Monday, December 16, 2013

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రతి కోసం క్లిక్ చేయడి.

‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü X¾ÛÊ-ªý-«u-«-®Ôn-¹-ª½º G©Õx “X¾A Â¢ ÂËxÂú Í䧌բœË 

Wednesday, August 14, 2013

Friday, June 21, 2013

రూపాయితో మనకేంటి నష్టం?

ఈనాడు సౌజన్యంతో...

మనకేంటి నష్టం? మన రూపాయి విలువ పతనం అవుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశీ నిల్వలు అడుగంటి పోతున్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దాదాపు ప్రతి వస్తువు ధరా ప్రభావితం అవుతోంది. ఈ రూపాయి, డాలర్ పోటీలో మనకు వచ్చే లాభనష్టాలేమిటి? రూపాయి కన్నా డాలరుకు ఎక్కువ గిరాకీ ఉంటే.. రూపాయి మారకపు విలువ తగ్గుతుంది. మనదేశం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడి ఉంటుంది. సహజంగానే డాలరుకు రూపాయితో పోలిస్తే గిరాకీ ఎక్కువ. ముడి చమురు, ఎరువులు, బంగారం తదితర విలువైన లోహాలు, బొగ్గు, విద్యుత్ ఉపకరణాలు, రక్షణరంగానికి సంబంధించిన వస్తువులు, ఆహారపు నూనెలు తదితర వస్తువులను మనం ఇతర దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. దీనికి చెల్లించేదంతా డాలర్ల రూపంలోనే. దిగుమతులు ఎక్కువ కావడం, డాలర్ల కొరత ఏర్పడటంలాంటి పరిస్థితుల వల్ల నేడు రూపాయి విలువ గరిష్ఠ స్థాయిలో పతనం అయ్యింది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిశలో పయనించడం, భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గత పదేళ్ల కనిష్ఠానికి పడిపోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల కూడా రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో కొంత దిద్దుబాటు కన్పించింది. దీంతో పెద్ద మొత్తంలో ఈ విలువైన లోహాలను దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారక ద్రవ్య నిలువలు చాలా వేగంగా ఖాళీ అయ్యాయి. ఫలితంగా రూపాయి విలువ పతనం కావడానికి కారణం అయ్యింది. ఇతర దిగుమతులను ఆపడం సాధ్యం కాదు. దీంతో ఎగుమతులు, దిగుమతులను సమతౌల్యం చేసే దిశగా బంగారంలాంటి లోహాలను దిగుమతి చేసుకోకుండా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనివల్ల రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూడాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఎంత వరకూ.. 1947లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఎంతో తెలుసా? ఒక రూపాయికి ఒక డాలరు. ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం. తర్వాత రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ మన దేశంకన్నా ముందుకు వెళ్లడంతో డాలరుతో రూపాయి మారకం విలువ పతనం అవ్వడం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం కనిష్ఠ స్థాయికి రూపాయి చేరుకుంది. ఒక డాలరు విలువ సుమారు 60 రూపాయలు (59.57) వెచ్చించాల్సి వస్తోంది. అన్నీ భారమే మన దేశంలో అవసరమయ్యే ముడి చమురులో 70శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నదే. రూపాయి విలువ ఏ మాత్రం తగ్గినా వెంటనే ఆ ప్రభావం పెట్రోలు ధరలపై పడుతుంది. ఇటీవలే రూ.2 మేరకు పెరిగిన పెట్రోలు ధరే ఇందుకు నిదర్శనం. ఇది సామాన్యుడిపై పడే ప్రత్యక్ష భారం. డీఖ్ణ్మీ;లు/పెట్రోలు ధరల పెరుగుదల కారణంగా ఉత్పాదన వ్యయం, రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దీంతో పరోక్షంగా మనపైనే ఆ భారం పడి, వస్తువులకు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తుంది. సబ్సిడీకి (9 సిలిండర్లు) మించి వినియోగించే వంటగ్యాసు ధర కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. చి మనం వినియోగించే ఆహార నూనెల్లో విదేశాల నుంచి 60శాతం వరకూ దిగుమతి చేసుకుంటున్నదే. పామ్ఆయిల్, సోయాబీన్ నూనె ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. రూపాయి పతనం ఫలితంగా ఈ నూనెల ధర ఇటీవల కాలంలో లీటరుకు రూ.3 దాకా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చే పప్పుధాన్యాల ధరలు కూడా పెరగడం చూస్తేనే ఉన్నాం. చి బంగారం, వెండిలాంటి లోహాల ధరలు రూపాయి పతనంతో పెరిగాయి. మనదేశంలో బంగారం గనుల్లో చెప్పుకోదగ్గ ఉత్పత్తి లేకపోవడంతో మొత్తంగా విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రూపాయి విలువ తగ్గడంతో బంగారం దిగుమతులపై ఆ ప్రభావం పడుతోంది. చి విద్యుత్ ఉపకరణాలను కూడా ఎక్కువగా చైనా, ఇతర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పతనం అవడంతో ఈ వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. చి సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్లు తదితర వస్తువుల తయారీకి ముడి చమురు నుంచి వచ్చిన కొన్ని పదార్థాలను వినియోగిస్తారు. ముడి చమురు దిగుమతి ధర పెరిగితే.. సహజంగానే.. ఈ ఉత్పాదనల విలువ పెరిగే అవకాశం ఉంది. చి విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు కూడా డాలర్ ధర పెరగడంతో ఇక్కట్లు తప్పడం లేదు. విహార యాత్రలకు వెళ్లేవారిపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. చి రూపాయి విలువ పతనం ద్రవ్యోల్బణం పెరగడానికి అవకాశాన్నిస్తుందన్న కారణంతో వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మాత్రం సవరించలేదు. దీంతో రుణం తీసుకున్నవారికి నెలసరి వాయిదాల్లో ఎలాంటి తేడా రాలేదు. లాభాలూ ఉన్నాయి డాలరు ధర పెరగడం వల్ల అన్నీ నష్టాలే లేవు. కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు మన దేశంలో ఉన్నవారికి డాలర్లలో డబ్బు పంపిస్తుంటారు. దీనివల్ల వారికి ఎక్కువ రూపాయలు వచ్చేందుకు వీలు కల్గింది. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రవాస భారతీయులకు ఇది అనువైన సమయమే. అయితే, ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, వాటిని వెనక్కి తీసుకోవాలనుకున్న వారికి మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు రావచ్చు. చి ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉన్న ఐటీ, ఫార్మా రంగాల్లోని కంపెనీల షేర్లలో మదుపు చేసిన వారికి రూపాయి పతనం లాభాలు తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది. దిగుమతుల మీద ఆధారపడ్డ కంపెనీల షేర్లకు ఇబ్బందికర పరిణామమే అని చెప్పవచ్చు. విదేశీ సంస్థాగత మదుపరులు మన మార్కెట్లలో కీలకమైన పెట్టుబడిదారులు. ఇలాంటి సమయంలో రూపాయి మరింత తగ్గితే స్వల్పకాలంలో మార్కెట్‌లో కొంత వ్యతిరేక పవనాలు వీచే అవకాశం లేకపోలేదు. చి ఇటు ఈక్విటీ మార్కెట్లలోనూ, అటు బాండు మార్కెట్లోనూ మదుపు చేసేవారిపై స్వల్పకాలంలో రూపాయి పతనం ప్రభావం కనిపిస్తుంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tuesday, June 4, 2013

అనగనగా ఓ రూపాయి

 అనగనగా ఓ రూపాయి పడిపోతున్న మారకపు విలువ ప్రస్తుతం 11 నెలల కనిష్ఠ స్థాయి రూ.56.76కి.. త్వరలోనే 57కు చేరే అవకాశం దిగుమతి రంగాలకు తీవ్ర ఇబ్బందులే అంతర్జాతీయ పరిణామాలే కాదు.. ప్రభుత్వ అలసత్వమూ కారణమే ఈనాడు వాణిజ్య విభాగం రూపాయి.. రూపాయి నువ్వేం చేస్తావ్ అని అడిగితే.. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తా.. భార్య భర్తల మధ్య చిచ్చు పెడతా.. తండ్రీ బిడ్డలను విడదీస్తా.. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతా.. ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడదీస్తా.. అని అందట.. అక్కడితో విడిచిపెడుతుందనుకుంటే పొరపాటే.. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది.. స్టాక్ మార్కెట్లను కుప్పకూలుస్తుంది.. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంది.. వివిధ రంగాలను నీరుకారుస్తుంది... ఇలా చెప్పుకుంటే చాలానే పనులు చేస్తుంది రూపాయి. ఇలా అందరినీ ప్రభావితం చేసే రూపాయి.. ప్రస్తుతం డాలరుతో 11 నెలల కనిష్ఠ స్థాయి రూ.56.76కు పడిపోయి అటు ఆర్థిక వ్యవస్థను.. ఇటు ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ప్రభుత్వం చొరవ లేకే..: కరెన్సీని రక్షించడానికి రిజర్వు బ్యాంకు చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకున్నట్లే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో సరైన దిశానిర్దేశం అందలేదనే చెప్పాలి. కరెన్సీ కనిష్ఠ స్థాయిలకు వెళ్లినపుడు అంతర్జాతీయ పెట్టుబడుదారులు దేశంలోకి రావడానికి వెనకడుగు వేస్తారన్న విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితులు కఠినంగా ఉండడంతో పాటు గట్టి సవాళ్లు ఎదురుగా ఉన్నాయన్న విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఈ సమయంలో సరైన విధానపరమైన చర్యలు అవసరం. ఇంతకీ రూపాయి ఎందుకు పతనమవుతోందో మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా రూపాయి పడిపోతోందంటే.. దేశంలోకి పెట్టుబడులు రాకపోవడమో.. లేదా తరలిపోవడమో జరిగి ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మన మార్కెట్లలోకి నికరంగా పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. అయినా రూపాయి పడుతోంది. ఎందుకంటే.. ముఖ్యంగా డాలరు మారక విలువ అన్ని ప్రధాన కరెన్సీలు అంటే యెన్, యూరోల కంటే బలపడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని.. 2013లో మరింతగా మెరుగుపడుతుందన్న అంచనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఒక్క రూపాయే కాదు.. అన్ని ఆసియా కరెన్సీలదే అదే బాట. మరో పక్క దేశీయంగా సరైన సంస్కరణలు లేకపోవడంతో పెచ్చుమీరుతున్న కరెంట్ ఖాతా లోటుతో పాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) దశాబ్ద కనిష్ఠ స్థాయికి దిగజారడం కూడా రూపాయిపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఇంకా పడుతుందా..?: సోమవారం(జూన్ 3) రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజీ(ఫారెక్స్) మార్కెట్లో 56.76 వద్ద 11 నెలల తాజా కనిష్ఠ స్థాయికి చేరింది. త్వరలోనే 57కు కూడా చేరే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటిదాకా ఎఫ్ఐఐలు మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. అయితే ఈ మధ్యనే వెనక్కిమరలడం మొదలుపెటారు. 9 కోట్ల డాలర్ల దాకా మన స్టాక్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. మరోపక్క ద్రవ్యోల్బణంపై రిజర్వు బ్యాంకు అంచనాలు ఆశావహంగా లేవు. కరెంట్ ఖాతా లోటు కూడా భయపెడుతోంది. వ్యవసాయం, తయారీ తవ్వక రంగాలు డీలా పడడంతో జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ 4.8 శాతానికి పడిపోయింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఈ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైంది. ఇది దశాబ్దపు కనిష్ఠ స్థాయి. ఇప్పటికే ఫ్యూచర్స్ మార్కెట్లో 57 స్థాయిని అధిగమించిన రూపాయికి ఫారెక్స్ మార్కెట్లో 56.85 వద్ద గట్టి నిరోధం ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఈ స్థాయిని దాటితే అల్‌టైం కనిష్ఠ స్థాయి అయిన 57.32ను త్వరలోనే చేరే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. మరోపక్క మరికొంతమంది విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్పకాలంలో ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి చేరే అవకాశం తక్కువేనంటున్నారు. రూపాయి మారక విలువ క్షీణించిందంటే.. ముఖ్యంగా మనం డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకునే రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మనం ఎక్కువ శాతం ముడి పదార్థాలకు దిగుమతులపైనే ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ముడి చమురు..: ఫారెక్స్ నిల్వల్లో మనం ఎక్కువ భాగం ఖర్చుపెట్టేది చమురు దిగుమతుల కోసమే. బ్రెంట్ చమురు ధర రెండేళ్ల కిందట బారెల్‌కు 118 డాలర్ల దాకా పలికింది. అప్పట్లో రూపాయి మారక విలువ 44.4గా ఉంది. ప్రస్తుతం ముడి చమురు ధర 103 డాలర్లకు తగ్గింది. అయితేనేం ఒక్కో డాలరుకు 56 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో చమురు ధర తగ్గినా మనకు పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదు. కార్పొరేట్ రుణాలు: మన కార్పొరేట్లు ఎక్కువగా పెట్టుబడుల కోసం విదేశీ నిధులను సమీకరిస్తుంటారు. ఇందు కోసం విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీలు); విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్ల (ఎఫ్‌సీసీబీలు)ను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడి అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యలభ్యత దృష్ట్యా విదేశీ నిధులను సమీకరించుకున్నాయి కంపెనీలు. అయితే రూపాయి విలువ 17 శాతం దాకా క్షీణించడంతో వీరికి రుణం మరింత భారమైంది. విద్యుత్: ఫెర్రస్ లోహాల దిగుమతి వ్యయాలు అధికం కావడంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎరువులు: ఈ పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలలో సగభాగం దిగుమతుల ద్వారా అందేవే. వీటి వ్యయం 20 శాతం దాకా పెరగడంతో వీటిపై భారం పడుతోంది. వీటికి లాభం ఫార్మా కంపెనీలకు: సాధారణంగా ఫార్మా కంపెనీలన్నీ ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటాయి. రూపాయి పతనం కావడంతో వీటి మార్జిన్లు పెరగనున్నాయి. విదేశీ వాణిజ్య రుణాలపై నష్టాలు; ఎఫ్‌సీసీబీలు కొంత మేర వీటిపై ఒత్తిడి తెచ్చినా.. కలిసొచ్చే మార్జిన్లతో పోలిస్తే అవి అంత భారీగా ఏమీ ఉండబోవు. జౌళి: ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం పెరగడానికి తోడు నూలు ధరలు తగ్గడంతో జౌళి పరిశ్రమకు ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత హెడ్జింగ్ పొఖ్ణ్మీ;షన్లపై మార్క్-టు-మార్కెట్ నష్టాలు మొత్తం మీద లాభదాయకతను లెక్కించేటపుడు కీలకం కానున్నాయి. వజ్రాభరణాలు: ఈ మధ్య తగ్గుతున్న బంగారం, వెండి ధరలకు తోడు రూపాయి కూడా క్షీణించడంతో వజ్రాభరణాల పరిశ్రమ పంట పండిందనే చెప్పాలి. దిగుమతి చేసుకునే బంగారం, వెండి ధరలు తగ్గడం.. ఎగుమతులు చేసేటపుడు రూపాయి విలువ ఆధారంగా ఎక్కువ మార్జిన్లు రావడంతో రెండు వైపులా ప్రయోజనాలు అందుతాయి. 

