Wednesday, February 5, 2014

వాహన ప్రదర్శన నేటి నుంచే (5 ఫిబ్రవరి-2014)

(5 ఫిబ్రవరి-2014)
న్యూఢిల్లీ: భారత వాహన ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఆ పండుగకు తెరతీయనుంది. ఈ రంగం గత రెండేళ్లుగా డీలా పడ్డ సమయంలో తిరిగి గిరాకీని పెంచేందుకు.. కొనుగోలు దార్లను ఆకర్షించేందుకు ఇదో మంచి వేదికగా కంపెనీలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 11 వరకూ జరిగే ఈ ప్రదర్శనలో తొలి రెండు రోజులు మీడియా ప్రతినిధులకు కేటాయించారు. 7 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తారు. అంతక్రితంలా కాకుండా ఈ సారి 12వ ఆటో ఎక్స్‌పో రెండు భాగాలుగా విడదీశారు. గ్రేటర్ నోయిడాలో వాహన ప్రదర్శనను; ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ప్రదర్శనను నిర్వహించనున్నారు.

మొత్తం మీద 70 కొత్త వాహనాలు ఈ ప్రదర్శనలో మెరవనున్నాయి. ఇందులో 26 అంతర్జాతీయ మోడళ్లు కావడం విశేషం. అంతక్రితం ప్రదర్శనలో నిర్వహణపై ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజాలు 'ఇది తమాషా కాదు' అన్న విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సారి నిర్వాహకులు మరింత పకడ్బందీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారన్న అంచనాలున్నాయి. భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), భారత వాహన విడిభాగాల తయారీ సంఘం(ఏసీఎమ్ఏ)లు నిర్వహణలో పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే.

తెలుగు తేజానికి మైక్రోసాఫ్ట్ పగ్గాలు

Courtesy : Eenadu

ఈ సంధి కాలంలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి ఎవరూ లేరు. ఇంజినీరింగ్ నైపుణ్యం, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను కలిసికట్టుగా ఉంచడం వంటి విషయాల్లో సత్య ఒక నాయకుడుగా నిరూపించుకున్నారు.

తదుపరి తరం ఉత్పత్తుల్లో వినూత్నత, వృద్ధిలోకి కంపెనీ అడుగుపెడుతున్న ఈ సమయంలో మైక్రోసాఫ్ట్‌కు ఏం కావాలో; సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాదెళ్లకు బాగా తెలుసు.
- బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు

సత్య నాదెళ్ల ఓ అద్భుతమైన నాయకుడు. వినూత్న సాంకేతిక నైపుణ్యం ఆయన సొంతం. వ్యాపార పోకడలను త్వరితంగా అర్థం చేసుకోగల శక్తిసంపన్నుడు. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో కనిపెట్టగలడు. వాటిని మైక్రోసాఫ్ట్ ఎలా అందిపుచ్చుకోవాలో నిర్ణయించగలడు. సత్య నాదెళ్లతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశా. సత్య నాదెళ్ల గొప్ప సీఈఓ అవుతారన్న నమ్మకం నాకుంది.
- స్టీవ్ బామర్, వైదొలగుతున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ 

న్యూయార్క్: వూహించినదే జరిగింది. ప్రపంచ అగ్రగామి సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన తెలుగు తేజం సత్య నాదెళ్ల నియమితులయ్యారు. 38 ఏళ్ల మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడుఈయనే కావడం గమనార్హం. స్టీవ్ బామర్ స్థానంలో 46 ఏళ్ల నాదెళ్ల నియామకంతో కొన్ని నెలలుగా షికారు చేస్తున్న వూహాగానాలకు తెరపడింది. ఒక అమెరికా కంపెనీలో.. అందునా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలో.. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత సీఈఓ పదవి చేపట్టిన వ్యక్తిగా సత్య నాదెళ్ల నిలిచారు. ఇది ఒక భారతీయుడికి లభించిన అరుదైన గౌరవం.
నాదెళ్లతో పాటు.. గూగుల్‌కు చెందిన సుందర్ పిచాయ్ కూడా మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి పోటీ పడ్డారు. క్రికెట్ అంటే బాగా ఇష్టపడే నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అంతక్రితం క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ గ్రూపునకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఛైర్మన్‌గా జాన్ థాంప్సన్ : ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న జాన్ థాంప్సన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్థానంలో ఛైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక బిల్‌గేట్స్ సాంకేతిక సలహాదారుగా కొత్త అవతారం ఎత్తనున్నారు. బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు.

మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు ఉద్యోగులకు సత్య నాదెళ్ల రాసిన లేఖ సారాంశం....... 

'ఈ రోజు నాకు చిరస్మరణీయం. 22 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టిన రోజు గుర్తుకొస్తోంది. పనిచేసే కంపెనీని ఎంచుకునే అవకాశం మీలాగే నాకూ లభించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా నమ్మి మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టా. ఆనాటి నుంచి కొత్త ఆలోచనలు, ఉత్పత్తులతో ప్రజల సామర్థ్యాలను పెంచుతున్న మైక్రోసాఫ్ట్‌ను చూస్తూనే ఉన్నా. అద్భుతాలు సృష్టించాలనుకుంటే.. పని చేయడానికి మైక్రోసాఫ్ట్‌కు మించిన కంపెనీ లేదని నాకు తెలుసు. ఇదే స్ఫూర్తి నన్ను ఈ రోజు వరకూ నడిపిస్తోంది. నాకు నమ్మలేని గౌరవం దక్కింది. ఇంత గొప్ప కంపెనీకి నాయకత్వం వహించి సేవ చేసే భాగ్యం కలిగింది. చిన్న ఆలోచన నుంచి ప్రపంచంలోనే అత్యంత గొప్ప, ఆరాధ్య కంపెనీ స్థాయికి మైక్రోసాఫ్ట్ ఎదగడానికి కారణమైన స్టీవ్, బిల్‌గేట్స్‌తో సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఇప్పుడు సీఈఓ బాధ్యతలు చేపట్టాను. కంపెనీకి అదనంగా సమయం కేటాయించమని, టెక్నాలజీ, ఉత్పత్తులపై దృష్టిపెట్టమని బిల్‌ను కోరాను. కంపెనీ కొత్త ఛైర్మన్ జాన్ థాంప్సన్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనం ఎన్నో విజయాలను సాధించాం. మరిన్ని విజయాల కోసం తహతహలాడుతున్నాం. పరిశ్రమకు, మైక్రోసాఫ్ట్‌కు ఇది కీలకమైన సమయం. మొబైల్, క్లౌడ్ రంగాల్లో మైక్రోసాఫ్ట్ దూసుకుపోయేలా చేయడం మనందరి ముందున్న కర్తవ్యం. ఈ తరుణంలో నా గురించి మీతో ఓ రెండు ముక్కలు చెప్పుకోవాలి. నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విషయాలను మీతో పంచుకోవాలి.

నా వయసు 46 ఏళ్లు. 22 ఏళ్ల క్రితం పెళ్త్లెంది. ముగ్గురు పిల్లలు. అందరి లాగే నా కుటుంబం, అనుభవాలే నన్ను తీర్చిదిద్దాయి. నా మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను పుస్తకాల పురుగంటారు. అయితే.. చదివిన పుస్తకాల కంటే కొన్నవే ఎక్కువ. ఆన్‌లైన్‌లో కొత్త కోర్సులకు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నా.. పూర్తి చేసింది తక్కువే. కొత్త విషయాలను తెలుసుకోలేకపోతే ఉపయోగపడే గొప్ప పనులు చేయలేమని నా నమ్మకం. మొత్తం మీద కుటుంబం.. జ్ఞానాన్ని సముపార్జించాలన్న తృష్ణ, ఉత్సుకతలే నన్ను మలిచాయి.

నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే..?

ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మైక్రోసాఫ్ట్‌లో ఎక్కువమంది ఎందుకు చేరుతున్నారో ఆ కారణం తెలుసుకోవాలి. ఆ కారణమే నేను ఈ కంపెనీలో చేరడానికి దారి తీసింది. అబ్బురపడే పనులు చేయగలగడానికి వీలుగా ప్రజలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, తద్వారా ఈ ప్రపంచంలో మార్పు తేవాలనే ఆశయంతోనే పలువురు మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు.. అయినప్పటికీ నిజం మాత్రం ఇదే. మనం దీన్ని చేసి చూపించాం. ఈవేళకీ చేస్తున్నాం.
రానున్న పది సంవత్సరాల్లో కంప్యూటింగ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని నా నమ్మకం. కొత్త రకాల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్రాణం పోసుకొని మనం చేస్తున్న అనేక పనులలోకి, వ్యాపారాల లోకి, జీవన శైలుల్లోకి, ఏకమొత్తంగా మనదైన ప్రపంచంలోకీ చొచ్చుకు వచ్చి డిజిటైజ్ చేసేస్తాయి. ఈ ప్రపంచం సాఫ్ట్‌వేర్ ఆలంబనగా నిలుస్తున్న ప్రపంచం.

మన కుటుంబాలతోనూ, స్నేహితులతోనూ ఉన్న అనుబంధాన్ని మరింత మెరుగ్గా మనం పెంచుకోవడానికీ, ఈ ప్రపంచాన్ని ఇదివరకెన్నడూ ఎరుగని పద్ధతుల్లో చూడడానికి, అనుభూతించడానికి, సన్నిహితంగా పంచుకోవడానికి ఉపయోగపడనుంది. ఒక బలమైన ప్రభావాన్ని కలగజేయడంలో సాటిలేని శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నందువల్లనే నేను ఇక్కడికి వచ్చాననుకుంటున్నా.

ఇక్కడ ఎందుకున్నాం?

ఇంతకు ముందు వరకు మన ధ్యేయమల్లా ప్రతి ఇంట్లోకీ ఒక పీసీని చేర్చాలనేది. దీన్ని మనం చాలావరకు సాధించగలిగాం. ఇవాళ మరింత విస్తృత శ్రేణి పరికరాలపై దృష్టి కేంద్రీకరించాం. నోకియాతో మన ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు కానీ.. ఆ కంపెనీ ఉపకరణాలను, సేవలను మన కుటుంబంలోకి ఆహ్వానిద్దాం. మొబైల్ ఫోన్లపరంగా వారు మనకు తెచ్చి ఇచ్చే శక్తియుక్తులను అందుకుందాం. ఈ ప్రపంచానికి మైక్రోసాఫ్ట్ తనవంతుగా అందించగల విశిష్ట సేవలేమిటన్నది మనం గుర్తించి తీరాలి. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఇది.

ఇక నుంచి ఏం చేద్దాం?

ఆస్కార్ వైల్డ్ అన్నట్లు 'మనకు అసాధ్యం అన్నది ఉండదన్న విషయాన్ని విశ్వసించాలి. అదే సమయంలో అనుమానాన్ని దరిదాపుల్లోకి కూడా రానీయకూడదు.'
అపుడే మనం చేయాల్సిన పనిపై ఒక స్పష్టత మొదలవుతుంది. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. వినూత్నతకు ప్రాధాన్యమివ్వాలి. మన వినియోగదార్లకు కావాల్సింది అదే. మనం అందించే ప్రతీ సేవ, వస్తువుల్లో మరింత వినూత్నతను కనబరచాలి.

