2009-10లో కొనసాగిన డౌన్‌ట్రెండ్
ఇప్పటికే బాగా పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ ధరలు ముఖ్యంగా హౌసింగ్, కమర్షియల్, రెంటల్ స్పేస్ విభాగాల్లో ధరల పెత్తనం కొనసాగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. వచ్చే రెండు సంవత్స రాల వరకూ కమర్షియల్, రిటైల్ రియ ల్ ఎస్టేట్ విభాగంలో ధరల పతనం కొనసాగుతుందని ఇతర సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్ కంటే పెరిగే సప్లయ్యే ప్రధాన కారణమన్నది వీరి విశ్లేషణ. ఇంకా అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉన్నందున వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో వాణిజ్య రియల్ ఎస్టేట్ విభాగంలో అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు. అదేవిధంగా ఈ విభాగంలో మరికొంత కాలం వరకూ కొత్త పెట్టుబడులు రాకపోవచ్చు.
అదే రెసిడెన్షియల్ మార్కెట్స్ విషయానికి వస్తే పరిస్థితి చాలా ఆశావహంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ద్రవ్య సరఫరా పెరగడంతో ఈ రంగంలో డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. బ్యాంకులు రుణాలను ఇస్తుండటం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదినెమ్మదిగా గాడిన పడుతోందన్న సంకేతాలకు తోడు పెరుగుతున్న ఆదాయం వంటి ప్రధానమైన కారణాలు రెసిడెన్షియల్ సెగ్మెం ట్‌లో వెలుగులు విరజిమ్ముతున్నాయని క్రిసిల్ రీసెర్చ్ హెడ్ సుధీర్ నాయర్ పేర్కొన్నారు. సంక్షోభం తర్వాత రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్ చాలా ఆకర్షణీయమైన ధరలతో ఆఫర్ చేస్తు న్నాయని, దేశవ్యాప్తంగా సొంత ఇంటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా రెసిడెన్షియల్ సెక్టార్ శరవేగంగా కోలుకుంటుం దన్నారు.
చిన్న మధ్య స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థలు అధిక వడ్డీలు ఉన్న రుణభారాలను వదిలించుకోవడం ద్వారా వ్యయాన్ని తగ్గించు కోవడమేకాకుండా ప్రస్తుతం చౌకగా లభిస్తున్న హౌసింగ్ లోన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచే పనిలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగ భద్రతపై ఉన్న అనుమానాలు తొలిగి పోవడంతో రెసిడెన్షియల్ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది.
2010 ఎలా ఉంటుందంటే...
ఇక లగ్జరీ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే వీరు అత్యధికంగా రాజకీయ నాయకులు లేదా ఎన్‌ఆర్‌ఐలే ఉంటున్నారు. వీరు అత్యధికంగా మల్టీ స్పెషాలిటీ సర్వీస్ అపార్ట్‌మెంట్స్, రిసా ర్ట్స్, టౌన్‌షిప్స్ వంటి లగ్జరీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అత్యధికంగా ఆసక్తి చూపి స్తారు. పెట్టుబడులకు ఇండియా సురక్షితమై నదన్న నమ్మకం రావడంతో 2010లో ఇన్వెస్ట్ మెంట్స్ బాగానే పెరిగే అవకాశాలు ఉన్నాయి. సబ్‌ప్రైమ్ సంక్షోభం వలన ఇండియా కూడా కొద్దిగా దెబ్బతిన్నప్పటికీ వెంటనే కోలుకున్న ది. ఇది దేశీయ వినియోగంపై ఎటువంటి ప్రభావం చూప లేకపోయింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ మంచి పనితీరును కనపరుస్తున్నది. లగ్జరీ విల్లాలు, థీమ్ పార్కులను పెద్ద ఎత్తున ఏర్పాటుచేస్తున్నారు.
ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధిస్తున్న దేశాలలో ఇండియా ముందు వరసలో ఉంది. ఇండియా 7-8 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తుంటే యూరప్ దేశాలు 1-2 శాతం వృద్ధి సాధించడమే కష్టమవుతోంది. అమెరికా, యూఏఈ, యూకే, కెనడా వంటి దేశాలలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఇండి యాలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తు న్నారు. ఏటా రియల్ పెట్టుబడుల్లో సగటున 20-30 శాతం వృద్ధి నమోదు అవుతోంది. కానీ ఇండియాలో ఇన్వెస్ట్ చేసే ప్రవాస భారతీయుల్లో ఆందోళన ఉంది. 2010లో కూడా ఈ భయాలు కొనసాగుతాయని క్రిసిల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనికి కారణం భూమి ధరలు ఒక్కసారిగా ఆకాశానికి లేవడమే. ఇటువంటి సమయంలో ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవడం దేనికి అనుకుంటున్నారు. ఇప్పుడు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చే సత్తా కేవలం లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్‌కు మాత్రమే ఉంది.
ఇప్పటికీ దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వ్యవస్థీకృతం కాలేదు. ఒక్కసారి రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆర్గనైజ్‌డ్ సెక్టార్‌గా మారితే మరింత వేగంగా వృద్ధి చెందు తుంది. చివరగా చెప్పేది ఏమిటంటే కొత్త పెట్టుబడులు వచ్చినప్పు డు మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యవస్థ మరింత వేగంగా కోలుకుని అంచనాలకు అనుగుణంగా ముందుకు దూసుకు వెళ్లగలుగుతుంది. మొత్తానికి ప్రస్తుతానికి మార్కెట్ కొంత ఆశాజనకంగానే ఉందనేది కొంతమంది మార్కెట్ నిపుణుల భావన.
Saturday, April 3, 2010
ఇక "రియల్" వెలుగులే!
గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్‌రంగం ముఖ్యంగా లో- కాస్ట్ హౌసింగ్ విభాగంలో డిమాండ్ మొదలయ్యింది. ఇదే విధమైన డిమాండ్ 2010-11 సంవత్సరాంతం వరకూ ఉంటుందని రియల్ ఎస్టేట్ డెవలపర్స్, నిర్మాణ రంగ సంస్థలు అంచనా వేస్తున్నాయి. స్థానికంగా మంచి సంకేతాలు వెలువడుతుండటంతో చిన్న, మధ్యస్థాయి హౌసింగ్ డెవలప్ మెంట్ సంస్థలు గృహనిర్మాణ రంగం దేశవ్యాప్తంగా తిరిగి ఊపందుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితులు కనిపించడం లేదు. మార్కె ట్ తిరిగి గాడిన పడుతుందన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆశలపై రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్ నీళ్లు పోసింది. 20 09-10లో రియల్ ఎస్టేట్ రంగం తిరి గి గాడిన పడుతుందన్న వార్తలపై పరి శ్రమ ప్రతినిధులు, విశ్లేషకులు పెదవి విరిచారు.