Wednesday, March 27, 2013

కేటాయింపులు ఏనుగంత.. ఖర్చు ఎలుకంత! సర్కారు ఆర్థిక నిర్వహణ లోపాలమయం కేటాయింపుల్లో ఆరో వంతు ఖర్చు చేయలేదు మరో ఆరో వంతు మిగులు నిధులు బడ్జెట్ రూపకల్పనపైనే సందేహాలున్నాయి ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పింఛను బకాయిలు రూ.900 కోట్లు నష్టజాతక జాబితాలో ఆర్టీసీ, హౌసింగ్ టాప్ భారీగా పెరుగుతున్న వేతనాలు, పింఛన్ల ఖర్చు విద్య, ఆరోగ్యంపై మరింత ఖర్చు చేయాలి కాగ్ నివేదిక విడుదల.. శాసనసభకు సమర్పణ హైదరాబాద్, మార్చి 26 : 'కాగ్ నివేదిక ఏమైనా భగవద్గీత.. ఖురాన్... బైబిలా?' అని ముఖ్యమంత్రి కిరణ్ ఎద్దేవా చేసిన మర్నాడే.. ఆయన పాలనలో ప్రభుత్వ కేటాయింపులు, ఖర్చుల్లో అవకతవకలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తి చూపింది. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలమయమని, కేటాయింపులను ఏనుగంత చూపి.. ఎలుకంత మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించింది. పెరుగుతున్న అప్పులకు దన్నుగా సంపదను సృష్టించుకునేలా క్యాపిటల్ వ్యయాన్ని పెంచుకోవాలని సిఫారసు చేసింది. విద్య, ఆరోగ్యంపై మరింత వ్యయం చేయాలంది. ఆరోగ్యంపై బడ్జెట్లో 4.67 శాతం, విద్యపై 13.80 శాతం ఖర్చు చేసిందని, ఇది దేశంలోని సాధారణ కేటగిరీ రాష్ట్రాలతో పోల్చినా తక్కువని చెప్పిం ది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ వాణీ శ్రీరామ్ రూపొందించిన ఈ నివేదికను మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఆమె ఆ నివేదికను మీడియాకు విడుదల చేశారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన లో లోపాలున్నాయని కాగ్ తప్పుబట్టింది. కేటాయింపులు, ఖర్చులమధ్య పొంతన లేదని, నిధులు కేటాయించకుండానే ఖర్చు చేయడం ఆర్థిక నియమాల ఉల్లంఘనేనని తేల్చిచెప్పింది. కేటాయింపులు భారీగా చూ పినా.. వాస్తవ వ్యయం అతి స్వల్పమేనని తేల్చింది. కేటాయింపుల్లో 17శాతం వరకూ ఖర్చు చేయలేదని వివరించింది. ఉదాహరణకు చేనేత కార్మికులను అప్పుల ఊబి నుం చి బయట పడేసేందుకు రుణమాఫీ పథకా న్ని ప్రకటించారు. దీనికి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, విడుదల చేసింది రూ.32.88 కోట్లు (16శాతం) మాత్రమే. రాష్ట్రీయ మా ధ్యమిక శిక్షా అభియాన్‌కు కేంద్ర, రాష్ట్రాలు 75:25 నిష్పత్తిలో నిధులిస్తాయి. ఈ పథకానికి రూ.322.05కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది రూ.225.52కోట్లే. ఇక, కిశోర బాలికల పథకం 'సబల'కు రూ.124.91 కోట్లను కేటాయించి, రూ.20.25కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇందిరమ్మ గ్రామీణ పథకం కింద 2.93 లక్షల ఇళ్లను; ఇందిరమ్మ పట్టణ పథకం కింద 50 వేల ఇళ్లను నిర్మించాలన్న భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు రూ.571.25కోట్లు కేటాయించామని ఘనం గా ప్రకటించింది. కానీ, ఈ రెండు పథకాల కింద ఖర్చు రూ.142.81 కోట్లు మాత్రమే! మరీ విచిత్రం ఏమిటంటే.. జాతీయ గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమానికి రాష్ట్రం తన వాటాగా రూ.100కోట్లు కేటాయించింది. కానీ, రూపాయి కూడా విడుదల చేయలేదు. మధ్యాహ్న భోజన పథకానికి రూ.1.112 కోట్లు కేటాయించి, రూ.673 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాగ్ తేల్చింది. రాష్ట్రంలో నిరుపేదలకు 9.28 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తామన్న సర్కారు.. 91వేలు మాత్రమే పూ ర్తి చేసిందని తప్పుబట్టింది. ఆదర్శ పాఠశాల ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్రాలు 75ః25 నిష్పత్తిలో నిధులను భరిస్తున్నాయి. ఇందులో రూ.412 కోట్ల కేంద్ర వాటా 2011 జూలైలోనే వచ్చేసింది. కానీ, రాష్ట్రం రూ.136 కోట్లను విడుదల చేయలేదు. సరికదా.. కేంద్ర నిధుల్లో రూ.6.33 కోట్లను మాత్రమే ఖర్చుచేసి.. రూ.400 కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారి ప్రాజెక్టుకింద రోడ్ల అభివృద్ధికి కేంద్రం, ప్రపంచ బ్యాంకు ఆమోదించిన అంచనా వ్యయం రూ.3165 కోట్లు. 2011-12లో దీనికి రూ.600కోట్లు కేటాయించారు. కానీ, ఖర్చు చేసింది రూ.221 కోట్లు మాత్రమే. అప్పులు ఇచ్చి వసూలు చేయరా? నష్టజాతక ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకు 13వ ఆర్థిక రంగ సిఫారసుల ప్రకారం ప్రణాళికను రూపొందించుకోవాలని కాగ్ సూచించింది. రుణాలు తీసుకున్న సంస్థల నుంచి అసలు, వడ్డీలను ఎప్పటికప్పుడు వసూలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు నష్టాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయని కాగ్ తేల్చింది. ఈ కంపెనీలు, కార్పొరేషన్లలో 11సంస్థలకు మాత్రమే వార్షిక పద్దు లు ఖరారయ్యాయి. వాటిలో ఆ ఏడాదికి పేరుకుపోయిన నష్టా లు రూ.5979 కోట్లు. గృహనిర్మాణ సంస్థ రూ.3554 కోట్ల నష్టంతో, ఆర్టీసీ రూ.1984 కోట్ల నష్టంతో అగ్రస్థానంలో ఉన్నాయి. అలాగే కంపెనీలు, ప్రభుత్వ కార్పొరేషన్లలో పెట్టుబడులకు వచ్చిన ప్రతిఫలం ఎప్పటిలా స్వల్పంగానే ఉందని కాగ్ పేర్కొం ది. 2011-12లో ప్రభుత్వం తెచ్చిన రుణాలకు చెల్లించిన వడ్డీ రేటు 7.40శాతం కాగా.. ప్రభుత్వం పెట్టుబడులపై సగటు వడ్డీ రేటు 0.85 శాతమే. ప్రభుత్వం రూ.4983 కోట్ల రుణాలను ఇవ్వగా.. రికవరీ చేసింది రూ.164కోట్లే. ఇక రూ.17,337కోట్ల రుణాలకు సంబంధించి వివిధ సంస్థల నుంచి లెక్కల్లేవని కాగ్ తప్పుబట్టింది. పీడీ అకౌంట్లో పాతిక వేల కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో ఆరోవంతుదాకా నిధులు మిగిలి పోతున్నాయని కాగ్ వెల్లడించింది. కేటాయింపులలో 20 శాతానికి మించి భారీ మిగుళ్లు బడ్జెట్ అంచనాల్లో కచ్చితత్వం లేకపోవడాన్ని సూచిస్తున్నాయని వివరించింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయడం లేద ని, దీంతో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియపైనే సందేహాలు వస్తున్నాయని స్పష్టం చేసింది. చివర్లో ఒకేసారి భారీగా నిధులను ఖర్చు చేసేయడం లేదా మిగులుగా చూపడాన్ని నివారించేందుకు వాస్తవిక బడ్జెట్ అంచనాలను రూపొందించాలని సిఫార సు చేసింది. అసలు నిధుల కేటాయింపు తక్కువగా ఉండగా పాఠశాల విద్య, భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖలకు సంబంధించి మూడు గ్రాంట్లలో రూ.వెయ్యి కోట్లకుపైగా మిగు ళ్లు ఏర్పడ్డాయని తప్పుబట్టింది. వ్యక్తిగత డిపాజిట్ (పీడీ) అకౌంట్లలో రూ.లక్షకుపైగా ఉంచడాన్ని తప్పుబట్టింది. సుమారు రూ.23,483 కోట్లను పీడీ అకౌంట్లలోనే ఉంచేయడం పారదర్శకతకు పాతర వేయడమేనని తలంటింది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, నిధుల కోసం యూనిట్ కార్యాలయాల నుంచి అభ్యర్థనలు రాకపోవడం, యూజీసీ గ్రాంట్లు రాకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడం తదితర కారణాల వల్ల ఉన్నతవిద్యలో నిధులు మిగిలిపోయాయని వివరించింది. మంజూరు ఉత్తర్వులు అందకపోవడం, పనుల్లో పురోగతి మందగించడంవల్ల పురపాలన, పట్టణాభివృద్ధిలో మిగులు ఏర్పడిందని, కేంద్ర నిధులు ఆలస్యంగా అందడం, నిర్వహణ పనుల్లో పురోగతి లేకపోవడంవల్ల సాంఘిక, వెనకబడిన సం క్షేమ శాఖల్లో నిధులు మిగిలిపోయాయని తెలిపింది. పొంతనలేని అంచనాలు.. వాస్తవాలు బడ్జెట్లో అంచనాలకు, వాస్తవాలకు మధ్య భారీ తేడా ఉంద ని కాగ్ తలంటింది. 2011-12లో పన్నుల రాబడులు, పన్ను లు కాని రాబడులు రెండూ పెరిగాయి. ఆ ఏడాదిలో అబ్కారీ ఆదాయం 16.31 శాతం, వాణిజ్య పన్నులు 19.78, వాహనాలపై పన్నులు 13.69శాతం పెరిగాయి. దీంతో పన్నుల ఆదా యం అంతకుముందు ఏడాదికంటే 18.04 శాతం పెరిగింది. అయినా, బడ్జెట్ అంచనాల కంటే రెవెన్యూ వసూళ్లు 7.37శాతం తగ్గాయి. రెవెన్యూ వ్యయం 6.95 శాతం తగ్గింది. ఫలితంగా బడ్జెట్ అంచనాల కంటే రెవెన్యూ మిగులు 17.98 శాతం తగ్గితే.. రెవెన్యూ వ్యయం 6.95 శాతం తగ్గింది. ఈ తగ్గుదల ప్రధానంగా నీటి సరఫరా -పారిశుధ్యం (46.02శాతం), పట్టణాభివృద్ధి (28.52 శాతం), సాగునీరు-వరదల నియంత్రణ (19.04శాతం) , వడ్డీ చెల్లింపు (7.66 శాతం)ల్లో నమోదైంది. