రాష్ట్రంతో త్వరలో ఎంటిఎస్ మొబైల్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మరో రెండు, మూడు నెలలలో రాష్ట్రంలో మరో మొబైల్ సంస్థ తన సేవలను అందించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో బిఎస్ ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, ఐడియా, రిలయన్స్, టాటాటెలీ, వోడాఫోన్, యూనినార్ వంటి సంస్థలు మొబైల్ సేవలు అందిస్తుండగా తాజా ఈ రంగం లోకి సిస్టిమా శ్యామ్ అనే సంస్థ ప్రవేశిస్తోంది. ఎంటిఎస్ బ్రాండ్ పేరిట సిడి ఎంఏ తరహా సెల్యులర్ సేవలు మరో రెండు, మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టనుంది. రష్యాకు చెందిన ఎల్‌ఎస్‌ఇ, ఎస్‌ఎస్‌ఏ సంస్థలు సంయు క్తంగా నెలకొల్పిన సిస్టిమా, భారత్‌కు చెందిన శ్యామ్ గ్రూప్ టెలీ సర్వీసెస్ (ఎస్‌ఎస్‌టిఎల్)ను ప్రారంభించాయి. ఇందులో సిస్టిమాకు 73.71 శాతం వాటా ఉండగా, శ్యామ్ గ్రూప్‌కు 23.79 శాతం వాటా ఉంది.
మిగిలిన రెండు శాతం పబ్లిక్ ఈక్విటీ ఉంది. దేశంలోని 22 సర్కిళ్ళలో మొబైల్ స్పెక్ట్రమ్ లైసెన్స్ పొందిన ఎస్‌ఎస్‌టిఎల్ ఇప్పటికే రాజస్థాన్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, కోల్‌కత, ఢిల్లీలలో సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో మరికొద్ది రోజులలో తన సేవలు ప్రారంభిస్తున్న సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌ఎస్ టిఎల్ ప్రెసిడెంట్, సిఇవో స్వెవలోద్ రోజ్నోవ్, ఆంధ్రా, కర్ణాటక సర్కిళ్ళ సివోవో సురేష్ ఎస్ కుమార్ తమ వ్యాపార విశేషాలు అందించారు.
2008 డిసెంబర్‌లో రష్యాకు చెందిన ఎంటిఎస్ ను బ్రాండ్‌ను భారత్‌లో ప్రవేశపెట్టి మొబైల్ సేవలు అందించేందుకు లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకు న్నామని, రష్యాలోని శక్తివంతమైన వంద బ్రాండ్‌లలో ఎంటిఎస్ కూడా ఒకట ని, రాజస్థాన్‌లో తమకు అనతికాలంలోనే లక్ష మంది ఖాతాదారులు చేరువ య్యారని, దశలవారీగా దేశవ్యాప్తంగా తమ మొబైల్ సేవలు విస్తరిస్తామని చెప్పారు. తాము సేవలు అందిస్తున్న అన్ని సర్కిళ్ళలో 30 లక్షల మంది ఖాతా దారులు తమ నుండి నాణ్యతాయుతమైన సేవలు అందుకుంటున్నారని, త్వర లో స్మార్ట్‌ఫోన్లను కూడా విడుదల చేస్తామని, వీటి ధర 5000-30,000 రూ.ల వరకు ఉంటాయని తెలిపారు.
ఆంధ్రాలో ప్రారంభించనున్న సేవలతో మొత్తం దక్షిణాదిలో తమ కవరేజ్ ఉంటుందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల భౌగోళిక, సాంస్కృతిక, ప్రజల ఆదాయ పరిధులను బట్టి ఆకర్షణీయంగా టారిఫ్‌లను రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందుగా నూతనత్వంతో కూడిన భారీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో సంస్థ కార్పోరేట్ కమ్యూనికేషన్ల డైరక్టర్ వి.కె.చెరియన్ కూడా పాల్గొన్నారు.