విదేశీ లిక్కర్‌కు ప్రోత్సాహం
బెంగళూరు : ఫారెన్ బ్రాండ్ లిక్కర్‌ల వ్యాపారాలకు ఇక్కడి దేశీయ మార్కెట్లో డిమాండు రానుంది. ఇప్పటికే దాదాపు మూడు రాష్ట్రాలు ఫారెన్ బ్రాండ్ లిక్క ర్లపై సుంకాన్ని తగ్గించి తమ విక్రయాలను పెంచుకున్నాయి. ఈ వ్యాపారానికి కర్ణాటకతో పాటు గోవా కూడా సుంకాన్ని తగ్గించింది. యూరోపియన్ యూని యన్ ఒత్తిడితో ప్రస్తుతం విదేశీ బ్రాండ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రాలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆంధ్రరాష్ట్రంలో ఎకై్సజ్ సుంకం పద్ధతుల్లో మార్పు చేయగా, గోవా వంటి రాష్ట్రాల్లో ఎకై్సజ్ సుంకంతో పాటు బ్రాండ్ లేబుల్ల ఫీజు ల్లో కూడా మార్పులు చేర్పులు జతయ్యాయి. ఇక తమిళనాడు, దేశ రాజధాని ఢిల్లీ వంటి రాష్ట్రాలు డబ్ల్యూటీఓ(వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నియమాలు ఉల్లం ఘిస్తున్నాయనే ఆరోపణల్లో ఉన్నాయి.
ఈ నియమాల ప్రకారం విదేశాల నుంచి వ్యాపారాలు జరిపే ఏ సంస్థ అయినా ఇక్కడి మార్కెట్లో తమఉత్పత్తి ముద్రను మార్చుకోవాలి. అంటే దేశీయ మార్కెట్‌లో ఉత్పత్తి అయ్యే లిక్కర్ బ్రాండ్లుగానే వీటి ఉత్పత్తులనూ జమకడతారు. తమిళ నాడు ప్రభుత్వం ఈ విషయంలో తాజాగా అధి కారికంగా కొన్ని విదేశీ లిక్కర్ బ్రాండ్లను నేరుగా రీటైల్ షాపుల్లో విక్రయాలు జరిపేందుకు ఆమోదం తెలిపింది. ఇక ఆంధ్ర, గోవా రాష్ట్రాలు ఫారె న్ బ్రాండ్లపై సుంకాన్ని తగ్గించాయి. ఒకప్పుడు తమిళనాడులో విదేశీ బ్రాండ్ లిక్కర్లను సజావుగానే సప్లై చేశారు. ఇందులో ముఖ్యంగా స్టార్ హోటళ్ళకే నేరు గా డ్యూటీ-ఫ్రీ- ఎంటైటిల్ మెంట్ ద్వారా సప్లై జరిగేది. ఆ తరువాత దేశీయ బ్రాండ్ లిక్కర్ ఉత్పత్తుల విక్రయాలను నియంత్రిం చేందుకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టీఎఎస్ ఎంఎసీ) రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం కొన్ని విదేశీ బ్రాండ్లకు మాత్రమే ఈ కమిటీ అనుమతి నిచ్చింది.
ఈ రకమైన కొత్త ప్రోత్సాహం ద్వారా వ్యాపారపరంగా విదేశీ బ్రాండ్లకు లభ్యత పెరుగు తుందని యాస్‌ప్రి స్పిరి ట్స్ ఎగ్జిక్యూటివ్ అరుణ్‌కుమార్ ఇక్కడ అన్నారు. విదేశీ లిక్కర్ బ్రాండ్లలో ప్రస్తుతం డెవార్స్ విస్కీ, జానీ వాకర్ బ్లాక్, రెడ్ లేబుల్, డాన్ యాంజెల్ టెకిలా, ఫాకొనియర్ బ్రాండీ, గ్రెగూస్ వోడ్కా, సోల్ ది చిలె వైన్స్ వంటివి అనుమతి పొందిన వాటిలో ఉన్నాయి. అయితే ఆంధ్ర రాష్ట్రం ఈ విష యంలో మరింత స్పష్టత ఇవ్వాలని మరో లిక్కర్ రీటైలర్ ఇక్కడ అభిప్రాయ పడ్డారు. లిక్కర్ బ్రాండ్ల డిస్ట్రిబ్యూ షన్‌ను నియంత్రించే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్(ఏపీ బీపీల్)ఎలాంటి మార్పుల నియమాల్ని చేపట్టనుందో చెప్పాలని కోరారు.
విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే గోవా వంటి రాష్ట్రాల్లో ఎకై్స జ్ సుంకంతో పాటు బ్రాండ్ లేబుల్ ఫీజును కూడా అనుకూలమైన స్థాయిల్లో సవరించారు. ఈ రాష్ట్రంలో ఫారెన్ లిక్కర్ ఉత్పత్తిదారులు నేరుగా డిస్ట్రి బ్యూటర్లకే తమ బ్రాండ్లను సప్లై చేసుకునే వీలు కూడా కల్పించారు. ఇక రాజ దాని ఢిల్లీలో ప్రభుత్వం ఫ్లాటు రేటు సుంకాన్ని ఎంఆర్‌పీ రేటు స్థాయికి తీసు కువచ్చినా అక్కడి ఎకై్సజ్ సుంకాలు విదేశీ బ్రాండ్ లిక్కర్లపై ఇంకా అధికంగానే ఉన్నాయి. ప్రస్తుతం రూ.2వేలకు మించని లి క్కర్ బ్రాండ్లకు 30శాతం సుం కాన్ని, రూ. 2వేల కన్నా అధికంగా ఉన్న బ్రాండ్లపై 30శాతంతో పాటు మరో 20 శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు.