ఉపకార వేతనాలూ పెండింగే
2010-11 సంవత్సరానికి రూ.1,13,660 కోట్లతో రూపొందించిన బడ్జెట్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. బకాయిలు తీర్చాలంటే కొత్త బడ్జెట్‌లో అనుబంధ ఖర్చుల్ని చూపి మంజూరు చేయాల్సి ఉంటుంది. రాబడిలో వృద్ధిరేటు మెరుగుపడుతున్నందున ఈ ఏడాది బడ్జెట్‌ను సరిగా నడపగలమనే ధీమా వ్యక్తమవుతోంది.
2009-10 బడ్జెట్ వివిధ రంగాల వారికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆర్థికశాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులిచ్చినా ఖజానా కార్యాలయాల్లో ఎన్నో బిల్లులు నిలిచిపోయాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి పరిస్థితి ఇదే ప్రథమం. కొత్త బడ్జెట్‌పై భారం పడేకొన్ని బకాయిల వివరాలు ఇలా ఉన్నాయి...
* జలయజ్ఞంలో కాంట్రాక్టర్లకు రూ.3 వేల కోట్లు.
* బీసీ, ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ బకాయిలు. వీటిని ప్రత్యేక కేటాయింపులతో చెల్లించేస్తామని ఆర్థికశాఖ చెబుతోంది.
* మెదక్ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి రూ.76 కోట్లు బకాయి ఉండిపోయింది. వరంగల్ జిల్లాలో 500 బిల్లులు నిలిచిపోయాయి.
* 2009 పీఆర్‌సీకి సంబంధించి ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఫిబ్రవరి నెల నుంచి ఇవ్వాల్సిన బకాయిల భారం కొత్త బడ్జెట్‌పై పడుతుంది.
* నాలుగో విడతకు సంబంధించిన టెలీఫోన్ బిల్లులు బకాయి ఉండిపోయాయి.
అసలు కోత ఎంత?
పాత బడ్జెట్‌కు సంబంధించి ప్రణాళికేతర ఖర్చుల్లో మొదటే 20 శాతం కోత విధించారు. మొత్తం రూ.1.03 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ. 3,922 కోట్లు మాత్రమే తగ్గనున్నట్టుగా సవరించిన బడ్జెట్‌లో పేర్కొన్నారు. కోతలు భారీగా ఉన్న నేపథ్యంలో ఎంత మేర బడ్జెట్ తగ్గిందో వాస్తవ గణాంకాలు వచ్చిన తర్వాతే బయటపడుతుంది.