ఇక, మనం మన అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శించాలి. మనలో ప్రతి ఒక్కరూ తమ పనికి అర్థాన్ని వెతుక్కోగలరని నేను గట్టిగా నమ్ముతున్నా. ప్రజల జీవితాన్ని మార్చేదేదో చేసినపుడే అది అత్యుత్తమ పని.చాలా వరకు కంపెనీలు ప్రపంచాన్ని మార్చివేయాలని భావిస్తుంటాయి. కానీ చాలా కొన్నిటి వద్దే అందుకు కావలసిన ముడిసరకులుంటాయి. అందులో ముఖ్యమైనవి: ప్రతిభ, వనరులు, నిరంతర శ్రమ. మైక్రోసాఫ్ట్‌కు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొత్త సీఈఓగా నేను మరింత గట్టి పునాదులుండాలని కోరుకోను. రండి.. ఈ పునాదిపైనే ఒక నవ లోకాన్ని నిర్మిద్దాం.

ముళ్ల బాటే!

మొబైల్ కంప్యూటింగ్ రంగంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న మైక్రోసాఫ్ట్‌కు యాపిల్, గూగుల్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కంపెనీ 'మొబైల్' ఆశలను నెరవేర్చడంలో సత్య నాదెళ్ల ఎటువంటి వ్యూహాలను అమలు చేయనున్నారన్నదిఆసక్తి కరం.. సవాళ్లు పరిశీలిస్తే..
చి అంతర్జాలం (ఇంటర్నెట్) ఆధారిత, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో సత్యకు మంచి అనుభవమే ఉంది. కంపెనీకి నాయకత్వం వహించడానికి ఆయన తగిన వ్యక్తే. అయితే.. వినియోగదారులను మెప్పించడంలో.. వాటాదారులను సంతృప్తిపరచడంలో ఏ మేరకు విజయం సాధించగలరన్నది ప్రశ్న.

- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆయనకు అనుభవం ఉన్నా.. మొబైల్ సొల్యూషన్లపై పెద్ద అవగాహన లేదు. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

- వర్క్‌ప్లేస్ కంప్యూటింగ్‌లో కంపెనీకి ఇప్పటికీ తిరుగు లేకపోయినప్పటికీ.. అటు అమెరికాలోను, ఇటు విదేశాల్లోను క్రమక్రమంగా కంపెనీ వినియోగదారుల ఆదరణ కోల్పోతోంది.

- ఆండ్రాయిడ్ ఫోన్లు, యాపిల్ ఐపాడ్‌లను సవాలు చేయడానికి నోకియాను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. ఇది వాల్‌స్ట్రీట్‌ను అంతగా మెప్పించలేదు. హార్డ్‌వేర్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని కీలకమైన వాటాదారుల నుంచి ఒత్తిడి వస్తోంది.

- యూనిట్ అధిపతిగా సత్య నాదెళ్లకు అనుభవం ఉన్నా.. ఒక భారీ కంపెనీ ఎదుర్కొనే సవాళ్లను నేరుగా చవి చూడలేదు. ఇంత పెద్ద కంపెనీ లాభ, నష్టాల ఖాతాలపైనా ఆయనకు అనుభవం లేదు.

- పెద్ద పెద్ద కంపెనీల్లో వాటాదారుల విలువ పెరగడం నిధుల కేటాయింపుపైనే ఆధారపడి ఉంటుంది. కొత్త ఉత్పత్తుల వల్ల కాదు. వాటాదారుల విలువ పెంచడమే నాదెళ్లకు అసలైన సవాల్.

మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యాలయం: రెడ్‌మండ్, వాషింగ్టన్ 
ఏర్పాటు: 1975, ఏప్రిల్ 4, ఆల్బుకర్క్, న్యూమెక్సికో రాష్ట్రం 
వ్యాపార కార్యకలాపాలు: ఆసియా, ఐరోపా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలు దక్షిణ ఫసిఫిక్ 
ఉద్యోగుల సంఖ్య: సుమారు 1,00,932 (2013, డిసెంబరు నాటికి) 
ఆదాయం: 77.85 బిలియన్ డాలర్లు (2013లో)

బుక్కాపురం బిడ్డ.. 'ఐఏఎస్' యుగంధర్ కుమారుడు..

ఈనాడు, అనంతపురం; న్యూస్‌టుడే, తాడిపత్రి: సత్య నాదెళ్ల అలియాస్ నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. లోగడ ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగాను, ప్రణాళికా సంఘం సభ్యుడిగాను, ఇతర హోదాల్లోను పనిచేసి, ప్రజాసంక్షేమం, పరిపాలనలో తనదైన ముద్ర వేసి జాతీయస్థాయిలో పేరుగాంచిన మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ కుమారుడే సత్య. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ అల్లుడు కూడా. యుగంధర్ చిన్నతనం నుంచే కష్టపడి చదివారు. ఐఏఎస్‌కు ఎంపికై, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కుమారుడు సత్యను బాగా చదివించారు. పలు సందర్భాల్లో తండ్రి యుగంధర్‌తో కలిసి సత్య బుక్కాపురం సందర్శించారు. తమ ఇల్లు, పంట పొలాలు చూశారు. బంధువులను కలిసి ఆత్మీయంగా పలకరించారు. యుగంధర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. వూరిలోని చెన్నకేశవస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, గ్రామంలో సీసీ రోడ్లు, ఎస్సీలకు పక్కా ఇళ్ల నిర్మాణం- ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ప్రధాన భూమిక పోషించారు. 'ఈనాడు-ఈటీవీ' బృందం మంగళవారం బుక్కాపురాన్ని సందర్శించి, సత్య బంధువులు, కుటుంబీకులతో ముచ్చటించింది. ఆయన అత్యున్నత స్థాయికి ఎదగడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. ఆ తండ్రీ కొడుకులు గ్రామానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చారని ప్రశంసించారు.
పంట పొలాలు చూసి సంతోషించాడు: సర్పంచ్

''సత్య తండ్రి, మా తండ్రి చిన్నాన్న పెదనాన్న పిల్లలు. సత్య మైక్రోసాఫ్ట్ సీఈవో కావడం చెప్పలేని ఆనందాన్నిస్తోంది. సత్య బీటెక్‌లో చేరే ముందు తండ్రితో కలిసి గ్రామానికి వచ్చాడు. పంట పొలాలు చూసి సంతోషపడ్డాడు. గ్రామస్థులందరిని ఆప్యాయంగా పలకరించాడు. ఇప్పటికీ వారికి ఇక్కడ పదెకరాల పొలం ఉంది'' అని బుక్కాపురం సర్పంచ్ భీమశంకర్ తెలిపారు.

Friday, January 31, 2014

మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువ్యక్తి నాదెళ్ల సత్య?


వాషింగ్టన్ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి: అతిపెద్ద సాఫ్ట్‌వేర్ నిర్మాణసంస్థ, ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఛైర్మన్‌గా ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థకు తదుపరి సీఈవోగా తెలుగువాడైన నాదెళ్ల సత్యను ప్రకటించే అవకాశం ఉన్నట్లు అమెరికాలోని పలు వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. మైక్రోసాఫ్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆయన నియామకంపై తుది నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. అధికారిక నియామకానికి సంబంధించిన తుది ప్రకటన అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం వెలువరించే అవకాశం ఉంది. సత్య నాదెళ్ల నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రస్తుత సీఈవో స్టీవ్‌బామర్ రాజీనామా చేయనున్నారు. అయినప్పటికీ ఆయనకు మైక్రోసాఫ్ట్‌లో 4శాతం వాటా ఉంటుంది. నాదెళ్ల సత్య 2013 ఏడాదికి సుమారు రూ.48కోట్ల రూపాయల వేతనం అందుకున్నారు. ఇందులో జీతభత్యాల కింద 670డాలర్లు, బోనస్‌గా 1.5 మిలియన్ డాలర్లు, మరో 5.4 మిలియన్ డాలర్లు స్టాకుల రూపంలో ఆయనకు లభించాయి. దీంతో పాటు సుమారు రూ.90కోట్ల(15.4మిలియన్ డాలర్లు) విలువ కలిగిన 450వేల మైక్రోసాఫ్ట్ షేర్లను నాదెళ్ల సత్య కలిగి ఉన్నారు. 1992 నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న సత్య, ప్రస్తుతం సంస్థ కోడ్, ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవోగా సత్య నియామకం కానున్నారని తెలుసుకున్న పలువురు ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసిన సమయానికి మైక్రోసాఫ్ట్ షేరు ధర 1శాతం పెరిగి 37.20 డాలర్ల వద్ద స్థిరపడింది. నాదెళ్ల సత్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

మళ్లీ కార్ల పండుగ -2014 Delhi Auto Show

6 నుంచి భారత్‌లో ఆటో షో
70 కొత్త వాహనాలను విడుదల చేయనున్న ఆటోమొబైల్ దిగ్గజాలు...
 మందగమనం నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశ్రమ ఆశాభావం


 న్యూఢిల్లీ: వాహన అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో భారత్‌లో అతి పెద్ద వాహన పండుగ ఆటో షో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే నెల 6-12 తేదీల్లో జరిగే ఈ 12వ ఆటోషోలో వివిధ కంపెనీలు దాదాపు 70  కొత్త వాహనాలను ఆవిష్కరిస్తాయని, దీంతో మందగమనంలో ఉన్న వాహన మార్కెట్‌కు ఊపువస్తుందని వాహన పరిశ్రమ ఆశిస్తోంది. స్థలాభావం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం తదితర కారణాల వల్ల ఈ ఆటో షో రెండు చోట్ల జరుగుతుంది. గ్రేటర్ నోయిడాలో వాహనాల ప్రదర్శన,  ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ఎగ్జిబిషన్ జరుగుతాయి.  భవిష్యత్తులో ఒకే చోట ఆటో షో జరిగేలా ప్రభుత్వం చూడాలని  సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ కోరారు.  వినియోగదారులు వాహనాల కొనుగోళ్ల విషయమై డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నారని  చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం తదితర అంశాలు వారిని వెనక్కు లాగుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో అమ్మకాలు పుంజుకోవడానికి ఈ ఆటో షో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 కొత్త కార్ల సందడి... ఎస్‌యూవీల హల్‌చల్..
     ఈ ఆటోషోలో వివిధ వాహన కంపెనీలు 70 వరకూ కొత్త వాహనాలను ఆవిష్కరించే అవకాశాలున్నాయి. వీటిల్లో 26 వరకూ అంతర్జాతీయ మోడళ్లు ఉంటాయని(15 గ్లోబల్ కార్లు) అంచనా.
     దేశీ కార్ల దిగ్గజం మారుతీ.. ‘సెలెరియో’ను ఆవిష్కరించనుంది. ఆటోమాటిక్ గేర్ సిస్టమ్ దీని ప్రత్యేకత.
     కొత్త సెడాన్‌ను, దీంతో పాటు కొన్ని కాన్సెప్ట్ మోడళ్లను కూడా మారుతీ డిస్‌ప్లే చేయవచ్చు.
     హ్యుందాయ్ కంపెనీ మిడ్ సైజ్ ఐ10 గ్రాండ్‌ను డిస్‌ప్లే చేయనున్నది. కొత్త శాంటా ఫే ఎస్‌యూవీతో పాటు రెండు కాన్సెప్ట్ కార్లను కూడా ఈ కంపెనీ డిస్‌ప్లే  చేయనున్నది.

     నిస్సాన్ కంపెనీ డాట్సన్  గో చిన్న కారును,  గో ప్లస్ మల్టీ యుటిలిటి వెహికల్‌ను ప్రదర్శించనుంది
     ఫోక్స్‌వ్యాగన్ తైగన్, జనరల్ మోటార్స్ ఆడ్రా కాన్సెప్ట్. ఫియట్ కంపెనీ కొత్త ఎస్‌యూవీ, డస్టర్‌లో అప్‌గ్రేడ్ చేసిన ఎస్‌యూవీని రెనో కంపెనీలు. డిస్‌ప్లే చేయనున్నాయి.