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి భేష్! అయితే, ఆర్థిక నిర్వహణపై విమర్శలు చేసినా కాసిని ప్రశంసలూ కురిపించింది. ప్రభుత్వం ఆరేళ్ల నుంచి వరుసగా రెవెన్యూ మిగులును సాధిస్తూనే ఉంది. ద్రవ్యలోటు గత ఏడాదికంటే స్వల్పంగా పెరిగినా ఎఫ్ఆర్‌బీఎం చట్టం నిర్దేశిత పరిమితిని మించలేదు. దీనికి అనుగుణం గా రుణభారం తగ్గించుకోవడానికి లేదా వదిలించుకోవడానికి సంక్షిప్త నిధి, పూచీ విమోచన నిధిని ఏర్పాటు చేసింది. ఆర్బీఐ నిర్దేశించిన రేట్ల ప్రకారం వీటిలో నిధులను జమ చేస్తూ వస్తోంది. అయితే, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ తీసుకున్న రుణాలను వాటి తరపున ప్రభుత్వమే చెల్లిస్తోన్న సందర్భాల్లో ఆర్థికసాయాన్ని ప్రభుత్వ పద్దుల్లో తప్పుగా నమోదు చేశారు. ఫలితంగా లోన్ల పద్దు కింద ప్రతికూల నిల్వలు రూ.3.72 కోట్లు ఏర్పడి ఆర్థిక పద్దుల్లో రాష్ట్ర రెవెన్యూ వ్యయాన్ని తక్కువగా చూపారు. రాష్ట్ర ద్రవ్య సూచికలపై దీని ప్రభావం పడింది. పెరిగిన వేతన వ్యయం.. జీతాలు, వేతనాలపై ఖర్చు (రూ. 26,823కోట్లు) గత ఏడాది కంటే 12.49 శాతం పెరిగింది. అయితే, బడ్జెట్ అంచనాల కన్నా ఇది 1.52 శాతం తక్కువ. 13వ ఆర్థిక సంఘం అంచనా(రూ.15,735 కోట్లు)కన్నా చాలా ఎక్కు వ. పింఛన్లు, పదవీ విరమణ ప్రయోజనాలకు రూ. 11,110 కోట్లు ఖర్చు చేసింది. రెవెన్యూ రాబడుల్లో ఇది 12 శాతం. ఉద్యోగులకు వడ్డీ నష్టం ఉద్యోగుల నుంచి పింఛను మొత్తాన్ని జీతాల్లోంచి ప్రభుత్వం మినహాయించుకుంటోంది. కానీ, తన వాటాను మాత్రం ప్రభుత్వం పింఛను నిధికి జమ చేయడం లేదు. కాగ్ తన నివేదికలో ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పింఛను నియంత్రణాధికార సంస్థ నిర్దేశాల ప్రకారం కాంట్రిబ్యూటరీ ఫించన్ పథకంలో తన వాటా మొత్తాన్ని ఫండ్ మేనేజర్‌కు బదిలీ చేయాల్సి ఉండగా, 2012 మార్చినాటికి అలా బదిలీ చేయకుండా బకాయి పడిన పూర్తి మొత్తం రూ.894 కోట్లకు చేరింది. నిజానికి ఉద్యోగులు తమ వాటాగా చెల్లించిన మొత్తంతో పోలిస్తే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.100 కోట్లను తక్కువగా కేటాయించింది. పింఛను కోసం చేసే బడ్జెట్ కేటాయింపులను సమీక్షించుకోవాలని ప్రభుత్వానికి కాగ్ సిఫారసు చేసింది. బీమా గణన ప్రాతిపదికన చెల్లించాల్సిన పింఛను మొత్తాలను లెక్కగట్టి, అదే పద్దు కింద కేటాయించాలని, పింఛను నిధికి జమ చేయాల్సిన బకాయిలను తక్షణమే ఫండ్ మేనేజర్‌కు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను పూర్తి చేయండి మహాప్రభో! జల యజ్ఞం సహా వివిధ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒనగూడిన ప్రయోజనం శూన్యమని కాగ్ తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే ఏళ్ల తరబడి కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించిన పనులను పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారమే.. 2012 మార్చి 31 నాటికి 228 ప్రాజెక్టులు (సాగునీరు, ఆర్అండ్‌బీ తదితరాలు) అసంపూర్తిగానే ఉన్నాయని పేర్కొంది. 2011-12లో వీటిపై రూ.49,516 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది అసంపూర్తి ప్రాజెక్టులు 188! ఆ ఏడాది (2010-11) వాటిపై ఖర్చు రూ.46,330 కోట్లు! వేల కోట్లు ఖర్చయినా ఫలితం సున్నా. మరో విశేషం ఏమిటంటే.. ఈ 228 ప్రాజెక్టుల్లో 54 ప్రాధాన్యంగలవిగా ప్రభుత్వం చూపింది. వాటి తొలి అంచనాలను సవరించి అంచనా వ్యయాన్ని రూ.87,559 కోట్లకు పెంచింది. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా ఆశించిన ప్రయోజనాలూ రాలేదని కాగ్ తప్పుబట్టింది. చదువుపై ప్రసరించని 'కిరణం' హైదరాబాద్, మార్చి 26 : చదువుకుంటేనే ఉన్నత స్థితికి ఎదుగుతారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరచూ చెబుతుంటారు. కానీ, ఆయన హయాంలో విద్యా రంగానికి కేటాయింపులు అంతంతమాత్రమే! అందుకే, విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు పెంచాలని కాగ్ సూచించింది. సామాజిక ఆర్థిక రంగాల విషయంలో ప్రాథమ్యాలను పునర్ నిర్వచించుకోవాలని సిఫారసు చేసింది. వీటికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇచ్చినా కేటాయించిన నిధులను నిర్దేశిత పథకాలకు వినియోగించలేదని తప్పుబట్టింది. కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడం, కొద్దోగొప్పో విడుద ల చేసినా సకాలంలో ఇవ్వకపోవడంతో లక్ష్యం నెరవేరలేదని ఆక్షేపించింది. సామాజిక రంగంపై క్యాపిటల్ వ్య యం సాధారణ కేటగిరీ రాష్ట్రాల కంటే తక్కువగా ఉందని తప్పుబట్టింది. 2011-12లో సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో 17.18 శాతం విద్యారంగంపై ఖర్చు చేయగా, రాష్ట్రంలో అది 13.80 శాతమే. ఎన్నికలూ లేవు.. నిధులూ లేవు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగని కారణంగానే కేంద్రం నుంచి పలు రకాల నిధులు నిలిచిపోయినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు జరపని కారణంగా పనితీరు ప్రాతిపదికన రాష్ట్రానికి అందజేసే నిధులు రూ.1044 కోట్లను కేంద్రం మంజూరు చేసినా.. రూ.420 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించింది. కాగా, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు 29 అధికారాలు బదిలీ కావాల్సి ఉండగా ఇప్పటివరకు పది మాత్రమే బదిలీ అయ్యాయని తప్పుబట్టింది. ఉద్యోగశ్రీకి ఉరితాడు నిరుద్యోగులపై సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శించిందని 'కాగ్' కడిగేసింది. ఉద్యోగార్థులకు తగిన నైపుణ్యాన్ని కల్పించడంతోపాటు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన 'రాజీవ్ ఉద్యోగ శ్రీ'కి 2011-12 బడ్జెట్‌లో రూ.40 కోట్లను కేటాయించారు. కానీ, ఖర్చు చేసింది రూ.10 కోట్లే. అంతేకాదు.. కార్మిక, ఉపాధి శాఖకు వివిధ పద్దుల కింద 2011-12లో రూ.602.66 కోట్లను కేటాయించగా, రూ.140.33 కోట్లను ఖర్చు చేయలేదు. ఇందులో రూ.90.61 కోట్లను సరెండర్ చేయలేదు. పింఛను చెల్లింపుల్లో అక్రమాలు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పింఛన్లు, కుటుంబ పింఛన్లకు సంబంధించి పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు 'కాగ్' స్పష్టం చేసింది. కేవలం మచ్చుకు జరిపిన తనిఖీల్లోనే అంటే 410 కేసుల్లో రూ.2.7 కోట్ల మేరకు అధికంగా చెల్లించినట్లు పేర్కొంది. 2012 మార్చి 31 నాటికి 374 కేసుల్లో రూ.2.40 కోట్ల 'రికవరీ' జరగలేదని కాగ్ ఆక్షేపించింది. అసలు పింఛను, రెండో సీవీపీ నుంచి కమ్యూటేషన్ విలువను తగ్గించకపోవడం, పింఛను, కుటుంబ పింఛను సహా బకాయిలను తప్పుగా లెక్కించడం, అదనపు పింఛను మొత్తాన్ని అధికంగా చెల్లించడం, గ్రాట్యుటీ/పింఛను నుంచి చేయాల్సిన రికవరీలను మినహాయించకుండానే అధిక చెల్లింపులు చేయడం, అమ్ముకున్న పింఛన్లను తప్పుగా పునరుద్ధరించడం, రెండుసార్లు పింఛన్లను చెల్లించడం, పింఛనుదారులు మరణించాక కూడా పింఛన్ల చెల్లింపులు వంటి పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు 'కాగ్' వెల్లడించింది. సబ్సిడీలో సింహభాగం విద్యుత్తుదే! హైదరాబాద్, మార్చి 26 : రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలకు కేటాయించే మొత్తంలో సింహ భాగం విద్యుత్తు సబ్సిడీలకే పోతోంది. కాగ్ నివేదిక ప్రకారం.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలపై చేసిన మొత్తం వ్యయం రూ.7313 కోట్లు. ఇందులో విద్యుత్ సబ్సిడీకి ప్రభుత్వం రూ.4300 కోట్లు (59 శాతం) ఖర్చు చేసింది. ఇందులోనూ సింహ భాగం ఉచిత విద్యుత్తుదిగానే చెబుతున్నారు. సబ్సిడీ వ్యయంలో రెండో స్థానం బియ్యానిది. మొత్తం సబ్సిడీ వ్యయంలో 39 శాతం (రూ.2280 కోట్లు) బియ్యంపై ఖర్చు చేశారు. ఇతర అన్ని సబ్సిడీలకు కలిపి రూ.733 కోట్లు (10శాతం) వ్యయం చేశారు. 2010-11తో పోలిస్తే 2011-12లో సబ్సిడీ వ్యయం రూ.770 కోట్ల మేరకు పెరిగింది.

