చైనా, మెక్సికో పెన్సిలిన్‌పై దిగుమతిసుంకం
దేశీయ పరిశ్రమలను రక్షించడం కోసం చైనా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి అవుతున్న పెన్సిలిన్‌పై దిగుమతి సుంకం విధించనున్నారు. పెన్సిలిన్-జి పొటాషియంపై బిలియన్ ఆక్స్‌ఫోర్డ్ యూనిట్లకు (బీఓయూ) 18.54 డాలర్లు (రూ.833); 6-అమినో పెనిసిలానిక్ యాసిడ్‌పై 2.10 డాలర్లు (రూ.97) సుంకం విధిస్తారని వాణిజ్య శాఖ అధికారి న్యూఢిల్లీలో తెలిపారు. వడోదరాకు చెందిన అలెంబిక్, చెన్నైకు చెందిన సదరన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్&అల్త్లెడ్ డ్యూటీస్ (డీజీఏడీ) సూచన మేరకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వివరించారు.
మే ఆఖరులోపు నెంబరు పోర్టబిలిటీ
మొబైల్ నెంబర్ల పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ప్రక్రియ మే ఆఖరులోపు అమల్లోకి వస్తుందని భావిస్తున్నట్లు టెలికం శాఖ మంత్రి ఏ రాజా ఢిల్లీలో చెప్పారు. భద్రతా కారణాల వల్లే ఆలస్యం అవుతున్నట్లు ఆయన వివరించారు. చెన్నై, బెంగళూరుల్లో మే ఆఖరుకు అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. ఎంఎన్‌పీ అమలయితే, వినియోగదారుడు తన సర్వీస్ ప్రొవైడర్‌ను మార్చుకున్నా, నెంబరు మారదు.