Monday, February 22, 2010

మళ్ళీ అంకెల గారడీ

మళ్ళీ అంకెల గారడీ
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : రోశయ్య రికార్డ్‌ బడ్జెట్‌ మరోసారి అంకెల గారడీని తలపించింది. సంక్షేమం, సామాజిక ఫించ న్లు, విద్యా, వైద్య-ఆరోగ్యం, గ్రామీణ, పట్ట ణాభివృద్ధి, జలయజ్ఞం తదితర రంగాలకు పెద్ద పీటవేస్తూ రాష్ట్ర ప్రజలను ఆకర్షించే విధంగా తన 16వ బడ్జెట్‌ను ఆయన ప్రవే శపెట్టారు. వాస్తవ ఆదాయ అంచనాలతో సంబంధం లేకుండా ఆయన మరోసారి భారీ బడ్జెట్‌ను రాష్ర్ట ప్రజలకు అందిం చడం విశేషం. గత బడ్జెట్‌లు నిధుల లేమితో బోల్తాపడినప్పటికీ... 2010-11 బడ్జెట్‌ను రూ. లక్షా 13 వేల కోట్లను ప్రకటించడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి..రూ. లక్షా మూడు వేల కోట్ల బడ్జెట్‌లోనూ సవరించిన అంచనాల మేరకు బడ్జెట్‌ వ్యయాన్ని రూ. 99,563 కోట్లకు కుదించారు.

మొత్తంగా 2009-10 సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో రూ. 3,922 కోట్ల మేరకు మాత్రమే కోతలు పడ్డాయి. ఇదిలా ఉండగా వాస్తవ పరిణామాల రీత్యా 2009-10 బడ్జెట్‌లో బడ్జెట్‌ వ్యయం రూ. 75 వేల కోట్లు కూడా దాటదని అధికారులే పేర్కొంటున్నారు. 2008-09 బడ్జెట్‌ను రూ. లక్షా 436 కోట్లుగా ప్రకటిస్తే.. సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో దీన్ని రూ. 90 వేల 891 కోట్లుగా ప్రకటించడం జరిగింది. వాస్తవ బడ్జెట్‌ వ్యయం మాత్రం రూ. 80 వేల 467 కోట్లు మించలేదు. దాదాపు 2008-09 బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్ల మేరకు కోతలు చోటుచేసుకోవడం విశేషం.

లక్ష్యానికి దూరంగా ప్రణాళిక లక్ష్యాలు
2008-09లో ప్రణాళిక వ్యయం రూ. 48,551 కోట్లుగా ప్రకటిస్తే... సవరించిన అంచనాల్లో దీన్ని రూ. 41,539 కోట్లుగా పేర్కొనడం జరిగింది. వాస్తవ ప్రణాళిక వ్యయం రూ. 32,700 కోట్లు దాటలేదు. 2009-10 ప్రణా ళిక బడ్జెట్‌లోనూ ఇంతకన్నా దయనీయ పరిస్థితి చోటుచేసుకుంది. బడ్జెట్‌లో ప్రణాళిక పద్దు వ్యయం రూ. 40,184 కోట్లుగా ప్రకటిస్తే.. దీనిలో కేంద్ర ప్రభు త్వమే మూడు వేల కోట్లకుపైగా కోతలు వేసింది. ప్రస్తుత బడ్జెట్‌ సవరించిన అంచనాల్లో దీన్ని రూ. 36,496 కోట్లుగా పేర్కొన్నారు. వాస్తవ ప్రణాళిక వ్యయం మాత్రం రూ. 28 వేల కోట్లు దాటడమే కష్టమని అధికారులే పెదవి విరుస్తున్నారు. 2010-11 బడ్జెట్‌లో కూడా ప్రణాళిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభు త్వం రూ. 40,313 కోట్లుగా ప్రకటించడం గమనార్హం.