Thursday, April 29, 2010

అణువిద్యుత్‌కు ఐటి సహకారం

యుఎస్ కంపెనీతో ఇన్ఫోటెక్ ఒప్పందం

హైదరాబాద్ (బిజినెస్ బ్యూరో): ఇంజనీరింగ్ సేవల దిగ్గజం ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ అణు ఇంజనీరింగ్ కార్యకలాపాల్లో సేవలు అందించడానికి అమెరికా కంపెనీ వెస్టింగ్‌హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దిశగా యుఎస్ కంపెనీతో సమగ్రమైన ఒప్పందం కుదిరినట్లు ఇన్ఫోటెక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఒప్పందంలో భాగంగా వెస్టింగ్ హౌజ్‌కు అంతర్జాతీయంగా ఉన్న వనరులను క్రోడీకరించి అణు విద్యుత్ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని సాధించడానికి అవసరమైన సొల్యూషన్లను ఇన్ఫోటెక్ అందిస్తుంది. అలాగే ఇండియాలో వెస్టింగ్‌హౌజ్ నిర్మిస్తున్న అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలకు సహకారం అందించనున్నట్లు ఇన్ఫోటెక్ తెలిపింది.

ఈ ఒప్పందం కంపెనీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని, భారతీయ మార్కెట్లకు ప్రాధాన్యమిస్తున్నామనడానికి ఈ ఒప్పందమే నిదర్శనమని వెస్టింగ్ హౌజ్ ప్రెసిడెంట్, సిఇఒ ఆరిస్ కాండ్రిస్ వ్యాఖ్యానించారు.

అణు విద్యుత్ వెస్టింగ్‌హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీ తొషిబా కార్పొరేషన్ గ్రూప్ కంపెనీ. అణు విద్యుత్ ప్లాంట్లకు ప్రొడక్టులు, టెక్నాలజీలను కంపెనీ అందిస్తోందని ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటనలో వివరించింది.

యులిప్ పాలసీల్లో ఏజెంట్ కమీషన్ ఎంత?

బీమా కంపెనీలకు ఐఆర్‌డిఎ ఆదేశం

హైదరాబాద్: యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ (యులిప్స్)పై ఏజెంట్లకు చెల్లిస్తున్న కమీషన్ వివరాలను వినియోగదారులకు వెల్లడించాలని జీవిత బీమా కంపెనీలను ఐఆర్‌డిఎ ఆదేశించింది. బీమా సర్వీసుల మార్కెటింగ్‌లో పారదర్శకతను పెంచే దిశలో భాగంగా యులిప్‌లపై ఏజెంట్లకు చెల్లించే కమీషన్, బ్రోకరేజ్ వివరాలను వినియోగదారులకు విస్పష్టంగా తెలపాలని బీమా కంపెనీలను ఆదేశించినట్టు ఐఆర్‌డిఎ పేర్కొంది.

ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. యులిప్‌ల నియంత్రణపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబికి, బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఎకు మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఐఆర్‌డిఎ తాజా నిబంధన ప్రాధాన్యత సంతరించుకున్నది.

బీమా కవరేజ్ మినహా ఇన్వెస్ట్‌మెంట్ దృష్టితో చూస్తే పూర్తిగా మ్యూచువల్ ఫండ్స్‌ను పోలి ఉంటే యులిప్ పాలసీల్లో బీమా కంపెనీలు, బ్రోకర్లకు భారీ ఎత్తున కమీషన్లు చెల్లిస్తున్నాయి.

అదే సమయంలో సెబి ఆంక్షల కారణంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏజెంట్ల కమీషన్‌ను భారీగా తగ్గించాల్సి వచ్చింది. దాంతో బ్రోకర్లు, మార్కెట్ ఏజెంట్లు మ్యూచువల్ ఫండ్స్‌ను పట్టించుకోవడం మానేసి యులిప్ స్కీమ్‌ల మార్కెటింగ్‌ను మాత్రం జోరుగా చేస్తున్నారు. ఈ విషయంలో మ్యూచువల్ ఫండ్ సంస్థల ఆందోళనను గమనించిన సెబి రంగంలోకి దిగి యులిప్ స్కీమ్‌లపై ఆంక్షలను ప్రకటించింది.

తన పరిధిలోని యులిప్‌లపై సెబి పెత్తనాన్ని ఐఆర్‌డిఎ వ్యతిరేకించడంతో రెండు నియంత్రణ సంస్థల మధ్య వివాదం రాజుకున్నది. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. మరోవైపు బ్రోకర్ కమీషన్లే వివాదానికి మూలకారణమన్న విషయం గమనించిన ఐఆర్‌డిఎ బీమా పాలసీలకు సంబంధించి పారదర్శకతకు నడుంబిగించింది.

బీమా కంపెనీలు ఐఆర్‌డిఎ నిర్ణయాన్ని స్వాగతించాయి. యులిప్ పాలసీల కొనుగోలుదార్లకు తమ ఇన్వెస్ట్‌మెంట్‌లో నికరంగా ఎంత మొత్తం కమీషన్లు, చార్జీల కింద పోతున్నదో తెలియడం మంచిదేనని వారు అంటున్నారు. ఐఆర్‌డిఎ చర్య వల్ల మ్యూచువల్ ఫండ్స్, యులిప్‌ల మధ్య దేన్ని ఎంచుకోవాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి వినియోగదారులకు వీలుకలుగుతుందని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంటున్నాయి.

బియ్యం పరిశ్రమకు గడ్డుకాలం

మండపేట: మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా పిలువబడుతుంది. అందులో ఉభయగోదావరి జిల్లాలు ధాన్యాగారాలుగా వర్థిల్లుతున్నాయి. పచ్చని పొలాలు, పాడిపంటలతో వుండే మన రాష్ట్రంలోని అభివృద్ధి చెందినంత విధంగా మరే రాష్ట్రంలోను రైసుమిల్లుల పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఇండస్ట్రీస్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని గడ్డుకాలంగా వుంది. క్రాప్‌ ఏరియా తగ్గిపోవడం ఇబ్బడిముబ్బడిగా కార్పొరేట్‌ రైసుమిల్లులు విస్తరించడం, ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతులు తగ్గిపోవడం, కార్పొరేట్‌ పోటీని తట్టుకోలేక పాతమిల్లులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వీటితోపాటు ప్రభుత్వం పరిశ్రమలకు పవర్‌ హాలీడేను ప్రకటించడం, జనరేటర్లపై మిల్లులను తిప్పడం భారంగా మారడం, ఎఫ్‌సిఐ గోదాములు ఖాళీలేక తద్వారా ప్రొక్యూర్‌ చేయవలసిన బియ్యానికి దారిలేక లెవీ ఇవ్వవలసిన బియ్యం నిల్వలు మిల్లులలోనే మూలుగుతున్నాయి.

మన రాష్ట్రంలో చిన్నాపెద్దాకలిపి సుమారు ఆరువేల వరకు రైసు మిల్లులు ఉండగా, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 600 వరకు ఉన్నాయి. గత సంవత్సరం ఎఫ్‌సిఐ రాష్టవ్య్రాప్తంగా 90 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రొక్యూర్‌మెంటు చేయగా ఈ సంవత్సరం కేవలం 62 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటి వరకు ప్రొక్యూర్‌ చేసినట్లుగా రైసుమిల్లు వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 37లక్షల టన్నుల పచ్చి బియ్యం వుండగా, 25లక్షల టన్నులు బాయిల్డ్‌ (ఉప్పుడు బియ్యం) రైస్‌ వుంది. అదే ఒక్క తూర్పుగోదావరి జిల్లాకు వస్తే 15లక్షల టన్నుల లెవీకి ఇప్పటివరకు 11లక్షలు పూర్తి అయింది. మూడు లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ గోదాములు ఖాళీలేక లేవీ పూర్తి చేయలేదు. ఆహార ధాన్యాల నిల్వలు తరిగిపోకుండా కేంద్రప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా బఫర్‌ స్టాకు నిల్వలు పెట్టమని ఆదేశాలున్నాయి.

ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నా అయితే గోదాములు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత ఖరీఫ్‌లో వర్షాలు, వరదలతో ఈ రబీలో నీటి ఎద్దడి అంటూ సాగుభూమిని కుదించేయడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దాంతో మిల్లర్లు పోటీపడి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే 30 నుంచి 50 రూపాయలకు అదనంగా కొనుగోలు చేయడం జరిగింది. అదీకాకుండా గతంలో మన రాష్ట్రం నుంచి పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా, బీహార్‌, యు.పి., మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు బియ్యం, నూకలు ఎగుమతి అయ్యేవి. అయితే అక్కడ కూడా ధాన్యం విస్తారంగా పండటంతో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇక్కడ మిల్లింగ్‌ చేసిన పచ్చిబియ్యం మన రాష్ట్రం నుంచి మహారాష్టక్రు 40 నుంచి 50 శాతం వెళ్లేవి.

అక్కడకు కూడా ప్రస్తుతం ఎగుమతి కావడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వరిపంట విస్తారంగా పండటంతో మార్కెట్‌ లేకుండా పోయింది. గత మూడు సంవత్సరాల క్రితం మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలైన సౌదీ అరేబియా, శ్రీలంక, సింగపూర్‌, బంగాదేశ్‌ తదితర దేశాలకు బియ్యం ఎక్స్‌పోర్టు వుండేది. అప్పట్లో రైస్‌మిల్లర్ల పరిస్థితి మూడు పువ్వులు ఆరుకాయలుగా వుండేది. అప్పటి నుంచి బియ్యం రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి. అయితే ప్రభుత్వం మనదేశంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆహార ధాన్యాల ఎక్స్‌పోర్టుపై ఆంక్షలు విధించి ఎగుమతులను నిలిపి వేసింది. అలాగే సన్నరకాల బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఎగుమతి చేయాలంటే పరిమిట్‌ విధానం వుండేది. ఎఫ్‌సిఐకి 75 శాతం లెవీ పూర్తిచేస్తే 25 శాతం బయట అమ్ముకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించి అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం బియ్యం రేట్లు పెరిగిపోవడంతో అన్నిరకాల బియ్యానికి ఫ్రీ మార్కెట్‌ చేసింది.

దాంతో పరిమిట్‌ విధానం రద్దయి బియ్యాన్ని ఎక్కడైనా అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ లేకపోవడంతో మార్కెట్‌ లేకుండా పోయింది. ఒక్క కేరళ రాష్ట్రానికి మాత్రమే బాయిల్డ్‌ రైసు సరఫరా అవుతుంది. గత రెండు సంవత్సరాల నుంచి మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. బియ్యానికి మార్కెట్‌ లేక మిగిలిపోయిన లెవీ పూర్తిచేయడానికి గోదాములు ఖాళీలేక ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 30లక్షల టన్నుల బియ్యం రవాణా ఆగిపోయింది. చాలా వరకు రైసు మిల్లుల్లో మూలుగుతుంది. ప్రభుత్వం వరిలో కామన్‌ వెరైటీకి రూ.780లు, ఎ గ్రేడ్‌ ధాన్యానికి రూ.810లు రేటు నిర్ణయించింది. అయితే మిల్లర్లు పోటీ పడి కామన్‌ వెరైటీని రూ.820 నుంచి రూ.830, ఎగ్రేడ్‌ను రూ.830 నుండి రూ.850లకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే సన్నాలు, సోనా, గిద్ద మసూర్‌ ధాన్యాన్ని, పిఎల్‌ రకాలను రూ.1150 నుంచి రూ.1200 వరకు కూడా కొంటున్నారు.

