బడ్జెట్.. ఓ సవాల్ !
అందరి చూపు బడ్జెట్‌పైనే... ఇప్పట్లో ఎన్నికలు లేనందున ఇది జనాకర్షకంగా ఉండదనే చెప్పవచ్చు అదే సమయంలో ఇటీవలి వరకు మాంద్యం కొనసాగిన నేపథ్యంలో వడ్డింపులూ ఎక్కువగా ఉండక పోవచ్చు అటు ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ.. ఇటూ పరిశ్రమలపై భారం వేయకుండా బడ్జెట్ రూపొందించడం ప్రణబ్ దాదాకు నిజంగా ఓ పెద్ద సవాలే! అనుభవశాలి, ప్రజ్ఞావంతుడు అయిన ప్రణబ్ ఈ గడ్డు సమస్యను తేలికగానే అధిగమిస్తారన్నది ఆర్థిక నిపుణుల భావన.
నూఢిల్లీ :
గత 2009 సంవత్సరంలో లక్ష్యం వృద్ధిని పెంచే దిశగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారి పలు రంగాలు మెరుగు పడుతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం 2009-10లో పరిశ్రమలు, సేవల రంగాలు 8శాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి. గడిచిన కొన్ని మాసాల్లో ముఖ్యంగా వాహన రంగం, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్ వంటి పలు రంగాలు వృద్ది దిశగా నడు స్తున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గత ఆర్థిక సంవత్సరం 2009-2010 బడ్జెట్‌లో సుమారు 45 ముఖ్యప్రకటనలు చేశారు. ప్రకటించిన అన్ని వాగ్దానాలు అన్నీ పూర్తికాకపోయినా కొన్ని ముఖ్యమైన వాగ్దానాలను ఆయన నిలబెట్టుకున్నారు. ప్రకటించిన 45 ముఖ్య నిర్ణయాల్లో 36వరకు అమల్లోకి తేగలిగారు. ఇక పట్టించుకోలేక పక్కన పెట్టిన నిర్ణయాల్లో భార త ఇన్‌ఫ్రా సంస్థ కోసం చేపట్టిన ’టేక్ అవుట్ ఫైనాన్సింగ్ స్కీం’ ఒకటి. దీని ద్వారా ఇన్‌ఫ్రా రంగాలకు రుణసదుపాయాలు కల్పించాలనుకున్నా, ప్రస్తుతం ఆ నిర్ణయం ఇంకా కాగితం మీదే ఉంది.
ఇక ప్రణబ్ చేసిన పెద్ద తప్పిదాల్లో ఒకటి ఆర్థిక విధానాల సంస్కరణలు. గడువు తేదీ వరకు కూడా ఆయన డైరక్ట్ ట్యాక్స్ కోడ్‌ను ప్రవేశపెట్టలేకపోయారు. ఈ విధానంపై 2009 పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని కూడా వాగ్దానం చేసి నిలబెట్టుకోలేకపోయారు. ఇక గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) విషయంలో కూడా ఈ ఏడాది ఏప్రిల్ వరకు న్యాయపరమైన పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ విజయవం తంగా అమల్లోకి తీసుకురాగలిగిన కొన్ని పనుల్లో చెప్పుకోదగ్గవి కూడా ఉన్నాయి. వ్యవసాయ రుణాల మాఫీ పథ కం, జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెనీవల్ మిషన్ కింద ఎగుమతి దారులకు అధికంగా నిధులను కేటాయించ గలిగారు. నేషనల్ మిషన్ ఆఫ్ ఫిమేల్ లిటరసీ ద్వారా పన్ను చెల్లింపులను సులభతరం చేశారు.
చేపలు పట్టేవారికి, హాండ్లూమ్, పవర్‌లూమ్ రంగాలకు చేయూత వంటివి చేపట్టి ప్రశంసలను అందుకున్నారు. ఇక ప్రణబ్ చేపట్టిన అతి ముఖ్యమైన విధాన కార్యక్రమాల్లో పోషక ఆధా రిత సబ్సిడీ పథకం ఒకటి. దీని ద్వారా ఫర్టిలైజర్ సబ్సిడీలపై ప్రభుత్వ భారం తగ్గించగలిగారు. పబ్లిక్ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడుల పాలసీ (గవర్నమెంట్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ)తో పాటు దేశ ప్రజల కోసం ఆన్‌లైన్ డేటాబేస్ పద్ధతి ద్వారా శాశ్వత గుర్తింపు కార్డులను(యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) రూపొందించే ప్రక్రియను అమల్లోకి తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు ప్రణబ్ రూపొందించే బడ్జెట్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
ఉద్దీపనల ఉపసంహరణ..
ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో విశ్లేషకుల సంే తాల ప్రకారం, మార్చి నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవ త్సరంలో దేశీయ ఉత్పత్తులపై 6.8శాతం సుంకం విధించే వీలుంది. దీంతో పాటు గత ఏడాది మాంద్య పరిస్థితుల నుండి బయట పడటానికి కొని రంగాలకు ప్రకటించిన ప్రోత్సాహక ప్యాకేజీలను కూడా ఉపసంహరిం చనున్నారు. ప్రస్తుతం ఉద్దీపన ప్యాకేజీలను అందుకున్న అన్ని రంగాలు మళ్ళీ కుదుటపడ్డాయా అంటే లేదనే చెప్పాలి. ఇందులో కేవలం వాహన, సిమెంట్, కన్జూమర్ ఉత్పత్తులు, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలు మాత్రమే వృద్ధిలోకి వచ్చాయి. ఉపసంహరణ కేవలం వృద్ధి చెందుతున్న రంగాల నుంచే రాబట్టాలనేది విశ్లేషకుల సూచన.
ఎలా ఉండబోతోంది..
క్లిష్టమైన సమస్యలపై నిర్ణయాలు తీసుకునేందుకు ఆయన కొంత మంది ముఖ్య ఆర్థిక సలహాదారులను కూడా నియమించుకు న్నారు. ఈ సభ్యుల్లో డాక్టర్ సి.రంగరాజన్, మాంటెక్ సింగ్ అహ్లువాలియా వంటి ముఖ్యమైన వారు ఉన్నారు. ఆర్థిక ద్రవ్య లోటు వంటి క్లిష్టతరమైన సమస్యలను ఆయన రంగరాజన్ సల హాలను అమలుపరుస్తారని అంటారు. ఈ కారణంగానే ప్రస్తుత బడ్జెట్‌ను జీడీపీ ద్రవ్యలోటు 6.0శాతానికి తీసుకురావచ్చని విశ్లేషకుల అంచనా. అయితే మాంటెక్ సింగ్ ఇచ్చిన 6.8 శాతం ద్రవ్యలోటు సూచనను కూడా అమలు చేయవచ్చు.
గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టేప్పుడు ప్రణబ్ ముఖర్జీను పరిశీలస్తే ఆయన 21వ శతాబ్దపు ఆర్థిక మంత్రి పదవికి పూర్తిగా సిద్ధపడలేదని అర్థమైంది. ప్రణబ్‌ను 1980ల్లో చూసిన వారు మాత్రం ముందస్తు ప్రణాళికలు వేయడం, పరి శ్రమల ఆధారిత కొత్త కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిం చేవారని చెబుతారు. అది కేవలం అప్పటి ఎన్నికల గిమ్మిక్కేనని తేలికగా తీసుకున్న వారూ ఉన్నారు. మొత్తానికి అగ్ని పరీక్షలాంటి బడ్జెట్ ప్రణాళికను సిధ్దం చేసుకున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు లేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణబ్ ’ది బెస్ట్’ అనిపించు కుంటారా..? అనేది వేచిచూడాల్సిందే.
1984 సంవత్సరంలో యూరో-ఎకానమీ అప్పట్లో ప్రణబ్ ముఖర్జీని ప్రపంచంలోని ఐదు మంది ఉత్తమ ఆర్థికమంత్రుల్లో ఒకరిగా చేర్చింది. నాటి ప్రధానమంత్రి ఇంది రాగాంధీ అప్పట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగలిగేలా చేశారు. ఇలా ఆయన ఖాతాలో ఎన్నెన్నో విజయాలూ చోటు చేసుకున్నాయి. తాజా బడ్జెట్ కూడా అలా అవుతుందో, కాదో ఎదురు చూడాల్సిందే.
నెరవేరని వాగ్దానాలు
సామాన్యుడి బడ్జెట్‌లో ప్రణబ్ ముఖర్జీ తాను చేసిన వాగ్దానాలు కొన్నింటిని నిలబెట్టుకోలేకపోయారు. రాష్ట్రీ య ఉపాధి హామీ పథకం కింద రోజుకు వంద రూపా యల వేతనాన్ని ప్రవేశపెట్టాలనుకున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఏదీ కూడా ఇప్ప టి వరకు సిద్ధం కాలేదు.ఆమ్ ఆద్మీ కొరకు చేపట్టిన మూడు రూపాయలకు కిలో చొప్పున 25 కేజీల బియ్యం లేదా గోధుమలు కూడా అందించ లేకపోయారు. ఫుడ్ సెక్యూరిటీ బిల్లు పూర్తికానందున ఈ పనులను వాయిదా వేసుకున్నారు. ఇలా చెప్పుకుంటే ఈ వరుసలో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన పథకం కూడా ఉంది.