Tuesday, February 23, 2010

రాష్ట్రం అప్పు రూ.1,22,830 కోట్లు

రాష్ట్రం అప్పు రూ.1,22,830 కోట్లు
ఒక్కో వ్యక్తిపై రూ.14,622
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహించేందుకు ప్రపంచబ్యాంక్‌, ఇతర సంస్థల నుంచి తెస్తున్న అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. శనివారం నాటి బడ్జెట్‌ గణాంకాల ప్రకారం రాష్ట్రంపై ప్రస్తుతం రూ.1,22,830 కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే విశ్లేషణ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ జనాభా 8.40 కోట్లు. అంటే ఒక్కో పౌరుడిపై ఉన్న అప్పు రూ.14,622.65. ఈలెక్కన నలుగురు సభ్యులు గల ఒక కుటుంబంపై రూ.58,490 రుణం ఉంది.