షికాగో: అమెరికాలో ఉద్యోగ కోతలు తగ్గుముఖం పట్టాయి. కొత్త కొలువుల భర్తీ కొనసాగుతోందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే నియామకాలు మరింత వేగాన్ని పుంజుకోవడానికి, ఆర్థిక సంక్షోభానికి ముందు పరిస్థితులకు ఆర్ధిక వ్యవస్థ చేరుకోవడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి మార్చిలో ఉద్యోగ కోతలు 55 శాతం తగ్గి 67,000కు పరిమితం అయ్యాయని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్ట్‌మస్ సంస్థ నివేదిక వెల్లడించింది. మొత్తంలో మార్పు వచ్చినప్పటికీ.. ఫిబ్రవరి కంటే మార్చిలో ఉద్యోగ కోతలు 61 శాతం పెరగడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలోని చాలా రంగాలు ఇప్పుడిప్పుడే మందగమనం నుంచి బయటపడుతున్నాయని సదరు సర్వే సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
మార్చిలో 1.62 లక్షల ఉద్యోగాల భర్తీ:
అమెరికా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మార్చి నెలలో కొత్తగా 1,62,000 ఉద్యోగ నియామకాలు జరిగాయని ప్రభుత్వ కార్మికశాఖ పేర్కొంది.ప్రయివేటు రంగంలో 1,23,000 మందికి కొలువులు లభించాయి