బడ్జెట్ పదజాలం
దేశ దిశా నిర్దేశాన్ని చూపించే బడ్జెట్ ఎంతో క్రియాశీలకమైనది. ప్రత్య క్షంగా, పరోక్షంగా ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే కేంద్ర బడ్జెట్‌ను ఈ నెల 26వ తేదీ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతున్నారు. ప్రస్తుత బడ్జెట్ వాతావరణ సందర్భంగా కనిపించి, విని పించే పదజాలానికి సంబంధించిన అవగాహన పాఠకులలో కల్పించ డానికి వాటి అర్థాలను ఇక్కడ వివరిస్తున్నాము.
ఆర్థిక సంవత్సరం: దీనినే మదింపు సంవత్సరంగా కూడ పిలుస్తారు. ప్రతి ఏడాది ఏఫ్రిల్ 1వ తేదీ నుండి తర్వాత ఏడాది మార్చి 31 తేదీ వరకు ఉన్న 12 నెలల కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పిలుస్తారు.
ఆర్థిక విధానం (ఫిస్కల్ పాలసీ): పన్నులు విధించడానికి, రుణాలు సేకరించడానికి, నిధులు వ్యయం చేయడానికి కేంద్రం తనకు ఉన్న అధికా రాలను ఉపయోగించి ఆర్థిక అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొం దించడానికి కృషి చేయడం.
నియంత్రిత ధరలు: ధాన్యం ధరలను మార్కెట్ శక్తుల దయా దక్షిణ్యా లకు వదిలివేయ్యకుండా మద్ధతు ధర కల్పించి రైతులను అదుకునేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఎ డ్వారాలమ్ టాక్స్: విలువను బట్టి విధించే పన్ను. సరుకుపైన విధిం చే నిర్ణీతమైన పన్ను కాకుండా వస్తువు విలువ బట్టి విధించే పన్ను ఉదాహర ణకు ఒక వస్తువు ధర 50 రూపాయలుగా నిర్ధారిస్తే, ఆ ధరలో కొంత శాతా న్ని పన్ను రూపేణ వసూలు చేస్తారు. ఇది ధరను బట్టి మారుతూ ఉంటుంది.
సమష్టి డిమాండ్: ఒక ఆర్థిక వ్యవస్థలో సేవలు, ఉత్పత్తులపై చేసే మొత్తం ఖర్చు. వినియోగదారులు చేసే ఖర్చు, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం, ఎగుమతులపై చేసే వ్యయం అన్నీంటిని కలిపి అందులోంచి సరుకులు, సేవల దిగుమతులపై చేసిన వ్యయాన్ని తీసివేస్తే సమష్టి డిమాండ్ వస్తుంది.
సమిష్టి సరఫరా: మొత్తం సరుకులు, సేవలు దీని కిందికి వస్తాయి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులకు అందుబాటులో ఉండే మొత్తం సరుకులు, సేవలు.
వార్షిక ఆర్థిక పత్రం: ఏఫ్రిల్ 1తో మొదలై మార్చి 31తో ముగిసే ప్రతి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఈ పత్రాన్ని రూపొందించి పార్లమెంట్‌కు సమర్పించవలసి ఉంటుంది. ఇది బడ్జెట్ వివరాల ప్రధాన పత్రం ప్రభుత్వ వసూళ్ల చెల్లింపులను ఆర్థిక పత్రం ప్రధానంగా మూడు వేరు వేరు ఖాతాలలో చూపుతుంది. మొదటిది సంచిత నిధి, రెండవది అత్యవసర నిధి మూడు ప్రభుత్వ ఖాతా.
వార్షిక ప్రణాళిక: రాష్ట్రం కేంద్ర ప్రణాళిక సంఘంతో చర్చించి రానున్న ఆర్థిక సంవత్సరానికి రూపొందించే కార్యాచరణ ప్రణాళిక . రాష్ట్రం ఆదాయ వనరులు, ఖర్చులు అంచనా వేసి రానున్న సంవత్సరకాలంలో ఏయే వనరుల నుంచి ఎన్ని నిధులను సమీకరించుకోవాలో, ఏయే రంగాల్లో ఎంతా పెట్టుబడి పెట్టాల్లో సూచించే ప్రణాళిక.
దిగుమతుల కుమ్మరింపు వ్యతిరేక చట్టం
విదేశాల నుంచి దిగుమతులు నిరుత్సాహ పరచడం కోసం తీసుకునే చర్య లు. దిగుమతులపై ఆంక్షలు, అదనపు సుంకాలు విధించడాన్ని అనుమతించే చట్టం. విదేశీ ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా, కారు చౌకగా తమ మార్కెట్‌లోకి వచ్చి పడి స్వదేశీ పరిశ్రమలు దెబ్బతినకుండా చూడడం కోసం ఇటువంటి విధానాలు అనుసరిస్తారు.