పెరిగిన మారుతీ ధరలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా వివిధ మోడళ్లపై రూ.10,000 దాకా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో పాటు కొత్త బీఎస్IVకాలుష్య ప్రమాణాల అమలు కారణంగా పడిన భారంలో కొంత మేర వినియోగదారులకు మళ్లించక తప్పట్లేదని కంపెనీ పేర్కొంది. దీంతో ఎ-స్టార్, రిట్జ్ మోడళ్లు రూ.1,000 చొప్పున; ఎస్టిలో రూ.2,500, ఆమ్ని రూ.3,000; స్విఫ్ట్ రూ.3,750; డిజైర్ రూ.7,000; ఎస్‌ఎక్స్4 రూ.9,000 చొప్పున ప్రియం కానున్నాయి. కంపెనీ తన ఈకోపై ప్రారంభ ఆఫర్‌ను వెనక్కి తీసుకోవడంతో రూ.10,000 మేర ఆ కారు ధర పెరగనుంది.