Thursday, November 10, 2011

పెట్టుబడులు - జాగ్రత్తలు

స్వాతంత్ర్యం

రాజకీయ స్వాతంత్ర్యం అంటే సంక్షేమానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి, అదనపు మానవ వనరుల విలువలు, స్నేహపూర్వక, ఎటువంటి పక్షపాతంలేని పరిపాలన, సంపదకు సంబంధించిన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, అధిక ఉత్పాదకత.
- క్రమశిక్షణారాహిత్యం అనేది స్వాతంత్ర్యం కాదు
- క్రమశిక్షణ ద్వారానే అభివృద్ధి సాధ్యం
- నిబంధనల ద్వారా క్రమశిక్షణ
- ఆధారిత నిబంధనల అభివృద్ధి
- పక్షపాతం లేని కార్యక్రమాలను అమలు చేయడం
- సరైన ప్రణాళికలతో నిబంధనలు
- సరైన దిశలతో నిబంధనలు
- భవిష్యత్కు సంబంధించిన సూచనలు
- ప్రణాళికా ధృవీకరణ
- ప్రణాళికా అమలు, పరిశీలన
- దిశా, ప్రణాళికకు సంబంధించిన ఫలితాలు
----------------------
సంపద కోసం...

'Konda' అనగా...

“key (ముఖ్యమైన)
Operating (నిర్వహణ)
Net (నికర)
Developmental (అభివృద్ధి)
Applications” (అప్లికేషన్స్‌)

- పెట్టుబడి ఒక బహుమతి వంటిది
- ఖర్చు నుంచి తప్పించుకోవడం కష్టం
- నేటి ఆహారమే రేపటి ఆరోగ్యం
- నేటి పొదుపే రేపటి సంపద
--------------------

పెట్టుబడులు - జాగ్రత్తలు

నికర ఆస్తి విలువ : అత్యధిక నికర ఆస్తి విలువ, వాటా ఆదాయం, క్యాపిటల్రిటర్న్స్‌, అత్యల్ప ధరపై ఆర్జించిన నిష్పత్తి

భద్రతా: పెట్టుబడికి సంబంధించిన భద్రత, షెడ్యూల్ కాలంలో తిరిగి చెల్లించడానికి హామీ ఇవ్వడం

ఆదాయం: పెట్టుబడి నిధుల భద్రతకు ఎటువంటి నష్టం లేకుండా పెట్టుబడి మీద అధిక ఆదాయం పొందటం

ఆకర్షణ: పన్ను ప్రోత్సాహకాలు, భీమా వర్తింపుతో నిధులను పొందటానికి ఆకర్షించటం

లిక్విడిటీ: సమయంలో అయిన పెట్టుబడిని ఉపసంహరించుకునే సౌకర్యం ఉండటం.
-----------------------

అంతర్జాతీయ కరెన్సీ అవసరాలు:

అంతర్జాతీయ కరెన్సీ లేదా ఎక్స్ఛేంజ్యూనిట్కు వాస్తవిక కరెన్సీ అవసరం లేదు. అవకాశం, సామర్థ్యం, పంపిణీ, అకౌంటింగ్తో ఒక పద్ధతైన ధర విధానం ఉంటే మంచిది.

చేసే తప్పులు :
- అమాయకత్వం
- అజ్ఞానం
- అక్రమమైన పద్ధతులు
- నైతిక ప్రమాణాలకు అణుగుణంగా లేకుండా ఉండటం
- ఉద్దేశ్యపూర్వకంగా ఉండటం

ఆమోదాలు:
- కేవలం ధృవీకరణ కారణంగా తీసుకున్న చర్యలు
- సమయ పరిమితిలో తీసుకున్న చర్యలు
------------------------------
సంపద కోసం

పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం
ఖర్చు అనేది సంపదకు హానికరం

బలమైన సంపదకు సంబంధించి
చక్కని ఆరోగ్యమే ఒక కారణం

ఆదాయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే
ఖర్చును మాత్రం స్వల్పంగా ఎంపిక చేసుకోవాలి

బలవంతంగా పొదుపు చేయాలి
జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి
-------------------------

రుణాలు:
ఖర్చు కోసం అప్పు చేయరాదు. ఆదాయం కోసం అప్పు చేయడంలో తప్పులేదు.

నగదు : విశ్వసనీయత
సామర్థ్యం : జ్ఞానం, నగదు, అమలు మొదలగునవి
మృదువైనది : మర్యాద
నిజాయితీ : విధేయత
--------------------

సంపద కోసం కొన్ని మార్గదర్శకాలు (అన్ని విభాగాల కోసం):

- వృద్ధి కోసం స్వయంగా కొన్ని నిబంధనలను తయారు చేసుకోవాలి
- సహజ సిద్ధమైన నియంత్రణను సరైన పద్ధతిలో అమలు చేయాలి
- సామాజికంగా, వాణిజ్యపరంగా బాధ్యత కలిగి ఉండాలి
- అన్ని పరిశ్రమల మార్కెటింగ్ఉత్పత్తులు, సేవలు, నిర్వహణ, తయారీ కోసం దరఖాస్తు చేయాలి
- తక్కువ వ్యయంతో పరిపాలన (అడ్మినిస్ట్రేషన్‌)
- ఎక్కువ కాలం మన్నే విధంగా అధిక ఉత్పాదకతతో అభివృద్ధి సాధించాలి
-----------------------
ఆరోగ్యం-సంపద

ఆరోగ్యం, సంపదకు మతం, ప్రాంతం, రంగు, సంప్రదాయాలు వంటి అడ్డంకులతో ప్రపంచ సంబంధమైన సమస్యలు ఉంటాయి.

