Monday, January 30, 2012

మెట్రో రైల్ ప్రాజెక్ట్ చరిత్ర

మెట్రో రైల్ ప్రాజెక్ట్ చరిత్ర

హైదరాబాద్... దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్నటువంటి మహానగరం. దీనికి తగ్గట్టుగానే నగరంలో.. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో.. గంటలతరబడి అవుతున్న ట్రాఫిక్ జాముల్లో.. వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదేగాక.. రోజురోజుకు రోడ్లపైకి వస్తున్న కొత్త వాహనాలు ట్రాఫిక్ సమస్యను ఇంకా జఠిలం చేస్తున్నాయి. వీటన్నింటికి కొంతవరకు చెక్ పెట్టేందుకే.. ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం.. సిటీలోని వాహనదారుల ఆశలన్నీ.. మెట్రోరైలు ప్రాజెక్టుపైనే ఉన్నాయి. అటువంటి మెట్రో రైల్ ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలపై ప్రత్యేక కథనం...

''మెట్రో ప్రాజెక్టు గత చరిత్ర ఏంటి ? ''

ఇక ఈ మెట్రోరైలు ప్రాజెక్టు డిజైన్‌, వ్యయాన్ని ఇప్పటికే నాలుగు సార్లు మార్చారు. 2003లో 2కారిడార్లతో 41కిలోమీటర్లతో డిజైన్‌ను రూపొందించారు. 2006లో దీనిని 19కిలోమీటర్లు పెంచి 3కారిడార్లతో డిజైన్‌ చేశారు. అనంతరం 2007లో మరో 6కిలోమీటర్లు పెంచి మొత్తం 66కిలోమీటర్లతో మెట్రోరైల్‌ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. ఇక 2008 జులైలో ఇంకో 5కిలోమీటర్లు పెంచి 71.16కిలోమీటర్లతో మూడు కారిడార్లకు తుది రూపకల్పన చేశారు. అయితే.. 2003లో మొదట డిజైన్‌ చేసిన ఈ ప్రాజెక్టు వ్యయం 6వేల 100కోట్లు కాగా.. తుది డిజైన్‌ వరకు 14వేల 132 కోట్లకు చెరుకుంది. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా వ్యయం మరో 30శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిఫ్ లో రూపొందుతున్న ప్రాజెక్టు. మొదట... 2008లో మేటాస్ ఇన్ ఫ్రా కన్సార్టియం ఈ ప్రాజెక్టును దక్కించుకొంది. మొత్తం లీజ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా... 30వేల 311 కోట్ల రూపాయలను చెల్లిస్తానంటు ముందుకొచ్చింది. సత్యం కుభకోణం... అంతర్జాతీయంగా వచ్చిన ఆర్థిమాంద్యం కారణంగా ఒప్పందంలో పేర్కొన్నవిధంగా... సరైన సమయంలో ప్రాజెక్టు మొదలుపెట్టలేదు. దీంతో... ప్రభుత్వానికి-మేటాస్ కన్సార్టియానికి జరిగిన ఒప్పందం రద్దయింది. మళ్లీ బిడ్ లను ఆహ్హానించగా... ఎల్ అండ్ టి సంస్థ జులై 2010లో మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్లను దక్కించుకొంది.

''మెట్రో రైలు ప్రాజెక్టు ఎందుకు ? తెరపైకి రావడానికి గల కారణాలేంటి ? ''

నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను కొంతవరకు పరిష్కరించడానికి... ప్రభుత్వం మెట్రోరైలు ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రస్తుతం 90లక్షలుగా ఉన్న నగర జనాభా 2021 సంవత్సరానికల్లా ఒకకోటి 36లక్షలకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం 24 లక్షల 50వేల వాహనాలు నగరరోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఇవేగాక.. బయటి ప్రాంతాలనుంచి రోజూ మరో 6 లక్షలకుపైగా వాహనాలు నగరంలో ప్రవేశిస్తున్నాయి. ఇక.. ఏడాదికి 2లక్షల కొత్తవాహనాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. నగరంలోని వాహనాల గరిష్ట వేగం గంటకు కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే. ఇవికాక బస్సులు, లోకల్‌ట్రైన్ల ద్వారా 32శాతం మంది ప్రయాణిస్తున్నారు. జనాభాకు, వాహనాలకు సరిపడ రోడ్ల విస్తీర్ణం లేనందువల్ల.. గంటలకొద్ది ట్రాఫిక్ జాముల్లో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదేగాక... వ్యక్తిగత వాహనాల కారణంగా.. నగరంలో అత్యధిక కాలుష్యం ఉత్పత్తి అవుతోంది. దీనికి కొంతవరకు పరిష్కారం దిశగా మెట్రో రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