     టాటా మోటార్స్ కూడా కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచుతోంది.
     మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌లో హైబ్రిడ్ వెర్షన్‌ను, క్వాంటోలో ఆటో-గేర్ వేరియంట్‌ను తెస్తోంది.
     హోండా కంపెనీ జాజ్ హ్యాచ్‌బాక్‌ను, మొబిలియో ఎంపీవీని డిస్‌ప్లే చేయనున్నది.
     ఇక లగ్జరీ కార్ల విషయానికొస్తే, మెర్సిడెస్ బెంజ్ కంపెనీ సీఎల్‌ఏ సెడాన్‌లో ఏఎంజీ వెర్షన్‌ను, జీఎల్‌ఏ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాన్సెప్ట్ మోడల్‌ను, ఎఫ్1 పోడియమ్ కారును డిస్‌ప్లే చేయనున్నది.

     ఆడి కంపెనీ ఆడి ఏ3 సెడాన్‌ను, ఆర్‌ఎస్ 7 స్పోర్ట్స్ కారును ఆవిష్కరించనుంది. బీఎండబ్ల్యూ ఐ కాన్సెప్ట్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచనున్నాయి.
     ఇక టూ వీలర్ల విషయానికొస్తే, హార్లే డేవిడ్సన్ కంపెనీ స్ట్రీట్ 750 బైక్‌ను ఈ ఆటో షోలోనే ఆవిష్కరించనున్నది. హీరో మోటో కార్ప్ కంపెనీ కొత్త మోడళ్లను, కాన్సెప్ట్ టూవీలర్లను డిస్‌ప్లే చేయనున్నది.

 రెండేళ్లకోసారి జరిగే ఈ ఆటో షో 12వది

 ఎప్పుడు: వచ్చే నెల 6-12 తేదీల్లో(5న మీడియా కోసం ప్రత్యేకంగా అనుమతించనున్నారు).
 ఎక్కడ: గ్రేటర్ నోయిడాలో  వాహనాల ప్రదర్శన, ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ఎగ్జిబిషన్.
 వేదిక ఎందుకు మారింది?: గతంలో ఈ ఆటో షో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగేది. ఈ ఆటో షో జరిగినన్ని రోజులు జనం పోటెత్తడంతో ఢిల్లీ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌లతో అల్లాడి పోయాయి. దీనిని నివారించడానికి ఈ ఏడాది ఆటో షోను రెండు చోట్ల నిర్వహిస్తున్నారు.
 ఎన్ని కంపెనీలు:  గ్రేటర్ నోయిడా షోలో 55 వాహన తయారీ కంపెనీలు, ఢిల్లీ ప్రగతి మైదాన్ షోకు కనీసం 1,100 విడిభాగాల తయారీ సంస్థలు పాల్గొంటున్నాయి.

 సందర్శకుల సంఖ్య: 2012లో జరిగిన 11వ ఆటో షోకు 7 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఈ ఏడాది ఆటో షోకు 5.40 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశాలున్నాయి. గ్రేటర్ నోయిడాలో జరిగే ఆటో షోకు రోజుకు లక్ష మంది, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే వాహన విడిభాగాల ప్రదర్శనకు రోజుకు దాదాపు 10 వేల మంది సందర్శకులు రావచ్చని అంచనా.
 టికెట్లు: రూ.500(బిజినెస్ అవర్స్ ఉ.10-మ.1.00) రూ.200 (జనరల్ అవర్స్)
 ఎవరు నిర్వహిస్తున్నారు: సియామ్(సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ), సీఐఐలు సంయుక్తంగా నిర్వహిస్తాయి.
 ఎవరు పాల్గొంటున్నారు?: మారుతీ, హ్యుందాయ్, హోండా వంటి చిన్నా కార్ల కంపెనీలే కాకుండా, ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్ల కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి.
 ఎన్ని కొత్త మోడళ్లొస్తాయి:70 వరకూ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తాయని అంచనా.

Monday, December 16, 2013

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రతి కోసం క్లిక్ చేయడి.

‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü X¾ÛÊ-ªý-«u-«-®Ôn-¹-ª½º G©Õx “X¾A Â¢ ÂËxÂú Í䧌բœË 

Wednesday, August 14, 2013

Friday, June 21, 2013

రూపాయితో మనకేంటి నష్టం?

ఈనాడు సౌజన్యంతో...

మనకేంటి నష్టం? మన రూపాయి విలువ పతనం అవుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశీ నిల్వలు అడుగంటి పోతున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దాదాపు ప్రతి వస్తువు ధరా ప్రభావితం అవుతోంది. ఈ రూపాయి, డాలర్ పోటీలో మనకు వచ్చే లాభనష్టాలేమిటి? రూపాయి కన్నా డాలరుకు ఎక్కువ గిరాకీ ఉంటే.. రూపాయి మారకపు విలువ తగ్గుతుంది. మనదేశం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడి ఉంటుంది. సహజంగానే డాలరుకు రూపాయితో పోలిస్తే గిరాకీ ఎక్కువ. ముడి చమురు, ఎరువులు, బంగారం తదితర విలువైన లోహాలు, బొగ్గు, విద్యుత్ ఉపకరణాలు, రక్షణరంగానికి సంబంధించిన వస్తువులు, ఆహారపు నూనెలు తదితర వస్తువులను మనం ఇతర దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. దీనికి చెల్లించేదంతా డాలర్ల రూపంలోనే. దిగుమతులు ఎక్కువ కావడం, డాలర్ల కొరత ఏర్పడటంలాంటి పరిస్థితుల వల్ల నేడు రూపాయి విలువ గరిష్ఠ స్థాయిలో పతనం అయ్యింది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిశలో పయనించడం, భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గత పదేళ్ల కనిష్ఠానికి పడిపోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల కూడా రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో కొంత దిద్దుబాటు కన్పించింది. దీంతో పెద్ద మొత్తంలో ఈ విలువైన లోహాలను దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారక ద్రవ్య నిలువలు చాలా వేగంగా ఖాళీ అయ్యాయి. ఫలితంగా రూపాయి విలువ పతనం కావడానికి కారణం అయ్యింది. ఇతర దిగుమతులను ఆపడం సాధ్యం కాదు. దీంతో ఎగుమతులు, దిగుమతులను సమతౌల్యం చేసే దిశగా బంగారంలాంటి లోహాలను దిగుమతి చేసుకోకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనివల్ల రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూడాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఎంత వరకూ.. 1947లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఎంతో తెలుసా? ఒక రూపాయికి ఒక డాలరు. ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం. తర్వాత రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ మన దేశంకన్నా ముందుకు వెళ్లడంతో డాలరుతో రూపాయి మారకం విలువ పతనం అవ్వడం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం కనిష్ఠ స్థాయికి రూపాయి చేరుకుంది. ఒక డాలరు విలువ సుమారు 60 రూపాయలు (59.57) వెచ్చించాల్సి వస్తోంది. అన్నీ భారమే మన దేశంలో అవసరమయ్యే ముడి చమురులో 70శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నదే. రూపాయి విలువ ఏ మాత్రం తగ్గినా వెంటనే ఆ ప్రభావం పెట్రోలు ధరలపై పడుతుంది. ఇటీవలే రూ.2 మేరకు పెరిగిన పెట్రోలు ధరే ఇందుకు నిదర్శనం. ఇది సామాన్యుడిపై పడే ప్రత్యక్ష భారం. డీఖ్ణ్మీ;లు/పెట్రోలు ధరల పెరుగుదల కారణంగా ఉత్పాదన వ్యయం, రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దీంతో పరోక్షంగా మనపైనే ఆ భారం పడి, వస్తువులకు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తుంది. సబ్సిడీకి (9 సిలిండర్లు) మించి వినియోగించే వంటగ్యాసు ధర కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. చి మనం వినియోగించే ఆహార నూనెల్లో విదేశాల నుంచి 60శాతం వరకూ దిగుమతి చేసుకుంటున్నదే. పామ్ఆయిల్, సోయాబీన్ నూనె ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. రూపాయి పతనం ఫలితంగా ఈ నూనెల ధర ఇటీవల కాలంలో లీటరుకు రూ.3 దాకా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చే పప్పుధాన్యాల ధరలు కూడా పెరగడం చూస్తేనే ఉన్నాం. చి బంగారం, వెండిలాంటి లోహాల ధరలు రూపాయి పతనంతో పెరిగాయి. మనదేశంలో బంగారం గనుల్లో చెప్పుకోదగ్గ ఉత్పత్తి లేకపోవడంతో మొత్తంగా విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రూపాయి విలువ తగ్గడంతో బంగారం దిగుమతులపై ఆ ప్రభావం పడుతోంది. చి విద్యుత్ ఉపకరణాలను కూడా ఎక్కువగా చైనా, ఇతర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పతనం అవడంతో ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. చి సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు తదితర వస్తువుల తయారీకి ముడి చమురు నుంచి వచ్చిన కొన్ని పదార్థాలను వినియోగిస్తారు. ముడి చమురు దిగుమతి ధర పెరిగితే.. సహజంగానే.. ఈ ఉత్పాదనల విలువ పెరిగే అవకాశం ఉంది. చి విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు కూడా డాలర్ ధర పెరగడంతో ఇక్కట్లు తప్పడం లేదు. విహార యాత్రలకు వెళ్లేవారిపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. చి రూపాయి విలువ పతనం ద్రవ్యోల్బణం పెరగడానికి అవకాశాన్నిస్తుందన్న కారణంతో వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మాత్రం సవరించలేదు. దీంతో రుణం తీసుకున్నవారికి నెలసరి వాయిదాల్లో ఎలాంటి తేడా రాలేదు. లాభాలూ ఉన్నాయి డాలరు ధర పెరగడం వల్ల అన్నీ నష్టాలే లేవు. కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు మన దేశంలో ఉన్నవారికి డాలర్లలో డబ్బు పంపిస్తుంటారు. దీనివల్ల వారికి ఎక్కువ రూపాయలు వచ్చేందుకు వీలు కల్గింది. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రవాస భారతీయులకు ఇది అనువైన సమయమే. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, వాటిని వెనక్కి తీసుకోవాలనుకున్న వారికి మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు రావచ్చు. చి ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉన్న ఐటీ, ఫార్మా రంగాల్లోని కంపెనీల షేర్లలో మదుపు చేసిన వారికి రూపాయి పతనం లాభాలు తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది. దిగుమతుల మీద ఆధారపడ్డ కంపెనీల షేర్లకు ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు. విదేశీ సంస్థాగత మదుపరులు మన మార్కెట్లలో కీలకమైన పెట్టుబడిదారులు. ఇలాంటి సమయంలో రూపాయి మరింత తగ్గితే స్వల్పకాలంలో మార్కెట్‌లో కొంత వ్యతిరేక పవనాలు వీచే అవకాశం లేకపోలేదు. చి ఇటు ఈక్విటీ మార్కెట్లలోనూ, అటు బాండు మార్కెట్లోనూ మదుపు చేసేవారిపై స్వల్పకాలంలో రూపాయి పతనం ప్రభావం కనిపిస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tuesday, June 4, 2013

