపీసాస్ సంయుక్త సర్వేలో తేలింది. మొత్తం 40 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. వినోదం విషయమై టీవీల కన్నా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే భారతీయుల సంఖ్య అధికంగా ఉందంటున్న ఈ సర్వే వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు....


టీవీలు చూసే సమయాన్ని స్మార్ట్‌ఫోన్‌ల వినియోగానికి వెచ్చించే వ్యక్తులు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీల్లో 27 శాతంగా ఉండగా, భారత్‌లో ఈ సంఖ్య 49 శాతంగా ఉంది.

స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్లు, ఉన్నతమైన నాణ్యత గల వీడియో కంటెంట్, విస్తృతమైన ఆప్స్ కారణంగా భారతీయులు టీవీ కంటే స్మార్ట్‌ఫోన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

టీవీ కంటే కూడా స్మార్ట్‌ఫోన్ల ద్వారానే మరింత వినోదాన్ని పొందవచ్చని 56 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ఇలా భావించే భారత మహిళల సంఖ్య 58 శాతంగా ఉంది. ఇక టీవీ కంటే స్మార్ట్‌ఫోన్ల ద్వారా మరింత వినోదాన్ని పొందవచ్చని భావించేవారి సంఖ్య అమెరికాలో 21 శాతం ఇంగ్లాండ్‌లో 18 శాతంగా ఉంది.
భారత మహిళలు స్మార్ట్‌ఫోన్లను కేవలం వినోదానికే వినియోగించడం లేదు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా మిత్రులను కలవడం, ఆన్‌లైన్ షాపింగ్ తదితర సమాచారం కోసం వినియోగిస్తున్నారు.



స్మార్ట్‌ఫోన్ల ధరలు అందుబాటులోకి రావడం కూడా భారత్‌లో ఈ ఫోన్‌ల వినియోగం పెరగడానికి ముఖ్య కారణమని గూగుల్ ఇండియా కంట్రీ హెడ్(ఇండియా ప్రోడక్ట్స్) లలితేష్ కాట్రగడ్డ చెప్పారు.

మళ్ళీ తెరమీదకు ఐటీ సంక్షోభం

దేశీయ ఆర్థిక వ్యవస్థను అంత ర్జాతీయ ఆర్థిక మాంద్యం నీడలా వెంటాడుతున్నది. ఇప్పటికీ అభివృద్ది చెందిన అమెరికా, యూరప్‌ దేశాలు మాంద్యంతో కొట్టుమిట్టాడడంతో భారత్‌ వంటి వర్ధమాన దేశాలు కూడా ఈ దెబ్బకు విలవిల్లాడుతున్నది. ఇప్పటికే దేశీయ వృద్ధిరేటు 5 శాతం దాటే పరిస్థితి కానరావడం లేదు.తాజాగా దేశీయ ఆర్థిక వ్యవ స్థకు వెన్నుముఖ లాంటి ఐటీ రంగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొం టున్నది. అమెరికా, యూరప్‌ దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక విధా నాలతో భారత్‌ ఐటీ మార్కెట్లో ఉపాధి అవకాశాలకు శాపం గా మారాయి. ఇప్పటికే బారక్‌ ఒబా మా భారత్‌ వ్యతిరేక వెైఖరి అవ లంభించడంతో దేశీయ ఐటీ రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితు లను ఎదుర్కొంటున్నది. మరో వెైపు యూరప్‌లో కూడా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఆదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో దే శీయ ఐటీ వర్క్‌ ప్రాజెక్టులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, విప్రో, టిసిఎస్‌ వంటి కంపెనీలు నియమాకాల జోరుకు బ్రేకులు వేశాయి.