కావాల్సినవి :
- రాజకీయ స్వాతంత్ర్యం, ఆర్థిక అభివృద్ధి, సామాజిక బాధ్యత, అవకాశాల్లో సమానత్వం, మానవత్వం కలిగి ఉండటం, ప్రతిధ్వని సమపాళ్ళలో ఉండటం
- సాధారణ వినియోగ ప్రమాణాలు
- క్యాపిటల్గూడ్స్‌, విలాస వస్తువుల్లో ప్రత్యేకత
- అధిక ఉత్పాదకతకు దోహదం చేసే పరిజ్ఞానం
- లాభాల కోసం ప్రమాణిక నిబంధనలు,
- వ్యయ ధర, వినియోగదారుల ధరల మధ్య లేడా
- వ్యయం మొత్తం ఒకేలా ఉండాలి. అందరికీ ఒకే ధర, లాభం ప్రోత్సాహకాలు, వేతనం వంటి నిర్వహణ ఖర్చులు ఒకేలా ఉండాలి.
- వ్యయ నియంత్రణను పాటిస్తూ ధరలు భారీగా పెరగకుండా కృషి చేయాలి
--------------------------
సంపద కోసం వివిధ సమయాల్లో కావల్సినవి:

నిర్వహణ (మేనేజ్మెంట్‌):
- శక్తి
- పర్యావరణం
- నైపుణ్యం
- ఆస్తి
- సమగ్ర జాబితా
- భద్రతా
- మానవ వనరులు
- మార్కెటింగ్
- తయారీ
- సమయం

సేవలు:
- ఉత్తమమైన వినియోగం
- శిక్షణ & విద్య
- ధ్రువీకరణ
- నియామకాలు
- దిగుమతులు, ఎగుమతులు
- ఆర్అండ్డీ (శోధన మరియు అభివృద్ధి)
- పనితీరు అంచనా
- మేధో సంపత్తి హక్కులు
- వ్యయ విశ్లేషణ
- నిర్వహణ ప్రక్రియ విశ్లేషణ
- తారతమ్యాన్ని విశ్లేషించటం
- ఐటీ ఆధారిత సలహాలు
- సాంకేతిక ఆడిట్

ప్రణాళిక:
- పారిశ్రామికం
- పెట్టుబడి
- సురక్షిత ప్రాజెక్టు మొదలగునవి.

ఫైనాన్స్:
- అవసరం, అవకాశాలు
- విస్తరణ, పునర్వ్యవస్థీకరణ
- రుణాల పునర్నిర్మాణం, పునరుర్జీవం
- బ్యాంకు ఖాతాల పరిష్కారం
- ఆర్థిక సేవలు
- వనరుల పునర్వ్యవస్థీకరణ.

అంతర్జాతీయం:
- ఎగుమతి మరియు దిగుమతి
- విదేశీ మారకం
- ఐపీఆర్‌, పేటెంట్ హక్కులు
- న్యాయ సేవలు
------------------------

TDS/TCS – చెల్లింపు, రిటర్న్స్


TDS/TCS – చెల్లింపు, రిటర్న్స్

జీతాలు, కమీషన్‌, వడ్డీ, అద్దె, ప్రొఫెషనల్‌ సర్వీసుల కోసం ఫీజు, ప్రవాస భారతీయులు, విదేశీ సంస్థలు వంటి వాటిలో ప్రతి వ్యక్తి నుంచి నిర్ధిష్టమైన కొంత మొత్తాన్ని పన్ను రూపంలో తగ్గిస్తారు. ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా మొత్తం ఆదాయంలో నుంచి కొంత మొత్తాన్ని ప్రతి ఒక్కరూ పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి పన్ను అవసరం లేని వాటికి కూడా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నష్టాన్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరూ టీడీఎస్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను రూపంలో తగ్గిన బడిన మొత్తాన్ని బ్యాంక్‌లో జమ చేయడంతో పన్ను చెల్లింపు దారులు పన్ను వాపసు కోసం క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం సరైన TAN నెంబర్‌తో పాటు, సరైన వివరాలతో పాన్‌ నెంబర్‌ను వివరాలను పన్ను చెల్లింపుదారులు అందించాలి.

టీడీఎస్‌ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు
1. సొంత TAN నెంబర్‌ను కలిగి ఉండాలి.
2. అన్ని తగ్గింపులకు సంబంధించిన పాన్‌నెంబర్స్‌
3. చెల్లించాల్సిన పద్ధతులు : కమీషన్‌, వడ్డీ, అద్దె, ప్రొఫెషనల్‌ సర్వీసుల కోసం ఫీజు
4. టీడీఎస్‌ కలెక్షన్‌ పద్ధతులు : Forest Produce, Beverages Corporation etc
5. మినహాయింపులు : తగ్గింపులకు సంబంధించిన సర్టిఫికెట్లు
6. చెల్లించిన స్థూల మొత్తం నుంచి కొంత మొత్తాన్ని తగ్గించాలి. లేకుంటే మొత్తం చెల్లించిన మొత్తాన్ని మినహాయింపుల్లో చూపాలి.
7. ప్రతి వ్యక్తిగత తగ్గింపుల నుంచి తీసివేసిన పూర్తి మొత్తం
8. ప్రతి నెల పూర్తయిన తర్వాత ఏడు రోజుల తర్వాత బ్యాంకుల నుంచి ఆటోమెటిక్‌(ఎలక్ట్రానిక్‌)గా చెల్లించిన మొత్తం
9. అన్ని బ్యాంక్‌ చెల్లింపులకు సంబంధించి మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించాలి.
10. క్వార్టర్లీ టీడీఎస్‌ రిటర్న్స్‌ను త్రైమాసికం ముగిసిన వెంటనే సరైన పాన్‌ నెంబర్‌తో 15 రోజుల్లోగా దాఖలు చేయాలి. టిన్‌ సదుపాయం ఉన్న కేంద్రాల్లోనే వీటిని ఫైల్‌ చేయాలి.
11. అవసరమైతే తగ్గిపులకు సంబంధించి టీడీఎస్‌ సర్టిఫికెట్స్‌ జారీ



