రూ. 6 కోట్ల మెర్సిడెస్ బెంజ్
న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ 'ఎస్‌గార్డ్' పేరిట కొత్త లగ్జరీ కారును మార్కెట్‌లో విడుదల చేసింది. ఢిల్లీలో ఈ కారు (ఎక్స్‌షోరూమ్) ధర 6కోట్ల రూపాయలు. క్షిపణులు, పేలుడు ఆయుధాల దాడిని తట్టుకుని నిలవడం దీని ప్రత్యేకత అని కంపెనీ మేనేజ్‌మెంట్ బోర్డ్ సభ్యుడు సుహాస్ కడ్లాస్కర్ చెప్పారు.
దిగుమతి సుంకాలు, ఇతర ప్రత్యేకతల ఆధారంగా తొలి ఆర్డర్ అందుకున్న అనంతరం కారు తుది ధర నిర్ణయిస్తామన్నారు. బిఎండబ్ల్యు కంపెనీకి భారత మార్కెట్‌లో గట్టి పోటీనిచ్చి నంబర్ వన్‌గా ఎదగాలని మెర్సిడెస్ బెంజ్ 2010 సంవత్సరంలో ఏడు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. ఈ ఏడాది 12 వరకు కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి తీసుకురానున్నామని కడ్లాస్కర్ తెలిపారు.