వ్యాట్ తగ్గించాలి ః సిమెంట్ కంపెనీలు
ప్రభుత్వాలు విధించే పన్నులు, సుంకాలు అన్నీ కలిపితే, ఎక్స్ ఫ్యాక రీ ధరలో 60 శాతానికి మించే అవే ఉంటాయని ఫిక్కీ ఆ ర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మరే దేశంలో లేనంతగా మనదేశంలో సిమెంటు పై పన్నుల భారం ఉందని తెలిపింది. ఆయా దేశాల్లో సగటు పన్ను శాతం 11.4గా ఉందని, శ్రీలంక లో మాత్రమే 20 శాతంగా ఉందని పేర్కొంది. బొగ్గు, జిప్సం లాంటి వాటిపై దిగుమతి సుంకాలను తొలగించాలని బెనర్జీ డిమాండ్ చేశారు. దేశంలోకి దిగుమతి అయ్యే సిమెంటుపై సుంకాలు విధించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. దాల్మియా సిమెంట్ (భారత్) ఎండీ పునీత్ దాల్మియా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టీల్ తరహాలో సిమెంట్‌కు కూడా డిక్లేర్డ్ గూడ్స్ హోదాను పరిశ్రమ కోరుకుంటున్నదని అన్నారు. దీని వల్ల పరిశ్రమకు పన్నుల వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. సిమెంటు పరిశ్రమ ఇప్పుడు మిగులు సామర్థ్యం దశకు చేరుకుంది.
ఎగుమతులపై గనుక నిషేధాన్ని తొలగిస్తే, నూత నంగా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుగా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా చేయకుంటే, మధ్యప్రాచ్యంలో లభించే అవకాశాలను పాకిస్తాన్ లాంటి ఇ తర దేశాలకు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దాల్మియా అన్నారు. సిమెంటు, క్లింకర్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు గాను డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్ పాస్‌బుక్ (డీఈపీబీ) రూపంలో ఎగుమతి ప్రోత్సాహకాలను ప్రకటించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. సిమెంటు తలసరి వినియోగంలో దేశం బాగా వెనుకబడి ఉంది. మౌలికవసతులను బాగా వృద్ధి చేయ డం ద్వారా దేశంలో సిమెంటు వినియోగాన్ని పెంచవచ్చని పరిశ్రమ భావిస్తోంది.