* రుణం పొందడానికి యులిప్‌లను ఉపయోగించుకోకూడదని కూడా స్పష్టం చేసింది. (''యులిప్‌లకు ఎలాంటి అప్పు మంజూరు చేయరాద''ంది).
* ఇండివిడ్యువల్ ప్రోడక్ట్‌ల విషయంలో పాలసీ కనీస కాలపరిమితి 5 సంవత్సరాలు ఉండాలని, గ్రూప్ ప్రోడక్ట్‌లను ప్రతి సంవత్సరం పునరుద్ధరించవచ్చంది (రెన్యువల్).
* పింఛన్ లేదా యాన్యుయిటీ ప్రోడక్ట్‌లు మినహా మిగిలిన అన్ని రకాల యులిప్‌లలోనూ అయిదో ఏడాది పూర్తి అయ్యాక పాక్షిక విత్‌డ్రాయల్స్‌ను అనుమతించవచ్చంది.
* యూనిట్ లింక్డ్ పెన్షన్ లేదా యాన్యుయిటీ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే.. పాక్షిక విత్‌డ్రాయల్‌ను అనుమతించరు; పోగయిన ఫండ్ విలువను కాలపరిమితి పూర్తి అయిన తరువాతనే యాన్యుయిటీ (ప్రతి సంవత్సరం చెల్లించే నిర్ణీత మొత్తం)గా మార్పిడికి అనుమతిస్తారు.
* ప్రతి టాప్-అప్ ప్రీమియంకు అలాంటిది చెల్లించిన తేదీ నాటి నుంచి మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. కాంట్రాక్టు చివరి మూడేళ్ల పాటు మాత్రం వాటిని అనుమతించరు.
* సవరించిన నియమాలు రానున్న జులై ఒకటో తేదీ నుంచి అమలవుతాయని ఐఆర్‌డీఏ తెలిపింది.