బిగ్‌బజార్‌లో మినుట్‌మెయిట్ నింబూఫ్రెస్
హైదరాబాద్: బిగ్‌బజార్, ఫుడ్‌బజార్‌ల కోసం కోకకోలా కంపెనీ ప్రత్యేకంగా మినుట్‌మెయిట్ నింబూ ఫ్రెష్‌ను రూపొందించింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా ఏడు నగరాల్లో 96 బిగ్‌బజార్, ఫుడ్‌బజార్ స్టోర్‌లలో ఇది ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు అందుబాటులో ఉండనుంది. శుబ్ ముహూరత్ కార్యక్రమం కింద బిగ్ బజార్ ప్రతీ నెలా తన వినియోగదారులకు నూతన ఉత్పాదనలను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ ఉత్పాదనను ఆవిష్కరించారు. గతంలో బిగ్‌బజార్ ఇదేరీతిలో టేస్టీ ట్రీట్, మైల్‌స్టోన్ స్టోర్లే బ్యాగ్స్ లాంటి వాటిని కూడా వినియోగదారులకు అందించింది.
స్టింగ్ దుస్తుల విక్రయాల్లో వృద్ధిహైదరాబాద్: తమ బ్రాండ్ దుస్తుల విక్రయాల్లో 60 శాతం వృద్ధి సాధించినట్లు స్టింగ్ సంస్థ తెలిపింది. వార్షిక విక్రయాల్లో భాగంగా 60 శాతం వరకు డిస్కౌంట్‌తో క్యాజువల్స్, ఫార్మల్, సెమీ ఫార్మల్‌లో సరికొత్త రకాల జీన్స్, షర్ట్స్, నిక్కర్స్ లాంటివాటిని హైదరాబాద్ లోని బంజారాహిల్స్ సిటీసెంటర్‌లో విక్రయిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ సంస్థకు చెనై్న, బెంగళూరులలో తయారీ కేంద్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలతో పాటు మధ్యప్రాచ్యంలో కూడా విక్రయ కేంద్రాలున్నాయి. మాతృసంస్థ బ్లేజ్ తయారు చేసిన దుస్తులను స్టింగ్ విక్రయిస్తోంది. వేసవి కోసం ప్రత్యేక దుస్తులను విక్రయిస్తున్నట్లు స్టింగ్ తెలిపింది.