అయితే ఈ బియ్యానికి కూడా డిమాండ్‌ తగ్గిందని రైసుమిల్లర్లు చెబుతున్నారు. ఈ రకం బియ్యాన్ని పాతవైతే క్వింటాళ్లకు రూ.2800 నుంచి రూ.3 వేలు, కొత్తవైతే రూ.2200 నుంచి రూ.2400లకు అమ్మకాలు సాగిస్తున్నారు. మనరాష్ట్రంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం ద్వారా వినియోగదారులకు, సామాన్యులకు బియ్యం చౌకగా దొరకడం, అలాగే గతంలో బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కూడా ధాన్యం ఉత్పత్తి పెరగడమే కారణంగా మిల్లర్లు అంటున్నారు. వీటితోపాటు పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, అలాగే వారంలో ఒకరోజు మిల్లుకు శెలవు ఉండటంతో మూ డురోజుల పాటు మిల్లు తిరగడం, మూడు రోజుల పాటు బంద్‌ చేయడంతో దీని ప్రభావం మిల్లులపై తీవ్రంగా చూపడం జరుగుతుంది.

దాంతో చేతినిండా పని దొరక్క జట్టుకూలీలు కూడా రావడం తగ్గిపోయారు. రాష్ట్రంలో వున్న ఆరు వేల రైసుమిల్లుల్లో సుమారు లక్షా50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ విధానం వల్ల రైసుమిల్లులన్నీ నష్టాల మరలో నలుగుతున్నాయి. ప్రభుత్వం రైసుమిల్లుల పరిశ్రమను పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వున్నాయి. 24 గంటలూ విద్యుత్‌ సరఫరాను చేయడం, 150 హెచ్‌పి వరకు ఎల్‌టి కింద పరిగణించడం, రైసుమిల్లుల ఆధునికీకరణకు సబ్సిడీలు కొనసాగించడం, ఎఫ్‌సిఐ గోదాములు ఎక్కువగా తీసుకుని స్టాక్‌ పెట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

రిలయన్స్‌కు జాక్‌పాట్‌

కాంబే క్షేత్రంలో మరోచోట చమురు నిల్వలు
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని కాంబే క్షేత్రంలో మరో చమురు నిల్వను కనుగొన్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. ఈ క్షేత్రంలో కంపెనీకి ఇది నాలుగో అన్వేషణ. సీబీ - ఓఎన్‌ఎన్‌-2003/1 బ్లాకులో జరిపిన పరీక్షల్లోనే 300 బ్యారెళ్ల చమురు వెలుపలికి వచ్చినట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. అహ్మదాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బ్లాక్‌ 635 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 1,605 మీటర్ల లోతున ఉన్న చమురు నిల్వకు ధీరూభాయ్‌-47గా నామకరణం చేశారు. వాణిజ్యపరంగా చమురు లభ్యతను తెలుసుకునేందుకు సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. మొత్తం క్షేత్రం 2డీ సీస్‌మిక్‌ ఆవరించినా, అందులో 80% 3డీ సీస్‌మిక్‌ ఉందని కంపెనీ ప్రకటించింది. ఈ వివరాల ఆధారంగా మరికొన్ని వ్యూహాత్మక నిల్వలు బయటపడే అవకాశం ఉందని తెలిపింది.

పన్ను సంస్కరణలు అమలు చేస్తాం : ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాల్లో సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. 2010-11 ఆర్థికబిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఆయన ప్రసంగించారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ప్రతిపాదనలను వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశ పెడతామని ప్రణబ్‌ తెలిపారు. ప్రతిపాదిత జీఎస్‌టీపై రాష్ట్రాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆదాయపు పన్నులో మార్పులతో పాటు దీర్ఘకాల పొదుపు పథకాలు, పదవీ విరమణ సొమ్ముపై పన్ను విధింపుతో పాటు గృహ రుణాలపై పన్ను రాయితీ ఉపసంహరణ వంటివి ఇందులో ఉన్నాయి. దీనిపై పలు ఫిర్యాదులు అందాయి. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, డిమాండ్‌ పెరగడంతో పారిశ్రామిక వృద్ధి బాగుందని ఉద్దీపన పథకాలు ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేశాయని మంత్రి వివరించారు.

ఎల్‌ఎల్‌పీల స్థాపనకు అవకాశం రాజ్యసభలో బిల్లులు: పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థల (ఎల్‌ఎల్‌పీ) ఏర్పాటుకు ఛార్టెడ్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్‌ అకౌంటెంట్లకు అవకాశం కల్పించే బిల్లులను రాజ్యసభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం సంబంధిత చట్టాల్లో సవరణలను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ప్రతిపాదించారు.

పీఎస్‌యూల ఐపీవోలకు కమీషన్‌ చెల్లించనున్న ప్రభుత్వం: న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల పబ్లిక్‌ ఇష్యూలకు బ్రోకర్లుగా వ్యవహరించే వారికి కమీషన్‌ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు విక్రయించిన షేర్లపై 0.35%, అధిక విలువ కలిగిన పెట్టుబడిదారు (హెచ్‌ఎన్‌ఐ)లకు విక్రయించే షేర్లపై 0.15% కమీషన్‌ చెల్లిస్తామని పెట్టుబడుల ఉపసంహరణ శాఖ కార్యదర్శి సుమిత్‌ బోస్‌ చెప్పారు. సట్లజ్‌ జల విద్యుత్‌ నిగమ్‌తో ఆరంభించి, రాబోయే పీఎస్‌యూ ఇష్యూ లన్నిటికీ వర్తింప చేస్తామని ఆయన తెలిపారు.

తస్మాత్‌ జాగ్రత్త!

ముదురుతున్న గ్రీస్‌ సంక్షోభం
స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీలకూ ముప్పు!
గడ్డు స్థితిలో ఐరోపా దేశాలు
కుప్పకూలిన ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు
సెన్సెక్స్‌ పతనం 300 పాయింట్లు పైనే
మదుపర్లూ.. అనవసర ఖర్చులకు దూరం జరగండి
బంగారం, వెండి కొనుగోలు శ్రేయస్కరం
మొన్నటి ఆర్థిక సంక్షోభం ఛాయలు చెరిగిపోక ముందే.. మాంద్యం చీకట్లు పూర్తిగా తొలగిపోకముందే.. 'గ్రీస్‌ సంక్షోభం' ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఒకదానివెంట ఒకటి పతనానికి సిద్ధంగా ఉన్న కొన్ని 'ఐరోపా దేశాల' ఆర్థిక వ్యవస్థలు కలకలం పుట్టిస్తున్నాయి. ఒక దేశాన్ని నిలబెట్టాలంటే లక్షల కోట్లు కుమ్మరించాల్సిన పరిస్థితి. ఇదెంతవరకు సాధ్యం..? ఈ తాజా సంక్షోభం ఏ స్థాయికి తీసుకెళ్తుంది...? ఇప్పుడివే ప్రధాన ప్రశ్నలు.
- ఈనాడు వాణిజ్య విభాగం
పేరుకు అది చిన్న దేశమే. కానీ.. అక్కడ మొదలైన రుణ సంక్షోభం మాత్రం చిన్నది కాదు. గత కొన్ని నెలలుగా ఇంతలింతలవుతున్న ఈ దావానలం ఇపుడు తీవ్ర రూపు దాల్చింది. అది క్రమంగా ఐరోపా దేశాలకూ పాకి ఆర్థిక వ్యవస్థలను మరింత నిర్వీర్యం చేసే ప్రమాదముందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. బుధవారం ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలడం ఇందుకు తాజా ఉదాహరణ. డాయిష్‌ బ్యాంకు అయితే చావు ముంచికొచ్చే పరిస్థితిగా అభివర్ణించడం సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది.
ఇతర దేశాలకూ విస్తరిస్తోందా?
గ్రీసు దేశానికున్న మోయలేని అప్పుల ప్రభావం పోర్చుగల్‌కు పాకుతోంది. తాజాగా ఎస్‌&పీ రేటింగ్‌ ఆ దేశానికీ తగ్గడం దీనిని సూచిస్తోంది. రాజకీయ, ఆర్థిక నాయకులు జాగ్రత్తగా లేకపోతే ఈ సంక్షోభం మార్కెట్లో భయాందోళనలను రాజేస్తుంది. అప్పుల భారం ఎక్కువగా ఉన్న దేశాలనూ ఇది సంక్షోభంలోకి లాగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎలాగంటే.. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం వద్ద నిధులుంచిన పెట్టుబడిదార్లు డబ్బులు వెనక్కి ఇవ్వమని కోరతారు. అపుడు ఆ ప్రభుత్వం మరింత ఎక్కువ వడ్డీ రేట్లకు అప్పులు తెచ్చి ఈ అప్పు తీర్చాల్చి ఉంటుంది. ఇలా అప్పులు పేరుకుపోయి చివరకు అటు ప్రభుత్వం, ఇటు పెట్టుబడిదార్ల వద్ద మిగిలేది ఏమీ ఉండదు. కుప్పలకొద్దీ అప్పులు తప్ప. అపుడు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలతాయ్‌. ఈ ప్రమాదం చిన్న దేశాలకే ఉందనుకుంటే పొరబాటు. స్పెయిన్‌, బ్రిటన్‌లతో పాటు అమెరికాకూ ఉండడం గమనార్హం.

బయటపడే మార్గం దిశగా అడుగులు
సంక్షోభాల అల తగ్గుముఖం పట్టే సూచనలూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమోదించిన సహాయ ప్యాకేజీని యూరోపియన్‌ యూనియన్‌ గ్రీసుకు అందజేస్తే ఈ సంక్షోభానికి త్వరగా తెర వేయవచ్చు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి బెర్లిన్‌లో జర్మనీ రాజకీయ నాయకులు, అధికార్లతో ఐఎమ్‌ఎఫ్‌ అధిపతి డొమినిక్‌ స్ట్రాస్‌ కాన్‌ గ్రీసు సంక్షోభంపై చర్చించారు. అయితే ఇప్పుడే ఇంకా సహాయ ప్యాకేజీకి తుది రూపునివ్వలేదని ఆయన సమావేశం అనంతరం వెల్లడించారు. మరో పక్క అంతర్జాతీయ ప్యాకేజీ విలువ 100-120 బిలియన్‌ డాలర్ల వరకూ పెరగొచ్చని ఓ జర్మనీ చట్టసభ్యుడు అభిప్రాయపడడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఐరోపా, ఐఎమ్‌ఎఫ్‌ల నుంచి 45 బిలియన్‌ యూరోల(రూ.2,60,000 కోట్లు)ను సహాయంగా అడిగిన సంగతి తెలిసిందే.

