బ్రాండ్ సానియా తగ్గిందా..: 'ఆమె పెళ్లి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు బ్రాండ్ విలువను తగ్గించేస్తున్నాయ్. ఇది ప్రకటనదారులకు కలత చెందించే విషయమ'ని మార్కెటింగ్ సొల్యూషన్ల సంస్థ ఆల్‌కెమిస్ట్ ఎండీ మానిష్ పొర్వాల్ చెబుతున్నారు. 2005-06లో ఆమె ప్రపంచ ర్యాంకింగ్ 77గా ఉన్నప్పుడు టాటా ఇండికామ్, హ్యుందాయ్ గెట్జ్, లొట్టో స్పోర్ట్ ఇటాలియా, స్ప్రైట్, జీవీకే ఇండస్ట్రీస్, సహారా ఇండియా, అట్లాస్ సైకిల్, టాటా టీ వంటి భారీ కాంట్రాక్టులు దక్కించుకుంది. ఆ ఏడాది ఆమె బ్రాండ్ విలువ సచిన్, సౌరవ్, రాహుల్ ద్రవిడ్ తర్వాతి స్థానంగా ఉండేది. రూ.2-4 కోట్ల వరకూ డిమాండ్ చేయగల సత్తా అప్పటిది. 2007 కల్లా హ్యుందాయ్, టాటా ఇండికామ్, సహారా ఇండియా, లొట్టోలు ఒప్పందాలను పొడిగించుకోలేదు. ఆ తర్వాత ఆమె 27వ ర్యాంక్‌కు రావడంతో 2008లో అడిడాస్; 2009లో టీవీఎస్ స్యూటీ, క్యాడ్‌బరీ బోర్నవీటాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.