Tuesday, February 23, 2010

షేర్ల ట్రేడింగ్ నుంచి 16 మంది డిబార్: సెబి

స్టాక్ మార్కెట్ నియంత్రణ వ్యవస్థ సెబి 16 మందిని షేర్ల ట్రేడింగ్‌నుంచి నిషేధించింది. వీరు ఒక కూటమిగా ఏర్పడి స్టాక్ మార్కెట్లో సర్క్యులర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు తేలటంతో స్టాక్ మార్కెట్లో లావాదేవీలనుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు బహిష్కరించింది. గత సంవత్సరం మార్చి- సెప్టెంబర్ మాసాల మధ్య కాలంలో ఆల్ కార్గో గ్లోబల్ లాజిస్టిక్స్, ఆసియన్‌స్టార్ కో, కెఎస్ఎల్ అండ్ ఇండస్ట్రీస్ మావెన్స్ బయోటెక్, పానరోమిక్ యునివర్సల్, రాశి ఎలక్ట్రోడ్స్, సాట్ ఇండస్ట్రీస్, ఉషదేవ్ ఇంటర్నేషనల్ షేర్లలో ఈ పదహారుగురు కుమ్మక్కయి సర్క్యులర్ ట్రేడింగ్ పాల్పడినట్లు సెబి తన అదేశంలోపేర్కొంది. వీరి డిమాట్ అకౌంట్లను నిలిపి వేయాల్సిందిగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ డిపాజటరీ ర్వీసెస్‌లకు సూచించింది.