ఆదాయ ఫైలింగ్‌ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆదాయ ఫైలింగ్‌ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Asst. Year : 2011-12 (financial year 01-04-2010 to 31-03-2011)
1. ఫారం 16 (ఒకటి లేదా ఎక్కువ యజమానులు)
2. TDS సర్టిఫికెట్లు
3. బ్యాంకు ఖాతా సంఖ్య (MICR కోడ్‌తో)
4. బీఎస్‌ఆర్‌ కోడ్‌తో పాటు బ్రాంచ్‌ పేరుతో పన్ను చెల్లింపు వివరాలు కలిగిన బ్యాంక్‌ challan నెంబరు
5. చెల్లించిన LIC ప్రీమియంలు: కంపెనీ పేరు, పాలసీ నెఒంబరు, పాలసీ చెల్లించిన తేదీ, హామీ మొత్తం
6. ఫారమ్‌ 16 ప్రకారం ప్రావిడెండ్‌ ఫండ్‌(భవిష్యత్‌ నిధి), ప్రత్యక్ష చెల్లింపులు
7. పిల్లలు స్కూల్ ఫీజు (ట్యూషన్‌ ఫీజు మాత్రమే)
8. హౌజింగ్‌ లోన్‌ (గృహ) చెల్లింపులు (వడ్డీ సర్టిఫికెట్లు : రుణమొత్తం మరియు వడ్డీకి సంబంధించిన వివరాలు వేర్వేరుగా ఉండాలి)
9. సొంత ఇల్లు/ అద్దె ఇంట్లో నివాసానికి సంబంధించిన వివరాలు
10. ఇతర పొదుపునకు సంబంధించిన వివరాలు(ఏ తేదీలో చెల్లించారో వివరాలు)
11. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(మౌలిక సదుపాయాలు) బాండ్స్‌ - చెల్లింపు యొక్క తేదీ
12. ఆరోగ్య భీమా, మెడిక్లెయిమ్‌కు సంబంధించిన పత్రాలు
13. మీ మీద ఆధారపడిన తల్లిదండ్రుల వైద్య ఖర్చులు (ఖర్చులకు సంబంధించిన వివరాలు ఆధార పత్రాలతో ఉండాలి)
14. విరాళాలకు సంబంధించిన సాక్ష్యాలు, సంస్థ పేరు, ఇనిస్టిట్యూషన్‌ పాన్‌నెంబర్‌, మినహాయింపు సర్టిఫికేట్‌, దాని వ్యాలిడిటీకి సంబంధించిన వివరాలు
15. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు, వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయ వివరాలు.

పన్ను పరిధిలోకి అద్దె బకాయిలు

పన్ను పరిధిలోకి అద్దె బకాయిలు

అర్థం : గత ఆర్థిక సంవత్సరంలో అద్దె రూపంలో వచ్చిన ఆదాయంపై పన్నును చెల్లించినప్పటికీ... అద్దె ఇంకా బకాయి ఉండటంతో దానిని ఈ ఆర్థిక సంవత్సరంలో పరిగణనలోకి తీసుకోరు. కాని ఇది రాబోయే ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెరుగుతోన్న అద్దెకు చిహ్నంగా చెప్పవచ్చు.

Chargeability: అద్దెకు సంబంధించిన బకాయిలను మాత్రమే స్వీకరించవచ్చు. కాని దీనిపై ఇంతకు ముందే పన్ను చెల్లిస్తే తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా గృహ ఆదాయం క్రింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Year of taxability: అద్దెకు సంబంధించిన బకాయిలను గత ఏడాది పన్ను పరిధిలోకి తీసుకురాకుంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆదాయంగా లెక్కించాల్సి ఉంటుంది. ఇది ఈ ఆర్థిక సంవత్సరం పన్ను పరిధిలోకి వస్తుంది.

జీవనోపాధికాని యజమాన్యం : అద్దె బకాయిలు స్వీకరించినప్పటికీ అతనికి సొంత ఆస్తి లేని సమయంలో ఇది వ్యక్తిగత పన్ను పరిధిలోకి వస్తుంది.

తగ్గింపులు : పొందిన బకాయిల్లో 30 శాతం ప్రామాణిక తగ్గింపుగా మినహాయింపు ఉంటుంది.

ధరలు

ధరలు

ఆవశ్యక వస్తువులు, కూరగాయలు, వంటసరుకులతో సహా అన్ని వస్తువుల ధరలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం వినియోగవస్తువులన్నీ వినియోగదారుల డిమాండ్‌, సరఫరాల్లో ఉన్న తేడాలే. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా వస్తువుల సరఫరా లేకపోవడం మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. అందువల్ల ధరల అదుపునకు సరైనా విధివిధానాలను కేంద్రం అవలంభించాలి. కావాలని కృత్రిమ కొరతను సృష్టించే కంపెనీలపై దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలి. దీంతో ధరల పెరుగుదల కొంత మొత్తంలో అరికట్టవచ్చు.

