Wednesday, February 22, 2012

మ్యూచువల్ ఫండ్స్ అంటే…

మ్యూచువల్ ఫండ్స్ అంటే…
అనేకమంది పెట్టుబడిదారుల నుండి డబ్బుని సేకరించి, జమచేసిన మొత్తాన్ని వృత్తిపరంగా నిర్వహిస్తూ, ఆ డబ్బును షేర్లు, డిబెంచర్లు, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీస్‌లలో సామూహిక పెట్టుబడి పెట్టడమే మ్యూచువల్ ఫండ్ అని చెప్పవచ్చు. పోగుచేసిన మొత్తంతో క్రమబద్ధంగా పెట్టుబడి చేయడానికి మ్యూచువల్ ఫండ్ కు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. అందుకోసం వారు కొంత కమీషన్ తీసుకుంటారు.
ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది.
సామన్యంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే కేవలం షేర్లలోనే పెట్టుబడి పెడతారనుకోవడం కేవలం అపోహ మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్ ఋణ పత్రాలలో, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో కూడా పెడతాయి. అందువల్ల షేర్ల ద్వారా వచ్చే రిస్క్‌ని గణనీయంగా తగ్గించుకుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బుని మొత్తం షేర్లలోనే పెట్టదు. అందులో 50% షేర్లలో కొనడం, మిగతాది ఋణపత్రాల్లో పెట్టడం వల్ల మన రిస్క్ గణనీయంగా తగ్గే అవకాశం వుంది.
ఒక్కో మ్యూచువల్ ఫండ్ ఒక్కో ట్రస్ట్‌గా ఏర్పడి ఎంతోమంది మదుపుదారుల నుండి డబ్బుని సేకరించి వారి తరపున పెట్టబడులను నిర్వహిస్తాయి. ఇలా వచ్చిన పెట్టుబడులనే నిధి(ఫండ్) గా వ్యవహరిస్తారు. అందుకే వాటికి మ్యూచువల్ ఫండ్ (సమిష్టి నిధి)గా షేరు వచ్చింది.
ఒక్కో మ్యూచువల్ ఫండ్ ఒకో స్కీమ్ ద్వారా డబ్బుని సమీకరిస్తుంది. ఒక మ్యూచువల్ ఫండ్ కేవలం ప్రైమరీ మార్కెట్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తామని, మరో ఫండ్ కేవలం షేర్లలోనే (ఋణ సాధనాలల్లో కాకుండా) చేస్తామని, ఇంకో ఫండ్ కొంత డబ్బుని షేర్లు, మిగతా డబ్బుని ఋణ సాధనాలలో ఇన్వెస్ట్ చేస్తామని ప్రజల దగ్గర నుండి పెట్టుబడులను సమీకరిస్తాయి. ఏ రకపు స్కీమ్‌ని ఎన్నుకోవాలో ప్రజల పెట్టబడి ఉద్దేశాలు, కాల పరిమితిలాంటి అంశాల మీద ఆధారపడి వుంటుంది.
ప్రజలనుండి సమీకరించిన డబ్బుని మ్యాచువల్ ఫండ్ కంపెనీ వివిధ సాధనాలలో పెట్టుబడి చేయడానికి ఒక ఫండ్ మేనేజర్‌ని నియమిస్తారు. ఫండ్ మేనేజర్‌ ఈ డబ్బు మొత్తాన్ని రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి చేస్తారు. ఎప్పటికప్పుడు ఈ ఫండ్‌ పనితీరును గమనిస్తు అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఫండ్ విలువను లెక్కించిన తర్వాత , పెట్టుబడిదారులకు నికర లాభం లేదా నష్టం పంపిణీ చేయబడుతుంది.


మ్యూచువల్ పంఢ్స్ - లాభాలు

మ్యూచువల్‌ పంఢ్స్‌లో పెట్టుబడి వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి.