ప్రపంచ మార్కెట్లు ఇలా పడ్డాయ్‌
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూంటే గ్రీస్‌ దేశ భవిష్యత్‌ అంచనాను 'చెత్త'(జంక్‌)గా రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌&పూర్స్‌ తేల్చి చెప్పడంతో అగ్గిరాజుకుంది. ప్రపంచ మార్కెట్ల సూచీ ఎమ్‌ఎస్‌సీఐ 0.9 శాతం పడింది. అంతక్రితం మంగళవారం ఇది 3 శాతం పతనమైంది. అంతక్రితం రోజు 3.1 శాతం పడ్డ ఐరోపా మార్కెట్‌ (ఎఫ్‌టీఎస్‌ఈ) బుధవారం మరో 0.7% నష్టపోయింది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 2.6% కుదేలైంది. 8 వారాలుగా పెరుగుతూ వస్తున్న అమెరికా మార్కెట్లు మంగళవారం ఒక్కసారి కుదేలయ్యాయి. డోజోన్స్‌ మూడు నెలల కనిష్ఠ స్థాయి 10,991కి పతనమైంది.

మన మార్కెట్లకూ 'గ్రీసే'
భారత మార్కెట్లనూ గ్రీసు సంక్షోభం విడిచిపెట్టలేదు. గ్రీసు, పోర్చుగల్‌ దేశాల రేటింగ్‌ దిగజారడం ఇక్కడి మార్కెట్లకు శాపమైంది. అంతక్రితం రోజు డోజోన్స్‌ పతనం పూర్తి ప్రభావం చూపింది. ఒక్కసారిగా సెన్సెక్స్‌ దాదాపు నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. 310 పాయింట్లు కోల్పోయి 17,380.08 వద్ద స్థిరపడింది. ఒక దశలో 17,344.58 వద్ద కనిష్ఠ స్థాయినీ తాకింది. మదుపర్లు బుధవారం ఒక్కరోజే రూ.41,000 కోట్లు కోల్పోయారు.మరో పక్క గురువారం(నేడు)డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు తీరనుండడం కూడా కొంత ప్రతికూలంగా నిలిచింది. అంచనాల కంటే తక్కువగా ఫలితాలను ప్రకటించడంతో కొన్ని కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో 4.16% నష్టపోయి రూ.1,017కు పరిమితమైంది. ఐసీఐసీఐ బ్యాంకు 2.93% పోగొట్టుకుని రూ.918.65 వద్ద నిలిచింది. మొత్తం 13 బీఎస్‌ఈ సూచీలూ కుంగాయి. సెన్సెక్స్‌లోని 30 స్క్రిప్‌లలో 25 నేల చూపులు చూశాయి. ఇతర నష్టపోయిన షేర్లలో జైప్రకాశ్‌ అసోసియేట్స్‌(4.48%), టాటా స్టీల్‌(3.52%), డీఎల్‌ఎఫ్‌(3.17%), టాటా మోటార్స్‌(3%) ఉన్నాయి. అయితే సన్‌ఫార్మా, ఏసీసీ, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐలు మాత్రం స్వల్ప లాభాలు పొందాయి.

రోమారు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రీస్‌ రూపంలో తాజా ముప్పు ఉప్పెనలా ముంచుకొచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ కుంగదీసేదిలా కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం యూఎస్‌, ఐరోపా దేశాల్లో కంపెనీలు, బ్యాంకులు దివాలాతో సంక్షోభం తలెత్తితే.. ఇప్పుడు ప్రభుత్వాలు అప్పుల పాలై ఈ ముప్పును కొనితెస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం లాటిన్‌ అమెరికా దేశాలు ఎదుర్కొన్న స్థితినే ఇప్పుడు ఐరోపా ఎదుర్కొంటోంది. గ్రీస్‌, ఇటలీ, స్పెయిన్‌ తదితర దేశాలు ఒకదానివెంట మరొకటిగా దివాలా దిశగా కదులుతున్నాయి.

కష్టాల కడలిలో ఐరోపా: గ్రీస్‌ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ ఏకంగా 'పనికిరాని (జంక్‌)' స్థాయికి దిగజార్చింది. అంటే ఆ దేశంలోని బ్యాంకులన్నీ దివాలా తీసినట్లే. అలాగే పోర్చుగల్‌ రేటింగ్‌నూ తగ్గించింది. ఇదే వరుసలో స్పెయిన్‌, ఇటలీ ఉన్నాయి. వీటిని ఒడ్డున పడేయాలంటే కనీసం 2 లక్షల కోట్ల యూరోలు (మన కరెన్సీలో 120 లక్షల కోట్ల రూపాయలు) కావాలి. గ్రీస్‌కు 'జంక్‌' రేటింగ్‌ రావడంతో ఆ దేశ బాండ్‌ మార్కెట్‌ కుప్పకూలి ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ సైతం నష్టపోతున్నాయి. రేటింగ్‌ తగ్గడంతో పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాల్లోని బ్యాంకింగ్‌ వ్యవస్థ కూలిపోయే విధంగా ఉంది. ఇబ్బంది కొన్ని ఐరోపా దేశాలకే అనుకుంటే పొరపాటే. ఇది ఆరంభం మాత్రమే. నెమ్మదిగా ఇతర ఐరోపా దేశాలకు, జపాన్‌, అమెరికాలకూ సంక్షోభం విస్తరిస్తుంది. అప్పుల భారమే ఈ స్థితికి ప్రధాన కారణం. ఐరోపా దేశాలు వచ్చే ఏడాది వ్యవధిలో 1.6 లక్షల కోట్ల (దాదాపు రూ.96 లక్షల కోట్ల) అప్పు తీర్చాల్సి ఉంది. గ్రీస్‌ వచ్చే మూడేళ్ల పాటు ఏటా 5000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్ల) అప్పు చేయకపోతే బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. ఐరోపా దేశాల ఆర్థిక లోటు (గ్రీస్‌కు 13.6 శాతం, పోర్చుగల్‌ 9.4 శాతం, స్పెయిన్‌ 12 శాతం, బ్రిటన్‌ 11.5 శాతం) అంతులేని స్థాయికి పెరిగిపోయింది. ఐరోపాలో మొదలైన సమస్యను తక్షణం కట్టడి చేయకపోతే కష్టమే. ఎందుకంటే ఈ దేశాల మధ్య మూలధన మార్పిడికి ఆంక్షలు లేవు. దీనివల్ల మూలధనం వేగంగా ఆయా దేశాల నుంచి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇంకా అంతులేని సంక్షోభంలో ఆయా దేశాలు చిక్కుకుపోతాయి.

అమెరికా, చైనా: అమెరికా తాను సృష్టించుకున్న కష్టాల్లో పీకల్లోతు మునిగిపోయి ఉంది. నిరుద్యోగం పెద్ద సమస్య. ఫలితంగా ఎంతోమంది ఇళ్లు అమ్ముకోవలసి వస్తోంది. అక్కడి పౌరుల వ్యక్తిగత ఆదాయం క్షీణిస్తూనే ఉంది. పైగా అమెరికా ప్రభుత్వం చేస్తున్న అప్పులు భయాందోళన కలిగిస్తున్నాయి. అవి తీర్చలేనంతగా పెరిగిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా కష్టాలను అడ్డుకోగలదని భావిస్తున్న చైనా కూడా ఇబ్బందుల్లో ఉంది. చైనా రియల్‌ఎస్టేట్‌ గాలి బుడగ ఏక్షణంలోనైనా పేలిపోనుంది. 2009లో చైనా బ్యాంకులు 1.4 ట్రిలియన్‌ డాలర్ల ఇంటిరుణాలు మంజూరు చేశాయి. ఈ మొత్తం భారత స్థూల ఆదాయం కంటే ఎక్కువ. ద్రవ్యోల్బణం చైనాలో అదుపులేని స్థాయిలో ఉంది. అతిజాగ్రత్తకు పోయి చైనా పెద్దఎత్తున సరుకులు, బొగ్గు, రాగి వంటి ముడిపదార్ధాలు పెద్దఎత్తున దిగుమతి చేసుకుంది. దీంతో నిల్వలు పేరుకుపోయాయి. దీనికి పరిష్కారంగా వడ్డీ రేట్లు పెంచాలి. అందుకే చైనాలో షేర్లు, రియల్‌ ఎస్టేట్‌ ధరలు పతనం అవుతున్నాయి.

మనదేశం మాటో..: మనదేశంలో ఇప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేదు. మనకు అతిపెద్ద వర్తక భాగస్వామి అయిన చైనా సమస్యల పాలయితే మనకూ ఇబ్బందులు తప్పవు. యూరో జోన్‌, అమెరికా ఇతర అతిపెద్ద వర్తక భాగస్వాములు. ఈ మూడుచోట్లా కష్టాలు చోటుచేసుకుంటే మనదేశానికి అంతా బాగుంటుందని భావించడానికి వీల్లేదు. కాకపోతే ఈ దేశాలతో పోలిస్తే మన స్థితి కాస్త ఫర్వాలేదు. చమురు ధరలు పెరుగుతుండటం మనకు ఇబ్బందికరమైన పరిణామం. దీనివల్ల సబ్సిడీ భారం రూ. లక్ష కోట్లకు పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీరేట్లు పెంచాల్సి వస్తుంది. అదే జరిగితే అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్లకు పెనుభారమే. ప్రస్తుతం విదేశీ సంస్థాగత పెట్టుబడులు (హాట్‌ మనీ) పెద్దఎత్తున మనదేశానికి వస్తున్నాయి. ఇది కూడా ప్రమాదమే. అవి ఎప్పుడు వెనక్కి వెళ్లిపోతాయో అంచనా వేయలేం. ప్రతిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కృషి చేయాలి. రిటైల్‌, బీమా, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో ఎఫ్‌డీఐలను ఇంకా అనుమతించాలి. దేశీయంగా బలమైన బాండ్‌ మార్కెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల స్థితిపై కన్నేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కంపెనీలైనా, మదుపుదార్త్లెనా ప్రస్తుత పరిస్థితుల్లో అనవసర ఖర్చులు, విస్తరణల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ధరలు తగ్గినప్పుడల్లా బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉండటం మదుపుదార్లకు క్షేమకరంగా కనిపిస్తోంది.

