బాధ్యత
వెంకటేశ్: గుడ్‌మార్నింగ్ సర్!
ఆఫీసర్: గుడ్ మార్నింగ్ యంగ్‌మేన్.. కమాన్. ముందుగా నీకు చెప్పేది ఏమిటంటే.. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తికే ఈ పోస్ట్ ఇవ్వాలన్నది మా ఉద్దేశం.
వెంకటేశ్: అయితే ఈ ఉద్యోగానికి కచ్చితంగా సరిపోతాను సర్!
ఆఫీసర్: ఎలా...?
వెంకటేశ్: నేను గతంలో పనిచేసిన ఆఫీసులో ఏ చిన్న తప్పు జరిగినా.. అంతా నన్నే బాధ్యుడ్ని చేసేవారండీ...!
ఆఫీసర్: ఆ..!
బ్యాంక్ మేనేజర్: ఎందుకు..?
సురేశ్: ఏం లేదు సర్.. ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మాట్లాడాలి. నమ్మకస్తులైతే మంచిది కదా అని.
మేనేజర్: ఆహా.. అలాగా..! మీరు చెబుతున్నట్లు చాలా నమ్మకస్తుడు. అతని కోసమే వెతుకుతున్నాం. కనబడగానే కబురు చేస్తాం లెండి.