Friday, March 19, 2010

గందరగోళంలో పారిశ్రామిక , ఐటీ పాలసీలు

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావి స్తున్న 2010-15 నూతన పారిశ్రామిక, ఐటీ పాలసీల రూపకల్పన ప్రక్రి యను గందరగోళ పరిస్థితులు చుట్టుముట్టాయి. సర్కార్‌ ముందుచూపు లేకుం డా హడావుడిగా చేస్తున్న ఐఏఎస్‌ బదిలీలే కొత్త పాలసీలను నిలువునా మింగేస్తు న్నాయని అసోసియేషన్లు మండిపడుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిి, ఆర్థిక వ్యవస్ఖకు వెన్నెముక లాంటి పారిశ్రామిక, ఐటీ పాలసీల పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. నూతన పారిశ్రామిక పాలసీ కసరత్తు వేగంగా జరుగుతున్న సమయంలో రాష్ర్ట ప్రభుత్వం పరిశ్రమ ల శాఖ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ను ఆ పోస్ట్‌ నుంచి బదిలీ చేసింది.

ఆయన స్థానంలో వచ్చిన కొత్త అధికారికి మొత్తం పరిశ్రమల శాఖ సమస్యలు, ఇతర అంశాలపై పట్టు రావాలంటే దాదాపుగా ఆరు నెలలకుపైనే సమయం పడుతోంది. ఈ నెలాఖరుతో 2005-10 పారిశ్రామిక పాలసీ గడువు పూర్తి కానున్నది. ఏప్రిల్‌ నుంచి కొత్త పాలసీని ప్రకటించి, విసృ్తత పెట్టుబడులను ఆక ర్షిస్తూ, రాష్ట్రం పారిశ్రామికంగా మరింత ముందుకు దూసుకుపోయే విధంగా వాతావరణాన్ని చక్కదిద్దాల్సిన సమయంలో వరుస బదిలీలను చేపడు తూ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.

ఐటీ పరిస్థితి మరీ అధ్వానం
అంతర్జాతీయ ఐటీ మార్కెట్లో మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. దేశంలోనూ ఈరంగంలో చెప్పుకోదగిన ప్రగతినే సాధించింది. ఆర్థిక మాంద్యం, సత్యం కుంభకోణం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఐటీ మార్కెట్‌ తీవ్రంగా కలత చెందినప్పటికీ... దేశీయ ఐటీ ఎగుమతులతో పోల్చు కుంటే ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన పనితీరును ప్రదర్శించడంతోపాటు అన్ని రంగా ల్లోనూ వృద్ధిని సాధించడం విశేషం. ఈ నెలాఖరకు ఐటీ పాలసీ గడువు పూర్తి కానున్నది. గత మూడు నెలల నుంచి 2010-15 రాష్ట్ర ఐటీ పాలసీని సదరు శాఖ కసరత్తు చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో ఐటీ ముఖ్యకార్యదర్శిని పలు మార్లు బదిలీచేసింది.

ప్రస్తుతం మార్కెట్లో అనుకూల పరిస్థితులు లేకపోవడం తోపాటు..సదరు శాఖ బడ్జెట్‌ కూడా అంతంతమాత్రంగా ఉండడంతో సర్కార్‌ పలుమార్లు ఐఏఎస్‌ బదిలీల ద్వారా ఈ పోస్ట్‌ను భర్తీ చేయడానికి ప్రయత్నించి నప్పటికీ.. ఐటీ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి పలుకుబడి కలిగిన సీనియర్‌ ఐఏఎస్‌లు ఎవ్వరూ ఆ పోస్ట్‌ చేపట్టడానికి ససేమిరా అన్నారు. గతంలో మున్సిపల్‌, ఇతర ప్రధాన శాఖలు నిర్వహించిన ఎస్పీ సింగ్‌ను ఐటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆయన ఆ స్థానంలో బాధ్యతలు స్వీకరించడానికి విముఖత చూపడంతో... చాలా రోజులు ఆ పోస్ట్‌ ఖాళీగానే ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి రత్నప్రభను ఐటీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ఎస్పీ సింగ్‌ను నియమించడం విశేషం.

తలబాదుకుంటున్న అమాత్యులు
వరుస బదిలీలతో కొత్త అధికారులకు శాఖలపై అవగాహన లేకపోవడంతో అమాత్యులు కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. ప్రధానంగా పరిశ్రమలు, ఐటీ శాఖల్లో పరిస్థితి మరీదారుణంగా తయారైంది. శాఖాపరమైన సమస్యలను పరిష్కరించడంలోనూ, అభివృద్ధి లక్ష్యాలతోపాటు పలు అంశాల్లో మంత్రులకు దిశనిర్దేశం చేయాల్సిన అధికారులు కొత్తవారు కావడంతో మంత్రులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిందిగా రోజూ కార్యాలయాలు చుట్టూ అసోసియేషన్‌ నాయకులు తిరుగుతున్నా... తమ కష్టాలు తీరడంలేదని వారు వాపోవడం విశేషం.

కీలకమైన అసెంబ్లీ సమా వేశాల ప్రశ్నలకు ప్రభుత్వం తరుపున సమాధానాలు తయారు చేయడానికి కూడా సదరు శాఖల అధికారులకు సరైన పట్టులేకపోవడంతో మంత్రులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ర్ట పారిశ్రామిక రంగం సమ్మెలు, ఇతర ఉద్రిక్త పరిస్థితులతోపాటు విద్యుత్‌ కోతలు చుట్టుముట్టడంతో యూనిట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన ఐటీ, పరిశ్ర మల శాఖల పట్ల సర్కార్‌ తీరు హాస్యాస్పదం గా ఉందని పరిశ్రమల అసోసియేషన్లు విమర్శిస్తున్నాయి. సదరు శాఖల్లో చోటు చేసుకున్న విచిత్ర పరిస్థితుల రీత్యా 2010-215 నూతన పారిశ్రామిక, ఐటీ పాలసీల రూపకల్పన ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుం దని అధికారులు భావించడం విశేషం.అత్యంత కీలకమైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా భవిష్యత్తులోనూ ఇదే వైఖరి ప్రదర్శిస్తే.. రాష్ట్రం అన్ని స్థాయిల్లోనూ తీవ్రంగా నష్టపోవడంతోపాటు రాష్ట్ర పరిశ్రమల ప్రగతి గాడి తప్పుతుందని పరిశ్రమల అసోసియేషన్‌ నాయకులు సర్కార్‌ను హెచ్చరిస్తున్నారు.