Tuesday, March 19, 2013

2013-14 budget eenadu news

ఎన్నికల ఏడాదిలో బడుగులే లక్ష్యంగా నిధుల గుమ్మరింపు వైద్యం, ఆరోగ్యం సహా కీలక రంగాలకు కత్తెర.. యూజర్ ఛార్జీల మోత 2013-14 బడ్జెట్ రూ.1.61,348 కోట్లు వృద్ధిరేటు మందగించినా రూ.22 వేల కోట్లు పెంపు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విత్తమంత్రి ఆనం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ ప్రతిపాదన విపక్షాల విమర్శలతో.. వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికగా మార్పు ఆదుకుంటారో లేదో తెలియదు. అయిననూ చివరాఖరి ప్రయత్నం చేయక తప్పదు! అందుకే ఆర్థిక మంత్రి ఆనంవారు భారీ వరాల జల్లులూ, ఆర్భాట సందోహాలేవీ లేని బడ్జెట్ తూణీరంలోంచి కొన్ని పూలబాణాలు తీశారు. వాటిని- సరిగ్గా తమను ఆదుకుంటారని ఆశపడుతున్న వర్గాలవైపే గురిపెట్టారు. ఎన్నికల సమర ప్రాంగణంలో ప్రవేశించబోతున్న తుది అంకంలో.. దాదాపు ఆఖరి బడ్జెట్ ఘట్టంలో.. ఆశ్చర్యకరంగా విత్తమంత్రి అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణ మంత్రాలేవీ చదవలేదు. జనం నెత్తిన వరాల జల్లులేవీ కురిపించ లేదు. తమకు బాసటగా నిలుస్తారని ఆశపడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వంటి అక్షౌహిణులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని.. వారివైపు మాత్రమే కొన్ని పూల బాణాలు వదిలారు. మరోవైపు- మధ్యతరగతి జీవుల నెత్తిన కనిపించని కొరడాలు ఝుళిపించారు. పన్నులంటూ, వ్యాట్, యూజర్ ఛార్జీలంటూ, రిఖ్ణ్మీ;స్ట్రేషన్ రుసుములంటూ.. అటూ ఇటూగా బాగానే వాయించారు. గత ఏడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్ల మేర పిండుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. పైగా అత్యంత కీలకమైన విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలకు కొద్దికొద్దిగా కత్తెరలు కూడా వేశారు. మొత్తానికి ఆయన కళ్లన్నీ 'ఓటు బ్యాంకు' మీదే! అయితే... ఆయనైతే బడుగులకు గురి పెట్టారుగానీ.. మరివారికి ఈ సర్కారు మీద 'గురి' కుదురుతుందో లేదో చెప్పటం మహా కష్టం. అందుకే ఆనం వారి బడ్జెట్ పత్రం.. ఆశలు వదులుకోలేని ఒక ప్రయత్నం! ఓటరుపై 'ఆన'ం బడుగుల్ని అకట్టుకొనే పథకాలకు నిధుల గుమ్మరింపు వైద్యం, ఆరోగ్యం సహా పలు కీలక రంగాల వాటాలకు కత్తెర ఈనాడు - హైదరాబాద్ ఆనం గల్లాపెట్టె 'ఓటు' మోత మోగింది. ప్రాధాన్య రంగాల్ని పక్కనబెట్టింది. ''దారిద్య్రానికి మూలం నిధుల కొరత కాదు. సరైన మార్గాల్ని అనుసరించకపోవటమే'' అంటూ అమర్త్యసేన్ చెప్పిన మాటల్ని వల్లెవేసిన విత్తమంత్రి అనం దారిద్య్ర నిర్మూలన మార్గాలకు పెద్దపీట వేయాల్సింది పోయి.. 2014లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా, వివిధ వర్గాల్ని అకర్షించటమే ధ్యేయంగా 2013-14 వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. వైద్యం, గృహ నిర్మాణం వంటి కీలక రంగాల్ని సైతం విస్మరించి ఓటరన్న దీవెనలు పొందడంపైనే దృష్టిపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో వారికి సంబంధించిన పథకాల ప్రస్తావనే ఎక్కువగా చోటు చేసుకొంది. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతున్న నేపథ్యంలో మున్ముందు రాజకీయంగా ప్రయోజనాల్ని పొందటమే ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ పరమార్థంగా ఉంది. ఇదే ఆఖరి అవకాశం... లెక్కప్రకారమైతే.. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు 2014 ఏప్రిల్, మే నెలల్లో జరుగుతాయి. ఆ ఎన్నికల నాటికి రాష్ట్ర సర్కారు చేతిలో చిట్టచివరి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ఇది మాత్రమే. 2014 ఎన్నికల వేళ ప్రభుత్వం కేవలం కొద్ది రోజుల ఖర్చులకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టటమే తప్ప 2014-15కు పూర్తిస్థాయి బడ్జెట్‌కు రూపకల్పన చేసే అవకాశం ఉండదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ తన ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసుకోవటం కోసమే సర్కారు ఇలా చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి బడ్జెట్ మాత్రమే సర్కారు వద్ద ఉండే ప్రధాన, చివరి ఆయుధం కాబట్టి.. కొన్ని వర్గాల వారిని అకట్టుకొనేలా తీర్చిదిద్దుకొనేందుకు ప్రభుత్వం చాలా తంటాలు పడింది. వ్యవసాయం తీవ్రసంక్షోభంలో చిక్కుకొని రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు 5.29 శాతానికి పరిమితమైన నేపథ్యంలో కూడా 2012-13 సవరణ బడ్జెట్ కంటే రూ.22 వేల కోట్లను కొత్త బడ్జెట్‌లో అదనంగా చేర్చింది. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే పథకాలను కూడా ప్రత్యేకంగా ప్రవేశపెట్టేందుకు సర్కారుకు సాధ్యంకాదు. అందుకే ప్రస్తుత బడ్జెట్‌లో ఆయా వర్గాలకు ఇచ్చిన నిధులకు అనుగుణంగా త్వరలోనే కొన్ని పథకాలను ప్రవేశపెట్టి ఎన్నికల వేళ ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది. ప్రధాన రంగాలకు తగ్గిన కేటాయింపులు మొత్తం రూ.1.61 లక్షల కోట్లతో తయారుచేసిన బడ్జెట్‌లో పలు ప్రధాన రంగాలకు పొందుపరిచిన ప్రణాళిక, ప్రణాళికేతర కేటాయింపుల శాతం నడుస్తున్న 2012-13 బడ్జెట్ కంటే తగ్గిపోయింది. తాను లక్ష్యంగా నిర్దేశించుకొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మాత్రం ఎక్కువ నిధుల్ని ఇవ్వటంతో వారికి ప్రస్తుత 5.31 శాతం నుంచి 7.01 శాతానికి నిధులు పెరిగాయి. ఈ నిధులు ఆయా వర్గాల్ని ఆకర్షించే పథకాలకు వెళ్లాయి. అయితే అదే వర్గాలు విరివిగా ఉపయోగించుకొనే ఆసుపత్రులపై మాత్రం సర్కారుకు దయ కలగలేదు. వైద్యానికి ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కేటాయింపుల వాటాను బడ్జెట్ మొత్తంలో 4.04 శాతం నుంచి 4.02 శాతానికి కుదించేసింది. దేశంలో పలు ప్రధాన రాష్ట్రాల కంటే ఇక్కడే తక్కువగా కేటాయిస్తున్నారంటూ రిజర్వు బ్యాంకు ఇటీవల వెల్లడించిన నేపథ్యంలోనైనా వైద్యం వాటాను పెంచలేదు. విద్యకు కుదింపు విద్యా రంగంలో రాష్ట్రంలోని కేటాయింపు శాతం మిగతా అన్ని రాష్ట్రాల కంటే బాగా తక్కువనే విషయాన్నీ ఆర్‌బీఐ చెప్పింది. ఇప్పుడు కేటాయింపును పెంచాల్సిందిపోయి విద్యా రంగానికి 12.70 శాతం వాటాను 12.30 శాతానికి కుదించింది. అంటే తాను అకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్న వర్గాలకు విద్య, వైద్యం సరిగ్గా సమకూరకపోయినా సర్కారుకు ఏమీ పట్టదు. అవి రెండూ తన లక్ష్య సాధనకు మార్గాలను ఏర్పరచలేవు కాబట్టే సర్కారు ఇలా వ్యవహరించింది. తనకు అక్కరకు వస్తారని భావించటం వల్లనే బీసీల సంక్షేమ కేటాయింపును రూ. 2,656 కోట్ల నుంచి రూ.3,632 కోట్లకు పెంచింది. ఎస్సీలకు చెందిన సాంఘిక సంక్షేమ కేటాయింపును రూ.1,719 కోట్ల నుంచి ఏకంగా రూ.3,077 కోట్లకు పెంచేసింది. ఎస్టీలకు మరో రూ.500 కోట్లు అదనంగా ఇచ్చింది. మైనారిటీలకు ప్రస్తుతమున్న రూ.482 కోట్లను ఏకంగా రూ.1,020 కోట్లకు తీసుకెళ్లింది. నడ్డీ విరుస్తారు... బడుగు వర్గాల ఓట్లను దండుకోవాలనే సన్నాహాల్లో ఉన్న సర్కారు మళ్లీ అవేవర్గాలు ఉపయోగించే పప్పులు, సబ్బులు, బియ్యం సహా పలు వస్తువులపై విపరీతంగా పన్నుల్ని పిండదలచింది. సొంత పన్నుల రాబడుల్ని 2012-13 సవరించిన బడ్జెట్ కంటే దాదాపు రూ.10 వేల కోట్ల మేర పెంచి రూ.72 వేల కోట్ల మేర రాబట్టదలిచింది. ఇందులో వస్తువులపై వ్యాట్ ద్వారా వచ్చే మొత్తమే రూ.52 వేల కోట్ల మేర ఉంటుంది. సవరించిన బడ్జెట్‌తో పొలిస్తే ఇది రూ.10 వేల కోట్ల ఎక్కువ. అనేక వస్తువుల్ని గరిష్ఠ పన్ను రేటు పరిధిలోకి తెచ్చినప్పుడే ఇంతటి రాబడి సాధ్యమవుతుంది. భూముల రిఖ్ణ్మీ;స్ట్రేషన్ రుసుముల్ని బాగా పెంచాలని కూడా సర్కారు సంకల్పించింది. రిఖ్ణ్మీ;స్ట్రేషన్ల రాబడి లక్ష్యాన్ని ఏకంగా రూ.6,414 కోట్లకు చేర్చింది. ప్రస్తుత సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.1,464 కోట్లు ఎక్కువ. ఇక త్వరలో మోటారు వాహనాల జీవిత కాల పన్నులు కూడా పెరగబోతున్నాయని కొత్త బడ్జెట్‌లోని రవాణా శాఖ రాబడి లక్ష్యం వెల్లడిస్తోంది. వాహనాలపై సుంకాల రాబడి లక్ష్యాన్ని రూ.745 కోట్లు ఎక్కువతో రూ. 4,352 కోట్లగా పొందుపరిచింది. వివిధ రిఖ్ణ్మీ;స్ట్రేషన్లతో సహా వివిధ శాఖల్లో యూజర్ ఛార్జీల బాదుడు కూడా పెరగబోతోంది. సాకారమయ్యేనా? సర్కారుకు రాబడులు పెరగాలంటే వ్యవసాయం బాగుండాలి. కానీ వ్యవసాయ వృద్ధిరేటు ప్రస్తుతం తిరోగమనంలో ఉంది. పరిశ్రమలదీ ఇదే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో సర్కారు ఆర్భాటంగా తెచ్చిన బడ్జెట్ ఆయా వర్గాలకు నిజంగా ఉపయోగపడుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తంకావటం సహజం. బడ్జెట్‌లో చెప్పినట్టుగా చేయలేకపోతే సర్కారువన్నీ ఎన్నికల వేళ ఉత్తుత్తి వాగ్దానాలుగానే మిగిలిపోతాయి. అప్పులు భారం ప్రభుత్వం అప్పుల్ని కూడా ఈసారి ఎక్కువగానే తేదలచింది. ఇప్పటికే అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయినా మరిన్ని అప్పులకు ఎగబడదలచింది. మొత్తం రూ.24,487 కోట్ల నికర అప్పుల్ని తేబోతోంది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.85 శాతం. 2012-13 బడ్జెట్‌కు నికర అప్పుల్ని 20 కోట్ల మేర తెస్తామని తొలి అంచనాల్లో చెప్పి సవరించిన అంచనాల్లో దాన్ని రూ.21 వేల కోట్లకు పెంచింది. వైఎస్ హయాంలో మొదలైన భూముల అమ్మకాలను ఏ సర్కారూ వదిలిపెట్టడం లేదు. కొత్త బడ్జెట్‌లో భూములపై రూ.37 కోట్లను లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఓటాన్ అకౌంట్ కూడా.. 2013-14 ఆర్థిక సంవత్సరం మొదటి 3నెలల ఖర్చులకుగాను దాదాపు రూ.40వేల కోట్లతో ఓటాన్ అకౌంట్‌నూ ప్రభుత్వం ఈ పూర్తిస్థాయి బడ్జెట్‌లో నుంచే ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులను విశ్లేషించడం కోసం కొత్తగా స్థాయి సంఘాలు ఏర్పాటయినందున ఈ ఓటాన్ అకౌంట్ ఆవశ్యకత ఏర్పడింది. ఓటాన్ అకౌంట్‌కు ఈ నెల 26వ తేదీన, పూర్తిస్థాయిబడ్జెట్‌కు మే 2న ఆమోదం లభిస్తుంది.

