రాష్ట్ర ప్రభుత్వం తాజా వివరాలతో విడుదల చేసిన 'స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్-2009' సంచికలో పొందుపరచిన గణాంకాల ప్రకారం.. 2008-09లో రహదారుల పొడవు, విద్యుత్ కనెక్షన్ల సంఖ్య, లోడ్ వివరాలు ఇలా ఉన్నాయి...
| * రంగాల వారీగా విద్యుత్తు కనెక్షన్లు, లోడు పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. * గృహ విద్యుత్తు కనెక్షన్లలో గుంటూరు జిల్లా అగ్రభాగంలో ఉంది. ఆ తర్వాత వరుసగా రంగారెడ్డి, హైదరాబాద్, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలున్నాయి. * పారిశ్రామిక కనెక్షన్లు, లోడ్‌లో రంగారెడ్డి, నెల్లూరు జిల్లాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ కంటే కృష్ణా జిల్లాలో పారిశ్రామిక కనెక్షన్లు, లోడ్ ఎక్కువగా ఉండటం గమనార్హం. |
| * జాతీయ రహదారులు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 528 కి.మీ. ఉండగా రాష్ట్ర రాజధానిలో 36 కి.మీ. మాత్రమే ఉన్నాయి. |