అనగనగా ఓ రూపాయి

 అనగనగా ఓ రూపాయి పడిపోతున్న మారకపు విలువ ప్రస్తుతం 11 నెలల కనిష్ఠ స్థాయి రూ.56.76కి.. త్వరలోనే 57కు చేరే అవకాశం దిగుమతి రంగాలకు తీవ్ర ఇబ్బందులే అంతర్జాతీయ పరిణామాలే కాదు.. ప్రభుత్వ అలసత్వమూ కారణమే ఈనాడు వాణిజ్య విభాగం రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావ్ అని అడిగితే.. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తా.. భార్య భర్తల మధ్య చిచ్చు పెడతా.. తండ్రీ బిడ్డలను విడదీస్తా.. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతా.. ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడదీస్తా.. అని అందట.. అక్కడితో విడిచిపెడుతుందనుకుంటే పొరపాటే.. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది.. స్టాక్ మార్కెట్లను కుప్పకూలుస్తుంది.. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంది.. వివిధ రంగాలను నీరుకారుస్తుంది... ఇలా చెప్పుకుంటే చాలానే పనులు చేస్తుంది రూపాయి. ఇలా అందరినీ ప్రభావితం చేసే రూపాయి.. ప్రస్తుతం డాలరుతో 11 నెలల కనిష్ఠ స్థాయి రూ.56.76కు పడిపోయి అటు ఆర్థిక వ్యవస్థను.. ఇటు ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ప్రభుత్వం చొరవ లేకే..: కరెన్సీని రక్షించడానికి రిజర్వు బ్యాంకు చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకున్నట్లే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో సరైన దిశానిర్దేశం అందలేదనే చెప్పాలి. కరెన్సీ కనిష్ఠ స్థాయిలకు వెళ్లినపుడు అంతర్జాతీయ పెట్టుబడుదారులు దేశంలోకి రావడానికి వెనకడుగు వేస్తారన్న విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితులు కఠినంగా ఉండడంతో పాటు గట్టి సవాళ్లు ఎదురుగా ఉన్నాయన్న విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఈ సమయంలో సరైన విధానపరమైన చర్యలు అవసరం. ఇంతకీ రూపాయి ఎందుకు పతనమవుతోందో మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా రూపాయి పడిపోతోందంటే.. దేశంలోకి పెట్టుబడులు రాకపోవడమో.. లేదా తరలిపోవడమో జరిగి ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మన మార్కెట్లలోకి నికరంగా పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. అయినా రూపాయి పడుతోంది. ఎందుకంటే.. ముఖ్యంగా డాలరు మారక విలువ అన్ని ప్రధాన కరెన్సీలు అంటే యెన్, యూరోల కంటే బలపడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని.. 2013లో మరింతగా మెరుగుపడుతుందన్న అంచనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఒక్క రూపాయే కాదు.. అన్ని ఆసియా కరెన్సీలదే అదే బాట. మరో పక్క దేశీయంగా సరైన సంస్కరణలు లేకపోవడంతో పెచ్చుమీరుతున్న కరెంట్ ఖాతా లోటుతో పాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) దశాబ్ద కనిష్ఠ స్థాయికి దిగజారడం కూడా రూపాయిపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఇంకా పడుతుందా..?: సోమవారం(జూన్ 3) రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజీ(ఫారెక్స్) మార్కెట్లో 56.76 వద్ద 11 నెలల తాజా కనిష్ఠ స్థాయికి చేరింది. త్వరలోనే 57కు కూడా చేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటిదాకా ఎఫ్ఐఐలు మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. అయితే ఈ మధ్యనే వెనక్కిమరలడం మొదలుపెటారు. 9 కోట్ల డాలర్ల దాకా మన స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. మరోపక్క ద్రవ్యోల్బణంపై రిజర్వు బ్యాంకు అంచనాలు ఆశావహంగా లేవు. కరెంట్ ఖాతా లోటు కూడా భయపెడుతోంది. వ్యవసాయం, తయారీ తవ్వక రంగాలు డీలా పడడంతో జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 4.8 శాతానికి పడిపోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఈ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైంది. ఇది దశాబ్దపు కనిష్ఠ స్థాయి. ఇప్పటికే ఫ్యూచర్స్ మార్కెట్లో 57 స్థాయిని అధిగమించిన రూపాయికి ఫారెక్స్ మార్కెట్లో 56.85 వద్ద గట్టి నిరోధం ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఈ స్థాయిని దాటితే అల్‌టైం కనిష్ఠ స్థాయి అయిన 57.32ను త్వరలోనే చేరే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. మరోపక్క మరికొంతమంది విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్పకాలంలో ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి చేరే అవకాశం తక్కువేనంటున్నారు. రూపాయి మారక విలువ క్షీణించిందంటే.. ముఖ్యంగా మనం డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకునే రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మనం ఎక్కువ శాతం ముడి పదార్థాలకు దిగుమతులపైనే ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ముడి చమురు..: ఫారెక్స్ నిల్వల్లో మనం ఎక్కువ భాగం ఖర్చుపెట్టేది చమురు దిగుమతుల కోసమే. బ్రెంట్ చమురు ధర రెండేళ్ల కిందట బారెల్‌కు 118 డాలర్ల దాకా పలికింది. అప్పట్లో రూపాయి మారక విలువ 44.4గా ఉంది. ప్రస్తుతం ముడి చమురు ధర 103 డాలర్లకు తగ్గింది. అయితేనేం ఒక్కో డాలరుకు 56 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో చమురు ధర తగ్గినా మనకు పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదు. కార్పొరేట్ రుణాలు: మన కార్పొరేట్లు ఎక్కువగా పెట్టుబడుల కోసం విదేశీ నిధులను సమీకరిస్తుంటారు. ఇందు కోసం విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీలు); విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల (ఎఫ్‌సీసీబీలు)ను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడి అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యలభ్యత దృష్ట్యా విదేశీ నిధులను సమీకరించుకున్నాయి కంపెనీలు. అయితే రూపాయి విలువ 17 శాతం దాకా క్షీణించడంతో వీరికి రుణం మరింత భారమైంది. విద్యుత్: ఫెర్రస్ లోహాల దిగుమతి వ్యయాలు అధికం కావడంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎరువులు: ఈ పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలలో సగభాగం దిగుమతుల ద్వారా అందేవే. వీటి వ్యయం 20 శాతం దాకా పెరగడంతో వీటిపై భారం పడుతోంది. వీటికి లాభం ఫార్మా కంపెనీలకు: సాధారణంగా ఫార్మా కంపెనీలన్నీ ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాయి. రూపాయి పతనం కావడంతో వీటి మార్జిన్లు పెరగనున్నాయి. విదేశీ వాణిజ్య రుణాలపై నష్టాలు; ఎఫ్‌సీసీబీలు కొంత మేర వీటిపై ఒత్తిడి తెచ్చినా.. కలిసొచ్చే మార్జిన్లతో పోలిస్తే అవి అంత భారీగా ఏమీ ఉండబోవు. జౌళి: ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరగడానికి తోడు నూలు ధరలు తగ్గడంతో జౌళి పరిశ్రమకు ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత హెడ్జింగ్ పొఖ్ణ్మీ;షన్లపై మార్క్-టు-మార్కెట్ నష్టాలు మొత్తం మీద లాభదాయకతను లెక్కించేటపుడు కీలకం కానున్నాయి. వజ్రాభరణాలు: ఈ మధ్య తగ్గుతున్న బంగారం, వెండి ధరలకు తోడు రూపాయి కూడా క్షీణించడంతో వజ్రాభరణాల పరిశ్రమ పంట పండిందనే చెప్పాలి. దిగుమతి చేసుకునే బంగారం, వెండి ధరలు తగ్గడం.. ఎగుమతులు చేసేటపుడు రూపాయి విలువ ఆధారంగా ఎక్కువ మార్జిన్లు రావడంతో రెండు వైపులా ప్రయోజనాలు అందుతాయి. 