తక్కువ పెట్టుబడి:ఒక కంపెనీ షేర్లను కొనాలంటే మీరు రూ.25,000 పెట్టుబడి పెట్టాలి. కాని మీ దగ్గర కేవలం రూ. 1000 మాత్రమే వున్నాయి. అయినా ఆ కంపెనీ షేర్లలో సైతం మీరు పరోక్షంగా భాగస్వామి కావచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

మ్యూచువల్‌ పంఢ్స్‌లో మనం కేవలం షేర్లలోనే కాక, వివిధ రకాల కంపెనీ డిపాజిట్లు. ప్రభుత్వ బుుణపత్రాలు, ట్రజరీ బిల్లులు మొదలైన వాటిలో సైతం భాగస్వాములం అవుతాం. అందువల్ల ఒక షేర్‌ విలువ తగ్గిపోయినా, ఇతర షేర్లు, బుుణపత్రాల ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం వుంటోంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వుంటాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా కాక యూనిట్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం వుంటుంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో మనం మదుపు చేసే డబ్బు వివిధ రకాల పెట్టుబడులలో పెడతారు.

మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి వల్ల పొందే ప్రయోజనాలలో పన్ను ప్రోత్సాహాకాలు ఒకటి. కొన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌లలో పెట్టే పెట్టుబడిని మన ఇతర ఆదాయంలో నుండి మినహాయించడానికి కేంద్రప్రభుత్వ ఆర్థిక శాఖ కొన్ని సూచనలు ఇచ్చింది. అందువల్ల మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన ఆదాయం పన్నుమినహాయింపు వుంటుంది. అంతేకాక మ్యూచువల్‌ ఫండ్‌ ద్వారా లభించే డివిడెండ్‌లకు, దీర్ఘకాల టాక్స్‌ లేదు.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఒక స్కీము నుండి మరో స్కీములోకి మీరు నిరభ్యంతరంగా మారిపోయే సౌకర్యం వుంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌ లో రిస్కు
మ్యూచువల్‌ ఫండ్స్‌ అంటేనే కీలక వ్యక్తులు మదుపర్ల తరపున షేర్లు, డిబెంచర్లు, ఇతర బుుణ పత్రాలను కొని సమర్థవంతంగా నిర్వహించే ప్రక్రియ. అయితే ప్రతి ఫండ్‌ ఎంతో జాగ్రత్తగా మదుపరుల డబ్బుని సమర్థవంతంగా నిర్వహిస్తుందని మనం ఆశించలేం.

మనం మ్యూచువల్‌ ఫండ్‌ని ఏ మాత్రం నియంత్రించలేం. అదే స్టాక్‌ మార్కెట్‌లో యితే షేర్లను కొనడం, అమ్మడం అనేది పూర్తిగా మన చేతిలో పని. అలాగే మ్యూచువల్‌ ఫండ్స్‌ ఒక షేర్‌ని కాక ఎన్నో రకాల షేర్లని కొంటాయి. ఒక షేర్‌లోని అపరిమిత పెరుగుదల మొత్తం పోర్ట్‌పోలియోతో పోలిస్తే మనకు పెద్దగా మార్పు రాకపోవచ్చు. ఒక కంపెనీ బోనస్‌ ఇచ్చినా మొత్తం షేర్లమీద అది కేవలం ఒక శాతం పెరుగుదల ప్రభావం కూడా కనిపించకపోవచ్చు. అదే షేర్లలో అయితే లాభనష్టాలు మన పోర్ట్‌ పోలియో మీద పూర్తి ప్రభావం చూపించవచ్చు. రిస్కుల విషయానికి వస్తే

అనుకున్న ఉద్దేశ్యం నుండి వైదొలగడం:

చాలా మ్యూచువల్‌ ఫండ్స్‌లు ఎన్నెన్నో ఉద్దేశ్యాలతో ప్రజల దగ్గర నుండి డబ్బుని సేకరిస్తాయి. కాని వాటిని చెప్పిన విధంగా మదుపు చేయవు. ప్రతి నెలా ఖచ్చిత ఆదాయం (డివిడెండ్‌) ఇవ్వాల్సిన మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ ఫండ్‌లో ఎక్కువ భాగం డెట్‌ పత్రాలలో లేదా ప్రభుత్వ బుుణ పత్రాలలో వుంచాలి. కాని అధిక లాభాలకు ఆశపడి వాటిని ఈక్విటీ షేర్లలో ఉంచుతారు. ఫలితంగా అనుకున్న ఉద్దేశ్యం నెరవేరకపోగా, డివిడెండ్‌ ఇచ్చే అవకాశం పోతుంది. అలా ఫండ్‌లో తాము అనుకున్న ఉద్దేశ్యానికి కట్టుపడకపోవటం వల్ల మదుపరులు దెబ్బతినే అవకాశం వుంది.

