Friday, March 19, 2010

మేటాస్‌ ప్రాపర్టీస్‌ అమ్మకానికి సిద్ధం!: ఖుర్షీద్‌

న్యూఢిల్లీ: సమస్యల్లో కూరుకుపోయిన మేటాస్‌ ప్రాపర్టీస్‌ను కొనుగోలు చేయడానికి ఓ పెట్టుబడిదారును వెతికే అవకాశాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తున్నట్లు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ పేర్కొన్నారు. 'అన్ని అవకాశాలనూ పరిశీలించిన తర్వాత నిర్ణయాత్మక విక్రయం(స్ట్రాటజిక్‌ సేల్‌) పనిచేస్తుందని భావిస్తున్నాం. అయితే బోర్డు సభ్యులే ఆ విషయాన్ని నిర్ణయించాల్సి ఉంద'ని ఖుర్షీద్‌ అంటున్నారు. 'కంపెనీ ఛైర్మన్‌ వేద్‌జైన్‌ అన్ని అవకాశాలపైనా దృష్టిసారించారు. అతనికి కావలసిన అన్ని సహాయాలనూ అందించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. చాలా తక్కువ అవకాశాలున్నప్పటికీ ఒక సంతృప్తికర ముగింపునివ్వడానికే మొగ్గుచూపుతున్నామ'ని ఆయన అన్నారు. గతేడాది సత్యం కుంభకోణం బయల్పడిన తర్వాత మేటాస్‌ ఇన్‌ఫ్రా, మేటాస్‌ ప్రాపర్టీస్‌ల్లో ప్రభుత్వం సొంత నామినీలను నియమించిన సంగతి తెలిసిందే.