Tuesday, February 23, 2010

అచ్చిరాని లక్ష కోట్ల బడ్జెట్‌లు ..!

అచ్చిరాని లక్ష కోట్ల బడ్జెట్‌లు ..!

హైదరాబాద్‌,మేజర్‌న్యూస్‌: రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష కోట్ల బడ్జెట్‌ తుస్‌ మంది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా బడ్జెట్‌ ఆదాయాలను అతిగా అంచనా వేయడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. నాలుగోసారి కూడా 2010-11 ఆర్థిక బడ్జెట్‌ను రూ. లక్షా13వేల కోట్లుగా ప్రకటించడం విశేషం. 2008-09 లో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 436 కోట్లతో భారీ బడ్జెట్‌ ప్రకటించి తీరా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సవరిం చిన బడ్జెట్‌లో రూ. పది వేల కోట్ల మేరకు కోతలు వేసింది.

బడ్జెట్‌ వాస్తవ అంచానల్లో ఈ కోతలు మరో పది వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఎన్నికల సంవత్సరం కావడంతో సర్కార్‌ గొప్పలకు పోయి బడ్జెట్‌సైజ్‌ను అంచ నాలకు మించి పెంచడంతో రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ డొల్ల తనం బయటపడింది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ సర్కా ర్‌ ఇదే తరహా వ్యూహా రచన చేసింది. బడ్జెట్‌ మాంత్రికుడి గా పేరుగాంచిన కొణిజేటి రోశయ్య తన 15వ బడ్జెట్‌ లోనూ రూ.లక్షా మూడు వేల 485 కోట్లను మరో మారు ప్రకటించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న సంక్షోభ పరిస్థి తులతో 2009-10 పూర్తి బడ్జెట్‌ పూర్తిగా బోల్తాపడింది.

తప్పని పన్నుల వాత..
సర్కార్‌ ఆదాయ అంచనాలు కూడా గణనీయంగా గాడి తప్పడంతో అదనపు ఆదాయం కోసం పన్నుల వాతకు కూడా సిద్ధపడింది. అసలే అధిక ధరల మంటతో పూట గడవడమే కష్టమవుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ లోటును పూడ్చుకోవడానికి వాణిజ్య, వాహన పన్నుల మోతకు పదునుపెట్టింది. ఈ చర్యలతో సర్కార్‌ ఖజానాకు కొంత ఊరట కలిగించానా వాస్తవ బడ్జెట్‌ వ్యయం మాత్రం అంతంతగానే ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 2009-10 సవరణ బడ్జెట్‌ను రూ.99,563 కోట్లుగా ప్రకటించడం గమనార్హం. వాస్తవ బడ్జెట్‌ వ్యయం మేరకు 2009-10 సవరణ బడ్జెట్‌ అంచనాలు 2008-09 వాస్త వ బడ్జెట్‌ వ్యయాని కంటే దిగువనే ఉంటాయని అధికా రులే పేర్కొనడం విశేషం.

వార్షిక ప్రణాళికకూ కోతలే..
దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడిన వార్షిక ప్రళిక బడ్జె ట్‌లకూ భారీగా కోతలు తప్పడం లేదు. ఆర్థిక మాంద్యం, కరువు, వరదలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలతో సర్కార్‌ ఖజానా బక్కచిక్కడంతో ప్రణాళికేతర కేటాయిం పులకు నిధుల కొరత ఏర్పడింది. ప్రధానంగా అప్పులు, వడ్డీలు, జీతభత్యాలు, పలు సంక్షేమ పథాకాల సబ్సిడీలను చెలించాల్సిం ఉండడంతో పెద్ద ఎత్తున ప్రణాళిక కేటాయింపులకు కోతలు తప్పలేదని అధికారులు పేర్కొంటున్నారు. 2008-09లో ప్రణాళిక వ్యయం రూ.48,551 కోట్లుగా అంచనా వేస్తే దీన్ని సవరించిన బడ్జెట్‌లో రూ.41,539 కోట్లుగా ప్రకటించింది. వాస్తవ ప్రణాళిక వ్యయం మాత్రం రూ.32,700 కోట్లుదాటలేదు.

రూ.16 వేల కోట్లకు కోతలు పడింది. 2008-09 బడ్జెట్‌లో వార్షిక ప్రణాళిక కేటాయింపులు రూ.41,539 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొంటే వాస్తవ వ్యయం మాత్రం రూ.30,617 కోట్లు మించలేదు. దాదాపుగా రూ.11 వేల కోట్ల మేరకు కోతలు వార్షిక ప్రణాళికలో చోటుచే సుకు న్నాయి. 2009-10 బడ్జెట్‌లో వార్షిక ప్రణాళికను రూ.36,635 కోట్లుగా నిర్ణయిస్తే రాష్ట్రానికి అంత ఆర్థిక సామర్థ్యంలేదని కేంద్రం వార్షిక ప్రణాళికను రూ.33,537 కోట్లకు కుదించింది. ఇదిలా ఉండగా వాస్తవ వార్షిక ప్రణాళిక వ్యయం సర్కార్‌ ప్రకటించిన సవరించిన అంచ నాల కంటే రెట్టింపు ఉంటుందని అధికారులే పేర్కొనడం విశేషం.

table