State Budget 2013-14 (Eenadu)

రూ. 1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్.. ముఖ్యాంశాలు

 హైదరాబాద్: 2013-14 బడ్జెట్‌ను రూ.1,61,348 కోట్ల అంచనాతో ఆర్థికశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనాలు * ప్రణాళికావ్యయం రూ. 59,422 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,926 కోట్లు * ద్రవ్యలోటు రూ. 24,487 కోట్లు * రెవెన్యూ మిగులు రూ. 1023 కోట్లు * 12వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్ర వృద్దిరేటు 10 శాతం ఉండేలా లక్ష్యం విద్యకు కేటాయింపులు ఉన్నత విద్యకు రూ. 482 కోట్లు పాఠశాల విద్యకు 16,990 కోట్లు విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపునకు రూ. 250 కోట్లు 7వ తరగతి వరకు మెస్‌ఛార్జీలు రూ.475నుంచి రూ. 750కు పెంపు 8నుంచి 10వ తరగతి వరకు మెస్‌ఛార్జీలు రూ. 535 నుంచి రూ. 850కు పెంపు ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు మెస్‌ఛార్జీలు రూ. 520 నుంచి రూ. 1050కు పెంపు ఎస్సీ, బీసీ విద్యార్థులకు రాజీవ్ దీవెన పథకం ద్వారా ఉపకారవేతనాలు అందజేయనున్నారు. దీని వల్ల సుమారు మూడు లక్షలమంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని ఆర్థిక మంత్రి అంచనా. నెల్లూరులో మరో వైద్య కళాశాల ఏర్పాటుకు పరిపాలన పరమైన అనుమతి లభించింది. దీనికోసం బడ్జెట్‌లో రూ. 352 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు. సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ రూ. 2126 కోట్లు వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 4027కోట్లు మహిళా శిశు సంక్షేమం రూ. 2712 కోట్లు సాంఘిక సంక్షేమ శాఖకు రూ. 4,122 కోట్లు మైనార్టీ సంక్షేమశాఖకు రూ. 1027 కోట్లు ఎస్సీ కులాల ఉప ప్రణాళికకు రూ. 8585కోట్లు ఎస్టీల ఉప ప్రణాళికు రూ. 3,666 కోట్లు బీసీ కార్పోరేషన్, సొసైటీలకు రూ. 436 కోట్లు వికలాంగుల సంక్షేమానికి రూ. 73 కోట్లు శాంతిభద్రతలు శాంతి భద్రతలకు రూ. 5,386 కోట్లు పోలీసు శిక్షణాసంస్థల ఆధునీకరణకు రూ. 100 కోట్లు హైదరాబాద్‌లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు సేవలు మౌలికసదుపాయాల కల్పనకు రూ. 180 కోట్లు పరిశ్రమలు వాణిజ్యశాఖ రూ. 1120 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ రూ. 6481 కోట్లు రహదార్లు, రవాణాశాఖకు రూ. 7117 కోట్లు పౌరసరఫరాలశాఖకు రూ. 3,231కోట్లు యువజన సేవలకు రూ. 280 కోట్లు పట్టణాభివృద్ధిశాఖకు రూ. 6,770 కోట్లు అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం కింద రూ. 2,700 కోట్లు రాష్ట్రంలో అన్నీ ప్రాంతాల క్రీడాప్రాంగణాల ఏర్పాటకు రూ .200 కోట్లు రాష్ట్రరాజధాని నగరంలో మెట్రోరైలు నిర్మాణం కోసం భూసేకరణ, పునరావాసానికి అదనంగా రూ. 1,980 కోట్లు కేటాయించారు. సాంస్కృతికం, పర్యాటకం తెలుగు బాటపేరిల సాంస్కృతిక పండగల కోసం రూ. 25 కోట్లు సాంస్కృతిక రంగానికి రూ. 69 కోట్లు పర్యాటక శాఖ రూ. 163 కోట్లు విద్యుత్ శాఖ రానున్న ఏడాది కాలంలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు చర్యలు చిత్తూరు ఖ్ణ్మీ;ల్లాలో తాగునీటి సరఫరా కోసం ఇన్‌క్యాప్ ద్వారా ఏర్పాట్లు వ్యవసాయానికి ఏడుగంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94,304 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం ప్రభుత్వం రూ. 3621 కోట్లు కేటాయించింది. జైకా సహకారంతో 16 ఖ్ణ్మీ;ల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ కోసం రూ. 1154 కోట్లు ఐటీ, ఉద్యోగాలు ఐటీ శాఖకు రూ. 207 కోట్లు. తిరుపతి, జహీరాబాద్‌లలో హోటళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణాకేంద్రాలు ఆర్థిక శాఖలో ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థలో భాగంగా బిల్ మానిటరింగ్ ఏర్పాటు 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు ఏర్పాటు చేస్తాం హైదరాబాద్‌కు తాగునీటి వసతిపెంపునకు రూ. 6,770 కోట్లు ( గోదావరి, కృష్ణా పథకాలు) వచ్చే ఏడాది కాలంలో 27,903 ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వైద్య వసతుల కల్పనకు రూ. 6481 కోట్లు జలయజ్ఞం, నీటిపారుదల జలయజ్ఞానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 13800 కోట్లు నీటిపారుదల శాఖకు రూ. 22,895 కోట్లు పోలవరం ప్రాజెక్టు అంచనా రూ. 16,010 కోట్లు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ. 38,500 కోట్లు పై రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జలయజ్ఞంలో 21,435 లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పటి వరకు జలయజ్ఞంలో రూ. 67,208 కోట్లను వ్యయం చేశారు. వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం ప్రభుత్వం రూ. 3621 కోట్లు కేటాయించింది. జైకా సహకారంతో 16 ఖ్ణ్మీ;ల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ కోసం రూ. 1154 కోట్లు 83 వేల టన్నుల ఆహార ధాన్యాల నిల్వకు రూ. 42 కోట్లతో 39 మండల స్థాయి గోదాముల నిర్మాణం వర్షాధారిత వ్యవసాయ అభివృద్ధికి రూ. 2903 కోట్లు వ్యవసాయ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 25,962 కోట్లతో వ్యవసాయబడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికా వ్యయం రూ. 17,694 కోట్లు వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం రూ. 8,267కోట్లు ఈ ఏడాది రూ. 72,450 కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6,128 కోట్లు ప్రకృతి వైపరీత్యాలకు వ్యవసాయ బడ్జెట్‌లో రూ. 589 కోట్లు ఫుడ్ ప్రొసెసింగ్‌కు రూ. 100 కోట్లు కనీస మద్దతు ధర లభించని సమయంలో రైతులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో ఆలంబన నిధి ఏర్పాటుచేయనున్నట్లు ఆర్థికమంత్రి ఆనం ప్రకటించారు. ఆహార ఉత్పత్తుల ప్రొసెసింగ్ ప్రత్యేక యూనిట్ వడ్డీలేని పంట రుణాలకు ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించింది. విత్తనాభివృద్ధికి రూ. 308 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 450 కోట్లు సోలార్ పంప్‌సెట్లకు రూ. 150 కోట్లు రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి 2013-14 బడ్జెట్ దోహదం చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనంరామనారాయణరెడ్డి అన్నారు. అన్నీ వర్గాల మానవాభివృద్దికికు కృషి చేస్తామన్నారు.

2013 - 14 రాష్ట్ర వార్షిక ప్రణాళిక

  • రాష్ట్ర ప్రణాళిక వ్యయం రూ.59,422 కోట్లు, ఈ మొత్తం గత సంవత్సరం కంటే 9.98శాతం ఎక్కువగా ఉంది. ఇందులో రాష్ట్ర పధకాలకు రూ.52,955.28 కోట్లుగా ఉంది.
  • ఆర్ధిక వృద్ధికి మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో కీల కం. ముఖ్యంగా సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ 2013-14 వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం కింద ఎ క్కువ నిధులు కేటాయించడం జరిగింది.
  • 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017) ముఖ్యాంశాలు
  • 11వ పంచవర్ష ప్రణాళిక కాలానికి రాష్ట్ర వృద్ధి రేటు 8.18గా ఉండగా, అఖిలభారత వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఈ వృద్ధి సరాసరి 8.03 శాతంగా ఉంది.
  • 12వ పంచవర్ష ప్రణాళిక తొలి సంవత్సరంలో రాష్ట్రంలో అంచనా వృద్ధి 5.29శాతం ఉండగా, దేశం మొత్తంలో ఈ వృద్ధిరేటు 4.96శాతంగా నమోదైంది. కాగా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్‌డీపీ అంచనావ్యయం రూ.7,38,497 కోట్లుగా ఉంది.
  • 12వ పంచవర్ష ప్రణాళికలో అన్నీ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చేసిన వ్యయం రూ.3, 42,842 కోట్లుగా నమోదైంది.
    ఈ వ్యయం 11వ పంచ వర్ష ప్రణాళికలో రాష్ట్రం ఖర్చుచేసిన మొత్తానికి రెండు రెట్లు అధికంగా ఉండగా, 12వ పంచవర్ష ప్రణాళి క పూర్త య్యేవరకు, ప్రస్తుతం చేసిన వ్యయానికి 10శాతం ఎక్కు వగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.
  • 12వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను అ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ, ఆర్ధికవృద్ధితోపాటు, సంక్షేమంపై దృష్టిసారించింది.

    రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యకార్యక్రమాలు...
  • ఎస్‌సీ,ఎస్‌టీలకు కేటాయించిన నిధులను ఆయా వర్గాలకే ఖర్చుచేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్‌సీ,ఎస్‌టీ ఉపప్రణాళిక నిధులకు ( ఆర్ధిక వనరుల చట్టం నెం.1 ఆఫ్‌ 2013 ) చట్టబద్ధత కల్పించింది.
  • ఎస్‌సీ,ఎస్‌టీ ఉప ప్రణాళిక చట్టబద్దత ద్వారా 2013-14 ఆర్ధిక సంవత్సరానికి ఎస్‌సీ సబ్‌ప్లాన్‌కు రూ.8584.83 కోట్లు ఉండగా, ఎస్‌సీ సబ్‌ప్లాన్‌కు రూ.3,666.59 కోట్ల నిధులు కేటాయించారు.
  • రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖలకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిని వ్యవసాయ ప్రణాళిక 2013-14గా అభివర్ణిస్తూ, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం కింద రూ.98,940.54 కోట్లు కేటాయించారు.

    సామాజిక, ఆర్ధిక సర్వే -2012-13 ముఖ్యాంశాలు...
  • 12వ పంచవర్ష ప్రణాళిక తొలి సంవత్సరంలో రాష్ట్రంలో అంచనా వృద్ధి 5.29శాతం ఉండగా, దేశం మొత్తంలో ఈ వృద్ధిరేటు 4.96శాతంగా నమోదైంది. కాగా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రంలో జీఎస్‌డీపీ వ్యవసాయ రంగంలో 1.96 శాతం వృద్ధి ఉండగా, పారిశ్రామిక రంగంలో 0.73శాతం, సేవా రంగంలో 8.45శాతంగా నమోదైంది.
  • 2004-05 వివరాల ప్రకారం 2012-13 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్‌డీపీ అంచనావ్యయం రూ.4,26,470 కోట్లు ఉండగా, ప్రస్తుత ధరల ప్రకారం గత ఆర్ధిక సంవత్సరానికి జీఎస్‌డీపీ అంచనావ్యయం రూ.7,38,497కోట్లుగా ఉంది.
  • 2012-13 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం ప్రకారం రూ.77, 277 కోట్లు అంచనావ్యయం ఉండగా, గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ అంచనావ్యయం 12శాతం అధికంగా ఉంది.
  • గడచిన 10 సంవత్సరాలతో పోల్చుకుంటే రాష్ట్ర తలసరి ఆదాయం దేశం తలసరి ఆదాయం కంటే మెరుగ్గా ఉంది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.8,500గా నమోదుకాగా, దేశ మొత్తంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ.