Wednesday, March 27, 2013

కేటాయింపులు ఏనుగంత.. ఖర్చు ఎలుకంత! సర్కారు ఆర్థిక నిర్వహణ లోపాలమయం కేటాయింపుల్లో ఆరో వంతు ఖర్చు చేయలేదు మరో ఆరో వంతు మిగులు నిధులు బడ్జెట్ రూపకల్పనపైనే సందేహాలున్నాయి ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పింఛను బకాయిలు రూ.900 కోట్లు నష్టజాతక జాబితాలో ఆర్టీసీ, హౌసింగ్ టాప్ భారీగా పెరుగుతున్న వేతనాలు, పింఛన్ల ఖర్చు విద్య, ఆరోగ్యంపై మరింత ఖర్చు చేయాలి కాగ్ నివేదిక విడుదల.. శాసనసభకు సమర్పణ హైదరాబాద్, మార్చి 26 : 'కాగ్ నివేదిక ఏమైనా భగవద్గీత.. ఖురాన్... బైబిలా?' అని ముఖ్యమంత్రి కిరణ్ ఎద్దేవా చేసిన మర్నాడే.. ఆయన పాలనలో ప్రభుత్వ కేటాయింపులు, ఖర్చుల్లో అవకతవకలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తి చూపింది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలమయమని, కేటాయింపులను ఏనుగంత చూపి.. ఎలుకంత మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించింది. పెరుగుతున్న అప్పులకు దన్నుగా సంపదను సృష్టించుకునేలా క్యాపిటల్ వ్యయాన్ని పెంచుకోవాలని సిఫారసు చేసింది. విద్య, ఆరోగ్యంపై మరింత వ్యయం చేయాలంది. ఆరోగ్యంపై బడ్జెట్లో 4.67 శాతం, విద్యపై 13.80 శాతం ఖర్చు చేసిందని, ఇది దేశంలోని సాధారణ కేటగిరీ రాష్ట్రాలతో పోల్చినా తక్కువని చెప్పిం ది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ వాణీ శ్రీరామ్ రూపొందించిన ఈ నివేదికను మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఆమె ఆ నివేదికను మీడియాకు విడుదల చేశారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన లో లోపాలున్నాయని కాగ్ తప్పుబట్టింది. కేటాయింపులు, ఖర్చులమధ్య పొంతన లేదని, నిధులు కేటాయించకుండానే ఖర్చు చేయడం ఆర్థిక నియమాల ఉల్లంఘనేనని తేల్చిచెప్పింది. కేటాయింపులు భారీగా చూ పినా.. వాస్తవ వ్యయం అతి స్వల్పమేనని తేల్చింది. కేటాయింపుల్లో 17శాతం వరకూ ఖర్చు చేయలేదని వివరించింది. ఉదాహరణకు చేనేత కార్మికులను అప్పుల ఊబి నుం చి బయట పడేసేందుకు రుణమాఫీ పథకా న్ని ప్రకటించారు. దీనికి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, విడుదల చేసింది రూ.32.88 కోట్లు (16శాతం) మాత్రమే. రాష్ట్రీయ మా ధ్యమిక శిక్షా అభియాన్‌కు కేంద్ర, రాష్ట్రాలు 75:25 నిష్పత్తిలో నిధులిస్తాయి. ఈ పథకానికి రూ.322.05కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది రూ.225.52కోట్లే. ఇక, కిశోర బాలికల పథకం 'సబల'కు రూ.124.91 కోట్లను కేటాయించి, రూ.20.25కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇందిరమ్మ గ్రామీణ పథకం కింద 2.93 లక్షల ఇళ్లను; ఇందిరమ్మ పట్టణ పథకం కింద 50 వేల ఇళ్లను నిర్మించాలన్న భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు రూ.571.25కోట్లు కేటాయించామని ఘనం గా ప్రకటించింది. కానీ, ఈ రెండు పథకాల కింద ఖర్చు రూ.142.81 కోట్లు మాత్రమే! మరీ విచిత్రం ఏమిటంటే.. జాతీయ గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమానికి రాష్ట్రం తన వాటాగా రూ.100కోట్లు కేటాయించింది. కానీ, రూపాయి కూడా విడుదల చేయలేదు. మధ్యాహ్న భోజన పథకానికి రూ.1.112 కోట్లు కేటాయించి, రూ.673 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాగ్ తేల్చింది. రాష్ట్రంలో నిరుపేదలకు 9.28 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తామన్న సర్కారు.. 91వేలు మాత్రమే పూ ర్తి చేసిందని తప్పుబట్టింది. ఆదర్శ పాఠశాల ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్రాలు 75ః25 నిష్పత్తిలో నిధులను భరిస్తున్నాయి. ఇందులో రూ.412 కోట్ల కేంద్ర వాటా 2011 జూలైలోనే వచ్చేసింది. కానీ, రాష్ట్రం రూ.136 కోట్లను విడుదల చేయలేదు. సరికదా.. కేంద్ర నిధుల్లో రూ.6.33 కోట్లను మాత్రమే ఖర్చుచేసి.. రూ.400 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారి ప్రాజెక్టుకింద రోడ్ల అభివృద్ధికి కేంద్రం, ప్రపంచ బ్యాంకు ఆమోదించిన అంచనా వ్యయం రూ.3165 కోట్లు. 2011-12లో దీనికి రూ.600కోట్లు కేటాయించారు. కానీ, ఖర్చు చేసింది రూ.221 కోట్లు మాత్రమే. అప్పులు ఇచ్చి వసూలు చేయరా? నష్టజాతక ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకు 13వ ఆర్థిక రంగ సిఫారసుల ప్రకారం ప్రణాళికను రూపొందించుకోవాలని కాగ్ సూచించింది. రుణాలు తీసుకున్న సంస్థల నుంచి అసలు, వడ్డీలను ఎప్పటికప్పుడు వసూలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నష్టాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయని కాగ్ తేల్చింది. ఈ కంపెనీలు, కార్పొరేషన్లలో 11సంస్థలకు మాత్రమే వార్షిక పద్దు లు ఖరారయ్యాయి. వాటిలో ఆ ఏడాదికి పేరుకుపోయిన నష్టా లు రూ.5979 కోట్లు. గృహనిర్మాణ సంస్థ రూ.3554 కోట్ల నష్టంతో, ఆర్టీసీ రూ.1984 కోట్ల నష్టంతో అగ్రస్థానంలో ఉన్నాయి. అలాగే కంపెనీలు, ప్రభుత్వ కార్పొరేషన్లలో పెట్టుబడులకు వచ్చిన ప్రతిఫలం ఎప్పటిలా స్వల్పంగానే ఉందని కాగ్ పేర్కొం ది. 2011-12లో ప్రభుత్వం తెచ్చిన రుణాలకు చెల్లించిన వడ్డీ రేటు 7.40శాతం కాగా.. ప్రభుత్వం పెట్టుబడులపై సగటు వడ్డీ రేటు 0.85 శాతమే. ప్రభుత్వం రూ.4983 కోట్ల రుణాలను ఇవ్వగా.. రికవరీ చేసింది రూ.164కోట్లే. ఇక రూ.17,337కోట్ల రుణాలకు సంబంధించి వివిధ సంస్థల నుంచి లెక్కల్లేవని కాగ్ తప్పుబట్టింది. పీడీ అకౌంట్లో పాతిక వేల కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో ఆరోవంతుదాకా నిధులు మిగిలి పోతున్నాయని కాగ్ వెల్లడించింది. కేటాయింపులలో 20 శాతానికి మించి భారీ మిగుళ్లు బడ్జెట్ అంచనాల్లో కచ్చితత్వం లేకపోవడాన్ని సూచిస్తున్నాయని వివరించింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయడం లేద ని, దీంతో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియపైనే సందేహాలు వస్తున్నాయని స్పష్టం చేసింది. చివర్లో ఒకేసారి భారీగా నిధులను ఖర్చు చేసేయడం లేదా మిగులుగా చూపడాన్ని నివారించేందుకు వాస్తవిక బడ్జెట్ అంచనాలను రూపొందించాలని సిఫార సు చేసింది. అసలు నిధుల కేటాయింపు తక్కువగా ఉండగా పాఠశాల విద్య, భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖలకు సంబంధించి మూడు గ్రాంట్లలో రూ.వెయ్యి కోట్లకుపైగా మిగు ళ్లు ఏర్పడ్డాయని తప్పుబట్టింది. వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) అకౌంట్లలో రూ.లక్షకుపైగా ఉంచడాన్ని తప్పుబట్టింది. సుమారు రూ.23,483 కోట్లను పీడీ అకౌంట్లలోనే ఉంచేయడం పారదర్శకతకు పాతర వేయడమేనని తలంటింది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, నిధుల కోసం యూనిట్ కార్యాలయాల నుంచి అభ్యర్థనలు రాకపోవడం, యూజీసీ గ్రాంట్లు రాకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడం తదితర కారణాల వల్ల ఉన్నతవిద్యలో నిధులు మిగిలిపోయాయని వివరించింది. మంజూరు ఉత్తర్వులు అందకపోవడం, పనుల్లో పురోగతి మందగించడంవల్ల పురపాలన, పట్టణాభివృద్ధిలో మిగులు ఏర్పడిందని, కేంద్ర నిధులు ఆలస్యంగా అందడం, నిర్వహణ పనుల్లో పురోగతి లేకపోవడంవల్ల సాంఘిక, వెనకబడిన సం క్షేమ శాఖల్లో నిధులు మిగిలిపోయాయని తెలిపింది. పొంతనలేని అంచనాలు.. వాస్తవాలు బడ్జెట్లో అంచనాలకు, వాస్తవాలకు మధ్య భారీ తేడా ఉంద ని కాగ్ తలంటింది. 2011-12లో పన్నుల రాబడులు, పన్ను లు కాని రాబడులు రెండూ పెరిగాయి. ఆ ఏడాదిలో అబ్కారీ ఆదాయం 16.31 శాతం, వాణిజ్య పన్నులు 19.78, వాహనాలపై పన్నులు 13.69శాతం పెరిగాయి. దీంతో పన్నుల ఆదా యం అంతకుముందు ఏడాదికంటే 18.04 శాతం పెరిగింది. అయినా, బడ్జెట్ అంచనాల కంటే రెవెన్యూ వసూళ్లు 7.37శాతం తగ్గాయి. రెవెన్యూ వ్యయం 6.95 శాతం తగ్గింది. ఫలితంగా బడ్జెట్ అంచనాల కంటే రెవెన్యూ మిగులు 17.98 శాతం తగ్గితే.. రెవెన్యూ వ్యయం 6.95 శాతం తగ్గింది. ఈ తగ్గుదల ప్రధానంగా నీటి సరఫరా -పారిశుధ్యం (46.02శాతం), పట్టణాభివృద్ధి (28.52 శాతం), సాగునీరు-వరదల నియంత్రణ (19.04శాతం) , వడ్డీ చెల్లింపు (7.66 శాతం)ల్లో నమోదైంది. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి భేష్! అయితే, ఆర్థిక నిర్వహణపై విమర్శలు చేసినా కాసిని ప్రశంసలూ కురిపించింది. ప్రభుత్వం ఆరేళ్ల నుంచి వరుసగా రెవెన్యూ మిగులును సాధిస్తూనే ఉంది. ద్రవ్యలోటు గత ఏడాదికంటే స్వల్పంగా పెరిగినా ఎఫ్ఆర్‌బీఎం చట్టం నిర్దేశిత పరిమితిని మించలేదు. దీనికి అనుగుణం గా రుణభారం తగ్గించుకోవడానికి లేదా వదిలించుకోవడానికి సంక్షిప్త నిధి, పూచీ విమోచన నిధిని ఏర్పాటు చేసింది. ఆర్బీఐ నిర్దేశించిన రేట్ల ప్రకారం వీటిలో నిధులను జమ చేస్తూ వస్తోంది. అయితే, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ తీసుకున్న రుణాలను వాటి తరపున ప్రభుత్వమే చెల్లిస్తోన్న సందర్భాల్లో ఆర్థికసాయాన్ని ప్రభుత్వ పద్దుల్లో తప్పుగా నమోదు చేశారు. ఫలితంగా లోన్ల పద్దు కింద ప్రతికూల నిల్వలు రూ.3.72 కోట్లు ఏర్పడి ఆర్థిక పద్దుల్లో రాష్ట్ర రెవెన్యూ వ్యయాన్ని తక్కువగా చూపారు. రాష్ట్ర ద్రవ్య సూచికలపై దీని ప్రభావం పడింది. పెరిగిన వేతన వ్యయం.. జీతాలు, వేతనాలపై ఖర్చు (రూ. 26,823కోట్లు) గత ఏడాది కంటే 12.49 శాతం పెరిగింది. అయితే, బడ్జెట్ అంచనాల కన్నా ఇది 1.52 శాతం తక్కువ. 13వ ఆర్థిక సంఘం అంచనా(రూ.15,735 కోట్లు)కన్నా చాలా ఎక్కు వ. పింఛన్లు, పదవీ విరమణ ప్రయోజనాలకు రూ. 11,110 కోట్లు ఖర్చు చేసింది. రెవెన్యూ రాబడుల్లో ఇది 12 శాతం. ఉద్యోగులకు వడ్డీ నష్టం ఉద్యోగుల నుంచి పింఛను మొత్తాన్ని జీతాల్లోంచి ప్రభుత్వం మినహాయించుకుంటోంది. కానీ, తన వాటాను మాత్రం ప్రభుత్వం పింఛను నిధికి జమ చేయడం లేదు. కాగ్ తన నివేదికలో ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పింఛను నియంత్రణాధికార సంస్థ నిర్దేశాల ప్రకారం కాంట్రిబ్యూటరీ ఫించన్ పథకంలో తన వాటా మొత్తాన్ని ఫండ్ మేనేజర్‌కు బదిలీ చేయాల్సి ఉండగా, 2012 మార్చినాటికి అలా బదిలీ చేయకుండా బకాయి పడిన పూర్తి మొత్తం రూ.894 కోట్లకు చేరింది. నిజానికి ఉద్యోగులు తమ వాటాగా చెల్లించిన మొత్తంతో పోలిస్తే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.100 కోట్లను తక్కువగా కేటాయించింది. పింఛను కోసం చేసే బడ్జెట్ కేటాయింపులను సమీక్షించుకోవాలని ప్రభుత్వానికి కాగ్ సిఫారసు చేసింది. బీమా గణన ప్రాతిపదికన చెల్లించాల్సిన పింఛను మొత్తాలను లెక్కగట్టి, అదే పద్దు కింద కేటాయించాలని, పింఛను నిధికి జమ చేయాల్సిన బకాయిలను తక్షణమే ఫండ్ మేనేజర్‌కు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను పూర్తి చేయండి మహాప్రభో! జల యజ్ఞం సహా వివిధ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒనగూడిన ప్రయోజనం శూన్యమని కాగ్ తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే ఏళ్ల తరబడి కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించిన పనులను పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారమే.. 2012 మార్చి 31 నాటికి 228 ప్రాజెక్టులు (సాగునీరు, ఆర్అండ్‌బీ తదితరాలు) అసంపూర్తిగానే ఉన్నాయని పేర్కొంది. 2011-12లో వీటిపై రూ.49,516 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది అసంపూర్తి ప్రాజెక్టులు 188! ఆ ఏడాది (2010-11) వాటిపై ఖర్చు రూ.46,330 కోట్లు! వేల కోట్లు ఖర్చయినా ఫలితం సున్నా. మరో విశేషం ఏమిటంటే.. ఈ 228 ప్రాజెక్టుల్లో 54 ప్రాధాన్యంగలవిగా ప్రభుత్వం చూపింది. వాటి తొలి అంచనాలను సవరించి అంచనా వ్యయాన్ని రూ.87,559 కోట్లకు పెంచింది. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా ఆశించిన ప్రయోజనాలూ రాలేదని కాగ్ తప్పుబట్టింది. చదువుపై ప్రసరించని 'కిరణం' హైదరాబాద్, మార్చి 26 : చదువుకుంటేనే ఉన్నత స్థితికి ఎదుగుతారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరచూ చెబుతుంటారు. కానీ, ఆయన హయాంలో విద్యా రంగానికి కేటాయింపులు అంతంతమాత్రమే! అందుకే, విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు పెంచాలని కాగ్ సూచించింది. సామాజిక ఆర్థిక రంగాల విషయంలో ప్రాథమ్యాలను పునర్ నిర్వచించుకోవాలని సిఫారసు చేసింది. వీటికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇచ్చినా కేటాయించిన నిధులను నిర్దేశిత పథకాలకు వినియోగించలేదని తప్పుబట్టింది. కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడం, కొద్దోగొప్పో విడుద ల చేసినా సకాలంలో ఇవ్వకపోవడంతో లక్ష్యం నెరవేరలేదని ఆక్షేపించింది. సామాజిక రంగంపై క్యాపిటల్ వ్య యం సాధారణ కేటగిరీ రాష్ట్రాల కంటే తక్కువగా ఉందని తప్పుబట్టింది. 2011-12లో సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో 17.18 శాతం విద్యారంగంపై ఖర్చు చేయగా, రాష్ట్రంలో అది 13.80 శాతమే. ఎన్నికలూ లేవు.. నిధులూ లేవు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగానే కేంద్రం నుంచి పలు రకాల నిధులు నిలిచిపోయినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరపని కారణంగా పనితీరు ప్రాతిపదికన రాష్ట్రానికి అందజేసే నిధులు రూ.1044 కోట్లను కేంద్రం మంజూరు చేసినా.. రూ.420 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించింది. కాగా, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు 29 అధికారాలు బదిలీ కావాల్సి ఉండగా ఇప్పటివరకు పది మాత్రమే బదిలీ అయ్యాయని తప్పుబట్టింది. ఉద్యోగశ్రీకి ఉరితాడు నిరుద్యోగులపై సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించిందని 'కాగ్' కడిగేసింది. ఉద్యోగార్థులకు తగిన నైపుణ్యాన్ని కల్పించడంతోపాటు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన 'రాజీవ్ ఉద్యోగ శ్రీ'కి 2011-12 బడ్జెట్‌లో రూ.40 కోట్లను కేటాయించారు. కానీ, ఖర్చు చేసింది రూ.10 కోట్లే. అంతేకాదు.. కార్మిక, ఉపాధి శాఖకు వివిధ పద్దుల కింద 2011-12లో రూ.602.66 కోట్లను కేటాయించగా, రూ.140.33 కోట్లను ఖర్చు చేయలేదు. ఇందులో రూ.90.61 కోట్లను సరెండర్ చేయలేదు. పింఛను చెల్లింపుల్లో అక్రమాలు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్లు, కుటుంబ పింఛన్లకు సంబంధించి పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు 'కాగ్' స్పష్టం చేసింది. కేవలం మచ్చుకు జరిపిన తనిఖీల్లోనే అంటే 410 కేసుల్లో రూ.2.7 కోట్ల మేరకు అధికంగా చెల్లించినట్లు పేర్కొంది. 2012 మార్చి 31 నాటికి 374 కేసుల్లో రూ.2.40 కోట్ల 'రికవరీ' జరగలేదని కాగ్ ఆక్షేపించింది. అసలు పింఛను, రెండో సీవీపీ నుంచి కమ్యూటేషన్ విలువను తగ్గించకపోవడం, పింఛను, కుటుంబ పింఛను సహా బకాయిలను తప్పుగా లెక్కించడం, అదనపు పింఛను మొత్తాన్ని అధికంగా చెల్లించడం, గ్రాట్యుటీ/పింఛను నుంచి చేయాల్సిన రికవరీలను మినహాయించకుండానే అధిక చెల్లింపులు చేయడం, అమ్ముకున్న పింఛన్లను తప్పుగా పునరుద్ధరించడం, రెండుసార్లు పింఛన్లను చెల్లించడం, పింఛనుదారులు మరణించాక కూడా పింఛన్ల చెల్లింపులు వంటి పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు 'కాగ్' వెల్లడించింది. సబ్సిడీలో సింహభాగం విద్యుత్తుదే! హైదరాబాద్, మార్చి 26 : రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలకు కేటాయించే మొత్తంలో సింహ భాగం విద్యుత్తు సబ్సిడీలకే పోతోంది. కాగ్ నివేదిక ప్రకారం.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలపై చేసిన మొత్తం వ్యయం రూ.7313 కోట్లు. ఇందులో విద్యుత్ సబ్సిడీకి ప్రభుత్వం రూ.4300 కోట్లు (59 శాతం) ఖర్చు చేసింది. ఇందులోనూ సింహ భాగం ఉచిత విద్యుత్తుదిగానే చెబుతున్నారు. సబ్సిడీ వ్యయంలో రెండో స్థానం బియ్యానిది. మొత్తం సబ్సిడీ వ్యయంలో 39 శాతం (రూ.2280 కోట్లు) బియ్యంపై ఖర్చు చేశారు. ఇతర అన్ని సబ్సిడీలకు కలిపి రూ.733 కోట్లు (10శాతం) వ్యయం చేశారు. 2010-11తో పోలిస్తే 2011-12లో సబ్సిడీ వ్యయం రూ.770 కోట్ల మేరకు పెరిగింది.

