వినోదమూ నిత్యావసరమే!
వినోదమూ నిత్యావసరమే!
హాలీవుడ్, బాలీవుడ్ ఉమ్మడిగా కృషిచేయాలి: షారుక్
ముంబయి: మనిషికి అత్యవసరమైన వాటిలో వినోదం నాలుగోదని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ వ్యాఖ్యానించారు. మనుషులకు 'కూడు, గూడు, గుడ్డ(రోటీ, కప్డా, మకాన్)'తోపాటు వినోదం అవసరమని చెప్పారు. మంగళవారమిక్కడ భారత వినోద, మీడియా పరిశ్రమపై ఏర్పాటైన అంతర్జాతీయ సదస్సు 'ఫిక్కీ ఫ్రేమ్స్ 2010'లో ఆయన కీలకోపన్యాసం చేశారు. పూర్తిస్థాయి అంతర్జాతీయ వినోదం అందించడానికి హాలీవుడ్, బాలీవుడ్ ఉమ్మడిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. కథన రచన, సాంకేతిక పరిజ్ఞానం వాడటం, క్రమశిక్షణ-నిర్వహణ అంశాల్లో హిందీ చిత్ర పరిశ్రమ వెనకబడినట్లు చెప్పారు. కథన రచన ఒక కళ కాదని, అదొక శాస్త్రీయ ప్రక్రియని వ్యాఖ్యానించారు.