    రాష్ట్రంలో పక్కాప్రణాళికతో అమలుచేస్తున్న పలు కార్యక్రమాలు...
    1.ఆధార్‌ కార్డుల జారీలో రాష్ట్రం దేశస్ధాయిలో మొదటిస్ధానంలో నిలిచింది.
    2.మీసేవ ద్వారా ప్రభుత్వ ధృవపత్రాల సత్వరమే జారీ.
    3. ఇందిరమ్మ బాట కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి జిల్లాల్లో పర్యటన, తద్వారా హాస్టళ్ళు, పాఠశాలల్లో వసతులపై సమీక్ష. ఇందిరమ్మ బాట కార్యక్రమంతో 14 జిల్లాల్లో పర్యటన పూర్తి.
    4. శిశువులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఐఎంఆర్‌, ఎంఎంఆర్‌, పోషకలోపం నివారణ.
    5. ఐఎంఆర్‌, ఎంఎంఆర్‌ రేటు తగ్గుదల
    6. ఇందిరమ్మ అమృత హస్తం ద్వారా 102 అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణి స్ర్తీలకు పౌష్టికాహారం అందజేయడం.
    7. మార్పు, చిన్నారి చూపు కార్యక్రమాలు
    8.ప్రజాపంపిణీ వ్యవస్ధ ద్వారా మనబియ్యం పధకం ద్వారా రూ.1కి కేజీ బియ్యం
    ఆహార ధాన్యాల ఉత్పత్తికి గత సంవత్సరం 66.3 లక్షల హెక్టార్లు లక్ష్యం కాగా, 72.9 లక్షల హెక్టార్లుగా నమోదైంది.
  • ‘వడ్డీలేని రుణాలు’ పధకం ద్వారా రైతులకు ఆత్మస్ధైర్యం కల్పించడం.
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేక కార్యక్రమాలు.
  • 13.61 స్వయం సహాయక బృందాలలో ఒక కోటి నలభై ఆరు లక్షల సభ్యులు.
  • గ్రామీణ ప్రాంతాలలో 10.59 స్వయం సహాయక బృందాలు ఉండగా, వీటిలో సభ్యులు 1కోటి 15 లక్షల మంది సభ్యులున్నారు.
  • పట్టణ ప్రాంతాలలో మూడు లక్షల రెండు వేల స్వయం సహాయక బృందాలు ఉండగా, ఇందులో 31లక్షల మంది సభ్యులున్నారు.
  • హాస్టల్‌ విద్యార్ధులకు డైట్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఛార్జీల పెంపు.
  • ఐటీ రంగం ద్వారా రూ.40,646 కోట్ల మేరకు ఎగుమతులు ఉండగా, అదనంగా గత ఆర్ధిక సంవత్సరానికి 39,186 మందికి ఉద్యోగ అవకాశాలు. దీనితో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు మొత్తం 3,18,624 ఉన్నారు.
  • రాష్ట్రంలో ప్రతినెలా 76.09 మందికి ఫించన్‌ చెల్లిస్తుండగా, 2011-12 ఆర్ధిక సంవత్సరానికి 64లక్షల ఫించన్‌దారులకు రూ.2069 కోట్లు వెచ్చించారు. కాగా 2012-13 ఆర్ధిక సంవత్సరానికి (సెప్టెంబర్‌ చివరినాటికి) రూ.68.05 ఫించన్‌దారులకు రూ.1108.55 కోట్లు చెల్లించారు.
  • 2011-12 ఆర్ధిక సంవత్సరానికి బలహీన వర్గాలకు 1.05 గృ హాలు నిర్మించగా, 2012-13 ఆర్ధిక సంవత్సరానికి (సెప్టెంబర్‌ చివరినాటికి) 2,03, 475 గృహాలు నిర్మించారు.

Thursday, February 28, 2013

Budget 2013-14 (Eenadu)