1. పెట్రోలియం ఉత్పత్తులు:
విదేశీ మారకం రేట్లలో మార్పులు, అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల కారణంగా పెట్రోలియం కంపెనీల నష్టాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచుతూ వస్తోంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ధరలు పెరిగిన ప్రతిసారి దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచే ప్రభుత్వం, తగ్గినప్పుడు మాత్రం ధరలను తగ్గించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే గతంలో ఆయిల్‌ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయని, దీనిని రికవరీ చేయడానికి ధరలను తగ్గించడం లేదని కేంద్రం ప్రకటిస్తోంది. అయితే నష్టాలు పూడ్చుకున్న తర్వాత కూడా ప్రభుత్వం ధరలను తగ్గించడానికి వెనుకంజ వేస్తోంది.

అయితే ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్చలు చేపట్టవచ్చు. దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల శాతాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3 పెరిగిందనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం సుకం రూపంలో వసూలు చేసే పన్నుతో రిటైల్‌ మార్కెట్లో ఈ ధర మరింత పెరుగుతుంది. పెట్రో ధరలు పెరిగితే పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా అమాంతం పెరుగుతుంది. ఇది వినియోగదారులకు అదనపు భారంగా చెప్పవచ్చు. సుంకం నిర్ణీత మొత్తంలో ఉండాలి తప్ప పర్సెంటేజీ లెవల్స్‌లో ఉంటే వినియోగదారులు మరింత నష్టపోతారు. ధరలు ఎప్పుడు గిట్టుబాటు ధర, వినియోగదారు ధరల్లో ఉండాలి. అంతేకాని నిర్దిష్ట పర్సెంటేజీలో ఉంటే జనం పన్నుల రూపంలో మరింత డబ్బును కోల్పోవాల్సి వస్తుంది.

2. ఆవశ్యక వస్తువుల:
మార్కెట్లో డిమాండ్‌, సరఫరాల ఆధారంగా ఆవశ్యక వస్తువుల ధరలు నిర్ణయించబడుతున్నాయి. సరఫరాల్లో ఆసల్యం, గోదాముల్లో అక్రమ నిల్వలతో ఆవశ్యక వస్తువుల ధరలను మరింత పెంచుతున్నాయి. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ప్రస్తుతం మన దేశంలో చైన్‌ సిస్టమ్‌ ఉండటంతో రైతుల కన్నా దళారులు ఎక్కువగా లాభపడుతున్నారు. సీజన్‌లో ప్రభుత్వం మద్దతు ధరను తక్కువగా నిర్ణయించడంతో రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు.

వినియోగదారుని కొనుగోలు శక్తి పెరగడంతో ధరలు పెరిగాయని చెప్పడం పెరిగాయని చెప్పడం కరెక్ట్‌ కాదు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వినియోగదారులు కొన్ని వస్తువులను తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందువల్ల ముఖ్యమైన వస్తువులపై కేంద్రం కీలక నిర్ణయాలు ధరల అదుపునకు కృషి చేయాలి.


ఆదాయపు పన్ను రీఫండ్స్‌


ఆదాయపు పన్ను రీఫండ్స్‌

అదనంగా చెల్లించిన మొత్తాన్ని పన్ను చెల్లింపుదారునికి తిరిగి చెల్లించడానికి ఆదాయపు పన్ను శాఖ కొన్ని పద్ధతులను పాటిస్తుంది.
1. ముందస్తు పన్ను : స్వచ్ఛందంగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే ముందస్తు పన్ను
2. టీడీఎస్‌ : పన్ను చెల్లింపుదారుడు క్లెయిమ్‌ చేసుకున్న మొత్తాన్ని పరిశీలించి పన్ను మొత్తాన్ని తగ్గించి ఆదాయపు పన్ను శాఖ తిరిగి చెల్లించటం.
3. టీసీఎస్‌ : పన్ను చెల్లింపుదారుని నుంచి పరిగణనలోకి తీసుకొన్ని మొత్తాన్ని సేకరించటం.
రీఫండ్‌ క్లెయిమ్‌ కోసం పాటించాల్సిన పద్ధతులు :
1. ఇన్‌కమ్‌ రిటర్న్స్‌ : పూర్తి ఆదాయానికి సంబంధించి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత రెండు సంవత్సరాల లోపు ఆదాయానికి సంబంధించిన ఫైల్‌ను రిటర్న్‌ చేయాలి.
2. పన్ను చెల్లింపులు : పన్ను చెల్లింపుదారులు బీఎస్‌ఆర్‌ కోడ్‌, సరైన పాన్‌ నెంబర్‌తో పన్ను చెల్లించాలి.
3. పన్నుల తగ్గింపు : పన్ను చెల్లింపుదారులు పూర్తి ఆదాయంపై ట్యాక్స్‌ చెల్లిస్తారు. పన్ను చెల్లింపుదారులు ఫారం 26ఎఎస్‌ను పూర్తి చేసి ఆదాయపు పన్ను శాఖకు సరైన పాన్‌ నెంబర్‌తో దాఖలు చేయాలి. దీనిని పరిశీలించి ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్‌లో కొంత మొత్తాన్ని తగ్గించి తిరిగి చెల్లిస్తుంది.
4. టీసీఎస్‌ : పన్ను చెల్లింపుదారుని ఆదాయం నుంచి పరిగణనలోకి తీసుకున్న శాతంతో కొంత మొత్తాన్ని ట్యాక్స్‌ కలెక్టర్‌ సేకరిస్తాడు. తిరిగి ఆ మొత్తంలో నుంచి కొంత భాగాన్ని టీడీఎస్‌ రిటర్న్‌ దాఖలు చేయడం ద్వారా సరైన పాన్‌ నెంబర్‌, ఆదాయపు పన్ను శాఖ ఫారం 26ఎఎస్‌తో తిరిగి పొందవచ్చు.
5. ప్రక్రియ : ఆదాయం పన్ను శాఖ TDS / TCS దాఖలు చేసిన తర్వాత బ్యాంక్ రికార్డులతో పన్ను చెల్లింపులను ధ్రువపరుస్తారు. ఆదాయపు పన్నును తిరిగి చెల్లించడం కోసం దరఖాస్తును పరిశీలించి ఆదాయంను రిటర్న్‌ ఆఫ్‌ ప్రాసెస్‌ చేస్తారు.