డిసెంబర్‌ పైనే ఆశలు : ఫలితంగా ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు దాదాపుగా నిలియిపోయాయి. ప్రతి ఏటా రెండున్నర లక్షల మంది యువతకు ఐటీ అవకాశాలు లభిస్తే, ఈసారి ఆ అవకాశాలు కనుచూపు మేరలో కాన రావడం లేదు. ప్రతి ఏటా జులెైలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ నియామకాల పండుగ జోరుగా జరుగుతుండగా, ఈఏడాది నవంబర్‌ ప్రవేశించిన అటువంటి వాతావరణం కానరావడం లేదు. తాజాగా ఇన్ఫోసిస్‌ వచ్చే మూడు నెలల వరకు ఎటువంటి క్యాంపస్‌ నియామకాలు ఉండవని, కంపెనీ చవి చూస్తున్న నష్టాల భారాన్ని వీలెైనంత మేరకు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు బెంగుళూరులో ప్రకటించింది. అదే విధంగా ఉద్యోగుల శిక్షణపై వెచ్చించే ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించుకొంటున్నట్లు ఇన్ఫోసిస్‌ ఇప్పటికే ప్రకటించింది. గత ఏడాది ఈ సీజన్లో కాగ్నిజంట్‌, విప్రో, టిఎసిఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలు చేపట్టిన క్యాంపస్‌ నియామకాలతో పోల్చితే, ప్రస్తుతం ఇది నాల్గొవంతుకు పడిపోయిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.



2009 నుంచి దేశీయ ఐటీ రంగం ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటున్నప్పటికీ, 2011-12 ఆర్థిక సంవత్సరం దేశీయ ఐటీ కంపెనీలు మెరుగెైన ఫలితాలు సాధించడంతోపాటు, అన్ని స్థాయిల్లోనూ నియామకాలను మెరుగెైనట్లు జాబ్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా 2012-13 ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ మాంద్యంతో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. ఆపెై అమెరికా ఆర్థిక వ్యవస్థను శాండీ వంటి పెను తుఫాన్లు దెబ్బతీయండతో ఆప్రభావం భారత్‌ వంటి దేశా లపెై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఫలితంగా దేశీయ ఐటీ కంపెనీలు చేతిలో ఉన్న అరకొర ప్రాజెక్టులు చేజారడంతో, పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు మూత పడుతున్నాయి. దీంతో ప్రతి నెలా వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఒక హైదరాబాద్‌ మార్కెట్లోనే రోడ్డునపడడం గమనార్హం.



ఆందోళనలో ఇంజనీరింగ్‌ యాజమాన్యాలు: తాజాగా హైదరాబాద్‌ ఐటీ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా స్థానిక ఐటీ కంపెనీలతోపాటు, ఉద్యోగులు కూడా చెన్నయ్‌, బెంగుళూరు, నొయిడా, ముంబాయి, పూనే వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరులుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా పొదుపు చర్యల్లో భాగంగా ఐటీ దిగ్గజాలు చేపడుతున్న కఠిన చర్యలతో ఇంజనీరింగ్‌ కాలేజీలతోపాటు విద్యార్థులు కలవరం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 750 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉంటే, ఇప్పటికే వాటి పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. తాజా ఐటీ పరిశ్రమ ప్రతికూల పరిస్థితుల రీత్యా మరింత బెంబేలె త్తుతున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా ఐదు లక్షల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు బయటకు వస్తే, దీనిలో ఒక ఆంధ్రప్రదేశ్‌ నుంచే రెండు లక్షల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారని గణాంకాలు వెల్లడి స్తున్నాయి.



ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు ఐటీ నియామకాలు జరుగుతుంటే, దీనిలో ఒక ఏపీలోనే లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, తాజా గడ్డు పరిస్థితులు స్థానిక విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలకు మింగుడుపడడం లేదు.ఫలితంగా పీజీ ఇతర ఉన్నత చదువులపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నట్లు జామ్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజా ఐటీ పరిశ్రమల సవాళ్లపెై ఇటు రాష్ట్ర ఐటీ శాఖ గాని, అటు ఐటీ అసోసియేషన్లు గానీ స్పంధించడానికి విముఖత కనబరుస్తున్నాయి.

Monday, November 5, 2012

పసిడి... దీపావళి హ్యాట్రిక్!

