ప్రస్తుతం రిలయన్స్ ఉత్పత్తి చేసే ఈ గ్యాస్ విద్యుత్‌కు, ఎరువుల పరిశ్రమలకు, రిఫైనరీలకు, స్టీల్ పరిశ్రమలకు, ఎల్‌పిజి.కు, సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నిమిత్తం దేశంలోగల వివిధ రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే ఈ డి6 బ్లాక్ సముద్ర గ ర్భం నుంచి రెండు కిలోమీటర్లు, సముద్ర ఉపరితలం నుండి మూడు కిలోమీటర్ల లోతు నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వెలికితీయడం ఒక రికార్డు కాగా, ప్రపంచంలో గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న తర్వాత వాటిని వెలికితీసేందుకు 8 సంవత్సరాల వ్యవధి అవసరం కాగా రిలయన్స్ రికార్డు స్థాయిలో ఆరున్నర సంవత్సరాల్లోనే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం.
ఈ సంస్థ 2002లో కెజి. బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాల వెలికితీత ప్రక్రియను డ్రిల్లింగ్ చేసి అవసరమైన పైపులైన్లు వేసి రికార్డు స్థాయిలో టెర్మినల్‌ను తయారుచేశారు. ఈ 62 ఎంఎంఎస్‌సిఎండి. లో 18 విద్యుత్ రంగానికి, 12.24 ఎరువుల రంగానికి, 3.06 స్టీల్ రంగానికి, 0.29 సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రంగానికి వినియోగిస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ వినియోగం జరిగే సమయంలో ఖర్చయ్యే విద్యుత్‌లో 33శాతం, మొత్తం విద్యుత్ వినియోగంలో 4శాతం ఈ సంస్థ అందించే గ్యాస్ ద్వారానే ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. అలాగే కోటి 50లక్షల గృహాలకు ఆరు కోట్ల మంది ప్రజల అవసరాలు ఈ సంస్థ ఉత్పత్తి చేసే గ్యాస్ ద్వారా తయారయ్యే విద్యుత్‌తో తీరుతున్నట్లు సంస్థ వెల్లడించింది.
అదే విధంగా ప్రతీ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయంలో రూ.1.47లు తగ్గుతుందని అంచనా. మొత్తం సంస్థ ఉత్పత్తి చేసే గ్యాస్ ద్వారా 4,745 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కారణంగా 1.2బిలియన్ వినియోగదారులకు రూ.5,400 కోట్లు ఆదా అవుతుంది. అలాగే ఎరువుల పరిశ్రమలకు ఈ గ్యాస్ ద్వారా యూరియా 6.10 మిలియన్ టన్నులు ఉత్పత్తి కావడంతో 2009-10 సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.3,100 కోట్లు ఆదా అయింది. స్టీల్ పరిశ్రమలకు ఈ గ్యాస్ ద్వారా రూ.732కోట్లు ఆదా కాగా, సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి.) రంగంలో 3లక్షల మంది గృహావసరాలు, ప్రతీ రోజూ 30వేల వాహనాలకు వినియోగించడం ద్వారా రూ.75కోట్లు సంవత్సరానికి ఆదా అయినట్లు ఆ సంస్థ అంచనా వేస్తుంది.
సమాజ సేవలో రిలయన్స్
కృష్ణా-గోదావరి బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి, ప్రజలకు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాలను రిలయన్స్ సంస్థ చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది కోరిక మేరకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ధీరూభాయి అంబానీ ప్రోత్సాహం పథకాన్ని 2008లో ప్రవేశపెట్టి రూ.కోటి అందజేశారు. అలాగే 2009-10 సంవత్సరంలో ఈ పథకం కింద రూ.కోటి 62లక్షలు ఖర్చు చేశారు.
దీంతోపాటు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు ఉచితంగా మందులు అందజే యడం, వైద్య శిబిరాలు నిర్వ హించడం, అలాగే ఆ ప్రాంత ప్రజలకు వివిధ విభాగాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తుంది. టూరి జం అభివృద్ధిలో భాగంగా యానాంలో టవర్ నిర్మాణం చేపట్టడమేగాక యానాం బీచ్ అభివృద్ధితోపాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను రిలయన్స్ సంస్థ చేపట్టింది. అలాగే రిలయన్స్ డ్రిల్లింగ్ జరిపే పరిసర ప్రాంత ప్రజలకు, వలస కూలీలకు హెచ్‌ఐవి., ఎయిడ్స్‌పై పెద్ద ఎత్తున అవగాహన శిబిరాలు ఈ సంస్థ చేపట్టింది. కేవలం సంవత్సరంలో సాధించిన ఈ విజ యాలు భవిష్యత్‌లో మరింతగా గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం తోపాటు పరిసర ప్రాంత ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించేందుకు ఆ సంస్థ ప్రణాళికలను రూపొందించుకుంటుంది.