ఆర్థిక సంక్షోభం

ఆర్థిక సంక్షోభం

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. సంక్షోభం తర్వాత చాలా కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. వాణిజ్య కంపెనీలు ప్రచార వ్యయంతో పాటు అనవర వ్యయాన్ని తగ్గించుకుని సంస్థపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడకుండా కాపాడుకుంటున్నాయి.
వృధా తగ్గింపు, ఉత్పాదకత, పొదుపు మెరుగుపరిచే దశలను తెలుసుకుందాం.
వాణిజ్య సంస్థలు ద్వారా :
- ప్రకటన మరియు ప్రచారపు ఖర్చును భారీగా తగ్గించాలి.
- ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉత్పాదకత పెంచాలి.
- అమ్మకం ధర, ఉత్పత్తి వ్యయం మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించాలి.
- అడ్మినిస్ట్రేషన్‌, మార్కెటింగ్‌ సిబ్బందిని తగ్గించాలి.
- అధిక లాభాలు ఇచ్చే ఉత్పత్తిపై మాత్రమే దృష్టి పెట్టాలి.
వినియోగ వస్తువులు కోసం ప్రకటన, మార్కెటింగ్ వ్యయాన్ని వీలైనంత తగ్గించాలి లేదా పూర్తిగా నిషేధించాలి. నాణ్యత, పరిమాణం, ధర ఏకరీతిలో ఉండాలి. ఈ నియమాలను పాటిస్తే మార్కెట్లో సమర్థవంతంగా పనిచేసే సంస్థల్లో ఒకటిగా కంపెనీ నిలుస్తుంది. పెట్టే ప్రతి ఖర్చుకు ముందు కొన్ని నియమాలను పాటిస్తే మంచిది.
A. ఈ ఖర్చు అవసరమా?
B. దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? ఉంటే దీనికన్నా తక్కువ ఖర్చు అవుతుందా? లేదా?
C. ఇదే వ్యయంతో ఎక్కువ ఉత్పాదకతను పొందే ఆస్కారం ఉందా?
D. ఈ వ్యయం ద్వారా ఏమైనా లాభాలు వచ్చే ఛాన్స్‌ ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంటాయి?
- నాణ్యతను మెరుగుపరిచేందుకు సంస్థలు ప్రయత్నించాలి. అలాగే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే బదులు అడ్వటైజ్‌మెంట్‌, ఉచితం, నమూనాలు, మార్కెటింగ్‌ వ్యయాన్ని తగ్గించాలి. ధరలను తగ్గించి అమ్మకాలను మెరుగు పరచడానికి ప్రయత్నించాలి.
- జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో తమ కంపెనీని పోల్చి చూసుకోవాలి. ఆ సంస్థలతో పోల్చి చూసుకుంటే కంపెనీ అనవసర ఖర్చులు భారీగా తగ్గుతాయి. అలాగే ఉత్పాదకతను మెరుగుపర్చడానికి కీలక నిర్ణయాలను తీసుకోవాలి.
- ఉన్నత ప్రమాణాలతో నాణ్యత ఉండాలి. తరచుగా నాణ్యతపై తనిఖీ నిర్వహించి తగు సూచనలు ఇవ్వాలి.
- బడ్జెట్‌, వాస్తవిక గణాంకాల మధ్య ఉన్న గ్యాప్‌ను అన్ని సూక్ష్మ స్థాయిల్లోనూ తగ్గించాలి. ఈ గ్యాప్‌ను తగ్గించడానికి వెంటనే చర్యలు చేపట్టాలి.
- అదే బ్రాండ్‌ పేరుతో సెకండ్‌ క్వాలిటీ వస్తువులను అమ్మరాదు. ఇది సంస్థ ఇమేజ్‌ను నాశనం చేస్తుంది. దీంతో పాటు వినియోగదారులను మోసగించినట్టు అవుతుంది. దీనిద్వారా అమ్మకాలు తగ్గడంతో పాటు ఒక్కోసారి న్యాయపరమైన చర్యలకు అవకాశం ఉంటుంది.
- జవాబుదారీని కలిగి ఉండాలి. ఏదైనా పొరపాటు జరిగితే దానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే సమస్య రాకుండా ఉండేందుకు సిబ్బందికి సరైన శిక్షణ ఇచ్చి ఇతరులెవరికీ జవాబు చెప్పవలసిన అవసరం లేకుండా తీర్చిదిద్దాలి.
- మెరుగైన నాణ్యత, తక్కువ ధర, ఉత్పాదకత కంపెనీకి పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెడుతుంది. దీనిద్వారా కంపెనీ లాభాల్లో వృద్ధిని సాధిస్తుంది.
- నిపుణులు, చుకుకైన సిబ్బందిని తీసుకోవాలి. ఏ ఉద్యోగానికి ఎవరు అతికినట్టు సరిపోతారో వారికి అవకాశం ఇవ్వాలి.
- వ్యయంపై తరచు విశ్లేషణ జరపాలి.
- చక్కగా, సమర్థవంతంగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రోత్సహించాలి. వారిని గుర్తించి వీలైతే అవార్డులను ప్రకటించాలి.
- వృధాని అరికట్టి, ఉత్పత్తిని పెంచడానికి కృషి చేయాలి. అలాగే సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి.
- బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం నాణ్యత, పనితీరు, ఉత్పాదకత కోసం పోటీ పడుతూ ఉండాలి
- సంస్థ యొక్క నిర్వహణ మేనేజ్‌మెంట్‌ చేతిలో ఉండకుండా వృత్తిపరంగా నిపుణులైన వారి చేతుల్లో ఉంటే మంచిది.
- పెట్టుబడి, మేనేజ్‌మెంట్‌ వేర్వేరుగా ఉండాలి. పెట్టుబడిదారులు నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండరు.
- వ్యయ నియంత్రణను కవర్‌ చేసేలా ఆడిటింగ్‌ ఉండాలి. వనరులను సమర్థవంతంగా నిర్వహించి ఉత్పాదకతను పెంచి ఎక్కువ లాభాలను పెంచేలా ఉండాలి. ఆడిటింగ్‌ అనేది ఒక 'పోస్ట్‌మార్టం'లా ఉండకూడదు.