పసిడి... దీపావళి హ్యాట్రిక్!
11/5/2012
వరుసగా మూడో ఏడాదీ స్టాక్‌మార్కెట్‌ను మించి లాభాలు
గత దీపావళి నుంచి 15 శాతం పెరిగిన ధర...
మూడేళ్ల కాలంలో 92 శాతం అప్...


న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు ‘కనక’వర్షం కురుస్తోంది. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి ఏటికేడు సిరుల పంట పండుతోంది. గడిచిన మూడేళ్ల కాలంలో దీపావళి నుంచి దీపావళికి చూస్తే... పసిడి ధర హాట్రిక్ లాభాలతో దూసుకెళ్తోంది. స్టాక్ మార్కెట్ల కంటే బంగారమే మెరుగైన రాబడులను అందిస్తుండటంతో ఈ ఇన్వెస్టర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. 2011 దీపావళి నాటికి రూ.26,700 స్థాయిలో ఉన్న పుత్తడి రేటు(10 గ్రాములు)... ఇప్పుడు 15 శాతం ఎగబాకి... రూ.30,700 స్థాయికి చేరింది.

అదే స్టాక్ మార్కెట్లకు ప్రామాణిక సూచీ అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ను తీసుకుంటే 17,300 పాయింట్ల నుంచి 18,755 పాయింట్లకు మాత్రమే పెరిగింది. సెన్సెక్స్ కూడా సానుకూల రాబడులనే అందించినప్పటికీ... ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాల మాదిరిగా 8.5 శాతం మేర లాభాలనే అందించడం గమనార్హం. గత దీపావళినాడు రూ.10 లక్షలను బంగారంపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్ము... ఇప్పుడు దాదాపు రూ.11.5 లక్షలు అయినట్లు లెక్క. ఇంకా దీపావళి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల అంచనా. అదే... స్టాక్‌మార్కెట్లో సెన్సెక్స్ ప్రకారం చూస్తే రూ.10 లక్షల పెట్టుబడి ప్రస్తుతం రూ.10.85 లక్షలకు మాత్రమే పెరిగినట్లు చెప్పుకోవచ్చు.

స్వర్ణం కొత్త రికార్డులకు...
భారతీయులు స్వర్ణంపై పెట్టుబడుల విషయంలో వెనకాడటం లేదని... ఇది ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ బంగారం కొనుగోలు అనేది ఒక సంస్కృతి. అక్షయ తృతీయ, ధన్‌తేరస్, దీపావళి వంటి శుభదినాల్లో పసిడి కొనుగోలు చేస్తే మంచిదనే సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. రేటు భారీగా పెరిగినప్పటికీ... భవిష్యత్తులో కూడా బంగారం ధర కొత్త శిఖరాలను తాకుతూనే ఉంటుందనే భావనలోనే అత్యధిక శాతం మంది ప్రజలు ఉన్నారనేది పరిశీలకుల విశ్లేషణ. మరోపక్క, స్టాక్స్‌లో పెట్టుబడి అత్యంత రిస్క్‌తో కూడుకున్నదే కాకుండా... ఇంకా మన దేశంలో స్టాక్‌మార్కెట్ సంస్కృతి అంతంతమాత్రంగానే ఉండటంతో పసిడి అత్యంత అనువైన పెట్టుబడి సాధనంగా అలరారుతోంది. ఏటా భారతీయులు 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 80 వేల కోట్లు) విలువచేసే బంగారు కడ్డీలు, నాణేలు కొనుగోలు చేస్తారని అంచనా. రమారమి ఇది 270 టన్నులకు సమానం. కాగా, వచ్చే వారంలో 11న ధన్‌తేరస్, 13న దీపావళి ఉండటంతో బంగారం కొనుగోళ్ల గిరాకీ దూసుకెళ్తుందని, ఇప్పటిదాకా ఉన్న రూ.32,000 రికార్డును కూడా బద్దలుకొట్టి రేటు కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

