Tuesday, February 23, 2010

సత్యం కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చెల్లదు

సత్యం కేసు విచారణకు
ప్రత్యేక కోర్టు ఏర్పాటు చెల్లదు
హైకోర్టులో నిందితుల పిటిషన్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సత్యం కేసు విచారణకు అదనపు చీఫ్‌మెట్రోపాలిటన్‌ ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేస్తూ ఇచ్చిన 110, 269 నెంబరు జీవోలకు వ్యతిరేకంగా సోమవారం హైకోర్టులో పిటిషన్‌దాఖలైంది. ఈకేసులో నిందితులుగా జైలులో ఉన్న సత్యం మాజీసిబ్బంది జి.రామకృష్ణ, డి.వెంకటపతిరాజు, సీహెచ్‌.శ్రీశైలంలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. భారత శిక్షాస్మృతిలో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలు లేవని చెప్పారు. ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 16 ప్రకారం ప్రభుత్వం ఎక్కడ కావాలంటే అక్కడ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులు ఏర్పాటు చేయవచ్చని, హైకోర్టును సంప్రదించిన తర్వాత నోటిఫికేషన్‌ ద్వారా మాత్రమే జరగాలని పేర్కొన్నారు.