"ప్రస్తుత ప్రజారవాణా వ్యవస్థల పరిస్థితి ఏంటి? "

హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా వ్యవస్థలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు 3వేల బస్సుల ద్వారా 30 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేస్తుంది. మరో రెండువేల బస్సుల కోరతతో ఆర్టీసీ సతమతమౌతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎంఎంటిఎస్ మొదటి దశలో ప్రతిరోజు 1లక్షా 20వేలమంది ప్రయాణిస్తున్నారు. రెండోదశ పనులు సంగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. ఒక్క మెట్రో రైలే గాకుండా... బస్ ర్యాపిడ్ ట్రాన్స్ ఫోర్ట్ సిస్టం, ఎంఎంటిఎస్ లు వంటి ప్రత్యాన్మాయ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనేక స్వచంఛంధ సంస్థలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.

''ఏ ఏ ప్రాంతాల్లో టెర్మినల్స్, స్టేషన్లు ? ''

నాంపల్లి, సికింద్రాబాద్‌, బేగంపేటలలో రైల్‌ టెర్మినల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. కిలోమీటర్‌కు ఒకటి చొప్పున మెట్రో రైల్‌ స్టేషన్లను నిర్మిస్తారు. ఈ మార్గాల్లోని అన్ని స్టేషన్ల నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్‌సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు. మియాపూర్‌, ఇమ్లిబన్‌, ఎంజీబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చార్మినార్, జూబ్లీబస్‌స్టేషన్‌ల నుంచి మెట్రోరైల్‌ స్టేషన్లకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తారు. భరత్‌నగర్, బేగంపేట, ఖైరతాబాద్‌, మలక్‌పేట్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాలకు మెట్రోరైల్‌ను అనుసంధానిస్తారు.

''ఎల్ అండ్ టి కంపెనికి... ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం ఏంటి ? ''

మేటాస్ తో ఒప్పందం రద్దయిన తర్వాత... ఎల్ అండ్ టి సంస్థ 14 జూలై 2010 న బిడ్ దక్కించుకోగా... సెప్టంబర్4, 2010న రాష్ట్రప్రభుత్వం, ఎల్ అండ్ టి - హైదరాబాద్ మెట్రా రైల్ ప్రైవేట్ లిమిటెడ్ లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం 10వేల 132కోట్ల రూపాయలు. నిర్మితకాలంతో కలిపి... మొత్తం లీజు కాలం 35 సంవత్సరాలు. అప్పటికి నిర్మిత సంస్థ ప్రభుత్వాన్ని, ప్రజలను సంతృప్తిపర్చితే... మరో 25ఏళ్ల కాలాన్ని పొడగించేందుకు అవకాశం ఉంది. ప్రాజెక్టు లక్ష్యం... 2014 సంవత్సరం వరకు ప్రతిరోజు 15 లక్షలమంది ప్రయాణికులను.... 2025 నాటికి 22 లక్షల మంది మెట్రో రైల్ ని ఉపయోగించుకోనున్నారు. ఒప్పందంలో... మెట్రో కారిడార్ లో ఉన్న మూడు రూట్లలో మొత్తం 269 ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ కోసం ఎల్ అండ్ టి సంస్థకు ప్రభుత్వం అప్పగించాలి. ఇందులో మియాపూర్ లో 99 ఎకరాలు, ఫలక్ నుమాలో 17 ఎకరాలు, నాగోల్ లో 99 ఎకారాలతోపాటు... ఇతర ప్రాంతాల్లో ఒకటి, రెండు ఎకరాల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. డిశంబర్ 2010 వరకల్లా... జీహెచ్ఎంసీ ఈ స్థలాన్ని హెచ్.ఎం.ఆర్ కి అందిస్తే... 2011 జనవరిలోనే మెట్రో రైలు పనులు ప్రారంభం కావ్లసి ఉంది.

''ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెట్రో రైలు నిర్మాణం ? ''

హైదరాబాద్ లో.. మొత్తం మూడు రూట్లలో.. మియాపూర్‌ - ఎల్‌.బి.నగర్‌, జేబీఎస్ - ఫలక్‌నుమా, నాగోల్‌ - శిల్పారామం ల మధ్య కారిడార్ల నిర్మాణం జరుగనుంది. ఈ మూడు ప్రధాన మార్గాల్లో రెండు లేన్లతో.. దాదాపు 71.16 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొదటగా 12వేల 132 కోట్ల వ్యయం అంచనా వేయగా.. ఇప్పటికే అదికాస్తా 14వేల 132 కోట్ల రూపాయలుచేరింది. ఇందులో 1980 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీనిలో మెట్రోరైల్‌ కోసం సేకరించాల్సిన స్థలాలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టపరిహారం అందించేందుకు ఉపయోస్తారు.

((చారిత్రక కట్టడాల పరిస్థితి ))

మియాపూర్‌-ఎల్‌.బి.నగర్‌, జూబ్లీబస్‌స్టేషన్‌-ఫలక్‌నుమా, నాగోల్‌-శిల్పారామం.. ఈ మూడు మార్గాల్లో మెట్రో రైల్ ట్రాక్‌లను నిర్మించునున్నారు. అమీర్‌పేట్, కోఠి, ప్యాట్నీ సెంటర్లలో పెద్దఎత్తులో మెట్రో రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగనుంది. ఖైరతాబాద్ సమీపంలో దాదాపు 51 ఫీట్లు, అమీర్ పేట్ లో 71 ఫీట్లు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర 61 ఫీట్ల ఎత్తులో భారీ ఫిల్లర్స్ తో కూడిన రైల్వే ఫ్లాట్ ఫారాలు రానున్నాయి. మొత్తం 62 ప్లాట్ ఫారమ్స్ లలో... దాదాపు 25 అడుగుల ఎత్తు నుంచి 71 అడుగుల ఎత్తులో... అంటే.. ఐదు నుంచి ఏడంతస్థుల బిల్డింగ్స్ ఎత్తులో రైల్వే ప్లాట్ ఫారాల నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ టెర్మినల్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు అభ్యంతరం చెప్తున్నారు.

"గత చరిత్రను తెలిపే చారిత్రక, వారసత్వ కట్టడాల పరిస్థితి ఏంటి ?"

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెట్రో ప్రాజెక్టులన్నీ చారిత్రక కట్టడాల సమీపం నుంచి నిర్మించినప్పటికీ అన్నివిధాలుగా పరిరక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం అటువంటి దాఖలాలేవీ కనిపించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ వెళ్లేదారిలో హుడా గుర్తించినటువంటి దాదాపు 27 చారిత్రక కట్టడాలకు ప్రమాదం పొంచి ఉందని తాజా సర్వేల్లో వెల్లడైంది. అంతే కాకుండా... మరో 44 చారిత్రక భవనాల గుండా రైలు మార్గం వెళ్తుండడంతో... వాటికి ముప్పు పొంచి ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఎల్ అండ్ టి సంస్థ - హైదరాబాద్ మెట్రో రైల్ ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని... అందుకే ప్రాజెక్టులోని అంశాలను బహిర్గతం చేయడంలేదని స్వచ్ఛంధసంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఇతర దేశాల మాదిరిగానే.. హైదరాబాద్ లో కూడా.. హెరిటేజ్ కట్టడాలకు దూరంగా మెట్రో మార్గాన్ని తీసుకెళ్లాలని వారసత్వ కట్టడాల ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