ª½Ö. 16,65,297 Âî{xÅî ꢓŸ¿ ¦œçbšü
ƒ¢{-éªošü œç®ýˆ, å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ
* 2013Ð14 ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ê¢“Ÿ¿-¦-œçbšü ª½Ö. 16,65,297 Âî{Õx
* «u«-²Ä§ŒÕ ª½¢’Ã-EÂË ª½Ö.27,049 Âî{Õx
* «u«-²Ä§ŒÕ X¾J-¬ð-Ÿµ¿-ÊÂ¹× ª½Ö.3,415 Âî{Õx
* XÔ‡¢-°-‡-®ý„çj ÅíL-N-œ¿ÅŒ X¾ÜJh Íä®ÏÊ „ÃJê XÔ‡¢-°-‡-®ý„çjÐ2
* èä‡-¯þ-‡-¯þ-§Œâ-‚-ªý‡¢ X¾Ÿ±¿-ÂÃ-EÂË ª½Ö.14,873 Âî{Õx
* «u«-²Ä§ŒÕ ÆÊÕ-¦¢Ÿµ¿ ª½¢’é «%Cl´ êª{Õ 3.6¬ÇÅŒ¢
* ‚£¾É-ª½-ŸµÄ-¯Ãu© …ÅŒpAh 250 NÕL-§ŒÕ¯þ {ÊÕo-©Â¹× Í䪽ի
* «u«-²Ä§ŒÕ ª½ÕºÇ© X¾ª½-X¾A ¹©pÊ ©Â¹~u¢ ª½Ö.7©-¹~© Âî{Õx
* X¾¢{© QÅŒ-M-¹-ª½º ’îŸÄ-«á-©Â¹× ª½Ö.500 Âî{Õx
* „Ã{ªý 农¿x ÆGµ-«%-Cl´ÂË ª½Ö.5,387 Âî{Õx
* wåXj„ä{Õ ¦Çu¢Â¹×-©ðxÊÖ 4¬ÇÅŒ¢ «œÎfê éªjÅŒÕ-©Â¹× ª½ÕºÇ©Õ
* ®¾ÂÃ-©¢©ð ª½ÕºÇ© «œÎf ÍçLx¢-*Ê éªjÅŒÕ-©ê 4¬ÇÅŒ¢ «œÎf ª½ÕºÇ©Õ
‚ŸÄ§ŒÕ X¾ÊÕo ²Äx¦Õ©ðx «Öª½Õp©äŸ¿Õ
[ X¾ÊÕo ²Äx¦ü©ð «Öª½Õp-©äx«Û
[ „ÃJ¥-ÂÃ-ŸÄ§ŒÕ¢ ª½Õ. 2 ©Â¹~-©-©ðX¾Û …Êo-„ê½Õ ‚ŸÄ-§ŒÕX¾Û X¾ÊÕo X¾J-Cµ-©ðÂË ªÃª½Õ.
[ ª½Ö. 2 ©Â¹~-©-ÊÕ¢* ª½Ö. 5 ©Â¹~© «ª½Â¹× ‚ŸÄ§ŒÕ¢ …Êo-„Ã-JåXj 10 ¬ÇÅŒ¢ X¾ÊÕo §ŒÕŸ±Ä-ÅŒŸ±¿¢
[ ª½Ö. 5 ©Â¹~-©-©ðX¾Û ‚ŸÄ§ŒÕ¢ ¹L-T-Ê-„Ã-JÂË ª½Ö.2 „ä©Õ šÇuÂúq “éœ˚ü
[ ª½Ö. 5 ©Â¹~© ÊÕ¢* ª½Ö. 10 ©Â¹~© ‚ŸÄ§ŒÕ¢ …Êo-„Ã-JåXj 20 ¬ÇÅŒ¢ X¾ÊÕo §ŒÕŸ±Ä-ÅŒŸ±¿¢
[ ª½Ö. 10 ©Â¹~-©Â¹× NÕ¢* ‚ŸÄ§ŒÕ¢ …Êo-„Ã-JåXj 30 ¬ÇÅŒ¢ X¾ÊÕo §ŒÕŸ±Ä-ÅŒŸ±¿¢
[ ª½Ö. ÂîšËÂË åXj’à ‚ŸÄ§ŒÕ¢ ¹L-TÊ „ÃJåXj ®¾ªý-͵ÃJb
[ ª½Ö. 10 ©Â¹~-©Â¹× NÕ¢* ‚ŸÄ§ŒÕ¢ …Êo-„Ã-JåXj 30 ¬ÇÅŒ¢ X¾ÊÕo §ŒÕŸ±Ä-ÅŒŸ±¿¢
[ ®ÏnªÃ®Ïh Æ«Õt-¹¢åXj ŠÂ¹ ¬ÇÅŒ¢ šÌœÎ-‡®ý, «u«-²Ä-§ŒÕ-¦µ¼Ö-NÕÂË NÕÊ-£¾É-ªá¢X¾Û
[ ª½Ö. 50 ©Â¹~-©Â¹× åXj¦-œËÊ ®ÏnªÃ®Ïh Æ«Õt-¹¢åXj ŠÂ¹ ¬ÇÅŒ¢ šÌœÎ-‡®ý
[ NŸÄu ®¾Õ¢Â¹¢ 3 ¬ÇÅŒ¢ ÂíÊ-²Ä-T¢X¾Û
[ ª½Ö. ÂîšË ‚ŸÄ§ŒÕ¢ …Êo-„Ã-JåXj 30 ¬ÇÅŒ¢ X¾ÊÕoÅî ¤Ä{Õ ÆŸ¿-Ê¢’à ¨ \œÄC ÊÕ¢* 10 ¬ÇÅŒ¢ ®¾ªý-͵ÃJb
[ ‚ŸÄ-§ŒÕX¾Û X¾ÊÕo ¦ÂÃ-ªá© ÍçLx¢-X¾Û© Â¢ «¯þ-˜ãj„þÕ å®šË-©ü-„çÕ¢šü
‚¢“Ÿµ¿-“X¾-Ÿä-¬ü©ð ¦µÇK ‹œ¿-êª«Û EªÃtº¢
* ‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü, ¦ã¢’Ã-©ü©ð ¦µÇK ‹œ¿-êª«Û EªÃtº¢
* “X¾ŸµÄ-Ê-«Õ¢“A “’ÃOÕº ®¾œ¿Âú §çÖ•ÊÐ2 ÂË¢Ÿ¿ ‚¢“Ÿµ¿-“X¾-Ÿä-¬üÂ¹× “X¾Åäu¹ EŸµ¿Õ©Õ
* ‚£¾Éª½ ¦µ¼“Ÿ¿ÅŒ “X¾•© “¤ÄŸ±¿-NÕ¹ £¾Ç¹׈
* ¨ \œÄC “X¾ºÇ-R¹ «u§ŒÕ¢ ª½Ö5.55 ©Â¹~© Âî{Õx
* ‚§Œá†ý Â¢ ª½Ö.1069Âî{Õx
* ®¾OÕ-¹%ÅŒ P¬ÁÙ ÆGµ-«%Cl´ X¾Ÿ±¿-ÂÃ-EÂË ª½Ö.17,700Âî{Õx
* ƒ¢CªÃ ‚„îý §çÖ•Ê Â¢ ª½Ö.15,184 Âî{Õx
* èä‡-¯þ-‡-¯þ-§Œâ-‚-ªý‡¢ X¾Ÿ±¿-ÂÃ-EÂË ª½Ö.14,873 Âî{Õx
* «u«-²Ä§ŒÕ …ÅŒp-ÅŒÕh© ‡’¹Õ-«Õ-Ōթ ŸÄyªÃ ª½Ö.1,38,403 Âî{Õx
* ‡®Ôq, ‡®Ôd, H®Ô „çÕi¯Ã-Kd© …X¾-Âê½ „äÅŒ-¯Ã© Â¢ ª½Ö.5,284 Âî{Õx
* “’ÃOÕº «ÕøL¹ ®¾Ÿ¿Õ-¤Ä-§ŒÖ© ¹©p-ÊÂ¹× ª½Ö.20,000 Âî{Õx
* “’ÃOÕº …¤ÄCµ £¾ÉOÕ X¾Ÿ±¿-ÂÃ-EÂË ª½Ö.33,000 Âî{Õx
* ’¹Åä-œÄ-CÅî ¤òLaÅä 6.5¬ÇÅŒ¢ åXJ-TÊ ¦œçbšü
* «ÕøL¹ ®¾Ÿ¿Õ-¤Ä-§ŒÖ© ª½¢’¹¢©ð ª½Õº-æ®-¹-ª½-ºÂ¹× “¤òÅÃq-£¾Ç-ÂéÕ
* Íç¯çjoÐ-¦ã¢-’¹-@ÁÚª½Õ «ÕŸµ¿u ¤ÄJ-“¬Ç-NÕ¹ ÂÃJ-œÄªý
* ¦ã¢’¹-@ÁÚ-ª½ÕÐ-«á¢-¦ªá «ÕŸµ¿u ¤ÄJ-“¬Ç-NÕ¹ ÂÃJ-œÄªý
* ¡Ê-’¹-ªýÐ-©ä£ýÇ «ÕŸµ¿u ª½Ö.1800 Âî{xÅî “X¾Åäu¹ ®¾«Ö-Íê½ «u«®¾n
* 5 •©-ª½-„ÃºÇ «ÖªÃ_-©Â¹× èÇB-§ŒÕ-£¾ÇôŸÄ
* ÍŒ«áª½Õ ®¾£¾Ç-•-„çŒá Ưäy-†¾º ŠX¾p¢-ŸÄ© ®¾OÕ¹~ 2013Ð14 êšÇ-ªá¢-X¾Û©Õ
* ‡®Ôd …X¾ “X¾ºÇ-R-Â¹Â¹× ª½Ö.24,491 Âî{Õx
* ®ÔY ®¾«Õ-“’Ã-Gµ-«%-Cl´ÂË ¨ ¦œçb-šü©ð ª½Ö.19,134 Âî{Õx
* P¬ÁÙ ®¾¢êÂ~-«Ö-EÂË ª½Ö.77,236 Âî{Õx
* ‡®Ôq …X¾ “X¾ºÇ-R-Â¹Â¹× ª½Ö.41,561 Âî{Õx
* ‡®Ôq, ‡®Ôd …X¾-“X¾-ºÇ-R¹ EŸµ¿Õ©Õ ƒÅŒª½ ¬ÇÈ-©Â¹× êšÇ-ªá¢-ÍŒ{¢ ®¾J-Âß¿Õ.
* „çÕi¯Ã-J-šÌ© ®¾«Õ-“’Ã-Gµ-«%Cl´ÂË ª½Ö.3,511 Âî{Õx
* «Õø©Ç¯Ã ƦÕ-©ü-¹©Ç¢ ¤¶ù¢œä-†¾-¯þÂ¹× ª½Ö.7.5 Âî{Õx
* „çjŸ¿u, ¹×{Õ¢¦ ®¾¢êÂ~-«Ö-EÂË ª½Ö.37,330 Âî{Õx
* X¾{dº ‚ªî’¹u NÕ†¾¯þ ª½Ö.22,239 Âî{Õx
* «Ö«Ê «Ê-ª½Õ© ÆGµ-«%-Cl´ÂË ª½Ö.65,680 Âî{Õx
* ®¾ª½yP¹~ ÆGµ-§ŒÖ¯þÂ¹× ª½Ö.27,259 Âî{Õx
* ®¾¢“X¾-ŸÄ§ŒÕ „çjŸÄu-EÂË ª½Ö.139 Âî{Õx
* «ÖŸµ¿u-NÕ¹ NŸÄu-P-¹~-ºÂ¹× ª½Ö.3,993 Âî{Õx
* «ÕŸµÄu£¾Ço ¦µð•-¯Ã-EÂË ª½Ö.13,215 Âî{Õx
* *¯Ão-ª½Õ©ðx ƒ¢Âà ¤ù†Ïd-ÂÃ-£¾Éª½ ©ðX¾¢ ®Ï’¹Õ_-X¾-œÄLqÊ Æ¢¬Á¢.
* ’¹Js´-ºË©Õ, Ê«-èÇÅŒ P¬ÁÙ ®¾¢êÂ~-«Ö-EÂË ª½Ö.300 Âî{Õx
* ÅÃ’¹Õ-Fª½Õ, ¤ÄJ-¬ÁÙ-ŸÄl´u-EÂË ª½Ö.15,260 Âî{Õx
* “’ÃOÕ-ºÇ-Gµ-«%Cl´ X¾Ÿ±¿-ÂÃ-EÂË ª½Ö.80,190 Âî{Õx
’¹%£¾Ç-ª½Õº «œÎf-êª-{x©ð ÆŸ¿-ÊX¾Û ÅŒT_¢-X¾Û©Õ
* ¤ñŸ¿ÕX¾Û X¾Ÿ±¿-ÂÃ-©Â¹× «ÕJ¢ÅŒ “¤òÅÃq£¾Ç¢
* ªÃ°-„þ-’âDµ ¨ÂËyšÌ X¾Ÿ±¿Â¹¢ «ÕJ¢ÅŒ ®¾ª½-@Á-ÅŒª½¢
* ’¹%£¾Ç EªÃtº ª½¢’Ã-EÂË ÂíÅŒh «ÜXÏJ
* ’¹%£¾Ç-E-ªÃtº «œÎf-êª-{x©ð ÆŸ¿-ÊX¾Û ÅŒT_¢-X¾Û©Õ: „ç៿šË²ÄJ ’¹%£¾Ç ª½Õº¢ B®¾Õ-¹×-Êo-„Ã-JÂË «Jh¢X¾Û
* ’¹%£¾Çª½ÕºÇ©åXj «œÎf NÕÊ-£¾É-ªá¢X¾Û ©Â¹~-Êoª½ ÊÕ¢* ª½Ö.2.5©-¹~-©Â¹× åX¢X¾Û
* X¾¢{ «ÖJpœË NŸµÄ-¯Ã-EÂË ª½Ö.500Âî{Õx
* ª½Ö.1650 Âî{xÅî ‡ªá„þÕq ÅŒª½£¾É «Õªî ‚ª½Õ „çjŸ¿u ¹@Ç-¬Ç-©©Õ
„çªáu-Âî{x «â©-Ÿµ¿-Ê¢Åî «Õ£ÏÇ@Ç ¦Çu¢Â¹×
* „çªáu-Âî{x «â©-Ÿµ¿Ê¢Åî “X¾¦µ¼ÕÅŒy ª½¢’¹¢©ð “X¾Åäu¹ «Õ£ÏÇ@Ç ¦Çu¢Â¹×
* X¾«ªý ©Ö„þÕ ‚Ÿµ¿Õ-E-ÂÌ-¹-ª½-ºÂ¹× ª½Ö.2400Âî{Õx
* èÇB§ŒÕ ‚£¾Éª½ ¦µ¼“Ÿ¿-ÅŒÂ¹× ª½Ö.10„ä© Âî{Õx
* ª½Ö.25©-¹~© «ª½Â¹× ’¹%£¾Ç-ª½Õº¢ ¤ñ¢Ÿä-„Ã-JÂË ª½Ö.©Â¹~ «ª½Â¹× ÆŸ¿-ÊX¾Û ªÃªáB
* ’¹Õ•-ªÃÅý, «Õ£¾É-ªÃ†¾Z, «ÕŸµ¿u-“X¾-Ÿä¬ü, §ŒâXÔ©ð 3„ä© ÂË.OÕ. ªîœ¿x EªÃtº¢
* ª½£¾Ç-ŸÄJ “¤Äèã¹×d Â¢ “X¾Åäu¹ E§ŒÕ¢-“ÅŒº «u«®¾n
* «ÕøL¹ ®¾Ÿ¿Õ-¤Ä-§ŒÖ© ª½¢’¹¢©ð ª½Õº æ®Â¹-ª½-ºÂ¹× “¤òÅÃq-£¾Ç-ÂéÕ
* ‚£¾Éª½ ¦µ¼“Ÿ¿ÅŒ G©ÕxÂ¹× X¾C-„ä© Âî{Õx
* 2014 ¯ÃšËÂË ÆEo ®¾£¾Ç-Âê½ ¦Çu¢Â¹×-©ÂË \šÌ-‡¢©Õ
* “X¾A ¦Çu¢Â¹× \šÌ‡¢ ÅŒX¾p-E-®¾J
* «Öª½Õs-©üqåXj ®¾Õ¢Â¹¢ åX¢X¾Û
* Åî©Õ «®¾Õh-«Û©Õ, ¤ÄŸ¿-ª½-¹~© Ÿµ¿ª½©Õ ÅŒ’¹Õ_-Ÿ¿©
* ªÃÊÕÊo ÂíCl-ªî-V©ðx Æ«Õ-©Õ-©ðÂË ªÃÊÕÊo °šÌ-‡®ý
* NŸ¿u, X¾J-¬ð-Ÿµ¿Ê ®¾¢®¾n-©-ÂËÍäa ÍŒ¢ŸÄ©Õ ²Ä«Ö->¹ ¦ÇŸµ¿uÅŒ ÂË¢Ÿ¿ X¾J-’¹-ºÊ
* ¦œçbšü ®¾«Ö-„ä-¬Ç©Õ ƧäÕu-©ð’à “X¾ÅŒu¹~ X¾ÊÕo© Âîœþ ®¾«-ª½º G©Õx

రూపాయి రాక...పోక


బడ్జెట్ 2013-2014 ముఖ్యాంశాలు...

* ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.41,561 కోట్లు
* ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.24,598 కోట్లు
* మహిళా సంక్షేమానికి రూ.200 కోట్లు
* వికలాంగుల పథకానికి రూ.110 కోట్లు.
* వైద్య శాఖకు రూ.37,330 కోట్లు
* చిన్నారులకు రూ.76,200 కోట్లు
* వైద్య విద్యా శిక్షణ కోసం రూ.4727 కోట్లు
* ఆయూష్‌కు రూ.1069 కోట్లు
* విద్యాశాఖకు రూ.65,857 కోట్లు.
* సర్వశిక్ష అభియాన్‌కు రూ.27,368 కోట్లు.
* స్కాలర్‌షిప్‌లకు రూ.5,284 కోట్లు.
* మధ్యాహ్న బోజనం రూ.13,837 కోట్లు
* మహిళలు, శిశివు పోషకాహార పథకానికి రూ.300 కోట్లు, 100 నుంచి 200 జిల్లాలకు ఈ పథకం విస్తరణ
* గ్రామీణాభివృద్ధికి రూ.80,195 కోట్లు.
* ఇందిరా ఆవాస్ యోజన కోసం రూ.15,184 కోట్లు.
* తాగునీటి, పారిశుధ్యానికి రూ.15,260 కోట్లు.
* ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తాగునీటి శుద్ధికి రూ.1400 కోట్లు
* గ్రామీణ సడక్ యోజన రెండో ధఫా ప్రారంభిస్తాం.
* 12వ ప్రణాళికలో నగరాభివృద్ధి పథకం కొనసాగింపు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 250 మినియన్ టన్నుల పైనే.
* రవాణా శాఖకు అదనంగా 10 వేల బస్సులు.
* రవాణా శాఖకు రూ.14,873 కోట్లు
* వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రూ.27,049 కోట్లు.
* వాటర్ షెడ్ల నిర్వహణకు రూ.5,387 కోట్లు.
* ఎస్సీ,ఎస్టీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.5,284 కోట్లు.
* మైనార్టీ సంక్షేమానికి రూ.3,511 కోట్లు.
* ఉపాధి పనులకు రూ.70 వేల కోట్లు.
* ఉపకార వేతనాలకు రూ.5,284 కోట్లు.
* రూ. 7లక్షల కోట్ల మేర పంట రుణాలు, సకాలంలో రుణాలు చెలించే రైతులకు రాయితీ.
* ఆహార భద్రత పథకానికి అదనంగా రూ.10 వేల కోట్లు.
* పంట మార్పిడికి ప్రోత్సాహం.
* మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల కోసం కొత్త పథకాలు.
* 2013-14 బడ్జెట్ రూ16,65,282 కోట్లు.
* ఈ ఏడాది ప్రణాళిక వ్యయం రూ.5,55,322 కోట్లు.
* ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో మేజర్ ఓడరేవులు.
* ఎయిమ్స్ తరహా ఆరు వైద్య సంస్థలు.
* పంట శీతలీకరణ గోదాముల కోసం రూ.500 కోట్లు.
* తొలిసారి రూ.25 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి లక్ష వడ్డీ తగ్గింపు.
* బొగ్గు ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రాధాన్యం
* బొగ్గు దిగుమతులు తగ్గించడం ప్రాధాన్యం.
* చిన్న తరహా పరిశ్రమలకు మూడున్నరేల్ల పన్ను రాయితీ.
* చెన్నై - బెంగుళూరు మధ్య పారిశ్రామిక కారిడార్.
* త్వరలో రోడ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు.
* మరమగ్గుల ఆధనికీకరణకు రూ.2400 కోట్లు.
* జౌళి పరిశ్రమలో కాలుష్య నియంత్రీకరణకు రూ.500 కోట్లు.
* 12వ ప్రణాళికలో ఖాది పరిశ్రమకు రూ.850 కోట్లు.
* వ్యవసాయ పరిశోధనకు రూ.3145 కోట్లు.
* 13 జాతీయ బ్యాంకులకు రూ.12,570 కోట్ల అదనపు పెట్టుబడి. ప్రతి బ్యాంకుకు ఏటీఎమ్ తప్పనిసరి.
* ప్రభుత్వ రంగంలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు.
* మహిళా బ్యాంకుకు వెయ్యి కోట్లు మూలధనం. రుణ పరపతికి వీలుగా జాతీయ మహిళా బ్యాంకు.
* వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యక్తిగత భీమా పథకాలు.
* టెక్స్‌టైల్స్ పార్కులకు రూ.50 వేల కోట్లు.
* 10 వేల జనాభా దాటిన గ్రామంలో జాతీయ బ్యాంకు, ఎల్ఐసీ కార్యాలయాల ఏర్పాటు.
* త్వర లో సెబీ చట్ట సరవరణకు చర్యలు.
* అంగన్‌వాడీ వర్కర్లకు గ్రూప్ భీమా పథకాలు.
* పవన విద్యుత్‌కు రూ.800 కోట్లు.
* ఆరు శాతం వడ్డీతో చేనేత మహిళలకు రుణాలు.
* రక్షణ రంగానికి రూ.2,03,670 కోట్లు.
* సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.6 వేల కోట్లు.
* పాటియాలాలో జాతీయ క్రీడా శిక్షణ సంస్థ.
* లక్ష జనాభా దాటిన పట్టణాల్లో ఎఫ్ఎం రేడియోలు. ఈ ఆర్థిక ప్రణాళికలో 800 పైగా ఎఫ్ఎమ్ స్టేషన్లు.
* పోస్టాఫీస్ బ్యాంకింగ్ కోసం రూ.532 కోట్లు.
* మహిళా భద్రత సమిష్టి బాధ్యత. నిర్భయ ఫండ్ కోసం రూ.1000 కోట్లు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ లోటు 5.2 శాతం.
* పన్నుల విధానంలో పారదర్శకత
* టాక్స్ అడ్మిస్టేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు.
* ఆదాయ పన్ను విధానం యథాతథం.
* ఏడాదికి రూ.2-5 లక్షలు లోపు ఆదాయం ఉన్న వారికి రెండు వేల పన్ను మినహాయింపు.
* ఏడాదికి కోటి ఆదాయంపైన ఉన్నవారికి 10 శాతం సర్‌చార్జి. మొత్తం 42,800 మందికి వర్తింపు.
* ఉద్యోగులకు పన్ను రాయితీ.
* రూ.50 లక్ష లు దాటిన స్థిరాస్తి విక్రయంపై ఒక శాతం పన్ను . వ్యవసాయ భూములకు మినహాయింపు.
* టీవీ సెట్అప్ బాక్స్ దిగుమతులపై 5 శాతం సుంకం.
* ఏసీ లగ్జరీ కార్లపై సుంకం పెంపు.
* సిగిరెట్లపై 18 శాతం పన్ను పెంపు.
* పెరుగనున్న విదేశీ కార్ల ధరలు.
* రెండు వేలు దాటిన సెల్‌ఫోన్‌పై 6 శాతం సుంకం పెంపు.
* ఏసీ ఉన్న అన్ని హోటళ్లకు సర్వీస్ ట్యాక్స్.

2013-14 బడ్జెట్ హైలైట్స్

2013-14 బడ్జెట్ హైలైట్స్ 

మొత్తం బడ్జెట్ అంచనా : రూ.16.55 లక్షల కోట్లు
ప్రణాళిక వ్యయం రూ.5.5 లక్షల కోట్లు
ప్రణాళిక వ్యయం కిందటేడారి కంటే 30 శాతం ఎక్కువ

ఆహార పదార్థాల సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు
ఆర్థిక లోటు తగ్గించేందుకు ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంటోంది
ఆర్థిక లోటు కంటే కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) ఎక్కువగా భయపెడుతోంది
కరెంట్ అకౌంట్ లోటు తగ్గించాలంటే విదేశీ పెట్టుబడులు తప్పనిసరి
లోటు పూడ్చేందుకు రెండేళ్లలో రూ.4 లక్షల కోట్లు అవసరం
ఖర్చుల్ని నియంత్రించుకోవటం తప్పా వేరే మార్గం లేదు
ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్
గత ఏడాదితో పోలిస్తే 29 శాతం బడ్జెట్ పెంపు
41,561 కోట్లు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయింపు
21 రాష్ట్రాల్లో 100 జిల్లాల ఎంపిక
జాతీయ ఆరోగ్య పథకం ఈ జిల్లాల్లో వర్తింపు
ఆయుష్ కు రూ.1,069 కోట్లు
మానవ వనరుల అభివృద్ధికి రూ.65,867 కోట్లు పెంపు
సర్వశిక్షా అభియాస్ కు ఈ ఏడాది రూ. 27,258 కోట్లు
నలంద యూనివర్శిటీ పునర్ నిర్మాణం
12వ ప్రణాళికలో ప్రణాళిక వ్యయం రూ.14,30,825 కోట్లు
2013-14 సంవత్సరంలో ఖర్చు రూ.16,65,297 కోట్లు
ప్రణాళిక ఖర్చు రూ. 5,55,322 కోట్లు
14 వేల గ్రామాల్లో నీటి శుద్ధి పథకం
రక్షిత తాగునీరు అందించటమే లక్ష్యం
గ్రామీణ ఉపాధి పధకానికి రూ.33వేల కోట్లు

జేఎన్ ఎన్యూఆర్ ఎం కొనసాగింపు
ఈ ఏడాది రూ. 14వేల కోట్లకు పైగా కేటాయింపు
జేఎన్ యూఆర్ ఎం కింద 10వేల బస్సుల కొనుగోలు
వ్యవసాయ రంగం పనితీరు బాగుంది.
ఈ ఏడాది 250 మిలియన్ టన్నుల దిగుబడి ఉంటుంది

లింగ వివక్షను నివారించేందుకు రూ.200 కోట్లు
యువత ఉపాధికి విద్య, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం
తూర్పు రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధికి వెయ్యికోట్లు
100 జిల్లాలో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రత్యేక పథకం
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ.41,561 కోట్లు
ఇందులో గిరిజనులకు రూ.24,598 కోట్లు
పౌష్టికాహార ధాన్యాల సాగువృద్ధికి పైలట్ ప్రాజెక్ట్

సామాజిక పధకాలకు నిధుల పెంపు
అందరికి విద్య, వైద్యం... ఇది ప్రభుత్వానికి ప్రాధాన్యం
విద్యా రంగానికి రూ.66,877 కోట్లు గతం కంటే 17శాతం ఎక్కువ
మైనార్టీ సంక్షేమానికి రూ.3వేల కోట్లకు పైగా కేటాయింపు
గ్రామీణాభివృద్ధికి రూ.80,194 కోట్లు, గతంలో కంటే 46 శాతం ఎక్కువ



ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమబెంగాల్‌లో భారీ ఓడరేవుల నిర్మాణం
* ముడి చమురు రంగాల్లో రెవెన్యూ షేరింగ్‌ పద్దతి విధానం
* చెన్నయ్‌ - బెంగళూరు మధ్య పారిశ్రామిక కారిడార్‌
* లక్షా 50 వేలమంది చేనేత కార్మికులకు వెలుసుబాటు
* అక్టోబరు నాటికి వెయ్యి కోట్లతో మహిళా బ్యాంక్‌
* వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యక్తిగత, గ్రూప్‌ భీమా పథకాలు
* త్వరలో సెబీ చట్ట సవరణ
* అంగన్‌వాడీ వర్కర్లకు గ్రూప్‌ బీమా పథకం
* 10 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో ఎల్‌ఐసీ కార్యాలయం
* 6 శాతం వడ్డీతో చేనేత మహిళా కార్మికులకు రుణాలు
* జాతీయ బీమా పథకం పరిధిలోకి ఆటో, రిక్షా, పారిశుద్ధ్య కార్మికులు
* ప్రైవేటు బ్యాంకుల ద్వారా 4 శాతం వడ్డీకే రైతులకు రుణాలు
* రూ. వెయ్యి కోట్లతో నిర్భయ నిధి
* లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలకు సహాయంగా నిర్భయ నిధి
* నగదు బదిలీ పథకం ద్వారా గర్భిణులకు ఆర్థిక సాయం
* 10 లక్షల మంది యువతకు సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి వెయ్యి కోట్లు

జనరల్‌ బడ్జెట్‌లో పెరిగిన పన్నులు
* ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 13,300 కోట్లు
* పరోక్ష పన్నుల ద్వారా రూ. 4,700 కోట్లు

 

Tuesday, February 26, 2013

రైల్వే బడ్జెట్ 2013-14 హైలెట్స్

న్యూఢిల్లీ : ప్రస్తుత బడ్జెట్ నాటికి రైల్వే నష్టం రూ.24,600 కోట్లు
రైల్వే నిర్వహణకు వ్యయం పెరిగింది.
భారతీయ రైల్వేలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి.
భారతీయుల జీవనయానంలో రైల్వేలది కీలకపాత్ర.
నిరంతర నష్టాల వల్ల కొత్త ప్రాజెక్టులకు సత్వర నిర్మాణానికి అవరోధం.
ప్రయాణికులు చెల్లిస్తున్న రుసుంకు తగ్గట్టు సేవలు అందించాలి.
అలహాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం.
దేశ పురోగతి రైల్వేలతో ముడిపడి ఉంది.
40 శాతం ప్రమాదాలు లెవల్ క్రాసింగ్ ల వల్లే జరుగుతున్నాయి.
పెరిగిన ఆధునీకరణ వల్లే ప్రమాణల సంఖ్య గణనీయంగా తగ్గింది.
వచ్చే ఏడాది 17 పురాతన వంతెనల స్థానాల్లో కొత్తవాటి నిర్మాణం.
మహిళ ప్రత్యేక రైళ్లకు మహిళా భద్రతా సిబ్బంది.
ఏ-1 స్థాయి స్టేషన్లలో 117 ఎస్కలేటర్లు, 400 లిప్ట్ లు ఏర్పాటు.
టిక్కెట్ల విక్రయంలో అక్రమాల తగ్గింపుకు ఆధార్ తో అనుసంధానం.
పరిశుభ్రత కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు.
ఎస్ఎంఎస్ ద్వారా రిజర్వేషన్ స్టేటస్ తెలుసుకునే ఏర్పాటు.
డిసెంబర్ లోగా ఈ-టిక్కెటింగ్ లో విప్లవాత్మక మార్పు.
ఒకేసారి పదిలక్షల మంది ఈ-టిక్కెటింగ్ ఉపయోగించుకోవచ్చు.
ఆరు చోట్ల రైల్ బాయిలింగ్ ప్లాంట్లు.
రద్దీని తగ్గించేందుకు మరిన్ని రైళ్లు.
కాజీపేటలో నైపుణ్యాల శిక్షణా కేంద్రం ఏర్పాటు.
వెయ్యి కోట్లతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి సంస్థ ఏర్పాటు.
ఒడిశా కలహండిలో రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాపు.
మధ్యప్రదేశ్‌లో మిస్రాలో కోచ్‌ల ఆధునికీకరణ వర్క్‌షాపు.
పుణ్య క్షేత్రాలు ఉన్న రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ.
కత్రా-వైష్ణోదేవి యాత్రికులకు రైలు-బస్సుకు ఒకే టికెట్‌.
రైల్వేలో ఖాళీగా ఉన్న 1.52 లక్షల ఉద్యోగాల భర్తీ.
రైల్వే ఉద్యోగుల వసతి గృహాల సంఖ్య పెంపు.
లెవల్‌ క్రాసింగ్‌ల వద్ద సౌరశక్తి వినియోగం.
1007 మిలియన్‌ టన్నుల సరకు రవాణా లక్ష్యంగా ముందుకు సాగుతామని రైల్వే బడ్జెట్‌ ప్రసంగంలో ఆ శాఖ మంత్రి పవన్‌కుమార్‌ బన్సల్‌ పేర్కొన్నారు.