Tuesday, February 23, 2010

ఎగుమతుల సుంకం ఎత్తివేత అనుమానమే

ఎగుమతుల సుంకం ఎత్తివేత అనుమానమే

exportsన్యూఢిల్లీ: దేశీయ ఎగుమతులు ఆశించినదానికన్నా నత్తనడకన సాగుతున్నాయని ప్రధాన మంత్రి ఆర్థికసలహా మండలి ఇక్కడ తెలిపింది. సుమారు 7.77కోట్ల రూపాయల ఎగుమతు లను 2009-2010 సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నా అంత ఆశాజనకంగా ఎగుమతుల వ్యాపారం సాగట్లేదని పీఎంఈఎసీ తెలిపింది. దిగుమతులు మాత్రం ఈ త్రైమాసికానికి అంటే జనవరి నుంచి మార్చి మాసానికి 13.6కోట్ల వ్యాపారాన్ని నమోదు చేశాయని తెలిపింది. ఈ బడ్జెట్‌లో ధరల పెరుగుదలకు సంబంధించి, సెంటర్‌ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌తో పాటు సర్వీస్‌ ట్యాక్స్‌లను ప్రస్తుత, క్రితం నమోదైన ధరల స్థాయిల్లో చేర్చాలని కోరుతోంది. సర్వీసుల ట్యాక్‌ కవరేజ్‌ను కూడా విస్తృతపరచాలని కోరింది. భవిష్యత్‌లో ఎగు మతి సుంకాలపై ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది.

9.8 శాతంగా జీడీపీ గణాంకాలు ఉంటే వాణిజ్య ద్రవ్యలోటు నికర మిగులు రూ.4.5కోట్లుగా ఉండవచ్చని తెలి పింది. ఫండ్‌ మార్పిడిల్లో బలమైన వృధ్దితో పాటు సర్వీసు సేవల ఆధారిత ఎగుమతులు మళ్లీ పుంజుకోవడంతో 2009-2010 పెట్టుబడి నిధులు దేశీయంగా 48.5బిలియన్‌ డాల ర్లుగా ఉండవచ్చు. ఇది వచ్చే ఏడాదికి మరింత ఆశాజనంగా ఉండగలదని కమిటీ తెలి పింది. ప్రస్తుత సంవత్సరం ఆర్థిక వృద్ధి 8.2శాతం ఉంటుందనే ఆశావాహం పీఎంఈఎసీ వ్యక్తం చేస్తున్నా, వృద్ధి చెందుతున్న దేశాల గురించి సానుకూలమైన వార్తలు లేవని చెబుతోంది.