పుత్తడి పరుగేపరుగు...
దీపావళి రోజు నుంచి లెక్కలేస్తే... గత మూడేళ్లలో పసిడి వార్షిక ప్రాతిపదిక పగ్గాల్లేకుండా పరుగులు తీస్తోంది. 2009 దీపావళి నాటికి రూ. 16,000 స్థాయిలో ఉన్న బంగారం రేటు 2010 దీపావళికి రూ. 21,100 స్థాయికి ఎగబాకింది. అంటే దాదాపు 32 శాతం మేర ఎగసింది. ఇక 2010 దీపావళి నుంచి 2011 దీపావళి వరకూ చూస్తే... 27 శాతం పెరిగింది. అదే సెన్సెక్స్ విషయానికొస్తే... 2009 నుంచి 2010 దీపావళికి 21 శాతం పెరగగా... 2010 నుంచి 2011 నాటికి 17 శాతం పైగానే పడిపోవడం గమనార్హం. ఇక 2009 నుంచి ఇప్పటిదాకా మూడేళ్ల వ్యవధికి చూసినా సరే పసిడి 92% మేర పరుగులు తీసింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 17,300 స్థాయి నుంచి 18,755 పాయింట్లకు(ప్రస్తుతం) పెరిగింది. అంటే కేవలం 8% మాత్రమే వృద్ది చెందింది. అంతకుముందు 2007-08 మధ్య స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద సగానికి పైనే ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బంగారం మాత్రం 11% రాబడులను అందించింది. ఇలా ఏవిధంగా చూసుకున్నా... లాభాలందించడంలో, సురక్షితమైన పెట్టుబడి సాధనంగానూ స్టాక్‌మార్కెట్ కంటే అత్యంత మెరుగైనదిగా పసిడి కాంతులీనుతోంది.

Courtesy : Sakshi


బంగారం హ్యాట్రిక్... వరుసగా మూడేళ్లలో స్టాక్ మార్కెట్‌కన్నా మంచి రాబడులు

  బంగారం హ్యాట్రిక్
వరుసగా మూడేళ్లలో స్టాక్ మార్కెట్‌కన్నా మంచి రాబడులు


న్యూఢిల్లీ , నవంబర్ 4 : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఏ రోజున కరిగిపోతుందో, ఏ రోజున పెరుగుతుందో కచ్చితంగా చెప్పడం కష్టమే. ఒక రోజున కోటీశ్వరుడిగా ఉన్న ఇన్వెస్టరు మరో రోజున బికారిగా మారి రోడ్డుపై పడిన తరుణాలు స్టాక్ మార్కెట్లో సర్వసాధారణం. కానీ బంగారాన్ని నమ్ముకున్న వారికి ఇలాంటి పరిస్థితి ఉండదు. ఎంతో కొంత ధర తగ్గినా నష్టం పెద్దగా ఉండదు. అయితే గణాంకాలను చూస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కన్నా బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారి సంపదే విపరీతంగా పెరిగిపోయింది. గడచిన మూడేళ్లకాలంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఇన్వెస్టర్లను కుబేరులుగా మార్చాయి. వరుస లాభాలు తెచ్చిన పసిడి ఇన్వెస్టర్లు హ్యాట్రిక్ కొట్టేలా చేశాయి.

ఈ దీపావళికి కూడా బంగారం ఇంకా పెరుగుతుందన్న అంచనాలున్నాయి. గత ఏడాది దీపావళితో పోల్చితే బంగారంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద 15 శాతం పెరిగింది. ఇది స్టాక్ మార్కెట్ పెట్టుబడులకన్నా ఎక్కువే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా పొందిన మాదిరిగా 8.5 శాతం రాబడిని పొందగలిగారు. గత దీపావళి సీజన్‌లో 26,700 రూపాయలున్న పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 30,700 రూపాయల స్థాయిలో ఉంది. అప్పుడు 10 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడదని 11.50 లక్షల రూపాయలకు పెరిగేది. వచ్చే దీపావళి వరకు ధర పెరిగితే రాబడి ఇంకా వృద్ధి చెందుతుంది.