- కె. కృష్ణంరాజు, క్రిసాని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఎండీ

పత్తి కొను'గోడు'

ధర తగ్గడంతో రైతన్న విలవిల..
ఎగుమతుల నిలుపుదలే కారణం!
వారంలో క్వింటాలు ధర రూ.500 పతనం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పత్తి ఎగుమతులను కేంద్రం నిషేధించడంతో మార్కెట్‌లో ధరతోపాటు కొనుగోలు తగ్గింది. వారం వ్యవధిలో క్వింటాలుకి రూ.500 ధర తగ్గడంతో రైతుల్లో కలవరం మొదలైంది. తొలుత దేశవ్యాప్తంగా 292 లక్షల బేళ్లు పత్తి ఉత్పత్తి అవుతుందని భావించిన కేంద్రం ఎగుమతులను అనుమతించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 19 వరకు దాదాపు 58 లక్షల బేళ్లు చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి జరిగింది. ఏటా 70 లక్షల బేళ్లు ఎగుమతి అవుతాయి. ఈ ఏడు ఎక్కువ ఎగుమతి జరగడంతో ఈ నెల 19వ తేదీ నుంచి ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. టెక్స్‌టైల్‌ కమిషనర్ల వద్ద వ్యాపారులు రిజిస్టరు చేసుకున్న 22 లక్షల బేళ్ల ఎగుమతులను అనుమతించారు. దేశంలో ఉత్పత్తయిన 292 లక్షల బేళ్లలో దేశీయ అవసరాలకు 230 లక్షల బేళ్లు అవసరమవుతాయని జౌళి పరిశ్రమ అంచనా. ఇప్పటివరకు జరిగిన ఎగుమతులు, రిజిస్టరు అయినవి కలిపితే 80 లక్షల బేళ్ల వరకు వచ్చాయి. మిగిలింది 212 లక్షల బేళ్లే కావడంతో కేంద్రం కొత్తగా ఎగుమతులను నిలిపింది.

సీసీఐ కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించినా.. ధరల గిట్టుబాటుగా ఉండటంతో రైతులు ఊరట చెందారు. తెలంగాణ జిల్లాల్లో నిల్వ చేసుకున్న రైతులకు ఎగుమతులను నిషేధించిన కేంద్రం నిర్ణయం అశనిపాతంలా తాకింది. దీంతో దేశీయంగా పత్తి ధరలు తగ్గిపోవడం ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వారం క్రితం వరకు క్వింటాలు రూ.3600 పలికిన పలికిన పత్తి మంగళవారం రూ.3200, బుధవారం రూ.3100కు పడిపోయాయి. గుంటూరు జిల్లాలో క్వింటాలు రూ.3400 వరకు పలికిన ధర రూ.300 వరకు తగ్గింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 50 లక్షల బేళ్ల పత్తి అమ్మకాలు జరగ్గా మరో 5 లక్షల బేళ్లు రైతుల వద్ద నిల్వ ఉన్నట్లు అంచనా. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం దారం, నూలు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీని 7.5 శాతానికి పెంచడంతో నూలుమిల్లుల యజమానులు కొనుగోళ్లను తగ్గించారు. ఇది ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లపై ప్రభావం చూపింది. ఇప్పటికే వరంగల్‌ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిచాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మార్కెట్‌ యార్డులకు సెలవు ప్రకటించారు. శని, ఆదివారాల్లో సాధారణ సెలవులు. దీంతో ఈ నాలుగు రోజులు విక్రయాలు ఉండవు.

నేడు, రేపు పత్తి పరిశ్రమల బంద్‌
గుంటూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాలు పత్తి పరిశ్రమలు బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఎ.పి. కాటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోరంట్ల పున్నయ్యచౌదరి తెలిపారు. బుధవారం గుంటూరు నగరంలోని కాటన్‌ అసోసియేషన్‌ హాలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం దూది ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయడం సమంజసం కాదన్నారు. దీనికి నిరసనగా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌, కాటన్‌ ట్రేడర్స్‌ బంద్‌ నిర్వహిస్తున్నారన్నారు. ఎగుమతులు నిలిపివేయడం సరికాదని, వెంటనే పునఃప్రారంభించాలన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ఈ విషయమై జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు నష్టపోతారని, అందుకే తాము బంద్‌ నిర్వహిస్తున్నామన్నారు. రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి రోశయ్యను కలవనున్నట్లు ఆయన తెలిపారు.

బ్యాక్‌అప్‌ తప్పనిసరి!

నుకోకుండా ఒక రోజు... హార్డ్‌డిస్క్‌ క్రాష్‌ అయ్యి డేటా యాక్సెస్‌ కాకుంటే! డిలీట్‌ చేసిన ఫైల్స్‌ ముఖ్యమైనవని తెలిస్తే! వాటిని తిరిగి పొందాల్సివస్తే! బ్యాక్‌అప్‌ తప్పనిసరి!
కంప్యూటర్‌లో వందల జీబీల్లో మెమొరీ అందుబాటులోకి వచ్చేసింది. వేలల్లో ఫైల్స్‌ని భద్రం చేస్తున్నాం. వాటిల్లో ముఖ్యమైన వర్డ్‌ డాక్యుమెంట్స్‌, కంపెనీ ఉత్పత్తికి సంబంధించిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్స్‌, మీకు ఇష్టమైన ఆడియో, వీడియోలు ఉండొచ్చు. అనుకోకుండా మీరుగానీ, ఇతరులుగానీ వాటిని డిలీట్‌ చేస్తుంటారు. తిరిగి పొందడం కోసం టూల్స్‌ వాడతారు. మరి, బ్యాక్‌అప్‌ చేస్తున్నారా? చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందే జాగ్రత్త పడితే మంచిది కదా! అందుకే మీ డేటాని సులువుగా బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో చక్కని మార్గాలు మీ కోసం...
ఒక్క 'బిట్‌' పోదు
డిస్క్‌ ఇమేజింగ్‌ ద్వారా బ్యాక్‌అప్‌ చేసుకోవాలనుకుంటే Macrium Reflect సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎక్స్‌పీ, విస్టా, విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో దీన్ని రన్‌ చేయవచ్చు. File Backup, Disk Imaging, XML పద్ధతుల్లో డేటాని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. సీడీ, డీవీడీ, లోకల్‌, నెట్‌వర్క్‌ డ్రైవ్‌ల్లో సురక్షితంగా కాపీ పెట్టుకోవచ్చు. ఇతరులు వాటిని యాక్సెస్‌ చేయకుండా బ్యాక్‌అప్‌ డేటాకి పాస్‌వర్డ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ వాల్యూమ్‌ షాడో కాపీ సర్వీసు ద్వారా డిస్క్‌ ఇమేజ్‌లను క్రియేట్‌ చేసుకోవచ్చు. నిర్ణీత సమయాల్లో డేటా బ్యాప్‌అప్‌ అయ్యేలా చేయవచ్చు. www.macr ium.com/reflectfree.asp
అంతా ఆన్‌లైన్‌లోనే!
వేగంగా, సురక్షితంగా డేటాని ఆన్‌లైన్‌లోనే బ్యాక్‌అప్‌ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తోంది IDrive. సైట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని, సైన్‌ఇన్‌ అయ్యి రెండే క్లిక్కుల్లో ఫొటోలు, డాక్యుమెంట్స్‌లాంటి ముఖ్యమైన డేటాని బ్యాక్‌అప్‌ చేయవచ్చు. 2 జీబీ స్పేస్‌ని ఉచితంగా పొందొచ్చు. ఆటోమాటిక్‌ బ్యాక్‌అప్‌ సదుపాయాన్ని సెట్‌ చేసుకోవచ్చు. మీ డేటాని మేం సురక్షితం చేస్తాం అంటున్నారు Mozyhome నిర్వాహకులు. దీంట్లో కూడా 2 జీబీ స్పేస్‌ ఉచితం. మిలటరీ గ్రేడ్‌ ఎన్‌క్రిప్షన్‌తో డేటాని సెక్యూర్‌ చేస్తున్నారు. అప్‌గ్రేడ్‌ సర్వీసులతో అపరిమిత స్టోరేజ్‌ స్పేస్‌ని పొందొచ్చు. www.idrive.com, http://mozy.com/ home
50 జీబీ ఉచితం!
నెట్‌ సెంటర్‌, ఆఫీస్‌, మరెక్కడైనా ఏదైనా ముఖ్యమైన డేటాని సేవ్‌ చేయాల్సివస్తే? ఆ సమయంలో మీ దగ్గర పెన్‌డ్రైవ్‌గానీ మరేదైనా బ్యాక్‌అప్‌ డ్రైవ్‌ లేకపోతే? వెంటనే ADriveలోకి లాగిన్‌ అయిపోండి. మెయిల్‌ ఐడీతో సభ్యత్వ నమోదు చేసుకుని 50 జీబీ మెమొరీని ఉచితంగా పొందొచ్చు. ఆన్‌లైన్‌ స్టోరేజీ, బ్యాక్‌అప్‌ సర్వీసుగా దీన్ని పిలుస్తున్నారు. సినిమాలు, డాక్యుమెంట్‌లు, ఫొటోలు, మ్యూజిక్‌... ఇలా డేటా ఏదైనా అప్‌లోడ్‌ చేసుకుని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్‌ని ఆన్‌లైన్‌లోనే ఎడిట్‌ చేసుకోవచ్చు. ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయడానికి జావా స్క్రిప్ట్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. సిస్టంలో మాదిరిగా ఫోల్డర్లను క్రియేట్‌ చేసుకోవచ్చు. డేటాని ఇతరులతో పంచుకోవచ్చు కూడా. www.adrive.com
మరో 25 జీబీ
సిస్టంలోని హార్డ్‌డ్రైవ్‌ మాదిరిగా మైక్రోసాఫ్ట్‌ ఉచితంగా 25 జీబీతో స్కైడ్రైవ్‌ను అందిస్తోంది. కంప్యూటర్‌ లేకపోయినా నెట్‌ సెంటర్‌లో బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని స్కైడ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. మెయిల్‌ ఐడీతో సభ్యత్వ నమోదు చేసుకోవాలి. సైన్‌ఇన్‌ అయ్యాక మైకంప్యూటర్‌లో మాదిరిగానే Create folders లింక్‌ను ఎంచుకుని ఫోల్డర్లను క్రియేట్‌ చేసుకోవచ్చు. Add filesపై క్లిక్‌ చేసి ఐదు ఫైల్స్‌ని ఒకేసారి అప్‌లోడ్‌ చేయవచ్చు. మీరు ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తే మెనూబార్‌లోని Slide Show ఎంచుకుని చూడొచ్చు. ఫైల్స్‌ని Icons, Details, Thumbnails వ్యూలో చూడొచ్చు. మోర్‌లోని View Permissionsపై క్లిక్‌ చేసి ఫైల్స్‌ని ప్రైవేటు, పబ్లిక్‌ చేయవచ్చు. డేటాని స్నేహితులతో పంచుకోవాలనుకుంటే Shareని ఎంచుకోండి.www.skydrive.live.com
రెండూ కలిపితే 15 జీబీ
వ్యాపార నిమిత్తం ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని బ్యాక్‌అప్‌ చేసుకుని మానేజ్‌ చేసుకోవాలనుకుంటే humyo సర్వీసులో సభ్యత్వం నమోదు చేసుకుంటే సరి! 10 జీబీ ఉచితం. Backup, Access, Share, sync సర్వీసుల్ని దీంట్లో పొందొచ్చు. 256 బిక్‌ ఎన్‌క్రిప్షన్‌ టెక్నాలజీ రక్షణ వలయంతో డేటాని ఇతరులతో పంచుకోవచ్చు. ఫేస్‌బుక్‌, హాట్‌మెయిల్‌, జీమెయిల్‌ యూజర్లకు సులువుగా ఆహ్వానాన్ని పంపొచ్చు. 2,500 డాక్యుమెంట్స్‌, పాటలు, ఫొటోలను బ్యాక్‌అప్‌ చేసుకోవాలంటే OpenDriveలో సైన్‌ఇన్‌ అవ్వండి. దీంట్లోని బేసిక్‌ ప్లాన్‌లో 5 జీబీ ఉచితంగా అందిస్తున్నారు. www.humyo.com, www.opendrive.com
మైక్రోసాఫ్ట్‌ 'సింక్‌'
ఇల్లు, ఆఫీసుల్లో ఒకటి కంటే ఎక్కువ సిస్టంలను వాడుతున్నారా? నెట్‌వర్క్‌లోని అన్ని సిస్టమ్స్‌లో క్రియేట్‌ చేసిన ఫైల్స్‌ని పూర్తిస్థాయిలో మేనేజ్‌, బ్యాక్‌అప్‌ చేసుకోవడానికి మైక్రోసాప్ట్‌ రూపొందించిన SyncToy 2.1 యుటిలిటీని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. లోకల్‌ నెట్‌వర్క్‌లో మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనే డేటాని సింక్రనైజ్‌ చేయడానికి Windows Live FolderShare టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. బ్యాక్‌అప్‌ నెట్‌వర్క్‌ని క్రియేట్‌ చేసుకోవడం దీంట్లో చాలా సులభం. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు http://download.cnet.com/synctoy/3000-2248_4-10629009.html
మరికొన్ని...
నచ్చిన ఫొటోలు, డాక్యుమెంట్స్‌, ప్రజెంటేషన్స్‌... లాంటి ముఖ్యమైన డేటాని బ్యాక్‌అప్‌ చేసుకోవాలనుకుంటే MyOtherDrive ఆన్‌లైన్‌ సర్వీసులో సైన్‌ఇన్‌ అవ్వాలి. 2 జీబీ ఉచితం. ఒకే ఎకౌంట్‌తో మల్టిపుల్‌ కంప్యూటర్లలో బ్యాక్‌అప్‌ చేయవచ్చు. డేటాని ఇతరులతో పంచుకోవచ్చు. డ్రాప్‌బాక్స్‌ సర్వీసులో కూడా 2 జీబీ ఉచితం. www.myotherdrive.com, www.dropbox.com