స్పెక్యులేషన్‌ :

మార్కెట్‌ శరవేగంతో కదులుతున్నప్పుడు మేనేజర్లు సైతం ప్రతిరోజు షేర్ల కదలకలలోని తేడాని క్యాష్‌ చేసుకుందామని మార్కెట్‌లో దిగుతారు. స్పెక్యులేషన్‌ జూదం లాంటిది. మదుపర్లు డబ్బుతో స్పెక్యులేషన్‌లోకి దిగడం మంచిది కాదు. లాభాలు వస్తే బాగానే వుంటుంది. కాని స్పెక్యులేషన్‌లో నష్టాలు వస్తే మదుపరుల డబ్బు గల్లంతవుతుంది. అంటే మ్యూచువల్‌ ఫండ్‌లలో రిస్క్‌ని ఆరికట్టాలంటే వీలైనన్ని ఎక్కువ షేర్లలో మదుపు చేయాలి. కాని కొంతమంది ఫండ్‌ మేనేజర్లు కేవలం ఒకటి లేదా రెండు షేర్లలో పెట్టుబడి పెడతారు. అవి పెరుగుతాయన్న ఆశతో వాటిలో అధిక భాగం షేర్లను కొంటారు. ఇది రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఒకటి, రెండు షేర్లు తగ్గితే మొత్తం ఫండ్‌కే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఇలాంటి మ్యూచువల్‌ ఫండ్స్‌ జోలికి పోకపోవడమే ఉత్తమం.

ఎక్కువ మొత్తంలో యూనిట్లు

కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లోని ఎక్కువ యూనిట్లు ఒకే వ్యక్తి లేదా వ్యక్తుల చేతిలో వుంటే ఆ వ్యక్తి లేదా వ్యక్తుల చేతిలో వుంటాయి. అలా అధిక యూనిట్లు ఒకే వ్యక్తి లేదా అనేక వ్యక్తుల చేతిలో వుంటే ఆ వ్యక్తి లేదా వ్యక్తుల ఆధిపత్యం ఆ ఫండ్‌ మీద వుంటుంది. అలాంటి వారు ఎప్పటికైనా మొత్తం యూనిట్లన్ని అమ్మేసుకోవచ్చు. దాని వల్ల లిక్విడిటీ సమస్య వచ్చి షేర్లన్నింటిని ఏదోక రేటుకు అమ్మేయ్యాల్సి వస్తుంది. అందువల్ల నెట్‌ అసెట్‌ వాల్యూ(ఎన్‌ఎవి) తగ్గి మిగతా వారు నష్టపోవచ్చు. ఇలాంటి ధోరణులను ఆరికట్టడానికే సెబి పూనుకుంది. ఏ ఫండ్‌లో అయితే 25 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి పెడతారో వారి షేర్లను బహిర్గతం చేయాలని సెబి కోరింది.

ఫలితాలు :

మామూలుగా అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రతిరోజూ తమ ఎన్‌ఎవి పేపర్లలో ప్రకటించాలి. అలా తమ ఎన్‌ఎవి పోర్ట్‌ఫోలియోలను ప్రకటించని మ్యూచువల్‌ ఫండ్స్‌ జోలికి పోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే అవి తమ ఫలితాల అంకెలను దాచిపెడుతున్నాయంటే ఆ స్కీమ్‌లో ఏవో అవకతవకలున్నాయని అనుకోవాలి.



మ్యూచువల్ ఫండ్స్ లో పథకాలేంటి?

