అక్షరాలా ఆరు కోట్ల కారు!
న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ లైమోసిన్ ఎస్-గార్డ్ కారును భారత్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర అక్షరాల రూ.ఆరు కోట్లు. ఇది దేశంలోనే అతి ఖరీదైన కారుగా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.పేలుడు పదార్ధాల నుంచి కూడా ఎక్కువ రక్షణాత్మకంగా ఉండేలా దీనిని ఎస్ 600 ప్లాట్‌ఫాం నిర్మించారు. 12 సిలిండర్లతో కూడిన 5.5 సీసీ పెట్రోలు ఇంజిన్‌తో ఈ కారును తయారు చేశారు. భారీ విస్పోటనాలను కూడా తట్టుకొని నిలిచేలా దీనిని రూపొందించినట్లు సంస్థ బోర్డులోని భారత సభ్యులు సుహాస్ కడ్‌లాస్కర్ తెలిపారు. ఎస్-గార్డ్ ప్రారంభధర రూ.5.5 కోట్లని వినియోగదారు కోరుకొనే సౌకర్యాలు, దిగుమతి సుంకం బట్టి ధరలో మార్పులు ఉంటాయని ఆయన అన్నారు. ఈ కారు పూర్తి స్థాయిలో జర్మనీలోనే తయారై, భారత్‌కు దిగుమతి అవుతుందని ఆయన వివరించారు.