Tuesday, March 19, 2013

2013-14 budget eenadu news

ఎన్నికల ఏడాదిలో బడుగులే లక్ష్యంగా నిధుల గుమ్మరింపు వైద్యం, ఆరోగ్యం సహా కీలక రంగాలకు కత్తెర.. యూజర్ ఛార్జీల మోత 2013-14 బడ్జెట్ రూ.1.61,348 కోట్లు వృద్ధిరేటు మందగించినా రూ.22 వేల కోట్లు పెంపు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విత్తమంత్రి ఆనం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ ప్రతిపాదన విపక్షాల విమర్శలతో.. వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికగా మార్పు ఆదుకుంటారో లేదో తెలియదు. అయిననూ చివరాఖరి ప్రయత్నం చేయక తప్పదు! అందుకే ఆర్థిక మంత్రి ఆనంవారు భారీ వరాల జల్లులూ, ఆర్భాట సందోహాలేవీ లేని బడ్జెట్ తూణీరంలోంచి కొన్ని పూలబాణాలు తీశారు. వాటిని- సరిగ్గా తమను ఆదుకుంటారని ఆశపడుతున్న వర్గాలవైపే గురిపెట్టారు. ఎన్నికల సమర ప్రాంగణంలో ప్రవేశించబోతున్న తుది అంకంలో.. దాదాపు ఆఖరి బడ్జెట్ ఘట్టంలో.. ఆశ్చర్యకరంగా విత్తమంత్రి అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణ మంత్రాలేవీ చదవలేదు. జనం నెత్తిన వరాల జల్లులేవీ కురిపించ లేదు. తమకు బాసటగా నిలుస్తారని ఆశపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వంటి అక్షౌహిణులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని.. వారివైపు మాత్రమే కొన్ని పూల బాణాలు వదిలారు. మరోవైపు- మధ్యతరగతి జీవుల నెత్తిన కనిపించని కొరడాలు ఝుళిపించారు. పన్నులంటూ, వ్యాట్, యూజర్ ఛార్జీలంటూ, రిఖ్ణ్మీ;స్ట్రేషన్ రుసుములంటూ.. అటూ ఇటూగా బాగానే వాయించారు. గత ఏడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్ల మేర పిండుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. పైగా అత్యంత కీలకమైన విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలకు కొద్దికొద్దిగా కత్తెరలు కూడా వేశారు. మొత్తానికి ఆయన కళ్లన్నీ 'ఓటు బ్యాంకు' మీదే! అయితే... ఆయనైతే బడుగులకు గురి పెట్టారుగానీ.. మరివారికి ఈ సర్కారు మీద 'గురి' కుదురుతుందో లేదో చెప్పటం మహా కష్టం. అందుకే ఆనం వారి బడ్జెట్ పత్రం.. ఆశలు వదులుకోలేని ఒక ప్రయత్నం! ఓటరుపై 'ఆన'ం బడుగుల్ని అకట్టుకొనే పథకాలకు నిధుల గుమ్మరింపు వైద్యం, ఆరోగ్యం సహా పలు కీలక రంగాల వాటాలకు కత్తెర ఈనాడు - హైదరాబాద్ ఆనం గల్లాపెట్టె 'ఓటు' మోత మోగింది. ప్రాధాన్య రంగాల్ని పక్కనబెట్టింది. ''దారిద్య్రానికి మూలం నిధుల కొరత కాదు. సరైన మార్గాల్ని అనుసరించకపోవటమే'' అంటూ అమర్త్యసేన్ చెప్పిన మాటల్ని వల్లెవేసిన విత్తమంత్రి అనం దారిద్య్ర నిర్మూలన మార్గాలకు పెద్దపీట వేయాల్సింది పోయి.. 2014లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా, వివిధ వర్గాల్ని అకర్షించటమే ధ్యేయంగా 2013-14 వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. వైద్యం, గృహ నిర్మాణం వంటి కీలక రంగాల్ని సైతం విస్మరించి ఓటరన్న దీవెనలు పొందడంపైనే దృష్టిపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో వారికి సంబంధించిన పథకాల ప్రస్తావనే ఎక్కువగా చోటు చేసుకొంది. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో మున్ముందు రాజకీయంగా ప్రయోజనాల్ని పొందటమే ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ పరమార్థంగా ఉంది. ఇదే ఆఖరి అవకాశం... లెక్కప్రకారమైతే.. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2014 ఏప్రిల్, మే నెలల్లో జరుగుతాయి. ఆ ఎన్నికల నాటికి రాష్ట్ర సర్కారు చేతిలో చిట్టచివరి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఇది మాత్రమే. 2014 ఎన్నికల వేళ ప్రభుత్వం కేవలం కొద్ది రోజుల ఖర్చులకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టటమే తప్ప 2014-15కు పూర్తిస్థాయి బడ్జెట్‌కు రూపకల్పన చేసే అవకాశం ఉండదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ తన ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసుకోవటం కోసమే సర్కారు ఇలా చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి బడ్జెట్ మాత్రమే సర్కారు వద్ద ఉండే ప్రధాన, చివరి ఆయుధం కాబట్టి.. కొన్ని వర్గాల వారిని అకట్టుకొనేలా తీర్చిదిద్దుకొనేందుకు ప్రభుత్వం చాలా తంటాలు పడింది. వ్యవసాయం తీవ్రసంక్షోభంలో చిక్కుకొని రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు 5.29 శాతానికి పరిమితమైన నేపథ్యంలో కూడా 2012-13 సవరణ బడ్జెట్ కంటే రూ.22 వేల కోట్లను కొత్త బడ్జెట్‌లో అదనంగా చేర్చింది. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే పథకాలను కూడా ప్రత్యేకంగా ప్రవేశపెట్టేందుకు సర్కారుకు సాధ్యంకాదు. అందుకే ప్రస్తుత బడ్జెట్‌లో ఆయా వర్గాలకు ఇచ్చిన నిధులకు అనుగుణంగా త్వరలోనే కొన్ని పథకాలను ప్రవేశపెట్టి ఎన్నికల వేళ ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది. ప్రధాన రంగాలకు తగ్గిన కేటాయింపులు మొత్తం రూ.1.61 లక్షల కోట్లతో తయారుచేసిన బడ్జెట్‌లో పలు ప్రధాన రంగాలకు పొందుపరిచిన ప్రణాళిక, ప్రణాళికేతర కేటాయింపుల శాతం నడుస్తున్న 2012-13 బడ్జెట్ కంటే తగ్గిపోయింది. తాను లక్ష్యంగా నిర్దేశించుకొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మాత్రం ఎక్కువ నిధుల్ని ఇవ్వటంతో వారికి ప్రస్తుత 5.31 శాతం నుంచి 7.01 శాతానికి నిధులు పెరిగాయి. ఈ నిధులు ఆయా వర్గాల్ని ఆకర్షించే పథకాలకు వెళ్లాయి. అయితే అదే వర్గాలు విరివిగా ఉపయోగించుకొనే ఆసుపత్రులపై మాత్రం సర్కారుకు దయ కలగలేదు. వైద్యానికి ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కేటాయింపుల వాటాను బడ్జెట్ మొత్తంలో 4.04 శాతం నుంచి 4.02 శాతానికి కుదించేసింది. దేశంలో పలు ప్రధాన రాష్ట్రాల కంటే ఇక్కడే తక్కువగా కేటాయిస్తున్నారంటూ రిజర్వు బ్యాంకు ఇటీవల వెల్లడించిన నేపథ్యంలోనైనా వైద్యం వాటాను పెంచలేదు. విద్యకు కుదింపు విద్యా రంగంలో రాష్ట్రంలోని కేటాయింపు శాతం మిగతా అన్ని రాష్ట్రాల కంటే బాగా తక్కువనే విషయాన్నీ ఆర్‌బీఐ చెప్పింది. ఇప్పుడు కేటాయింపును పెంచాల్సిందిపోయి విద్యా రంగానికి 12.70 శాతం వాటాను 12.30 శాతానికి కుదించింది. అంటే తాను అకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్న వర్గాలకు విద్య, వైద్యం సరిగ్గా సమకూరకపోయినా సర్కారుకు ఏమీ పట్టదు. అవి రెండూ తన లక్ష్య సాధనకు మార్గాలను ఏర్పరచలేవు కాబట్టే సర్కారు ఇలా వ్యవహరించింది. తనకు అక్కరకు వస్తారని భావించటం వల్లనే బీసీల సంక్షేమ కేటాయింపును రూ. 2,656 కోట్ల నుంచి రూ.3,632 కోట్లకు పెంచింది. ఎస్సీలకు చెందిన సాంఘిక సంక్షేమ కేటాయింపును రూ.1,719 కోట్ల నుంచి ఏకంగా రూ.3,077 కోట్లకు పెంచేసింది. ఎస్టీలకు మరో రూ.500 కోట్లు అదనంగా ఇచ్చింది. మైనారిటీలకు ప్రస్తుతమున్న రూ.482 కోట్లను ఏకంగా రూ.1,020 కోట్లకు తీసుకెళ్లింది. నడ్డీ విరుస్తారు... బడుగు వర్గాల ఓట్లను దండుకోవాలనే సన్నాహాల్లో ఉన్న సర్కారు మళ్లీ అవేవర్గాలు ఉపయోగించే పప్పులు, సబ్బులు, బియ్యం సహా పలు వస్తువులపై విపరీతంగా పన్నుల్ని పిండదలచింది. సొంత పన్నుల రాబడుల్ని 2012-13 సవరించిన బడ్జెట్ కంటే దాదాపు రూ.10 వేల కోట్ల మేర పెంచి రూ.72 వేల కోట్ల మేర రాబట్టదలిచింది. ఇందులో వస్తువులపై వ్యాట్ ద్వారా వచ్చే మొత్తమే రూ.52 వేల కోట్ల మేర ఉంటుంది. సవరించిన బడ్జెట్‌తో పొలిస్తే ఇది రూ.10 వేల కోట్ల ఎక్కువ. అనేక వస్తువుల్ని గరిష్ఠ పన్ను రేటు పరిధిలోకి తెచ్చినప్పుడే ఇంతటి రాబడి సాధ్యమవుతుంది. భూముల రిఖ్ణ్మీ;స్ట్రేషన్ రుసుముల్ని బాగా పెంచాలని కూడా సర్కారు సంకల్పించింది. రిఖ్ణ్మీ;స్ట్రేషన్ల రాబడి లక్ష్యాన్ని ఏకంగా రూ.6,414 కోట్లకు చేర్చింది. ప్రస్తుత సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.1,464 కోట్లు ఎక్కువ. ఇక త్వరలో మోటారు వాహనాల జీవిత కాల పన్నులు కూడా పెరగబోతున్నాయని కొత్త బడ్జెట్‌లోని రవాణా శాఖ రాబడి లక్ష్యం వెల్లడిస్తోంది. వాహనాలపై సుంకాల రాబడి లక్ష్యాన్ని రూ.745 కోట్లు ఎక్కువతో రూ. 4,352 కోట్లగా పొందుపరిచింది. వివిధ రిఖ్ణ్మీ;స్ట్రేషన్లతో సహా వివిధ శాఖల్లో యూజర్ ఛార్జీల బాదుడు కూడా పెరగబోతోంది. సాకారమయ్యేనా? సర్కారుకు రాబడులు పెరగాలంటే వ్యవసాయం బాగుండాలి. కానీ వ్యవసాయ వృద్ధిరేటు ప్రస్తుతం తిరోగమనంలో ఉంది. పరిశ్రమలదీ ఇదే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో సర్కారు ఆర్భాటంగా తెచ్చిన బడ్జెట్ ఆయా వర్గాలకు నిజంగా ఉపయోగపడుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తంకావటం సహజం. బడ్జెట్‌లో చెప్పినట్టుగా చేయలేకపోతే సర్కారువన్నీ ఎన్నికల వేళ ఉత్తుత్తి వాగ్దానాలుగానే మిగిలిపోతాయి. అప్పులు భారం ప్రభుత్వం అప్పుల్ని కూడా ఈసారి ఎక్కువగానే తేదలచింది. ఇప్పటికే అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయినా మరిన్ని అప్పులకు ఎగబడదలచింది. మొత్తం రూ.24,487 కోట్ల నికర అప్పుల్ని తేబోతోంది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.85 శాతం. 2012-13 బడ్జెట్‌కు నికర అప్పుల్ని 20 కోట్ల మేర తెస్తామని తొలి అంచనాల్లో చెప్పి సవరించిన అంచనాల్లో దాన్ని రూ.21 వేల కోట్లకు పెంచింది. వైఎస్ హయాంలో మొదలైన భూముల అమ్మకాలను ఏ సర్కారూ వదిలిపెట్టడం లేదు. కొత్త బడ్జెట్‌లో భూములపై రూ.37 కోట్లను లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఓటాన్ అకౌంట్ కూడా.. 2013-14 ఆర్థిక సంవత్సరం మొదటి 3నెలల ఖర్చులకుగాను దాదాపు రూ.40వేల కోట్లతో ఓటాన్ అకౌంట్‌నూ ప్రభుత్వం ఈ పూర్తిస్థాయి బడ్జెట్‌లో నుంచే ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను విశ్లేషించడం కోసం కొత్తగా స్థాయి సంఘాలు ఏర్పాటయినందున ఈ ఓటాన్ అకౌంట్ ఆవశ్యకత ఏర్పడింది. ఓటాన్ అకౌంట్‌కు ఈ నెల 26వ తేదీన, పూర్తిస్థాయిబడ్జెట్‌కు మే 2న ఆమోదం లభిస్తుంది.

State Budget 2013-14 (Eenadu)

రూ. 1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్.. ముఖ్యాంశాలు

 హైదరాబాద్: 2013-14 బడ్జెట్‌ను రూ.1,61,348 కోట్ల అంచనాతో ఆర్థికశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనాలు * ప్రణాళికావ్యయం రూ. 59,422 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,926 కోట్లు * ద్రవ్యలోటు రూ. 24,487 కోట్లు * రెవెన్యూ మిగులు రూ. 1023 కోట్లు * 12వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్ర వృద్దిరేటు 10 శాతం ఉండేలా లక్ష్యం విద్యకు కేటాయింపులు ఉన్నత విద్యకు రూ. 482 కోట్లు పాఠశాల విద్యకు 16,990 కోట్లు విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపునకు రూ. 250 కోట్లు 7వ తరగతి వరకు మెస్‌ఛార్జీలు రూ.475నుంచి రూ. 750కు పెంపు 8నుంచి 10వ తరగతి వరకు మెస్‌ఛార్జీలు రూ. 535 నుంచి రూ. 850కు పెంపు ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు మెస్‌ఛార్జీలు రూ. 520 నుంచి రూ. 1050కు పెంపు ఎస్సీ, బీసీ విద్యార్థులకు రాజీవ్ దీవెన పథకం ద్వారా ఉపకారవేతనాలు అందజేయనున్నారు. దీని వల్ల సుమారు మూడు లక్షలమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని ఆర్థిక మంత్రి అంచనా. నెల్లూరులో మరో వైద్య కళాశాల ఏర్పాటుకు పరిపాలన పరమైన అనుమతి లభించింది. దీనికోసం బడ్జెట్‌లో రూ. 352 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ రూ. 2126 కోట్లు వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 4027కోట్లు మహిళా శిశు సంక్షేమం రూ. 2712 కోట్లు సాంఘిక సంక్షేమ శాఖకు రూ. 4,122 కోట్లు మైనార్టీ సంక్షేమశాఖకు రూ. 1027 కోట్లు ఎస్సీ కులాల ఉప ప్రణాళికకు రూ. 8585కోట్లు ఎస్టీల ఉప ప్రణాళికు రూ. 3,666 కోట్లు బీసీ కార్పోరేషన్, సొసైటీలకు రూ. 436 కోట్లు వికలాంగుల సంక్షేమానికి రూ. 73 కోట్లు శాంతిభద్రతలు శాంతి భద్రతలకు రూ. 5,386 కోట్లు పోలీసు శిక్షణాసంస్థల ఆధునీకరణకు రూ. 100 కోట్లు హైదరాబాద్‌లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు సేవలు మౌలికసదుపాయాల కల్పనకు రూ. 180 కోట్లు పరిశ్రమలు వాణిజ్యశాఖ రూ. 1120 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ రూ. 6481 కోట్లు రహదార్లు, రవాణాశాఖకు రూ. 7117 కోట్లు పౌరసరఫరాలశాఖకు రూ. 3,231కోట్లు యువజన సేవలకు రూ. 280 కోట్లు పట్టణాభివృద్ధిశాఖకు రూ. 6,770 కోట్లు అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం కింద రూ. 2,700 కోట్లు రాష్ట్రంలో అన్నీ ప్రాంతాల క్రీడాప్రాంగణాల ఏర్పాటకు రూ .200 కోట్లు రాష్ట్రరాజధాని నగరంలో మెట్రోరైలు నిర్మాణం కోసం భూసేకరణ, పునరావాసానికి అదనంగా రూ. 1,980 కోట్లు కేటాయించారు. సాంస్కృతికం, పర్యాటకం తెలుగు బాటపేరిల సాంస్కృతిక పండగల కోసం రూ. 25 కోట్లు సాంస్కృతిక రంగానికి రూ. 69 కోట్లు పర్యాటక శాఖ రూ. 163 కోట్లు విద్యుత్ శాఖ రానున్న ఏడాది కాలంలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు చర్యలు చిత్తూరు ఖ్ణ్మీ;ల్లాలో తాగునీటి సరఫరా కోసం ఇన్‌క్యాప్ ద్వారా ఏర్పాట్లు వ్యవసాయానికి ఏడుగంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94,304 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం ప్రభుత్వం రూ. 3621 కోట్లు కేటాయించింది. జైకా సహకారంతో 16 ఖ్ణ్మీ;ల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ కోసం రూ. 1154 కోట్లు ఐటీ, ఉద్యోగాలు ఐటీ శాఖకు రూ. 207 కోట్లు. తిరుపతి, జహీరాబాద్‌లలో హోటళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణాకేంద్రాలు ఆర్థిక శాఖలో ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థలో భాగంగా బిల్ మానిటరింగ్ ఏర్పాటు 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు ఏర్పాటు చేస్తాం హైదరాబాద్‌కు తాగునీటి వసతిపెంపునకు రూ. 6,770 కోట్లు ( గోదావరి, కృష్ణా పథకాలు) వచ్చే ఏడాది కాలంలో 27,903 ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వైద్య వసతుల కల్పనకు రూ. 6481 కోట్లు జలయజ్ఞం, నీటిపారుదల జలయజ్ఞానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 13800 కోట్లు నీటిపారుదల శాఖకు రూ. 22,895 కోట్లు పోలవరం ప్రాజెక్టు అంచనా రూ. 16,010 కోట్లు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ. 38,500 కోట్లు పై రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జలయజ్ఞంలో 21,435 లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పటి వరకు జలయజ్ఞంలో రూ. 67,208 కోట్లను వ్యయం చేశారు. వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం ప్రభుత్వం రూ. 3621 కోట్లు కేటాయించింది. జైకా సహకారంతో 16 ఖ్ణ్మీ;ల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ కోసం రూ. 1154 కోట్లు 83 వేల టన్నుల ఆహార ధాన్యాల నిల్వకు రూ. 42 కోట్లతో 39 మండల స్థాయి గోదాముల నిర్మాణం వర్షాధారిత వ్యవసాయ అభివృద్ధికి రూ. 2903 కోట్లు వ్యవసాయ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 25,962 కోట్లతో వ్యవసాయబడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికా వ్యయం రూ. 17,694 కోట్లు వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం రూ. 8,267కోట్లు ఈ ఏడాది రూ. 72,450 కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6,128 కోట్లు ప్రకృతి వైపరీత్యాలకు వ్యవసాయ బడ్జెట్‌లో రూ. 589 కోట్లు ఫుడ్ ప్రొసెసింగ్‌కు రూ. 100 కోట్లు కనీస మద్దతు ధర లభించని సమయంలో రైతులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో ఆలంబన నిధి ఏర్పాటుచేయనున్నట్లు ఆర్థికమంత్రి ఆనం ప్రకటించారు. ఆహార ఉత్పత్తుల ప్రొసెసింగ్ ప్రత్యేక యూనిట్ వడ్డీలేని పంట రుణాలకు ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. విత్తనాభివృద్ధికి రూ. 308 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 450 కోట్లు సోలార్ పంప్‌సెట్లకు రూ. 150 కోట్లు రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి 2013-14 బడ్జెట్ దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి అన్నారు. అన్నీ వర్గాల మానవాభివృద్దికికు కృషి చేస్తామన్నారు.