* బుక్‌మార్క్స్‌, పాస్‌వర్డ్‌లు, బ్రౌజింగ్‌ హిస్టరీ, ఓపెన్‌ చేసున్న ట్యాబ్స్‌ని బ్యాక్‌అప్‌ చేసుకోవాలంటే Weave Browser Sync ఫైర్‌ఫాక్స్‌ యాడ్‌ఆన్‌ను బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్‌ చేయండి. http://addons.mozilla.org/en-US/firefox/addon/10868

* ట్విట్టర్‌లో మీ పోస్టింగ్స్‌, ఫ్రెండ్స్‌ని జాబితాని బ్యాక్‌అప్‌ చేసుకోవాలనుకుంటే Tweetbackup సైన్‌ఇన్‌ అవ్వండి. http://tweetbackup.com

*DiverBackup, http://sourceforge.net/projects/drvback

*Syncplicity, www.syncplicity.com

CUCKU Social Backup, www.cucku.com/download. aspx
*AceBackup 3, www.acebackup.com/download.htm

తస్మాత్ జాగ్రత్త !

ముదురుతున్న గ్రీస్‌ సంక్షోభం
స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇటలీలకూ ముప్పు!
గడ్డు స్థితిలో ఐరోపా దేశాలు
కుప్పకూలిన ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు
సెన్సెక్స్‌ పతనం 300 పాయింట్లు పైనే
మదుపర్లూ.. అనవసర ఖర్చులకు దూరం జరగండి
బంగారం, వెండి కొనుగోలు శ్రేయస్కరం
నిన్న మొన్నటి మాంద్యం ఇంకా సమసిపోనేలేదు. అప్పుడే గ్రీసు రూపంలో మరో సంక్షోభం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారింది.తాజాగా అది అంతర్జాతీయ మార్కెట్లను కుప్పకూల్చింది. మన మార్కెట్‌ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇప్పటికే పోర్చుగల్‌పై ఈ ప్రభావం పడగా ఇటలీ, స్పెయిన్‌వంటి దేశాలకూ ముప్పు ముంచుకొస్తోంది. మరింత ఆలస్యమైతే అమెరికా, ఆసియాకూ ఈ ఛాయలు పాకే అవకాశముందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్రీసు సంక్షోభం రోజు రోజుకూ కాదు.. గంట గంటకూ వేగంగా వ్యాపిస్తోందంటున్న నిపుణుల మాటలు మరింత ఆందోళనను కలుగజేస్తున్నాయి.
రోమారు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రీస్‌ రూపంలో తాజా ముప్పు ఉప్పెనలా ముంచుకొచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ కుంగదీసేదిలా కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం యూఎస్‌, ఐరోపా దేశాల్లో కంపెనీలు, బ్యాంకులు దివాలాతో సంక్షోభం తలెత్తితే.. ఇప్పుడు ప్రభుత్వాలు అప్పుల పాలై ఈ ముప్పును కొనితెస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం లాటిన్‌ అమెరికా దేశాలు ఎదుర్కొన్న స్థితినే ఇప్పుడు ఐరోపా ఎదుర్కొంటోంది. గ్రీస్‌, ఇటలీ, స్పెయిన్‌ తదితర దేశాలు ఒకదానివెంట మరొకటిగా దివాలా దిశగా కదులుతున్నాయి.

కష్టాల కడలిలో ఐరోపా: గ్రీస్‌ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ ఏకంగా 'పనికిరాని (జంక్‌)' స్థాయికి దిగజార్చింది. అంటే ఆ దేశంలోని బ్యాంకులన్నీ దివాలా తీసినట్లే. అలాగే పోర్చుగల్‌ రేటింగ్‌నూ తగ్గించింది. ఇదే వరుసలో స్పెయిన్‌, ఇటలీ ఉన్నాయి. వీటిని ఒడ్డున పడేయాలంటే కనీసం 2 లక్షల కోట్ల యూరోలు (మన కరెన్సీలో 120 లక్షల కోట్ల రూపాయలు) కావాలి. గ్రీస్‌కు 'జంక్‌' రేటింగ్‌ రావడంతో ఆ దేశ బాండ్‌ మార్కెట్‌ కుప్పకూలి ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ సైతం నష్టపోతున్నాయి. రేటింగ్‌ తగ్గడంతో పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాల్లోని బ్యాంకింగ్‌ వ్యవస్థ కూలిపోయే విధంగా ఉంది. ఇబ్బంది కొన్ని ఐరోపా దేశాలకే అనుకుంటే పొరపాటే. ఇది ఆరంభం మాత్రమే. నెమ్మదిగా ఇతర ఐరోపా దేశాలకు, జపాన్‌, అమెరికాలకూ సంక్షోభం విస్తరిస్తుంది. అప్పుల భారమే ఈ స్థితికి ప్రధాన కారణం. ఐరోపా దేశాలు వచ్చే ఏడాది వ్యవధిలో 1.6 లక్షల కోట్ల (దాదాపు రూ.96 లక్షల కోట్ల) అప్పు తీర్చాల్సి ఉంది. గ్రీస్‌ వచ్చే మూడేళ్ల పాటు ఏటా 5000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్ల) అప్పు చేయకపోతే బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. ఐరోపా దేశాల ఆర్థిక లోటు (గ్రీస్‌కు 13.6 శాతం, పోర్చుగల్‌ 9.4 శాతం, స్పెయిన్‌ 12 శాతం, బ్రిటన్‌ 11.5 శాతం) అంతులేని స్థాయికి పెరిగిపోయింది. ఐరోపాలో మొదలైన సమస్యను తక్షణం కట్టడి చేయకపోతే కష్టమే. ఎందుకంటే ఈ దేశాల మధ్య మూలధన మార్పిడికి ఆంక్షలు లేవు. దీనివల్ల మూలధనం వేగంగా ఆయా దేశాల నుంచి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇంకా అంతులేని సంక్షోభంలో ఆయా దేశాలు చిక్కుకుపోతాయి.

అమెరికా, చైనా: అమెరికా తాను సృష్టించుకున్న కష్టాల్లో పీకల్లోతు మునిగిపోయి ఉంది. నిరుద్యోగం పెద్ద సమస్య. ఫలితంగా ఎంతోమంది ఇళ్లు అమ్ముకోవలసి వస్తోంది. అక్కడి పౌరుల వ్యక్తిగత ఆదాయం క్షీణిస్తూనే ఉంది. పైగా అమెరికా ప్రభుత్వం చేస్తున్న అప్పులు భయాందోళన కలిగిస్తున్నాయి. అవి తీర్చలేనంతగా పెరిగిపోతున్నాయి. ఆశ్చర్యకరంగా కష్టాలను అడ్డుకోగలదని భావిస్తున్న చైనా కూడా ఇబ్బందుల్లో ఉంది. చైనా రియల్‌ఎస్టేట్‌ గాలి బుడగ ఏక్షణంలోనైనా పేలిపోనుంది. 2009లో చైనా బ్యాంకులు 1.4 ట్రిలియన్‌ డాలర్ల ఇంటిరుణాలు మంజూరు చేశాయి. ఈ మొత్తం భారత స్థూల ఆదాయం కంటే ఎక్కువ. ద్రవ్యోల్బణం చైనాలో అదుపులేని స్థాయిలో ఉంది. అతిజాగ్రత్తకు పోయి చైనా పెద్దఎత్తున సరుకులు, బొగ్గు, రాగి వంటి ముడిపదార్ధాలు పెద్దఎత్తున దిగుమతి చేసుకుంది. దీంతో నిల్వలు పేరుకుపోయాయి. దీనికి పరిష్కారంగా వడ్డీ రేట్లు పెంచాలి. అందుకే చైనాలో షేర్లు, రియల్‌ ఎస్టేట్‌ ధరలు పతనం అవుతున్నాయి.

మనదేశం మాటో..: మనదేశంలో ఇప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం అదుపులో లేదు. మనకు అతిపెద్ద వర్తక భాగస్వామి అయిన చైనా సమస్యల పాలయితే మనకూ ఇబ్బందులు తప్పవు. యూరో జోన్‌, అమెరికా ఇతర అతిపెద్ద వర్తక భాగస్వాములు. ఈ మూడుచోట్లా కష్టాలు చోటుచేసుకుంటే మనదేశానికి అంతా బాగుంటుందని భావించడానికి వీల్లేదు. కాకపోతే ఈ దేశాలతో పోలిస్తే మన స్థితి కాస్త ఫర్వాలేదు. చమురు ధరలు పెరుగుతుండటం మనకు ఇబ్బందికరమైన పరిణామం. దీనివల్ల సబ్సిడీ భారం రూ. లక్ష కోట్లకు పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీరేట్లు పెంచాల్సి వస్తుంది. అదే జరిగితే అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్లకు పెనుభారమే. ప్రస్తుతం విదేశీ సంస్థాగత పెట్టుబడులు (హాట్‌ మనీ) పెద్దఎత్తున మనదేశానికి వస్తున్నాయి. ఇది కూడా ప్రమాదమే. అవి ఎప్పుడు వెనక్కి వెళ్లిపోతాయో అంచనా వేయలేం. ప్రతిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కృషి చేయాలి. రిటైల్‌, బీమా, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో ఎఫ్‌డీఐలను ఇంకా అనుమతించాలి. దేశీయంగా బలమైన బాండ్‌ మార్కెట్‌ను రూపొందించాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల స్థితిపై కన్నేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కంపెనీలైనా, మదుపుదార్త్లెనా ప్రస్తుత పరిస్థితుల్లో అనవసర ఖర్చులు, విస్తరణల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ధరలు తగ్గినప్పుడల్లా బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉండటం మదుపుదార్లకు క్షేమకరంగా కనిపిస్తోంది.