ఈ దీపావళికి బంగారం ధర 32,000 రూపాయలకు ఎగబాకే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. నవంబర్ 12న దంతేరస్, 13న దీపావళి ఉన్న నేపథ్యంలో అమ్మకాలు జోరందుకుంటాయని అంటున్నారు. స్టాక్ మార్కెట్ విషయానికొస్తే.. గత దీపావళప్పుడు సెన్సెక్స్ 17300 పాయింట్ల స్థాయిలో ఉంది.

గత శుక్రవారంనాడు సెన్సెక్స్ 18755 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లో 10 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పుడది 10.85 లక్షల రూపాయలయి ఉండేది. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లను అదుకున్నది బంగారమే. 2007, 2008 దీపావళికి ఇన్వెస్టర్ల సంపదంతా కరిగిపోయింది. కానీ 2009లో స్టాక్ మార్కెట్ మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

దంతేరస్ అమ్మకాల్లో 40 శాతం వృద్ధి!

బంగారం ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ ధరలు డిమాండ్‌ను ఎంత మాత్రం ప్రభావితం చేయబోవని అంటున్నారు బంగారం వ్యాపారులు. దంతేరస్‌ను దృష్టిలో ఉంచుకుని వారు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దంతేరస్‌ను హిందువులు శుభ దినంగా భావిస్తారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే సిరిసంపదలు కలిసివస్తాయని విశ్వసిస్తారు. కాబట్టి ధర ఎంత ఉన్నా ఈ రోజున వినియోగదారులు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తారని వ్యాపారులు అంటున్నారు.

ఫలితంగా దంతేరస్ అమ్మకాలు 35-40 శాతం వృద్ధి చెందే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. దీపావళి తరువాత వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో అమ్మకాలు ఇంకా జోరందుకుంటాయని గీతాంజలి గ్రూప్ చైర్మన్ ఎండి మెహుల్ చోక్రి తెలిపారు. ధరలు అధిక స్థాయిలో ఉన్నందు వల్ల కస్టమర్ల ధోరణి కూడా మారుతోందని ఆయన అంటున్నారు. తక్కువ బరువున్న ఆభరణాలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని, దీని వల్ల వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.

ఇక బంగారు నాణాలకు గిరాకీ బాగా పుంజుకుందని, ఏడాది కాలంలో వీటికి డిమాండ్ 35-40 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. బంగారం ధరలు పెరగడం వల్ల తక్కువ బరువు ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని మరో నగల వ్యాపారి తెలిపారు. వచ్చే పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొంత మంది కస్టమర్లు ఇప్పటి నుంచే కొనుగోళ్లు జరుపుతున్నారని చెప్పారు. పండగల సీజన్‌లో అమ్మకాలు బాగా పెరుగుతాయి. ఇదే సమయంలో ధరలు కూడా పెరగడానికి ఆస్కారం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి డైరెక్టర్ (ఇన్వెస్ట్‌మెంట్) అమ్రేష్ ఆచార్య తెలిపారు.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు దిగిరావడం మొదలైంది. ఇదే ధోరణి కొనసాగినా, ప్రస్తుత స్థాయిలోనే ధర ఉన్నా డిమాండ్ విపరీతంగా ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఇక బంగారం అమ్మకాలు కేవలం జువెలరీ దుకాణాలకే పరిమితం కావడం లేదు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా పసిడి నాణాలను విక్రయిస్తున్నారు. గత ఏడాది 125 కిలోల బంగారు నాణాలను బ్యాంకులు విక్రయించినట్టు కోటక్ మహీంద్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ కపూర్ తెలిపారు. ఈ ఏడాదిలో కనీసం 20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. పండగల సీజన్‌లో బంగారం ధర 35,500-31,000 రూపాయల స్థాయిలో ఉండవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ హెడ్ (కమోటిడీస్) నవీన్ మాథుర్ అంచనా వేస్తున్నారు.