2013 - 14 రాష్ట్ర వార్షిక ప్రణాళిక

  • రాష్ట్ర ప్రణాళిక వ్యయం రూ.59,422 కోట్లు, ఈ మొత్తం గత సంవత్సరం కంటే 9.98శాతం ఎక్కువగా ఉంది. ఇందులో రాష్ట్ర పధకాలకు రూ.52,955.28 కోట్లుగా ఉంది.
  • ఆర్ధిక వృద్ధికి మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో కీల కం. ముఖ్యంగా సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ 2013-14 వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం కింద ఎ క్కువ నిధులు కేటాయించడం జరిగింది.
  • 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017) ముఖ్యాంశాలు
  • 11వ పంచవర్ష ప్రణాళిక కాలానికి రాష్ట్ర వృద్ధి రేటు 8.18గా ఉండగా, అఖిలభారత వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఈ వృద్ధి సరాసరి 8.03 శాతంగా ఉంది.
  • 12వ పంచవర్ష ప్రణాళిక తొలి సంవత్సరంలో రాష్ట్రంలో అంచనా వృద్ధి 5.29శాతం ఉండగా, దేశం మొత్తంలో ఈ వృద్ధిరేటు 4.96శాతంగా నమోదైంది. కాగా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్‌డీపీ అంచనావ్యయం రూ.7,38,497 కోట్లుగా ఉంది.
  • 12వ పంచవర్ష ప్రణాళికలో అన్నీ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చేసిన వ్యయం రూ.3, 42,842 కోట్లుగా నమోదైంది.
    ఈ వ్యయం 11వ పంచ వర్ష ప్రణాళికలో రాష్ట్రం ఖర్చుచేసిన మొత్తానికి రెండు రెట్లు అధికంగా ఉండగా, 12వ పంచవర్ష ప్రణాళి క పూర్త య్యేవరకు, ప్రస్తుతం చేసిన వ్యయానికి 10శాతం ఎక్కు వగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.
  • 12వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను అ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ, ఆర్ధికవృద్ధితోపాటు, సంక్షేమంపై దృష్టిసారించింది.

    రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యకార్యక్రమాలు...
  • ఎస్‌సీ,ఎస్‌టీలకు కేటాయించిన నిధులను ఆయా వర్గాలకే ఖర్చుచేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్‌సీ,ఎస్‌టీ ఉపప్రణాళిక నిధులకు ( ఆర్ధిక వనరుల చట్టం నెం.1 ఆఫ్‌ 2013 ) చట్టబద్ధత కల్పించింది.
  • ఎస్‌సీ,ఎస్‌టీ ఉప ప్రణాళిక చట్టబద్దత ద్వారా 2013-14 ఆర్ధిక సంవత్సరానికి ఎస్‌సీ సబ్‌ప్లాన్‌కు రూ.8584.83 కోట్లు ఉండగా, ఎస్‌సీ సబ్‌ప్లాన్‌కు రూ.3,666.59 కోట్ల నిధులు కేటాయించారు.
  • రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిని వ్యవసాయ ప్రణాళిక 2013-14గా అభివర్ణిస్తూ, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ.98,940.54 కోట్లు కేటాయించారు.

    సామాజిక, ఆర్ధిక సర్వే -2012-13 ముఖ్యాంశాలు...
  • 12వ పంచవర్ష ప్రణాళిక తొలి సంవత్సరంలో రాష్ట్రంలో అంచనా వృద్ధి 5.29శాతం ఉండగా, దేశం మొత్తంలో ఈ వృద్ధిరేటు 4.96శాతంగా నమోదైంది. కాగా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రంలో జీఎస్‌డీపీ వ్యవసాయ రంగంలో 1.96 శాతం వృద్ధి ఉండగా, పారిశ్రామిక రంగంలో 0.73శాతం, సేవా రంగంలో 8.45శాతంగా నమోదైంది.
  • 2004-05 వివరాల ప్రకారం 2012-13 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్‌డీపీ అంచనావ్యయం రూ.4,26,470 కోట్లు ఉండగా, ప్రస్తుత ధరల ప్రకారం గత ఆర్ధిక సంవత్సరానికి జీఎస్‌డీపీ అంచనావ్యయం రూ.7,38,497కోట్లుగా ఉంది.
  • 2012-13 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం ప్రకారం రూ.77, 277 కోట్లు అంచనావ్యయం ఉండగా, గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ అంచనావ్యయం 12శాతం అధికంగా ఉంది.
  • గడచిన 10 సంవత్సరాలతో పోల్చుకుంటే రాష్ట్ర తలసరి ఆదాయం దేశం తలసరి ఆదాయం కంటే మెరుగ్గా ఉంది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.8,500గా నమోదుకాగా, దేశ మొత్తంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ.

    రాష్ట్రంలో పక్కాప్రణాళికతో అమలుచేస్తున్న పలు కార్యక్రమాలు...
    1.ఆధార్‌ కార్డుల జారీలో రాష్ట్రం దేశస్ధాయిలో మొదటిస్ధానంలో నిలిచింది.
    2.మీసేవ ద్వారా ప్రభుత్వ ధృవపత్రాల సత్వరమే జారీ.
    3. ఇందిరమ్మ బాట కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి జిల్లాల్లో పర్యటన, తద్వారా హాస్టళ్ళు, పాఠశాలల్లో వసతులపై సమీక్ష. ఇందిరమ్మ బాట కార్యక్రమంతో 14 జిల్లాల్లో పర్యటన పూర్తి.
    4. శిశువులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఐఎంఆర్‌, ఎంఎంఆర్‌, పోషకలోపం నివారణ.
    5. ఐఎంఆర్‌, ఎంఎంఆర్‌ రేటు తగ్గుదల
    6. ఇందిరమ్మ అమృత హస్తం ద్వారా 102 అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణి స్ర్తీలకు పౌష్టికాహారం అందజేయడం.
    7. మార్పు, చిన్నారి చూపు కార్యక్రమాలు
    8.ప్రజాపంపిణీ వ్యవస్ధ ద్వారా మనబియ్యం పధకం ద్వారా రూ.1కి కేజీ బియ్యం
    ఆహార ధాన్యాల ఉత్పత్తికి గత సంవత్సరం 66.3 లక్షల హెక్టార్లు లక్ష్యం కాగా, 72.9 లక్షల హెక్టార్లుగా నమోదైంది.
  • ‘వడ్డీలేని రుణాలు’ పధకం ద్వారా రైతులకు ఆత్మస్ధైర్యం కల్పించడం.
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేక కార్యక్రమాలు.
  • 13.61 స్వయం సహాయక బృందాలలో ఒక కోటి నలభై ఆరు లక్షల సభ్యులు.
  • గ్రామీణ ప్రాంతాలలో 10.59 స్వయం సహాయక బృందాలు ఉండగా, వీటిలో సభ్యులు 1కోటి 15 లక్షల మంది సభ్యులున్నారు.
  • పట్టణ ప్రాంతాలలో మూడు లక్షల రెండు వేల స్వయం సహాయక బృందాలు ఉండగా, ఇందులో 31లక్షల మంది సభ్యులున్నారు.
  • హాస్టల్‌ విద్యార్ధులకు డైట్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఛార్జీల పెంపు.
  • ఐటీ రంగం ద్వారా రూ.40,646 కోట్ల మేరకు ఎగుమతులు ఉండగా, అదనంగా గత ఆర్ధిక సంవత్సరానికి 39,186 మందికి ఉద్యోగ అవకాశాలు. దీనితో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు మొత్తం 3,18,624 ఉన్నారు.
  • రాష్ట్రంలో ప్రతినెలా 76.09 మందికి ఫించన్‌ చెల్లిస్తుండగా, 2011-12 ఆర్ధిక సంవత్సరానికి 64లక్షల ఫించన్‌దారులకు రూ.2069 కోట్లు వెచ్చించారు. కాగా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి (సెప్టెంబర్‌ చివరినాటికి) రూ.68.05 ఫించన్‌దారులకు రూ.1108.55 కోట్లు చెల్లించారు.
  • 2011-12 ఆర్ధిక సంవత్సరానికి బలహీన వర్గాలకు 1.05 గృ హాలు నిర్మించగా, 2012-13 ఆర్ధిక సంవత్సరానికి (సెప్టెంబర్‌ చివరినాటికి) 2,03, 475 గృహాలు నిర్మించారు.