కాల పరిమితి లేని పధకం(open ended Schemes)
ఒక కాల పరిమితి లేని పధకం అని చెప్పాలంటే ఆ పధకం ఎల్లప్పుడూ సొమ్ము సేకరిస్తూ, చెల్లిస్తూ తిరిగి చెల్లించిన వాటాలను కొనుగోలు చేస్తూ నిరంతర ప్రక్రియగా సాగిస్తూ ఉంటే దానిని కాల పరిమితి లేని పధకం అంటారు. ఈ పధకాలకు స్ధిరమైన పరిపక్వత సమయం అంటూ ఏమీ వుండదు. మదుపరులు తమ అనుకూలత ప్రకారం వాటాల కొనుగోలు మరియు అమ్మకాలు రోజువారీ ఎన్ఎవి (N A V) ఆధారంగా చేసుకోవచ్చు. ఈ పధకం ముఖ్యలక్షణం మదుపరుల వాటాలకు ద్రవ్యత్వం (liquidity) అనగా నగదు పొందడం లేదా ఇవ్వడం సులభం.

కాల పరిమితి గల పధకం (Closed ended Schemes)

ఒక కాల పరిమితి గల ఫండ్/ పధకానికి పరిపక్వత సమయం నిర్ణయించబడి వుంటుంది. ఉదా:5– 7 సంవత్సరములు. ఈ పధకం ప్రారంభంలో కొంత కాలం గడువు ఇస్తారు. ఈ సమయంలో దీనిలో మదుపరులు పెట్టుబడులు పెట్టడానికి / వాటాలు కొనుగోలు చేయడానికి తెరిచి వుంటుంది. మదుపుదారులు ఈ పధకం తెరిచి వుంచిన కాలంలో కాని లేదా పట్టావినిమయం (Stock Exchange) లో పొందుపరచిన పట్టిక నుండి కాని వాటాలను కొనుగోలు చేయవచ్చు. మదుపరులు ఈ పధకం నుండి తప్పుకొనుటకు వీలుగా కొన్ని కాల పరిమితి గల ఫండ్ / పధకంలో వాటాలను ఎన్ ఎ వి (N A V) ధరల ఆధారంగా తిరిగి అమ్ముకునే వీలుకల్పిస్తూ మ్యూచువల్ ఫండ్ లు తిరిగి కొనుగోలు చేస్తాయి. సాధారణంగా ఈ మ్యూచువల్ ఫండ్ లు ఎన్ ఎ వి (N A V) ధరలను వారం వారం ప్రకటిస్తారు.

పెట్టుబడి ఉద్దేశంతో ఏర్పాటు చేసే పధకాలు

ఒక పథకం అభివృద్ధి పథకంగా కూడా విభజించవచ్చు. ఆదాయ పథకం లేదా మదుపు చేసే ఉద్దేశం కల్గిన సమతౌల్య పథకంగా కూడా విభజించవచ్చు. ఈ పథకం కాల పరిమితి లేని ఫండ్ / పథకం లేదా కాల పరిమితి గల ఫండ్ పథకాలుగా ఇదివరకే వివరించడం జరిగింది. ఈ పథకాలన్నింటిని ఈ కింద పేర్కొన్న విధంగా విభజించవచ్చు.

అభివృద్ధి / ఈక్విటీ ఆధారిత పథకం (

అభివృద్ధి పథకం ముఖ్య లక్షణం యేమిటంటే పెట్టిన మూలధనం విలువ పెరగడం. మధ్య తరహా నుంచి దీర్ఘకాలం సమయంలో దీని విలువ పెరుగుతుంది. ఈ పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా తమ మూలనిధిలోని ఎక్కువ భాగం ఈక్విటీలుగా మదుపు(పెట్టుబడిగా పెడతారు) చేస్తారు. ఈ ఫండ్స్ లో నష్టాలను పోల్చి చూస్తే అధికంగా ఉంటాయి. ఈ పథకాలు మదుపరులకు వివిధ రకాల ఐచ్చికాలను కల్పిస్తాయి. డివిడెండ్ ఆప్షన్ , మూలధనం పెరగడం వంటి ఐచ్చికాల వంటివి కల్పిస్తాయి. మదుపరుల ప్రాముఖ్యతను బట్టి తమకనువైన ఐచ్చికాలను పేర్కొనవలసి ఉంటుంరది. తర్వాత కాలంలో మదుపరులు తమ ఐచ్చికాలను మార్చుకునే వీలును మ్యూచువల్ ఫండ్స్ కల్పిస్తాయి లేదా అనుమతినిస్తాయి. అభివృద్ధి పథకాలు మదుపరులకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పిస్తాయి. దీర్ఘకాలంలో మదుపరులకు తాము పెట్టిన పెట్టుబడుల మూలధనం విలువ పెరిగే రీతిలో ఉంటాయి.

