న్యూఢిల్లీ: విప్లవాత్మక 3జి (మూడోతరం) మొబైల్ సర్వీసులందించేందుకు దోహదపడే స్పెక్ట్రమ్ వేలం విషయంలో ఎంతో కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ ఎట్టకేలకు తొలగింది. ఈ వారాంతంలో 3జి స్పెక్ట్రమ్ బిడ్ డాక్యుమెంట్ల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం సోమవారం నాడు ప్రకటించింది. పొటెన్షియల్ బిడ్డర్ల నుంచి దరఖాస్తులను కోరుతూ టెలికాం డిపార్ట్‌మెంట్ (డాట్) ఈ వారాంతంలో నోటీస్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ (ఎన్ఐఎ)ను జారీ చేయనున ్నట్లు టెలికాం శాఖ మంత్రి ఎ రాజా తెలిపారు.
వేలం ప్రక్రియకు 40-45 రోజులు పడుతుందని ఆయన చెప్పారు. దీనిని బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో వేలం మొదలయ్యే అవకాశాలు లేవని స్పష్టమైంది. ఎన్ని స్లాట్ల వేలం నిర్వహించేది ఇజిఒఎం నిర్ణయం మేరకు ఉంటుంది. దేశ వ్యాప్తంగా చేపట్టే ్పెక్ట్రమ్ వేలంలో ముగ్గురు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లను, కొన్ని సర్కిళ్లలో నలుగురు ప్రైవేట్ ఆపరేటర్లు కూడా వేలంలో పాల్గొనేందుకు ఇజిఒఎం సమ్మతించింది.
మొబైల్ నంబర్ పోర్టబులిటీ మళ్లీ వాయిదా
దేశంలో మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పి) సర్వీసుల అమలుకు మరో రెండు నెలలు పట్టనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ జాప్యం జరుగుతోందని ప్రభుత్వం పేర్కొంది. వచ్చే మే నెల చివరి నాటికి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆపరేటర్ మారినా అదే మొబైల్ నంబర్ కొనసాగే వెసులుబాటు ఉండటాన్నే ఎంఎన్‌పిగా వ్యవహరిస్తారు.
కాగా ఎంఎన్‌పి అమలు వాయిదా పడటం ఇది మూడోసారి. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ 31నాటికి ఎంఎన్‌పి సర్వీసులను టెలికాం కంపెనీలు అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. కానీ అందుకు అనుగుణంగా టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడింగ్ చేసుకోకపోవడంతో ఈ గడువును మార్చి 31కు పెంచింది. తరువాత బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కోరిక మేరకు గడువు మళ్లీ వాయిదా పడింది.