Tuesday, February 23, 2010

మార్కెట్‌లోకి మెర్సిడస్‌ ఎస్‌-గార్డ్‌

మార్కెట్‌లోకి మెర్సిడస్‌ ఎస్‌-గార్డ్‌

s-cardన్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఖరీదైన కారు ఎస్‌-గార్డ్‌ను మెర్సిడస్‌ బెంజ్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎస్‌600 రకానికి చెందిన ఈ కారు అదే రకానికి చెందిన మేబాచ్‌ (రూ. 5.5 కోట్లు) కన్నా ఖరీదైంది. దీని ఖరీదు రూ. 6 కోట్లు. బాలిస్టిక్‌, ఇతర ఆయుధాల దాడులను తట్టుకోగలుగుతుంది. 12 సిలిండర్‌ 5.5 సీసీ పెట్రోల్‌ ఇంజన్‌తో నడుస్తుంది. దీన్ని ప్రధానంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, ప్రముఖులను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.