పైపులైన్ ద్వారా జంటనగరాల వాహనాలకు కావాల్సిన గ్యాస్‌ను సరఫరా చేస్తామంటూ గత కొంత కాలంగా భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ ప్రకట నలు చేస్తూనే ఉంది. దీంతో నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా రవాణా శాఖ అధికారులు ఆటో లు, కా ర్లు తదితర వాటికి గ్యాస్ కిట్‌లను ఏర్పాటు చేయాలని ప్రోత్సిహ స్తున్నారు. హైదరాబాద్ నగరానికి సీఎన్‌జీని సరఫరా చేసేందు కు నగర శివార్ల లోని శామీర్‌పేట ప్రాంతాన్ని బేస్ సెంటర్‌గా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడి నుంచి నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు గ్యాస్‌ను సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగ రంలోని వేర్వేరు ప్రాంతాలకు భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ విజయ వాడ నుంచి ట్రక్కులలో సిలెండర్‌లను అమర్చి వాటి ద్వారా సరఫరా చేస్తోంది. ఈ విధానం వల్ల చాలా ప్రాంతాలలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంటోంది.
కొన్ని చోట్ల ఆటోలు రోజుల కొద్దీ బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. అంతేకాకుండా ఆర్టీసీకి కావాల్సిన సీఎన్‌జీని సరఫరా చేస్తామని భాగ్యనగర్ గ్యాస్ ఏ న్సీ పలు పర్యాయాలు ప్రకటించి కాల పరిమితిని విధించినా ఇంత వరకు అది సాధ్యం కాలేదు. భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ అధికారుల మాటలను విశ్వసించిన ఆర్టీసీ అధికారులు దాదాపు 350 సీఎన్‌జీ బస్సులకు టెండర్లను పిలిచి అర్ధాంతరంగా నిలిపి వేయాల్సి వచ్చింది. శామీర్‌పేటలో మదర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టిన భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ కంటోన్మెంట్, మేడ్చల్ ఆర్టీసీ డిపోలకు డాటర్ సెంటర్ పేరుతో పైపులైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తామని పేర్కొంది. ఇందుకోసం ఆర్టీసీ అధి కారులు డిపోలలో కావాల్సిన స్థలాన్ని కూడా కేటాయించారు.
అదే విధంగా హకీంపేట డిపోకు వాహనాల ద్వారా గ్యాస్‌ను సరఫరా చేసేందుకు అంగీకారం కూడా కుదుర్చుకుంది. గత ఏడాది డిపోలకు కావాల్సిన సీఎన్‌జీని అందించాల్సిన గ్యాస్ ఏజె న్సీ మొదట డిసెంబర్ అని హామీ ఇచ్చింది. ఆ తర్వాత జనవరి, ఏప్రిల్ ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతుండ టం తో అధికా రులు ఆయోమయంలో పడిపోయారు. ఇంత వరకు శామీర్ పేట ప్రాంతంలో మదర్ సెంటర్‌కు కావాల్సిన ఏర్పాట్లు కూడా భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ చేయలేదని, ఫలితంగా తాము సీఎన్ జీ బస్సులకు టెండర్లను పిలిచి వాయిదా వేసుకోవాల్సి వచ్చిం దని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్‌రావు అన్నారు. మరో ఏడాది వరకూ గ్యాస్ సరఫరా చేస్తారన్న నమ్మకం కూడా తమకు లేదని ఆయన పేర్కొ న్నారు. భాగ్య నగర్ గ్యాస్ ఏజెన్సీ మాటలు నమ్మి మేడ్చల్, కం టోన్మెంట్, హకీం పేట డిపోలలో పూర్తి స్థాయిలో సీఎన్‌జీ బస్సు లను ఏర్పాటు చేయాలని భావిం చామని, టెండర్లను కూడా పిలిచామని, తీరా గ్యా స్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించక పోవడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు.
ఒక్కో సీ ఎన్‌జీ బస్సుకు అదనంగా అయిదున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అయిన ప్పటికీ గ్యా స్ వినియోగం వల్ల రోజు వారి ఇంధన వ్యయం లో ఆదా ఉంటుందన్న ఉద్దేశంతో సంస్థ సీఎన్‌జీ బస్సులను వీలైనంత ఎక్కువగా ప్రవేశపెట్టాలని భావిస్తుందన్నారు. మొదటి దశలో మూడు డిపోలను పూర్తి స్థాయి సీఎన్‌జీ బస్సు డిపోలుగా మార్చాలనుకున్న ఆర్టీసీ నిర్ణీత సమయంలో సీఎన్‌జీ అందు బాటులోకి వస్తే దశల వారీగా అ న్ని డిపోలను సీఎన్‌జీగా మార్చాలని భావించిం ది. భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సరఫరాలో జాప్యం వల్ల ఆర్టీసీ ప్రణాళి కలన్నీ మారిపోయాయి.
రవాణా కమిషనర్ ప్రకటన ఫలించేనా
జంటనగరాలకు ఆగస్టు మాసాంతానికల్లా సీఎన్‌జీ గ్యాస్ అందుబాటులోకి వస్తుందంటూ ఇటీవల రవాణా శాఖ కమిషనర్ రెమాండ్ పీటర్ ప్రకటన చేశా రు. వాస్తవ పరిస్థితిని చూస్తే 2011 వరకు కూడా పైపులైన్ ద్వారా గ్యాస్ నగర వాసులకు అందే అవకాశాలు కనిపించడం లేదు. శామీర్‌పేట ప్రాంతంలో మద ర్ (తల్లి) సెంటర్‌ను ఇంత వరకు ఏర్పాటు చేయని భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ నగరంలోని అనేక ప్రాంతాలలో డాటర్ (కూతురు) సెంటర్‌లను ఏర్పాటు చే యాల్సిన అవసరం ఉంది. అంతకంటే అత్యంత ప్రధానమైంది పైపులైన్ ఏర్పా టు. ఈ పైపులైన్ ఏర్పాటుకు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలా లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు వరకు నగర వాసులకు పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాలో ఎంత వరకు వాస్తవముందని ప్రశ్నిస్తున్నారు.