జౌళికి ఉద్దీపనలు ఉండాల్సిందే ః మారన్
ఈ ఉద్దీపనల ప్యాకేజీల కింద టెక్స్‌టైల్ పరిశ్రమ క్యాపిటల్ గూడ్స్‌పై దిగుమతి సుం కాల తిరిగి చెల్లింపు, సర్వీస్ టాక్స్ రిఫండ్, క్లస్టర్ వృద్ధి లాంటి ప్రయోజనాలను పొందింది. రిజర్వు బ్యాంకు పరిధిలో, వడ్డీరేటు సబ్సిడీని కూడా ఈ పరిశ్రమ పొందగలిగింది. 2008-09లో పరిశ్రమ వృద్ధి 2 శాతం పడిపోయింది. టెక్స్‌టైల్ పరిశ్రమకు ఉద్దీపనలు కొనసాగే అవకాశం ఉందని మారన్ పేర్కొన్నారు. 2008 ఏప్రిల్-నవంబర్‌తో పోలిస్తే, 2009లో అదే కాలానికి ఎగుమతులు 15 శాతం మేర తగ్గిపోవడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. డిసెంబర్, జనవరిలో మాత్రం నెలవారీగా ఎగుమతులు 5 శాతం పెరిగాయని మారన్ అన్నారు.