25 రోజులు వజ్రాల యూనిట్లకు సెలవు
గుజరాత్‌లోని వజ్రాల కటింగ్, పాలిషింగ్ యూనిట్లు 20 నుంచి 25 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. సాధారణంగా ఈ సీజన్‌లో పరిశ్రమలకు సెలవులుంటాయని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలిపారు. సోమవారంనుంచి నాలుగు వేలకు పైగా డైమండ్ యూనిట్లలో పనులు జరగవు.

డిసెంబర్ 1వ తేదీ నుంచి మళ్లీ యూనిట్లు ప్రారంభం అవుతాయి. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం. గుజరాత్‌లోని వజ్రాల పరిశ్రమ ప్రపంచ ప్రాసెస్డ్ డైమండ్స్‌లో 72 శాతం వాటాను కలిగి ఉంది. భారత ఎగుమతుల్లో 80 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇక్కడ సుమారు 6,547 డైమండ్ ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. వీటి ద్వారా దాదాపు ఏడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

Courtesy: Andhra Jyothy

Friday, November 2, 2012

సెన్సెక్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?

సెన్సెక్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?

ఆర్థిక వర్గాలలో 'సెన్సెక్స్' అత్యంత ప్రజాదరణ పొందిన పదం, చెప్పాలంటే అంతకు మించింది. సెన్సెక్స్ అంటే సున్నితమైన సూచిక అని అర్థం, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ కోసం ఉపయోగించే పదం. సెన్సెక్స్ భారతదేశంలో 30 స్టాక్స్‌ను ట్రాక్ చేస్తుంది, భారతదేశం లోని అతి పురాతన సూచిక.

ఎక్కువ మూలధనీకరణ స్టాక్స్, భారతదేశంలో వివిధ పారామీటర్లు, ప్రాతినిధ్యం ఆధారంగా 30 స్టాక్స్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుత ఉన్న రోజుల్లో సెన్సెక్స్‌ను మార్కెట్ల భారమితిగా భావిస్తున్నారు. దీనితో పాటు మార్కెట్ ధోరణి వర్ణించేందుకు ఉపయోగిస్తారు.

సెన్సెక్స్‌‌ను ఎలా లెక్కిస్తారు..?

సెన్సెక్స్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న అతి పెద్ద 30 స్టాక్స్‌ తెలిసిన ఒక పద్ధతి ద్వారా "ఉచిత ఫ్లోట్ మార్కెట్ మూలధనీకరణ" పద్ధతిని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న పద్దతిన లెక్కిస్కారు. ఒక కంపెనీలో కొన్ని షేర్లు తప్ప వాటాలు అందుబాటులో లేనప్పుడు
స్థాపకులు లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటాలను అందుబాటులోకి తీసుకరాకపోవచ్చు.

బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏమిటీ...?

బ్లూ చిప్ స్టాక్స్ అనేవి అధిక-నాణ్యత మరియు అధిక ధర స్టాక్ లక్షణములు కలిగి ఉంటాయి. ఈ స్టాక్స్ కంపెనీలు కలిగి ఉండడం వల్ల పెట్టుబడిదారు కాన్పిడెన్స్ తో పాటు కంపెనీలు ఎంతో ఎత్తులో ఉంటాయి. ఈ స్టాకులు పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు సహాయం చేస్తాయి. బ్లూ చిప్ స్టాక్స్ కలిగి ఉన్న కంపెనీలు ఆర్దిక పరంగా మంచి స్ట్రాంగ్‌గా ఉంటాయి.

ఈ బ్లూ చిప్ స్టాక్స్ పెట్టుబడిదారులకు సంపదను తెచ్చి పెట్టే విధంగా వ్యవహారిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్స్‌లో గట్టి పట్టుని కలిగి ఉన్న కంపెనీలు మాత్రమే ఈ బ్లూ చిప్ స్టాక్స్‌ని కలిగి ఉంటాయి. భారత దేశంలో ఈ బ్లూ చిప్ స్టాక్స్ విషయానికి వస్తే వాటాలు సెన్సెక్స్ మరియు నిప్టీ వాటాల రూపంలో భాగమై ఉంటాయి. ఉదాహారణకు ఎల్ అండ్ టి, హిందూస్తాన్ యూనీలీవర్, ఐటిసి, బజాజ్ ఆటో మొదలగునవి.

