సిగిరెట్లు, బీడీలపై పన్ను పెంచితే ఆరోగ్యం, ఆదాయం
ఎన్‌ఐపీఎఫ్‌పీ అధ్యయనంలో వెల్లడి
* పొగతాగడం 10 శాతం మేర పెరిగే కొద్దీ ఆయువు ఏడాది చొప్పున తగ్గుతున్నట్లు తేలింది.
* పట్టణ ప్రాంతాల్లోని 20- 24 ఏళ్ల వయసు పురుషుల్లో ధూమపానం 13 శాతం ఉండగా.. 2006 నాటికి అది 25 శాతానికి పెరిగింది.
* 30 ఏళ్ల వయస్సు వారిని పరిశీలిస్తే.. బీడీ తాగే పురుషులు ఆరేళ్ల జీవితాన్ని కోల్పోయారు. అదే మహిళలైతే.. తమ జీవితంలో 8 ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోయారు. సిగరెట్ తాగే పురుషుల్లో ఆయుష్షు 10 ఏళ్ల మేర తగ్గిపోయింది.
* సిగరెట్లపై పన్నుల ఎక్కువైతే పొగతాగడం తగ్గుతుంది. వీటి ధర 10 శాతం మేర పెరిగితే ధూమపానం తాగేవారిలో 2-4 శాతం మంది ఈ అలవాటును వదిలించుకుంటారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో సిగరెట్లపై ఎక్సైజ్ పన్నును 17 శాతం మేర పెంచారు. దీనివల్ల రెండు లక్షల మంది పొగతాగడాన్ని మానేస్తారని అంచనా.
* ఓ ప్యాకేజీ రీటెయిల్ ధరపై ప్రస్తుతం పన్ను నలభైశాతం కంటే తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ 65 నుంచీ 80 శాతంగా ఉండాలని కచ్చితంగా సిఫారసు చేసింది.
* సిగరెట్ల రీటెయిల్ ధరపై పన్నులను 78 శాతం దాకా పెంచితే భారత్‌లో 34 లక్షల అకాల మరణాలను నిరోధించవచ్చు. రూ.14,630కోట్ల ఆదాయాన్ని పన్నురూపేణా ఏటా సర్కారీ ఖజానాకు జమ చేయవచ్చు.
* బీడీలపై ఇప్పుడు రీటెయిల్ ధరపై తొమ్మిది శాతంగా ఉన్న పన్నును కనుక నలభైశాతం మేరకు పెంచగలిగితే ఏటా 1.5 కోట్ల మంది ప్రాణాలను అకాల మృత్యుబారిన పడకుండా కాపాడవచ్చు. ప్రభుత్వానికి రూ.3,690కోట్ల ఆదాయం వస్తుంది.