ఆదాయం / డెబ్ట్ ఆధారిత పథకం

మదుపరులకు క్రమబద్ధమైన రీతిలో నిర్దిష్టమైన ఆదాయం కల్పించడం ఆదాయం ఫండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో చేసే మదుపును స్థిరమైన ఆదాయం ఇచ్చే సెక్యూరిటీలు అనగా బాండ్లు, కంపెనీల డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు మనీ మార్కెట్ పత్రాలలో మదుపుగా చేస్తారు. ఈ ఫండ్స్ లో చేసే మదుపు ఈక్విటీ పథకాల్లో చేసే మదుపుతో వచ్చే నష్టాలలో పోల్చి చూస్తే కొంత తక్కువనే చెప్పాలి. ఈక్విటీ మార్కెట్లలో వచ్చే (హెచ్చుతగ్గుల ) మార్పుల ప్రభావం ఈ ఫండ్స్ పై ఉండదు. ఈ పథకాలలో మూలధనం విలువ పెరుగుదల కూడా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫండ్స్ లోని ఎన్ఎవిలు దేశంలోని వడ్డీరేట్లలొ వచ్చే మార్పులకనుగుణంగా వుంటాయి. వడ్డీరేట్లు తగ్గిపోయినచో ఈ ఫండ్స్ యొక్క ఎన్ఎవిలు తక్కువ వ్యవధికి పెరగవచ్చు. అలాగే పెరిగినచో ఎన్ఎవిలు తగ్గిపోవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే మదుపరులు ఈ హెచ్చుతగ్గుల మార్పుల గురించి ఆందోళన చెందకపోవచ్చు

బ్యాలెన్స్ డ్ ఫండ్

అభివృద్ధి మరియు క్రమబద్ధమైన ఆదాయం మదుపరులకు కల్పించడం బ్యాలెన్స్ డ్ ఫండ్ ల యొక్క ముఖ్యోద్దేశం. ఈ ఫండ్స్ లోని పథకాలలోను ఈక్విటీలలోను మరియు స్థిరమైన ఆదాయం కల్పించే సెక్యూరిటీలలోను తమ ప్రకటన పత్రాలలో పేర్కొన్న రీతిలో దామాషా పద్ధతిలో మదుపును చేస్తారు. తగినంత అభివృద్ది ఉంటే చాలన్న మదుపరులకు ఈ ఫండ్స్ లోని పథకాలు అనువైనవిగా ఉంటాయి. వీరు సాధారణంగా ఈక్విటీ మరియు డెబ్ట్ సాధనాలలో 40-60% వరకు మదుపు చేస్తారు. స్టాకు మార్కెట్లలోని షేర్ల ధరలలో వచ్చే హెచ్చు తగ్గు మార్పులు ఈ ఫండ్స్ పై ప్రభావం కల్గిస్తాయి. పూర్తి ఈక్విటీ ఫండ్స్ తో పోలిస్తే ఈ ఫండ్స్ లో ఎన్ఎవిల తీవ్రత కొంత మేరకు తక్కువ స్థాయిలోనే ఉంటుంది

మనీ మార్కెట్ లేదా ద్రవ్యశీలత ఫండ్స (అతి త్వరగా నగదు రూపంలో మార్చుకునే ఫండ్)

ఈ ఫండ్స్ కూడా ఆదాయం ఇచ్చేవి. వీటి ముఖ్యోద్దేశం ఏమిటంటే మూలధనాన్నిభద్రపరచడం, త్వరగా నగదుగా మార్చుకునే సౌకర్యం మరియు తగినంత (మిత) ఆదాయం కల్పించడం. ఈ పథకాలన్నీ సురక్షితమైన స్వల్ప కాల వ్యవధితో కూడిన ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ల సర్టిఫికెట్లు, వ్యాపార లావాదేవీల పత్రాలు (commercial papers), అంతర బ్యాంకుల కాల్ మనీ (inter- bank call money), ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైన వాటిల్లో మాత్రమే మదుపు చేస్తాయి.

