Friday, March 19, 2010

ఎక్కువ మంది ఫేస్‌'బుక్‌ అయ్యారు'

వెనకబడ్డ గూగుల్‌
శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ సందర్శకుల విషయంలో తొలిసారిగా గూగుల్‌ను ఓడించింది. గత వారం అమెరికాలో ఎక్కువ మంది గూగుల్‌ కంటే ఈ వెబ్‌సైట్‌నే సందర్శించడంతో ఈ ఘనత సాధించిందని పరిశ్రమ పరిశీలక సంస్థ 'హిట్‌వైజ్‌' పేర్కొంది. గతేడాది ఇదే వారంతో పోలిస్తే ఫేస్‌బుక్‌ సందర్శకులు 185 శాతం మేర పెరగడం విశేషమని ఆ సంస్థ పేర్కొంది. అదే సమయంలో గూగుల్‌ తన సందర్శకుల విషయంలో కేవలం 9 శాతం వృద్ధినే సాధించిందని చెబుతున్నారు. అయితే గూగుల్‌ ప్రాపర్టీ సైట్లయిన జిమెయిల్‌, యూట్యూబ్‌, గూగుల్‌ మ్యాప్స్‌లను పరిగణనలోకి తీసుకోలేదు. ఫేస్‌బుక్‌.కామ్‌, గూగుల్‌.కామ్‌లు రెండూ కలిపి మొత్తం అమెరికా ఇంటర్నెట్‌ సందర్శకుల్లో 14 శాతం మందిని కూడగట్టుకోగలిగాయి. గత కొద్ది నెలల్లో మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ద్వారా జి-మెయిల్‌ సేవలకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఫీచరు 'బజ్‌'ను చేర్చడం ద్వారా ఫేస్‌బుక్‌కు గూగుల్‌ సవాలు విసురుతోంది.