శీతల పానీయాల ప్యాకింగ్‌కు పెట్ బాటిళ్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. దేశీయ పెట్ బాటిళ్ల ఉత్పత్తిలో 22 శాతం శీతల పానీయాల రంగంలోనే వినియోగిస్తున్నారు. 2001-02 కాలంలో ఈ రంగంలో ఉపయోగించబడిన పెట్ బాటిళ్ల పరిమాణం 12 వేల టన్నులుండగా 2007-08 నాటికి 40 వేల టన్నులకు పెరిగింది. మన దేశం మొత్తం పెట్ బాటిళ్లలో 30 శాతం నీరు, ఇతర పానీయాల రంగంలోనే వినియోగిస్తున్నారు. ప్యాక్ చేయబడిన త్రాగునీరు రంగం ఇందులో ప్రధానమైనది. 1994లో కేవలం 4.4 కోట్ల లీటర్ల మినరల్ వాటర్ మార్కెట్ ఉండగా 2007 నాటికి అది 350 కోట్ల లీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం మనదేశంలో ప్యాక్ చేసిన మంచి నీరు తలసరి వినియోగం 0.5 లీటర్లుగా ఉంది. హార్లిక్స్, బూస్ట్ వంటి పదార్ధాలతో పాటుగా వంట నూనెల వంటి ఆహార పదార్థాల రంగంలో పెట్ బాటిళ్ల వినియోగం 10 శాతంగా ఉంది. దశాబ్ద కాలంలోనే వంటనూనెల రంగంలో పెట్ బాటిళ్ల వినియోగం 3 వేల టన్నుల నుంచి 14 వేల టన్నులకు పెరిగింది.
ఆహారేతర రంగాలు
షాంపులు, హెయిర్ ఆయిల్స్ వంటి రక్షణ ఉత్పత్తులు, రూమ్ ఫ్రెషనర్స్ వంటి హోమ్ క్లీనింగ్ ఉత్పత్తుల రంగాల్లో వినియోగించే పెట్ బాటిల్స్ పరిమాణం 37 శాతంగా ఉండటం విశేషం.
పెట్ ప్రీ ఫామ్స్ తయారీ పరిశ్రమ
ఏడాదికి 269 టన్నుల సామర్థ్యమున్న 1 లేదా 2 లీటర్ల పెట్ బాటిల్స్ తయారీకి వినియోగించే పెట్ ప్రీ ఫామ్స్ తయారీ పరిశ్రమ అంచనా వ్యయం : రూ.88 లక్షలు
ప్రీ ఫామ్స్ నుంచి పెట్ బాటి ల్స్ తయారీ పరిశ్రమ
ఏటా 18 లక్షల 1 లీటర్ మినరల్ బాటిళ్ల తయారీ సామర్థ్యమున్న ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 55లక్షలు
20 లీటర్ల మినరల్ వాటర్ బబుల్ తయారీ పరిశ్రమ
సంవత్సరానికి 205 టన్నుల 20 లీటర్ల బబుల్స్ ఉత్పత్తి సామర్థ్యమున్న ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1.58 కోట్లు
సమగ్ర పెట్ ప్రాసెసింగ్ పరిశ్రమ
ఏడాదికి 450 టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 7.25 కోట్లు
Monday, April 5, 2010
పెట్ బాటిల్స్ తయారీ పరిశ్రమ
దేశీయ ప్యాకేజింగ్ పరిశ్రమ ఏటా 15 శాతం వృద్ధితో 78,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో పెట్‌గా పిలిచే పాలీ ఇధ లిన్ టెరిస్పెథలేట్‌తో తయారు చేసే సీసాలు, క్యాన్ల వినియోగం బాగా పెరుగుతోంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 2009-10 కాలంలో పెట్ ఉత్పత్తుల మార్కెట్ 3,40,500 టన్నులుగా ఉంది. పెట్ బాటిల్స్, జార్స్, క్యాన్లను వివిధ ఉత్పత్తుల ప్యాకింగ్ కోసం పలు సంస్థలు వినియోగిస్తున్నాయి.