కార్పొరేట్‌ నష్టంతో వాటాదారులు ఇబ్బందులకు గురిచేస్తుంది. దాంతో వారు ఈ క్రింది నష్టాలను చవిచూస్తారు.
A. వనరుల వృధా
B. సిబ్బంది అసమర్ధతతో తక్కువ ఉత్పాదకత
C. రుణదాతలు, ఆర్థిక సంస్థలకు నష్టం
D. వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్‌కు నష్టం
E. వ్యవస్థ, పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది
F. సంస్థ పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది.
G. అంతర్జాతీయంగా కంపెనీకి చెడ్డ పేరు తెస్తుంది
H. ప్రభుత్వానికి తగ్గనున్న పన్నుల వసూళ్ళు
I. ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం
J. నికర సంపద నిర్వీర్యం అవుతుంది
K. నష్టాలు చవిచూస్తే కొత్తగా ఏ సంస్థను, పరిశ్రమను పెట్టినా పెట్టుబడులను ఆకర్షించడానికి ఇబ్బంది ఎదురవుతుంది.

విదేశాల్లో నగదు డిపాజిట్లు

విదేశాల్లో నగదు డిపాజిట్లు

అక్రమమని తెలిసినా ఎంతో మంది భారతీయులు స్విట్జర్లాండ్‌, జర్మనీతో పాటు అనేక దేశాల్లోని బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్‌ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి డిపాజిట్లకు సంబంధించిన హక్కులు వచ్చాయి. అయితే అధిక పన్నుల భారంతో అనేకమంది భారతీయులు డబ్బును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న పన్ను రేట్లే కాకుండా ఇతర కారణాలు కూడా విదేశీ బ్యాంకు డిపాజిట్లకు కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక సంతతను కలిగి ఉన్న విదేశీ బ్యాంకుల్లో డబ్బు జమ చేయడానికి భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. డిపాజిట్లకు సంబంధించిన ప్రధాన కారణాలను విశ్లేషించలేకపోయినప్పటికీ ఆయా దేశాల్లోని చట్టాల లోసుగుల ఆధారంగా భారతీయులు డబ్బును డిపాజిట్‌ చేస్తున్నారు.

నల్లధనాన్ని అక్రమమైన పద్ధతుల్లో విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన కారణంగా ఎత్తి చేపింది. విదేశాల్లా అలాంటి డిపాజిట్ల ఫలితంగా ప్రతి ఏటా మన దేశానికి పన్ను రూపంలో ఆదాయం చాలా తగ్గుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే దీనిని పన్ను కోణంలో చూడకుండా అక్రమాలను అరికట్టే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని తెలిపింది.

విదేశాల్లోకి భారీగా నిధులు బదిలీ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారుల చెల్లింపులపై ప్రభుత్వం విశ్వసనీయత కలిగి ఉండదు. లావాదేవీల్లో పారదర్శకత లేకపోతే ఎప్పుడూ ప్రభుత్వానికి అనుమానం వస్తుంది. దీన్ని తప్పించుకోవడానికి ఎక్కువ మంది డబ్బును విదేశాల్లో డిపాజిట్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే బదిలీ అవుతోన్న నిధుల్లో ఇందులో 3-4 శాతం కేసులే నమోదు అవుతున్నాయి.

పన్ను ఎగవేతను తగ్గించడానికి ఎన్‌డీయే ప్రభుత్వం 2004లో కీలక నిర్ణయాలను తీసుకుంది. పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత కల్పించడానికి వివిధ అధికారాలతో ఎలక్ట్రానిక్‌ రూపంలో “ANNUAL INFORMATION RETURN”ను పరిచయం చేసింది. ఇది సక్సెస్‌ కావడంతో కొంతలో కొంత నల్లధనం విదేశీ బ్యాంకులకు చేరకుండా అరికట్టగలిగినట్లైంది.

అయితే 2004 నుంచి ప్రస్తుతం ఉన్న యూపీఏ ప్రభుత్వం దీనిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. పన్ను చెల్లింపుదారుల నుంచి సరైన పన్నును వసూలు చేసేందుకు ఉన్న వార్షిక సమాచారాన్ని ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైంది. తగిన ప్రణాళికలతో వివిధ విభాగాల ద్వారా వార్షిక సమాచారాన్ని తీసి వినియోగించి ఉంటే పన్ను ఎగవేత తగ్గడంతో పాటు అక్రమవైన పద్ధతుల్లో విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గేవి.

విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు ప్రాముఖ్యత ఇవ్వడం సముచితమైనదే కాని ఆయా దేశాల్లో బ్యాంకుల్లో ఉన్న నల్లధనం వివరాలు బహిర్గత పరచకుండా రహస్యత పాటించడం మన దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనుంది. చట్ట విరుద్ధంగా సంపాదించిన ధనం ఇతర దేశాలకు తరలకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను ఇప్పటికే కుదుర్చుకోవడంతో నల్లధనం వెలికితీతకు సంబంధించి వివరాలు వెలికితీతకు భారత ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

దేశంలోకి నల్లధనాన్ని తిరిగి ఎలా తీసుకురావాలంటే...
- విదేశాల్లో జమచేసిన డబ్బుకు తగిన పన్నులు చెల్లిస్తే దానిని దేశంలోకి అనుమతించాలి.
- డబ్బుపై ఏమైనా అనుమానాలుంటే వాటిని బిగపడతామని(హోల్డ్ చేస్తామని‌) విదేశాలను ఒప్పించాలి.
- డిపాజిట్లకు సంబంధించి పారదర్శకత లేకపోతే ఆ వివరాలు వెల్లడించాలని విదేశాలను కోరాలి.
- ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించారని విదేశాలను హెచ్చరించాలి. నల్లధనానికి సంబంధించి అంతర్జాతీయ సంస్థలతో విచారించాలి.
- డిపాజిట్లకు సంబంధించి విదేశాలను బాధ్యులను చేయాలి.
- డిపాజిట్లలో పారదర్శకత ఎందుకు పాటించలేదు. డిపాజిటర్లను అలాంటి డిపాజిట్లు ఎందుకు చేశారో తెలపాలని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో పారదర్శక ఉంటుందని, గోప్యం ఉండదని డిపాజిటర్లకు సమాచారం ఇవ్వాలి.
- పన్ను చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి అక్రమ డిపాజిట్లను అరికట్టవచ్చు.
- కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తే డిపాజిటర్లలో భయం నెలకొని ఉంటుంది.
పైన చెప్పిన సూచనలు యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ రిటర్స్‌పై ఆధారపడి చేసినవి. ఈ సమాచారం ప్రతిపాదనల కోసం మాత్రమే.

Monday, November 7, 2011

షికాగోలో టు వాల్‌స్ట్రీట్

షికాగోలో టు వాల్‌స్ట్రీట్

- 1968లోనే ‘పెట్టుబడిపై ముట్టడి’
- షికాగోలో మొదలై..శాంటారోసా, న్యూయార్క్, శాన్‌వూఫాన్సిస్కోకు విస్తరణ
- 1999లో సియాటెల్ ఆక్రమణ
- అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా..
- అయినా లక్ష్యం పెట్టుబడిదారీ విధానాల దుర్నీతే!


seattle talangana patrika telangana culture telangana politics telangana cinemaపెట్టుబడిదారీ వ్యవస్థ అరాచకాలను అంతమొందించాలని, కార్పొరేట్ సంస్థల దురాశ, దుర్నీతి, అవినీతిని అంతమొందించాలని డిమాండ్ చేస్తూ అమెరికాలో కొద్దిమంది ప్రారంభించిన ‘వాల్‌వూస్టీట్‌ను ఆక్రమించండి’ ఉద్యమం రెండు నెలల వ్యవధిలోనే కార్చిచ్చులా ప్రపంచదేశాలన్నిటినీ తాకింది. తాజాగా భారత్‌లోనూ ఈ ఉద్యమం ‘దలాల్ స్ట్రీట్‌ను ఆక్రమించండి’ పేరుతో మొదలైంది. ఈ ఉద్యమం తాకిన 83వ దేశంగా భారత్, 1,501 నగరంగా ముంబై నిలిచింది. ఈ ఉద్యమంతో ప్రభుత్వాలు పడిపోతాయో చెప్పలేంకానీ.. పెట్టుబడిదారీ సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభానికి ప్రతీకగా ఈ ఉద్యమాలు నిలిచాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు పుట్టినిల్లయిన అమెరికాలో.. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాంటి మహోద్యమం ప్రారంభమవడం ఇదే తొలిసారా? కార్పొరేట్ ధనదాహాన్ని దునుమాడుతూ ప్రజలు ఇప్పుడే రోడ్లపైకి వచ్చారా? దాచేస్తే దాగదు కదా!!

‘షికాగో’ ముట్టడి!
పారిక్షిశామిక విప్లవం మలిదశ ప్రారంభంలోనే అంటే 1968లోనే అమెరికాలో తొలి ‘ఆక్షికమణ’ ఉద్యమం జరిగింది! పనిగంటలు తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పని ప్రదేశంలో వసతులు కల్పించాలని, యాజమాన్యాల సంకెళ్ల నుంచి స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ సాగిన మహోధృత ఉద్యమానికి చరివూతాత్మక ‘షికాగో’ నగరం వేదికైంది. రెండో ప్రపంచయుద్ధానంతరం అమెరికాలో పాలన అస్తవ్యస్తమైంది. యంత్రాంగంలో సమర్థత లోపించింది. సంక్షేమ కార్యక్షికమాలు నీరుగారాయి. సామాన్యుల పరిస్థితి దారుణంగా తయారైంది. వియత్నాంపై కొనసాగించిన యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. పాలనలో ఏర్పడ్డ శూన్యత ఆధారంగా పారిక్షిశామిక సంస్థలు కార్మికులను దోచుకోవడం ప్రారంభించాయి. అమెరికా అంతటా సామాజిక అశాంతి ఆవహించింది. అలజడి మొదలైంది. ఈ తరుణంలో రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్పటి అధ్యక్షుడు లిండ్సేజాన్సన్ నిరాకరించడంతో.. పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు అధికార డెమొక్షికటిక్ పార్టీ షికాగోలో ఆగస్టు 26-29 మధ్య జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. అయితే.. అప్పటికే తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన ప్రజలు 28వ తేదీన సదస్సు జరుగుతున్న ప్రాంగణానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక ‘గ్రాంట్ పార్క్’లో సాయంత్రం 3.30 గంటలకు ఓ చిన్నారి దేశ పతాకాన్ని చేతపట్టుకుని ముందునడవగా దాదాపు 10 వేల మంది ‘సభాస్థలి’ ముట్టడికి ప్రయత్నించారు.