గిల్ట్ ఫండ్

ఈ ఫండ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే మదుపు చేస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు తిరిగి చెల్లించవన్న అపనమ్మకం ఉండదు. అయితే ఈ పథకాల ఎన్ఎవిలు వడ్డీ రేట్లు మారుతున్నప్పుడల్లా హెచ్చుతగ్గులతో మార్పు చెందుతాయి. అలాగే ఆర్ధిక కారణాల వలన కూడా మారుతాయి. ఎలాగంటే ఆదాయ లేదా డెట్ ఆధారిత పథకాలు ఎలా మారుతాయో ఆ విధంగానే మారుతాయి.

ఇండెక్స్ ఫండ్

ఇండెక్స్ ఫండ్ ఒక ప్రత్యేక సూచిక (పట్టిక) లో పేర్కొన్న రీతిని ప్రతిబింబిస్తాయి. అంటే బిఎస్ ఇ సెన్సిటివ్ ఇండెక్స్ (BSE sensitive index), ఎస్ &పిఎన్ ఎస్ ఇ 50 ఇండెక్స్(S&P NSE50index(Nifty), మొదలైన వాటిలాగానే ఉంటాయి. ఈ పథకాలు ఒక సూచికలో పేర్కొన్న వాటికి గుర్తింపునిస్తూ వాటి సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. ఈ పథకాల్లో ఎన్ ఎవిలు ఆ సూచికలో పేర్కొన్న సెక్యూరిటీల విలువ మెరుగుదల, తగ్గుదల ఆధారంగా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. అయితే ఎప్పుడు ఎన్ ఎవిలు హెచ్చుతగ్గుల శాతం ఆ ఇండెక్స్ లలో ఉండనక్కరలేదు. ఎందుకంటే సాంకేతిక పరిభాషలో ట్రాకింగ్ ఎర్రర్(tracking error)అనే కారణం వల్ల ఆ హెచ్చుతగ్గుల శాతం ఇండెక్స్ ల పెరుగుదల తగ్గుదలలాగ ఉండనక్కరలేదు. ఈ అంశం గురించి అవసరమైన బహిరంగ ప్రకటనలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల అమ్మకపు ఆహ్వాన (offer) పత్రంలో పేర్కొనడం జరుగుతుంది.

ఈ ఫండ్స్ మార్పిడి వ్యాపార ఇండెక్స్ ఫండ్స్ కూడాను (exchange traded index funds). ఈ ఫండ్స్ స్టాక్ ఎక్స్ చేంజ్ (stock exchange) ల మీదుగా వ్యాపారం చేసుకునేలాగా మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభిస్తాయి.


మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకి వల్ల ఈ దిగువ పొందు పరచిన ప్రయోజనాలు కలుగుతాయి:

వృత్తిపరమైన నిర్వహణ
రిస్క్ తగ్గింపు
లావాదేవీ వ్యయ లిక్విడిటీలో తగ్గింపు
లిక్విడిటీ
సౌకర్వం మరియు వెసులుబాటు

మ్యూచువల్ ఫండ్స్ వల్ల కొన్ని ప్రతికూలతలు వున్నాయి.

వ్యయాలమీద నియంత్రణలేక పోవడం
నిర్దిష్టమైన పోర్టుఫోలియోలు లేకపోవడం

మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణకి సంబంధించిన అంశాలు

మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులు:

ఓపెన్ ఎం‌డెడ్ ఫండ్స్–
క్లోజ్ ఎం‌డెడ్ ఫండ్స్
ఈక్విటీ ఫండ్స్:-
డెట్ ఫండ్స్
బ్యాలె‌న్స్‌డ్:


పెట్టుబడి ఎంపికలు

పెట్టుబడుదారులు,అన్ని మూలధనాలలోనూఊ ఆదాయం మరియు అభివృధ్ధి లక్ష్యాలుసాధించవచ్చు

డివిడెం‌డ్ ఎంపిక(క్రమమైన డివిడెండ్/తాత్కాలిక(అడ్‌హాక్) డివిడెండ్
అభివృధ్ధి ఎంపిక
రీ-ఇన్‌వెస్ట్‌మెంట్ ఎంపిక

ఎన్నో నిధులు అసంఖ్యాకమైన ఎంపికలు మరియు ఎంపికల మధ్య మార్పిడి సదుపాయం కలుగజేస్టాయి.