Friday, March 19, 2010

ప్రపంచ ఫార్మా మార్కెట్లుగా ఎదుగుతున్న భారత్‌ , చైనా

న్యూఢిల్లీ : వేగంగా వృద్ది చెందుతున్న అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో భారత్‌, చైనాలు అగ్రస్థానంలో దూసుకెళుతున్నాయని పరిశోధ నా సంస్థ ఐఎంఎస్‌ హెల్త్‌ సర్వే తెలిపింది. 2013 సంవత్సరం నాటికి ఫార్మా ఉత్పత్తి విక్రయాలు పెరగనున్నాయని ప్రకటిం చింది. ఐఎంఎస్‌ సర్వే ప్రకారం చైనా దేశం ప్రపంచ ఫార్మా మార్కెట్లలో అగ్రస్థానానికి ఎదగనుంది. ఆ తరువాతి స్థానాలు ఫ్రాన్స్‌, జర్మనీ, రష్యా దేశాలు ఉండనున్నాయి. ప్రపంచ టాప్‌ 13వ పార్మా మార్కెట్‌గా భారత్‌ అవతరించనుందని ఈ సర్వే తెలిపింది. పెద్దగా ప్రాధాన్యంలేని సంప్రదాయ ఆర్థికవ్యవస్థగల దేశాలు కూడా ఫార్మా మార్కెట్లో తమ సత్తా చాటనున్నాయని తెలిపింది.


ప్రపంచ ఫార్మా రంగాన్ని యేలేందుకు అమెరికా సిద్ధమౌతుందని, జపాన్‌, చైనా మార్కెట్ల తరువాతి స్థానం అమెరికా ఆక్రమించుకోనుందని పేర్కొంది. ఈ వరుసలో బ్రెజిల్‌ దేశం 8వ స్థానాన్ని, రష్యా 11వ స్థానాన్ని, భారత్‌ 13వ స్థానాన్ని కైవసం చేసుకోనున్నాయి. గత 2009 సంవత్సరంలో సూపర్‌పవర్‌గా ఎదిగిన చైనాతో పాటు బ్రజిల్‌, రష్యా, భారత్‌ వేగంగా ఎదుగుతున్న ఫార్మా మార్కెట్లలో ఉన్నా యనీ, అంతర్జాతీయంగా ఫార్మా మార్కెట్‌ ఆదాయాలల్లో 37 శాతం వాటా ఈ దేశాలదేనని సర్వే పేర్కొంది. వచ్చే 2013 నాటికి ఈ దేశాలు 48శాతం మరింత వృద్ధిని ప్రపంచ స్థాయి లో నమోదు చేస్తాయని తెలిపింది. మరో మూడేళ్ళలో చైనా దేశ వ్యాపారం ఈ రంగంలో 40బిలియన్‌ డాలర్లుగా ఉండనుం దనీ వెల్లడించింది. దీనికి అదనంగా భారత్‌, బ్రెజిల్‌, రష్యా దేశా లు 5-15 బిలియన్‌ డాలర్ల వ్యాపారాన్ని జోడించనున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.