క్రికెట్ బ్యాట్ రూ.23,000
ఖరీదైన క్రీడా పరికరాలను విక్రయించే బ్రిటన్‌కు చెందిన మంగూస్ క్రికెట్ లిమిటెడ్ కూడా ట్వంటీ 20 పోటీలకు తమ బ్యాట్‌లతో దూసుకొచ్చేసింది. రూ.17,000, రూ.23,000 విలువైన రెండు రకాల బ్యాట్‌లను విక్రయానికి పట్టుకొచ్చింది. సాధారణ బ్యాట్‌లతో పోలిస్తే, వీటి హ్యాండిల్ 43% పొడవుగా, బ్లేడ్ 33% తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. బ్రిటన్‌లో తయారైన 100 బ్యాట్‌లను దేశంలోని 30 స్టోర్లలో అందుబాటులో ఉంచారట. సెప్టెంబరు నాటికి స్టోర్ల సంఖ్యను 200-300 చేయాలనుకుంటోందీ కంపెనీ. విక్రయాలు పెరిగితే భారత్‌లోనూ బ్యాట్‌లను తయారు చేస్తామంటోంది సదరు కంపెనీ. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వారు తమ బ్యాట్‌తో ఆడాలనేది కంపెనీ ఆశ. మొత్తంమీద మన క్రికెటర్లనే ప్రచారకర్తలుగా నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతానికి హెడెన్, ఆండ్రూ సైమండ్స్, డ్వానే స్మిత్ వంటి వారితో సరిపెడుతోంది.