‘ప్రజలను పట్టించుకోండి.. దోపిడీని నివారించండి’ అని పెద్ద పెట్టున నినదిస్తూ కదం తొక్కారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో ర్యాలీ హింసాత్మకంగా మారింది. భాష్పవాయుగోళాలు, నీటి ఫిరంగులతో ప్రదర్శనకారులపై విరుచుకుపడడంతో అనేక మందికి గాయాలయ్యాయి. దాదాపు 7,500 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో దేశమంతా అట్టుడికిపోయింది. పారిక్షిశామిక దోపిడీకి చిరునామాగా నిలిచిన కేంద్రస్థానాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఉత్తర కాలిఫోర్నియా రాష్ట్రం సొనొమా కౌంటీలోని ‘శాంటారోసా’ మహానగరాన్ని ఆక్రమించేందుకు లెక్కలేనన్ని ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో శాంటారోసా జనాభా 1.65 లక్షలు. దేశంలోనే ఆరవ అతి పెద్ద నగరం. ఇలాంటి ఆక్రమణలే ప్రముఖ నగరాలైన ఓక్‌ల్యాండ్, న్యూయార్క్, శాన్‌వూఫాన్సిస్కోలోనూ కొనసాగాయి. అయితే ఈ ఉద్యమం శాంతియుతంగా కొనసాగితే ప్రస్తుత ‘వాల్‌వూస్టీట్‌ను ఆక్రమించండి’ ఉద్యమంలో ప్రధానంగా వినిపిస్తున్న ‘వీ ఆర్ ది 99 పర్సెంట్ (మేం 99 శాతం మంది ప్రజలం)’ అన్న నినాదం అప్పుడే నిజమయ్యేది.

సియాటెల్ ముట్టడి!
1947లో ప్రారంభమైన సుంకాలు, వాణిజ్య సాధారణ ఒప్పందం (గాట్)... 1995, జనవరి ఒకటిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ-ఎల్‌పీజీ) పునాదులపై ప్రపంచవాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)గా అవతరించింది. వాస్తవానికి అగ్రదేశాల నయా వలసవాద విధానానికి ఈ సంస్థ ప్రతిరూపం. సంస్థ ప్రారంభమైన తొలినాళ్లలోనే ఎల్‌పీజీ విధానాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపించింది. ప్రభుత్వరంగ పరిక్షిశమలను ధ్వంసం చేయడం, వాటికి ఇచ్చిన రిజర్వేషన్లు, రాయితీలను తొలగించడం, చాలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించడం, ప్రైవేటు రంగంలో మితిమీరిన పోటీకి వీలు కలిగించి, విదేశీ బడా పారిక్షిశామిక కంపెనీలను అనుమతించి, స్థానిక, దేశీయ పరిక్షిశమలు చితికిపోయేలా చేయడం, లక్షలాది మంది కార్మికులను, సిబ్బందిని వీధులపాలు చేయడం, విదేశీ, స్వదేశీ బడా పరిక్షిశమల గుత్తాధిపత్యంతో నిత్యావసరాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి నియంవూతణ చర్యలే లేని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్య విధానాలను మరింత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో 1999, నవంబర్ 30న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ‘మినిస్టీరియల్ సమావేశం’ నిర్వహించింది. అయితే.. పునాది లేకుండా నిర్మిస్తున్న పేకమేడలపై అప్పుడే ఆందోళన రాజుకుంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే పేరుతో సంక్షేమ కార్యక్షికమాలకు నిధులు తగ్గించడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందుకు అమెరికన్లు కూడా మినహాయింపు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో.. ‘సియాటెల్ ముట్టడి’కి సామాజికవాదులు పిలుపునిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వందలాది మంది సియాటెల్ చేరుకుని సమావేశ కేంద్రాన్ని ముట్టడించారు.

అయితే.. 1968తో పోలిస్తే 1999నాటికి అమెరికా సైన్యం మరింతగా శక్తిమంతమైంది. దీంతో ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణిచివేసింది. సమావేశం జరగుతున్న ‘వాషింగ్టన్ స్టేట్ కన్వెన్షన్, ట్రేడ్ సెంటర్’ యుద్ధభూమిని తలపించింది. యుద్ధట్యాంకులను ఆ ప్రాంతంలో మోహరించడమే గాక ఆందోళనకారులను చెల్లాచెదరు చేసేందుకు అమెరికా ఏకంగా సైనిక హెలిక్యాప్టర్లను కూడా వినియోగించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.‘ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే.. ప్రపంచ దేశాల్లో ప్రజాసామ్యం పరిఢవిల్లేందుకు ఎంతో కృషి చేసే’ అమెరికా ఈ రెండు ఆక్రమణలను అత్యంత హింసాత్మక పద్ధతుల్లో అణచివేయగలింది. కానీ.. తాజా ‘వాల్‌వూస్టీట్‌ను ఆక్రమించండి’ ఉద్యమం మాత్రం చాలా శాంతియుతంగా జరుగుతోంది. అందువల్లే ఉద్యమానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా సంఘీభావం తెలపాల్సి వచ్చింది.