- కె. కృష్ణంరాజు, క్రిసాని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఎండీ
పేరుకు అది చిన్న దేశమే. కానీ.. అక్కడ మొదలైన రుణ సంక్షోభం మాత్రం చిన్నది కాదు. గత కొన్ని నెలలుగా ఇంతలింతలవుతున్న ఈ దావానలం ఇపుడు తీవ్ర రూపు దాల్చింది. అది క్రమంగా ఐరోపా దేశాలకూ పాకి ఆర్థిక వ్యవస్థలను మరింత నిర్వీర్యం చేసే ప్రమాదముందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. బుధవారం ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలడం ఇందుకు తాజా ఉదాహరణ. డాయిష్‌ బ్యాంకు అయితే చావు ముంచికొచ్చే పరిస్థితిగా అభివర్ణించడం సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది.
ఇతర దేశాలకూ విస్తరిస్తోందా?
గ్రీసు దేశానికున్న మోయలేని అప్పుల ప్రభావం పోర్చుగల్‌కు పాకుతోంది. తాజాగా ఎస్‌&పీ రేటింగ్‌ ఆ దేశానికీ తగ్గడం దీనిని సూచిస్తోంది. రాజకీయ, ఆర్థిక నాయకులు జాగ్రత్తగా లేకపోతే ఈ సంక్షోభం మార్కెట్లో భయాందోళనలను రాజేస్తుంది. అప్పుల భారం ఎక్కువగా ఉన్న దేశాలనూ ఇది సంక్షోభంలోకి లాగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎలాగంటే.. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వం వద్ద నిధులుంచిన పెట్టుబడిదార్లు డబ్బులు వెనక్కి ఇవ్వమని కోరతారు. అపుడు ఆ ప్రభుత్వం మరింత ఎక్కువ వడ్డీ రేట్లకు అప్పులు తెచ్చి ఈ అప్పు తీర్చాల్చి ఉంటుంది. ఇలా అప్పులు పేరుకుపోయి చివరకు అటు ప్రభుత్వం, ఇటు పెట్టుబడిదార్ల వద్ద మిగిలేది ఏమీ ఉండదు. కుప్పలకొద్దీ అప్పులు తప్ప. అపుడు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలతాయ్‌. ఈ ప్రమాదం చిన్న దేశాలకే ఉందనుకుంటే పొరబాటు. స్పెయిన్‌, బ్రిటన్‌లతో పాటు అమెరికాకూ ఉండడం గమనార్హం.
బయటపడే మార్గం దిశగా అడుగులు
సంక్షోభాల అల తగ్గుముఖం పట్టే సూచనలూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమోదించిన సహాయ ప్యాకేజీని యూరోపియన్‌ యూనియన్‌ గ్రీసుకు అందజేస్తే ఈ సంక్షోభానికి త్వరగా తెర వేయవచ్చు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి బెర్లిన్‌లో జర్మనీ రాజకీయ నాయకులు, అధికార్లతో ఐఎమ్‌ఎఫ్‌ అధిపతి డొమినిక్‌ స్ట్రాస్‌ కాన్‌ గ్రీసు సంక్షోభంపై చర్చించారు. అయితే ఇప్పుడే ఇంకా సహాయ ప్యాకేజీకి తుది రూపునివ్వలేదని ఆయన సమావేశం అనంతరం వెల్లడించారు. మరో పక్క అంతర్జాతీయ ప్యాకేజీ విలువ 100-120 బిలియన్‌ డాలర్ల వరకూ పెరగొచ్చని ఓ జర్మనీ చట్టసభ్యుడు అభిప్రాయపడడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఐరోపా, ఐఎమ్‌ఎఫ్‌ల నుంచి 45 బిలియన్‌ యూరోల(రూ.2,60,000 కోట్లు)ను సహాయంగా అడిగిన సంగతి తెలిసిందే.
ప్రపంచ మార్కెట్లు ఇలా పడ్డాయ్‌
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూంటే గ్రీస్‌ దేశ భవిష్యత్‌ అంచనాను 'చెత్త'(జంక్‌)గా రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌&పూర్స్‌ తేల్చి చెప్పడంతో అగ్గిరాజుకుంది. ప్రపంచ మార్కెట్ల సూచీ ఎమ్‌ఎస్‌సీఐ 0.9 శాతం పడింది. అంతక్రితం మంగళవారం ఇది 3 శాతం పతనమైంది. అంతక్రితం రోజు 3.1 శాతం పడ్డ ఐరోపా మార్కెట్‌ (ఎఫ్‌టీఎస్‌ఈ) బుధవారం మరో 0.7% నష్టపోయింది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 2.6% కుదేలైంది. 8 వారాలుగా పెరుగుతూ వస్తున్న అమెరికా మార్కెట్లు మంగళవారం ఒక్కసారి కుదేలయ్యాయి. డోజోన్స్‌ మూడు నెలల కనిష్ఠ స్థాయి 10,991కి పతనమైంది.
మన మార్కెట్లకూ 'గ్రీసే'
భారత మార్కెట్లనూ గ్రీసు సంక్షోభం విడిచిపెట్టలేదు. గ్రీసు, పోర్చుగల్‌ దేశాల రేటింగ్‌ దిగజారడం ఇక్కడి మార్కెట్లకు శాపమైంది. అంతక్రితం రోజు డోజోన్స్‌ పతనం పూర్తి ప్రభావం చూపింది. ఒక్కసారిగా సెన్సెక్స్‌ దాదాపు నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. 310 పాయింట్లు కోల్పోయి 17,380.08 వద్ద స్థిరపడింది. ఒక దశలో 17,344.58 వద్ద కనిష్ఠ స్థాయినీ తాకింది. మదుపర్లు బుధవారం ఒక్కరోజే రూ.41,000 కోట్లు కోల్పోయారు. మరో పక్క గురువారం(నేడు) డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు తీరనుండడం కూడా కొంత ప్రతికూలంగా నిలిచింది. అంచనాల కంటే తక్కువగా ఫలితాలను ప్రకటించడంతో కొన్ని కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో 4.16% నష్టపోయి రూ.1,017కు పరిమితమైంది. ఐసీఐసీఐ బ్యాంకు 2.93% పోగొట్టుకుని రూ.918.65 వద్ద నిలిచింది. మొత్తం 13 బీఎస్‌ఈ సూచీలూ కుంగాయి. సెన్సెక్స్‌లోని 30 స్క్రిప్‌లలో 25 నేల చూపులు చూశాయి. ఇతర నష్టపోయిన షేర్లలో జైప్రకాశ్‌ అసోసియేట్స్‌(4.48%), టాటా స్టీల్‌(3.52%), డీఎల్‌ఎఫ్‌(3.17%), టాటా మోటార్స్‌(3%) ఉన్నాయి. అయితే సన్‌ఫార్మా, ఏసీసీ, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐలు మాత్రం స్వల్ప లాభాలు పొందాయి.

ఖజానాకు రూ.281.93 కోట్ల గండి

పాత కన్సార్టియంకే రాజీవ్‌ రహదారి విస్తరణ పనులు
టెండర్ల రద్దుకు సర్కారు ససేమిరా
చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
ప్రభుత్వ సలహాదారుడి ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం జీ హుజూర్‌ అంది. ప్రభుత్వ ఖజానాకు రూ.281.93 కోట్ల మేర గండిపడుతుందని తెలిసినా కూడా రామగుండం-హైదరాబాద్‌ రాజీవ్‌ రహదారి విస్తరణ ప్రాజెక్టును అధికార పార్టీ ఎంపీకి చెందిన గాయత్రి-డీఎల్‌ఎఫ్‌ కన్సార్టియంకే కట్టబెట్టింది. ఈ మేరకు బుధవారం రహదారులు- భవనాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలిస్తే ఖజానాకు భారీ ఎత్తున ఆదా అవుతుందని తెలిసినా కూడా సర్కారు ససేమిరా అంది.

రాష్ట్రంలో మూడు ప్రధాన రహదారులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద నాలుగు వరుసలుగా విస్తరించాలని గత ఏడాదే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఒకటైన హైదరాబాద్‌-కరీంనగర్‌-రామగుండం రాజీవ్‌ రహదారి కోసం రూ.1358 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. సర్దుబాటు నిధి కింద రూ.177.07 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. టెండర్లను దాఖలు చేసిన డీఎల్‌ఎఫ్‌-గాయత్రి కన్సార్టియం రూ.529 కోట్ల మేర సర్దుబాటు నిధి కావాలంటూ టెండర్లను వేసింది. అంచనాలు ఎక్కువగా ఉండడం, రాష్ట్ర ఖజానాపై సర్దుబాటు నిధుల భారం పడనుండడంపై 'ఈనాడు' అప్పట్లో వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపిన కన్సార్టియం కేవలం రూ.9 కోట్లు మాత్రమే తగ్గించడానికి ముందుకు వచ్చింది. ఈ తగ్గింపుతో కాంట్రాక్టును ఆమోదిస్తే కేంద్రమిచ్చే సర్దుబాటు నిధి కాకుండా ప్రభుత్వ ఖజానాకు రూ.343 కోట్ల మేర గండిపడే అవకాశం ఉంది. దీనిపై మరోసారి 'ఈనాడు'లో కథనం వచ్చింది. దీంతో సంబంధిత కన్సార్టియంతో మరోసారి అధికారులు చర్చలు జరపగా రూ.70 కోట్లను తగ్గించడానికి అంగీకరించింది. టెండర్లు పిలిచినపుడు ఏ నిబంధనలకు అంగీకరించిందో అవే నిబంధనలకు అనుగుణంగానే పనులు చేయడానికి అంగీకరించడంతో కాంట్రాక్టును కట్టబెడుతూ ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి లక్ష్మీపార్థసారధి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.281.93 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

అంచనాలను పెంచి చూపించడమే కాకుండా వాహనాల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపించారని ఆరోపణలున్నాయి. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వ ఖజానాకు భారం పడుతుండగా టోల్‌ వసూళ్ల రూపేణా కాంట్రాక్టు సంస్థలు అధికంగా లబ్ధి పొందనున్నాయి. నిబంధనల్లో ఎటువంటి మార్పులు లేకుండా రూ.70 కోట్లను తగ్గించడానికి అంగీకరించారంటే మొత్తం అంచానాల్లో ఏ మేరకు మతలబులు జరిగాయో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

'సోయా'కు గడ్డుకాలం!

