హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిక్కుల్లో చిక్కుకున్న సత్యం కంప్యూటర్స్ సంస్థను మహీంద్రాలు కొనుగోలు చేసి సోమవారం నాటికి ఏడాది పూర్తయింది. 8000 కోట్ల రూ.ల ఖాతాల కుంభకోణానికి పాల్పడినట్లు నాటి సత్యం ఛైర్మన్ రామలింగరాజు స్వయంగా వెల్లడించడంతో కార్పొరేట్ ప్రపంచం పునాదులు క దిలాయి. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను, ముఖ్యంగా తెలుగు వారి వాణిజ్య విలువలను మసకబార్చిన ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పట్టించుకుని ఒక గాటన పెట్టడానికి శాయశక్తులా కృషి జరిపింది. చివరకు మహీంద్రాలు రంగంలోకి దిగి సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసి నేటికి ఏడాది పూర్త యిన సందర్భంగా ఇక్కడి మాదాపూర్ లేఅవుట్‌లో గతంలో ప్రభుత్వం కేటా యించిన 26 ఎకరాల ప్రత్యేక ఆర్ధిక మండలిలో తన కార్యాకలాపాలు ప్రారం భించింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సాల్మన్ ఖుర్షీద్ ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా హాజరై తన శుభాకాంక్షలు అందచేశారు.
ఈ సందర్భం గా ఆయన కంపెనీ ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ సంక్షోభంలో పడిన సత్యం సంస్థను గట్టెక్కించడానికి ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేసిందని, ఒకవైపు అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, మరోవైపు దేశంలోనే అతి పెద్ద కార్పొరేట్ కుంభకోణానికి తెర లేచిన నేపథ్యంలో ప్రభుత్వం చాకచాక్యంగా వ్య వహరించవలసి వచ్చిందని, ఆయా రంగాలలో సమర్ధులైన వారిని ఎంపిక చేసి బోర్డు సభ్యులుగా నియమించిందని చెప్పారు. సత్యం నిర్వాకం వల్ల అంత ర్జాతీయంగా భారతీయ కార్పొరేట్ రంగానికి చెడ్డపేరు వచ్చిందని, అయితే సత్యం సిబ్బంది ప్రతిభా విశేషాలు, నిబద్ధతతో కూడిన విధుల నిర్వహణ, కష్టప డి పనిచేసే తత్వం కారణంగా ఖాతాదారులు సత్యంతో అనుబంధం వదులు కోలేకపోయారని అన్నారు. ఈ ఘనత కేవలం సిబ్బందికు దక్కుతుందని కితాబు నిచ్చారు. ఏ కంపెనీకైనా ప్రారంభంలో ఒడిదుడుకులు, బాలారిష్టాలు తప్పవని, ఆ విషయాన్ని గ్రహించి ఉద్యోగులు సరైన సమయం ఆసన్నమయ్యేదాకా ఓపిక గా విధులు నిర్వహించాలని కోరారు.
సత్యం పునరుత్తానం చెంది మహీం ద్రా సత్యంగా నేడు వెలుగులు పూయించడం ముదావహమని, కొద్దికాలంలోనే సం స్థ ప్రగతి సాధించడం, ప్రత్యేక ఆర్ధిక మండలిలో మొత్తం నాలుగు లక్షల చద రపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం పూర్తి చేయడానికి నేడు సంకల్పిం చడం అభినందనీయమన్నారు. ఆరు నెలల్లో పూర్తయ్యే మొదటి దశలో 5000 మంది ఉద్యోగులకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. మహీంద్రా అండ్ మ హీంద్రా గ్రూప్ వైస్ ఛైర్మన్, ఎండి ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ గత ఏడాది ఇదే రోజున సత్యంను కొనుగోలు చేసి భారత ఐటి రంగంలో తమకున్న స్థానాన్ని పదిలపరుచుకున్నామని, ఏ లక్ష్యాన్ని సాధించడానికి సంస్థను కైవసం చేసుకున్నామో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సంస్థలో పనిచేసే సిబ్బంది, వారి కు టుంబాల సహాకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం మహీంద్రా సత్యం సిఇవో సి.పి.గుర్నానీ మాట్లాడుతూ సంస్థ ప్రస్థానంలో తొలిప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, సంస్థ పనితీరు, ప్రగతి ఒక రూపు దాల్చలంటే ఇంకా కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని తెలిపారు.
365 రోజుల ప్రయాణం లో చేయిదాటి పోబోతున్న నూరు శాతం మంది ఖాతాదారులను తిరిగి పొంద గలిగామని అన్నారు. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఉన్నతాధికార వ్యవస్థ ను 14 అంచెల నుండి ఏడు తగ్గించినట్లు తెలిపారు. సంస్థ ఆదాయ, వ్యయా లు, ఉద్యోగుల సంఖ్య, వలస కొత్త కాంట్రాక్టులు మొదలైన విషయాలు మాట్లా డడానికి ఇది తగిన సమయం కాదన్నారు. సమావేశంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహరాల శాఖ కార్యదర్శి బంధోపాధ్యాయ, మహీంద్ర సత్యం ఛైర్మన్ వినీత్ నయ్యర్ కూడా పాల్గొన్నారు.