ఈ వాటాల కొన్ని అధిక మూలధనీకరణ స్టాక్స్ ఉంటాయి. ఐతే బ్లూ చిప్స్ స్టాక్స్‌లో పెట్టిన పెట్టుబడులకు గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయనే నమ్మకం లేదు.

సర్క్యూట్ ఫిల్టర్లు అంటే ఏమిటి?

సర్క్యూట్ ఫిల్టర్లు ఎంపిక చేసిన సెక్యూరిటీస్, స్టాక్ ధరల చలనానికి పరిమితం చేయడానికి భారతదేశం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ (సెబి) ద్వారా విధించబడిన ధర బాండ్లు. వీటి సహాయంతో ఆపరేటర్లు తారుమారు చేసిన వాటా ధరలను అరికట్టవచ్చు. ఈ సర్కూట్ ఫిల్టర్లను స్టాక్ ఎక్స్చేంజ్ లు పరిచయం చేశాయి. సెబీ నిబంధనల ఆధారంగా స్టాక్ ప్రైజెస్‌లో స్టీల్ పెరిగిందా లేదా తగ్గిందా తెలుసకోవచ్చు.

సర్క్యూట్ ఫిల్టర్లు ఎలా పని చేస్తాయి..?

స్టాక్ ధర తప్పినప్పుడు ఆ ఖచ్చితమైన స్టాక్ వర్తకం, స్టాక్ ఎక్సేంజ్ ద్వారా నిర్ణయించుకుంటుంది. దీంతో బ్యాండ్ ధర నిర్దేశించినప్పుడు సస్పెండ్ చెయ్యబడుతుంది. ఉదాహరణకు మీరు గనుక రూ 100 రూపాయలను షేర్ చేయాలనుకుంటే, ఆ సందర్బంలో 5% సర్క్యూట్ బ్రేకర్ ఉంటే, షేరింగ్ ధర రూ 105 కంటే ఎక్కువ ఉంటే ట్రేడింగ్‌ను నిలిపి వేస్తారు. అదే విధంగా స్టాక్ రూ 95 కంటే తక్కువైతే, దిగువ ముగింపు సర్క్యూట్ ఫిల్టర్ వర్తించబడుతుంది. దీంతో వ్యాపారం సస్పెండ్ చెయ్యబడింది.

సర్క్యూట్లు స్టాక్ ఎక్సేంజ్ ఎంత వరకు పరిమితం

సూచికలు కోసం మొత్తం మూడు సర్క్యూట్ ఫిల్టర్స్ ఉన్నాయి 10%, 15%, 20%. ఏదైతే ముందుగా సెన్సెక్స్ లేదా నిఫ్టీని ముందుగా మొదటి పరిమితిని విభజిస్తుందో అప్పుడు ఈ ఫిల్టర్లును అనువర్తిస్తారు. ట్రిగ్గర్ కూడా అది జరిగే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

10% drift on either side
If the drift is before 1 pm – 1 hour halt
If the drift is after 1 but before 2:30 pm – half an hour halt
If the drift is after 2.30 pm – no halt

15% drift on either side
If the drift is before 1 pm – 2 hours halt
If the drift is after 1 pm but before 2 pm- 1 hour halt
If the drift is after 2 pm – no further halt

20% drift in either direction
In case of a 20% movement in either index, the trading will halt for the remainder of the day.

సర్క్యూట్ ఫిల్టర్లు ద్రవ్యత్వం లేని సర్టిఫికెట్ విషయంలో తగ్గించబడతాయి. స్టాక్ ఎక్సేంజ్ నిర్ణయం ద్వారా సర్క్యూట్ ఫిల్టర్స్ ఆధారంగా10% లేదా 5% లేదా 2% తగ్గిస్తారు.

COURTESY : తెలుగు వన్ఇండియా