Monday, March 15, 2010

సీఐఐ-ఏపీ ఛైర్మన్‌గా శక్తిసాగర్‌ ఎన్నిక

ఉపాధ్యక్షుడిగా జయదేవ్‌ గల్లా
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: 2010-11 సంవత్సరానికి భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆంధ్రప్రదేశ్‌ (సీఐఐ-ఏపీ) కొత్త కార్యవర్గాన్ని శనివారం ఇక్కడ జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో ఎన్నుకున్నారు. ఛైర్మన్‌గా శక్తిసాగర్‌, వైస్‌-ఛైర్మన్‌గా జయదేవ్‌ గల్లా ఎన్నికయ్యారు. వీరిరువురూ ఏడాది కాలం పాటు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జయదేవ్‌ గల్లా అమరరాజా బ్యాటరీస్‌, గల్లా ఫుడ్స్‌ కంపెనీలకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌, హైదరాబాద్‌ సభ్యుడిగా, స్వచ్ఛంద సంస్థ అయిన రాజన్న ట్రస్ట్‌ ట్రస్టీగా ఉన్నారు. జయదేవ్‌ గల్లా అమెరికాలోని ఇలినాయిస్‌ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలను అభ్యసించారు.