Friday, March 19, 2010

ఏప్రిల్‌ 20న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) ఉద్యోగ సంఘాల సంయుక్త ఫోరమ్‌ ఏప్రిల్‌ 20న ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందుకు ముందస్తు కసరత్తుగా ఉద్యోగులు న్యూఢిల్లీలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయం, జిల్లా ప్రధాన కార్యాలయాల వద్ద ఈ నెల 26న భారీ ధర్నాకు దిగనున్నారు. శ్యామ్‌ పిట్రోడా కమిటీ సిఫారసులను కంపెనీ బోర్డు అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతున్నట్లు సంస్థ ఉద్యోగ సంఘాల సంయుక్త ఫోరమ్‌ కన్వీనర్‌ వి.ఎ.ఎన్‌.నంబూద్రి మంగళవారమిక్కడ ఓ ప్రకటనలో తెలిపారు.ఇండియన్‌ టెలికాం సర్వీస్‌(ఐటీఎస్‌) అధికారుల నియామకం, 93 మిలియన్ల జీఎస్‌ఎమ్‌ లైన్ల కొనుగోలు ఆర్డరుకు మోక్షం, సంస్థ రిటైర్డ్‌ ఉద్యోగుల ఐడీఏ పెన్షన్‌ల పునరుద్ధరణలను సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.