2015 నాటికి లక్ష సెకెండ్ హ్యాండ్ కార్ల విక్రయం
నూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్ర సెకండ్ హ్యాండ్ కార్ల విభాగంలో వ్యాపార విస్తరణను చేపట్టనుంది. వచ్చే 2015 సంవత్సరం నాటికి లక్ష యూనిట్ల సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించనున్నట్టు సంస్థ ఇక్కడ తెలిపింది. దీని ద్వారా తమ శాఖలను మరింత విస్తరించనుంది. విపరీతమైన డిమాండ్ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్ల విభాగంలో ఈ ఆర్థిక సంవత్సరం 14లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయని ఎం అండ్ ఎం అధ్యక్షుడు(మానవ వనరులు, కార్పొరేట్ సేవల విభా గం) రాజీవ్ దుబే ఇక్కడ విలేకర్లతో అన్నారు. మహీంద్రా వారి సెకండ్ హ్యాండ్ కార్ల విభాగం సంస్థ అయిన మహీం ద్రా ఫస్ట్ ఛాయిస్ 2008-09 ఆర్థిక సంవత్సరానికి 10, 200 వాహనాలను విక్రయించింది. ఈ ఆర్థిక సంవత్స రానికి 18వేల యూనిట్లను లక్ష్యంగా పెట్టుకోగా 2010 -11 నాటికి దీన్ని రెండింతలు చేసుకునే పనిలో ఎం అండ్ ఎం సంస్థ ఉంది. ఏటా 20శాతం వృద్ధితో సాగుతో న్న ఈ మార్కెట్ లో 2015నాటికి క్ష యూనిట్ల విక్ర యాలను లక్ష్యంగా పెట్టుకున్నామని దుబే తెలిపారు.