పెరిగిన పోటీ
అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ధర
ఆదిలాబాద్‌- న్యూస్‌టుడే
ఇప్పటివరకు అంతర్జాతీయ విపణిలో తనకంటూ ఒక పట్టును నిరూపించుకుంటున్న సోయా పరిశ్రమ అమెరికా, బ్రెజిల్‌ల ధాటికి విలవిలలాడేటట్లుంది. సబ్బులు, ఖాద్య తైలాలు, కోళ్ల ఫారాలకు కావలసిన దాణాలకు ముడిపదార్థమైన సోయా పంట దిగుబడి తగ్గినా ధరలు పెరగకుండా మరింత తగ్గుతుండటం అటు రైతుల్లో, ఇటు సోయా కర్మాగారాల యాజమాన్యాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2009 ఖరీఫ్‌లో దాదాపు 1.90 లక్షల హెక్టార్లలో సోయా సాగయితే అందులో ఆదిలాబాద్‌లోనే 1.25 లక్షల హెక్టార్లు ఉంది. నిజామాబాద్‌లో మరో 50,000 హెక్టార్ల వరకు సాగయ్యింది. గత మూడేళ్లుగా సోయా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అది కూడా ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఎక్కువగా కనపడుతోంది. ఈ మధ్య కాలంలో నిజామాబాద్‌ తదితర జిల్లాలో ప్రజలు సోయా సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. రెండేళ్ల కిందట సోయా క్వింటాలుకు గరిష్ఠంగా రూ.2,600 వరకు ధర పలికింది. ఈసారి తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులతో 70 శాతం వరకు ఆదిలాబాద్‌లో సోయా పంట తుడుచిపెట్టుకుపోయింది. 2009 ఖరీఫ్‌ మొదట్లో క్వింటాలు సోయా ధర రూ.2,200 వరకు ఉండగా, నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం రూ.1,950కి చేరుకుంది.

ఎగుమతులపై ప్రభావం: మొదటి నుంచి భారత్‌ నుంచి సోయా నూనె, కేక్‌ (డీవోసీ)ల ఎగుమతి ఎక్కువగా బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలకు ఉండేది. అయితే సోయా ఎగుమతుల లాభాలను గరిష్ఠంగా ఆర్జించే ఉద్దేశంతో ఆమెరికా, బ్రెజిల్‌లు సోయా సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించి భారీగా సాగు చేయడంతో అంతర్జాతీయ విపణిలో సోయా ఉత్పత్తుల ధరలు గణనీయంగా పడిపోయాయి. రెండేళ్ల క్రితం సోయా క్రూడాయిల్‌ (రిఫైన్డ్‌ చేయనిది) 10 కిలోల ధర రూ.660 ఉండగా, ప్రస్తుతం రూ.400కు పడిపోయింది. ఇక కోళ్ల ఫారాల్లో దాణాగా ఉపయోగించే డీఓసీ (డీఆయిల్డ్‌ కేక్‌) రెండేళ్ల కిందట క్వింటాలుకు రూ.2,600 ఉండగా, ప్రస్తుతం రూ.1,700 వరకు ఉంది.

దెబ్బ మీద దెబ్బ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సోయా పరిశ్రమకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పరిణమించేటట్లుంది. హెచ్‌టీ విద్యుత్తును వినియోగిస్తోన్న సోయా పరిశ్రమలు యూనిట్‌ విద్యుత్తుకు రూ.3.25 వంతున చెల్లిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో యూనిట్‌కు రూ.3.75 చెల్లించవలసివస్తుంది.

మరింత ఇబ్బందికరమే: ఆదిలాబాద్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గాదె వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ అమెరికా, బ్రెజిల్‌ల వల్ల ఎగుమతుల్లో తగ్గుదల కనపడుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సోయా ఉత్పత్తులను స్థానికంగానే అమ్ముకోవాల్సి వస్తోందని, తాజాగా విద్యుత్తు ఛార్జీలను పెంచడంతో పరిశ్రమ మరింత ఇబ్బందిపడాల్సి ఉంటుందని చెప్పారు. సోయా ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అంతర్జాతీయంగా పోటీని తట్టుకుని విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చని తెలిపారు.

ప్రధాన కేంద్రం ఆదిలాబాద్‌
రాష్ట్రంలో సోయా పరిశ్రమకు ప్రధాన కేంద్రం ఆదిలాబాద్‌ జిల్లా. మొత్తం 3 కర్మాగారాలు రోజుకు 1,600 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో 200 టన్నుల సామర్థ్యం కల మరో పరిశ్రమ ఉంది. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే మహారాష్ట్రలో దాదాపు 60 వరకు సోయా పరిశ్రమలు, మధ్య ప్రదేశ్‌లో పదుల సంఖ్యలో సోయా పరిశ్రమలు ఉన్నాయి.

సబ్బుల తయారీలో కీలకం
క క్వింటాలు సోయా పంట నుంచి 17 శాతం క్రూడాయిల్‌, 82 శాతం డీఆయిల్డ్‌ కేక్‌- డీఓసీ ఉత్పత్తి అవుతాయి. తరుగుదల ఒక శాతమే ఉంటుంది. 100 కిలోల క్రూడాయిల్‌ను రీఫైన్‌ చేస్తే 95 కేజీల ఎడిబుల్‌ ఆయిల్‌ వస్తుంది. దీనిని వంటనూనెగా, ఇతరత్రా ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. మరో 5 కిలోలు చిక్కగా ఉండే మడ్డి లాంటి పదార్థం సబ్బుల తయారీకి కీలకం.

53 / 100

దేశంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు దూసుకుపోతున్నారు. మార్చిలో రికార్డు స్థాయిలో రెండు కోట్ల మంది కొత్తగా ఈ ఫోన్‌ కనెక్షన్లు తీసుకున్నారని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది. దీంతో దేశంలో ఫోన్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య ప్రతి 100 మందిలో 53కి చేరింది.
2 కోట్లు: గత నెలలో కొత్తగా 2 కోట్ల మంది మొబైల్‌ కనెక్షన్లు తీసుకున్నారు. ఈ ఏడాదిలోనే ఇది అత్యధికం. ముఖ్యంగా బీ,సీ విభాగపు నగరాల్లోని ప్రజలే ఎక్కువ ఫోన్‌ కనెక్షన్లు తీసుకున్నారు.

58.4 కోట్లు: మార్చిలో పెరిగిన కనెక్షన్లతో దేశంలో మొబైల్‌ చందాదారుల విస్తృతి మరో 3.6% మేర పెరిగి 56.4 కోట్ల నుంచి
58.43 కోట్లకు చేరింది.

3.7 కోట్లు: దేశంలో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్ల సంఖ్య మార్చిలో కూడా
3.7 కోట్లుగానే ఉంది. వినియోగదారుల సంఖ్యలో పెద్దగా మార్పులు కనిపించలేదు.

62 కోట్లు: ్లకొత్త వినియోగదారులతో దేశంలో మొత్తం టెలిఫోన్‌ చందాదారుల సంఖ్య (వైర్‌+వైర్‌లెస్‌) 62.12కోట్లకు ఎగసింది.అంతకు ముందు ఫిబ్రవరిలో సంఖ్య 60 కోట్లుగా ఉంది.

ఇకపై చూపిస్తాం మా సత్తా ...న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ సీఈఓ సుచేత్‌రావు దావులూరి

ఈ ఏడాది 20 కొత్త ఔషధాలు
జపాన్‌ మార్కెట్‌కు విస్తరణ
పరిశోధన- అభివృద్ధి విభాగం బలోపేతం
న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ సీఈఓ
సుచేత్‌రావు దావులూరి
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఔషధ కంపెనీ న్యూలాండ్‌ లేబరేటరీస్‌. గత మూడేళ్లుగా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలపై భారీగా వెచ్చించింది. అంతేగాక ఔషధ తయారీ సదుపాయాలను సైతం నవీకరించింది. కేవలం బల్క్‌ డ్రగ్స్‌కే పరిమితం కాకుండా కాంట్రాక్టు పరిశోధన, కాంట్రాక్టు తయారీ, క్లినికల్‌ పరీక్షల విభాగాల్లోకి తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. తత్ఫలితంగా ఖర్చులు పెరిగి గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నష్టాలు నమోదు చేయాల్సి వచ్చింది. కానీ ఈ పరిస్థితి తాత్కాలికమేనని, వచ్చే రెండు మూడేళ్లలో అనూహ్యమైన వృద్ధి ఉంటుందని అంటున్నారు న్యూలేండ్‌ లేబొరేటరీస్‌ సీఈఓ సుచేత్‌ రావు దావులూరి. ఆయన 'న్యూస్‌టుడే'కిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
న్యూస్‌టుడే: గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నష్టాలొచ్చాయి. ఎందువల్ల... మున్ముందు ఎలా ఉండొచ్చు?
సుచేత్‌ రావు: గత మూడేళ్లుగా మేం భారీగా విస్తరణ కార్యకలాపాలు చేపట్టాం. పరిశోధన-అభివృద్ధి విభాగంలోకి విస్తరించాం. హై పొటెన్సీ ఏపీఐలు, పెప్త్టెడ్‌ బిల్డింగ్‌ బ్లాకులు తయారు చేయడం మొదలుపెట్టాం. ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నాం. మౌలిక సదుపాయాలు, సామర్థ్యంపరంగా చూస్తే గత మూడేళ్ల క్రితం కంటే ఇప్పుడు ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాం. ఫార్మాలో ఒకేసారి పెట్టుబడి పెట్టి, వెంటనే ఫలితాలు ఆశించలేం. క్రమంగా పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చి దీర్ఘకాలంలో ప్రతిఫలాన్ని తీసుకోవాలి. సహజంగా ఈ విస్తరణ ఫలితంగా వడ్డీ భారం, తరుగుదల, పలు రకాల ఖర్చులు పెరిగిపోయాయి. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమే. మొత్తం మీద చూస్తే వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు పెరుగుతున్నాయి.

? వచ్చే రెండు మూడేళ్లలో ఆదాయాలు, లాభాలు ఎలా ఉంటాయి
మాది స్టాక్‌మార్కెట్లో నమోదైన కంపెనీ. అందువల్ల ఈ వివరాలను ముందుగానే బయటకు చెప్పలేం. కాకపోతే భవిష్యత్తు ఎంతో బాగుంటుందని మాత్రం స్పష్టం చేయగలను. గత అయిదేళ్లుగా ఏటా 20 శాతం చొప్పున వృద్ధి నమోదు చేస్తున్నాం. మున్ముందు ఇది ఇంకా అధికంగా ఉంటుంది. అదేవిధంగా నికర మార్జిన్లు కూడా పెరుగుతాయి. ఒక సానుకూల సంకేతం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సగానికి పైగా ఔషధ సరఫరా ఆర్డర్లు మాకు ఖరారయ్యాయి. ఆదాయాలు అధికంగా ఉంటాయనే దానికి ఇదొక సంకేతం. ముఖ్యంగా గుర్తించాల్సి అంశం- కేవలం ఏపీఐలు తయారు చేసే కంపెనీ ఇప్పుడు కెమికల్‌ డెవలప్‌మెంట్‌లో మొదటి దశ నుంచి భారీస్థాయి తయారీ వరకూ అన్ని పనులు చేయగలిగిన కంపెనీగా న్యూలాండ్‌ ఎదిగిందనే విషయం. మేం దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకెళ్తున్నాం.

? ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఔషధాల తయారీ ఏమైనా చేపడుతున్నారా
ఇప్పటికే మేం ఉన్న ఔషధ విభాగాల్లో, కొత్తగా ప్రవేశించే విభాగాల్లో కలిసి ఈ ఏడాదిలో 20 వరకూ కొత్త ఔషధాలు ప్రవేశపెడతాం. గత ఏడాదిలో 10 కొత్త ఔషధాలను మార్కెట్‌కు అందించాం. ఇంతకుముందే చెప్పినట్లుగా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను విస్తరించినందువల్ల కొత్త ఔషధాల తయారీ సాధ్యమవుతోంది. ప్రస్తుతం మేం కార్డియో వేస్క్యులర్‌, సెంట్రల్‌ నెర్వస్‌ సిస్టమ్‌, యాంటీ బయాటిక్‌, యాంటీ ఇన్ఫెక్టివ్స్‌, యాంటీ ఇమాటిక్స్‌ వంటి కొన్ని ప్రత్యేక విభాగాల్లో ఔషధాలు తయారు చేస్తున్నాం.

? పరిశోధన- అభివృద్ధి విభాగం ప్రధానంగా జనరిక్‌ ఔషధాల కోసమా లేక ఔషధాలు, ఔషధ సేవల కోసమా... దేనిపై ఈ విభాగం ప్రధానంగా పనిచేస్తోంది.
అటు జనరిక్‌ ఔషధాల్లో ఇటు కాంట్రాక్టు పరిశోధన, కాంట్రాక్టు తయారీ విభాగాల్లో ఆర్‌ అండ్‌ డి విభాగం దృష్టి కేంద్రీకరించింది. న్యూలాండ్‌ ఆర్‌ అండ్‌ డి విభాగానికి నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణం కల కేంద్రంలో 12 క్లినికల్‌ డెవలప్‌మెంట్‌ బ్లాకులు ఉన్నాయి, 180 మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారు. ఐపీఆర్‌, అనలైటికల్‌ ఆర్‌అండ్‌డీ, టెక్నాలజీ బదిలీ, డెవలప్‌మెంట్‌ క్యూఏ, కెమికల్‌ ఆర్‌అండ్‌డి, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆర్‌అండ్‌డీ పై గత రెండు మూడేళ్లలో రూ.25 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాం.

?జపాన్‌ మార్కెట్‌కు విస్తరించే సన్నాహాల్లో ఉన్నట్లు గతంలో మీరు చెప్పారు. ఈ విషయంలో ప్రగతి ఎలా ఉంది
కాంట్రాక్టు పరిశోధన, కాంట్రాక్టు తయారీ సేవలను జపాన్‌ మార్కెట్‌కు విస్తరిస్తున్నాం. దీనికి సంబంధించి అక్కడి ప్రముఖ ఔషధ కంపెనీలతో దీర్ఘకాలిక సంబంధాలు నెలకొల్పుకుంటున్నాం.

?కాటో రీసెర్చ్‌తో కలిసి అనుబంధ కంపెనీని ప్రారంభించారు. ఇది ఎందుకోసం ... ఏ దశలో ఉంది.
ప్రధానంగా ఫేజ్‌-2, ఫేజ్‌-3 క్లినికల్‌ పరీక్షల కోసం ఈ అనుబంధ కంపెనీ. ఇందులో న్యూలాండ్‌ లేబొరేటరీస్‌కు 30 శాతం వాటా ఉంది. ఈ ఏడాది చివర్లో దీని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను ఇది చేపడుతుంది.

మౌలికం ముందుకే...

మార్చిలో వృద్ధి 7.2%
పారిశ్రామిక ప్రగతిపై ఆశలు
న్యూఢిల్లీ: మౌలిక రంగ పరిశ్రమలు మార్చిలో ఆశాజనకమైన వృద్ధిని కనబర్చాయి.. కిందటేడాది ఇదే కాలంలో కేవలం 3.3 శాతంగా ఉన్న మౌలిక వృద్ధిరేటు ఈసారి ఏకంగా 7.2 శాతానికి పెరగడం గమనార్హం. పారిశ్రామిక రంగ రికవరీ వేగంగా చోటు చేసుకుంటోందనేందుకు ఇదొక నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మౌలిక రంగం తాజా పనితీరు మార్చి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సానుకూలంగా ఉంటాయనే సంకేతాలను పంపుతోందని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి నెలలో 4.7 శాతం వృద్ధిరేటుకు పరిమితమైన ముడి చమురు, పెట్రోలియం రిపైనరీ ఉత్పత్తులు, బొగ్గు, విద్యుత్తు, సిమెంటు, ఫినిష్‌డ్‌ ఉక్కు పరిశ్రమలు మార్చిలో గణనీయమైన పురోగతిని కనబర్చాయి. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో మౌలిక రంగాల సమీకృత వెయిటేజీ 26.7 శాతం. 2009 ఏప్రిల్‌ - 2010 మార్చికాలంలో వీటి వృద్ధిరేటు 5.5 శాతానికి చేరగా, కిందటేడాది ఇదేకాలంలో దీని విలువ 3 శాతంగా ఉన్నట్లు ఓ అధికారిక ప్రకటన తెలిపింది.

మౌలిక పరిశ్రమల వృద్ధి తీరిదీ..: ఫినిష్‌డ్‌ ఉక్కు పరిశ్రమ 9.2శాతం వృద్ధితో మౌలిక విభాగంలో ముందంజ వేసింది. కిందటేడాది ఇదే మార్చిలో ఈ పరిశ్రమ 1.8 శాతం ప్రతికూల వృద్ధిని చవిచూసింది.

* బొగ్గు, విద్యుదుత్పత్తి, సిమెంటు రంగాలన్నీ 7.8 శాతం చొప్పున వృద్ధిని కనబర్చాయి. 2009 మార్చిలో ఇవన్నీ వరుసగా.. 5.3 శాతం, 6.3%, 10.1% మేర రాణించాయి.

* ముడి చమురు ఉత్పత్తి 3.5 శాతం మెరుగుపడింది.. గతేడాది ఇదే కాలంలో 2.3 శాతం ప్రతికూలంగా నమోదైంది.

* పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల పరిశ్రమ 0.4 శాతం ప్రతికూల వృద్ధిరేటుకు క్షీణించింది. 2009 మార్చిలో ఇది 3.3 శాతంగా ఉంది.

బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 17.5% పెంపు

కుదిరిన వేతన సవరణ ఒప్పందం
ముంబయి: బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఉద్యోగుల వేతనాలు 17.5 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు భారతీయ బ్యాంకుల అసోషియేషన్‌(ఐబీఏ), 9 బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. వేతన సవరణ ఒప్పందంపై ఉద్యోగులు, ఐబీఏ ప్రతినిధులు మంగళవారం సంతకాలు చేశారు. 26 ప్రభుత్వరంగ బ్యాంకులు, 12 ప్రైవేటురంగ బ్యాంకులు, ఎనిమిది విదేశీ బ్యాంకులు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి. సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, అధికారులకు లబ్ధి చేకూరనుంది. వేతనాల పెంపువల్ల బ్యాంకులపై ఏటా రూ.4,816 వేల కోట్ల భారం పడనుంది. 2007 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లిస్తారు.'వేతనాల పెంపు నవంబరు 1, 2007 నుంచి వర్తిస్తుంది. ఇంటి అద్దెతోపాటు ఇతర అలవెన్సులు పెరుగుతాయి. ఈ ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. 1995లో పెన్షన్‌ పథకంలో చేరని ఉద్యోగుల కోసం ప్రస్తుత ఒప్పందం సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఈ పథకంలో చేరనప్పటికీ భవిష్యనిధికి సొమ్మును చెల్లిస్తున్న ఉద్యోగులు తిరిగి ఇందులో చేరేందుకు వీలు కల్పించింది' అని ఐబీఏ డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉన్నికృష్ణన్‌ తెలిపారు.

బహుళ బ్రాండ్‌ రిటైల్‌లో 51% విదేశీ పెట్టుబడులు?

న్యూఢిల్లీ: రిటైల్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) నియమాలను కొన్ని కఠినమైన షరతులకు లోబడి సరళతరం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆహార వస్తువులు, కిరాణా, కాయగూరలు వంటి ప్రాథమిక వస్తువులు మినహా ఇతర బహుళ బ్రాండ్‌ల రిటైల్‌ వ్యాపారంలో 51 శాతం వరకు ఎఫ్‌డీఐని అనుమతించడానికి సంబంధించి ఒక కాన్సెప్ట్‌ నోట్‌ను కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. ప్రస్తుత నిబంధనావళి ప్రకారం సింగిల్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల వ్యాపారంలో తప్ప రిటైల్‌లో 51 శాతం విదేశీ పెట్టుబడిని అనుమతించడం లేదు. హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగంలో మాత్రం ఎఫ్‌డీఐని 100 శాతం వరకు అనుమతిస్తున్నారు. ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరకుల రిటైల్‌ వ్యాపారంలో ఎఫ్‌డీఐలను అనుమతించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)కు సమాంతరమైన యంత్రాంగాన్నొకదానిని సృష్టించాలని మంత్రిత్వ శాఖ తలపోస్తోంది. ఇపుడున్న పీడీఎస్‌లో వస్తువులు లక్షిత వర్గాలకు కాకుండా ఇతరత్రా దారి మళ్లుతున్న ఆరోపణలు అంతకంతకు అధికంగా వినవస్తున్న విషయం విదితమే. రిటైల్‌ విక్రయ కేంద్రాలను కనీసం 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే ఏర్పాటు చేసుకునేలా పరిమితులు విధించే అవకాశాలున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వచ్చే నెలలో 6 చర్చాపత్రాలు..: రక్షణ శాఖ నుంచి వ్యవసాయం వరకు, ఔషధ తయారీ నుంచి రిటైల్‌ రంగం వరకు.. ఇలా పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని సరళతరం చేయడం గురించి ఒక చర్చకు వచ్చే నెలలో శ్రీకారం చుట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ఎఫ్‌డీఐ విధానాల రూపకల్పనకు నోడల్‌ ఏజెన్సీగా ఉన్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ) విదేశీ పెట్టుబడి నియమాలకు సంబంధించి ఆరు చర్చాపత్రాలను మే రెండో వారం చివర్లో విడుదల చేయనుంది. మే 12న గాని, లేదా 13వ తేదీన గాని ఈ చర్చాపత్రాలను ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేయనున్నట్లు డీఐపీపీ వర్గాలు పేర్కొన్నాయి.