(( స్థల సేకరణ, ఇబ్బంధులు ))
హైదరాబాదీల డ్రీమ్‌ ప్రాజెక్ట్ గా చెబుతున్న మెట్రోరైల్‌కు గ్రహణం పట్టింది. అగ్రిమెంట్ జరిగి ఏడాది కావస్తున్నా.. ఇంతవరకు పనులు చేపట్టిన దాఖలాలు కనిపించడంలేదు. నిర్ణీత గడువులోపు భూసేకరణ, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిర్మాణసంస్థకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పొడవైన ఎలివేటెడ్ సిస్టమ్‌తో.. రూపుదిద్దుకుంటున్న ఈ మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిర్మాణసంస్థ L&Tకి, HMR సంస్థకు మార్చిలోనే ప్రాజెక్ట్ నిర్మాణంపై అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం.. 2011 మే 15 లోపు ప్రాజెక్టుకు అవసరమైన 90 శాతం స్థలాలను ఎల్‌ అండ్‌ టి సంస్థకు ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. లేదంటే.. నిర్మాణసంస్థ చెల్లించిన 360 కోట్ల రూపాయల ఫర్ఫార్మెన్స్ సెక్యూరిటీ బ్యాంక్ గ్యారెంటీలో.. ప్రతిరోజూ 1 శాతం జరిమానాను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా రోడ్లు వెడెల్పు చేయకపోవడం వల్ల రోజూ 36 లక్షల రూపాయలను ఎల్ అండ్ టి సంస్థకు ప్రభుత్వం చెల్లించాలి. అటు స్థలాలను అప్పగించలేనందుకుగానూ.. ప్రతి 500 చదరపు గజాల స్థలానికి రోజుకు వెయ్యి రూపాయల నష్టాన్ని కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఒప్పందలో పేర్కొన్నారు. ఈవిధంగా.. ప్రభుత్వం ఎల్‌ అండ్ టి సంస్థకు ఇప్పటివరకు సుమారు 70 కోట్ల రూపాయల భారీ జరిమానాను చెల్లించాల్సి ఉంది.

నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలైన సుల్తాన్ బజార్, బడీచౌడీలలో.. పెద్దఎత్తున వ్యాపార సముదాయాలు కనుమరుగుకానున్నాయి. మియాపూర్-ఎల్బీ నగర్ ఒకటో నెంబర్ కారిడార్, జేబీఎస్-ఫలక్ నుమా రెండో నెంబర్ కారిడార్ కు ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులు.. భూ సేకరణ చట్టం కింద ఇప్పటికే 1200లకు పైగా ఆస్థులకు నోటీసులు జారీచేసారు. కూల్చివేతలు మాత్రం అంతంతమాత్రంగానే చేపట్టారు. మిగిలిచోట్ల.. నష్టపరిహారం చాలదంటూ, అసలు తమ ఆస్తులను ఇచ్చేదిలేదంటూ.. చాలామంది కోర్టులను ఆశ్రయించారు. దీంతో.. ప్రైవేట్ ప్రాపర్టీస్ కూల్చివేతలు ఒక్కసారిగా నిల్చిపోయాయి.

గడువు దగ్గరపడ్తున్న కొద్దీ.. రోడ్ల విస్తరణ, అవసరమైన స్థలాలు అప్పగించకపోతే.. భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిసినా.. సంబంధిత అధికారుల్లో ఏ మాత్రం చలనం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

నత్తనడకన మెట్రోరైల్ ప్రాజెక్ట్‌
అడుగడుగునా అడ్డంకులు
పూర్తికాని భూసేకరణ, స్థలాల అప్పగింత
ఇప్పటికీ పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు
గడువులోపు అప్పగించకుంటే భారీ జరిమానా
రోజుకు 36 లక్షల ఫెనాల్టీ?
నిర్మాణసంస్థకు 86 కోట్లు బకాయిపడ్డ ప్రభుత్వం
రెండో నెంబర్‌ కారిడార్‌కు ఎక్కువ అడ్డంకులు
కోర్టులను ఆశ్రయించిన బాధితులు
నిలిచిపోయిన ప్రైవేట్ ప్రాపర్టీస్‌ కూల్చివేతలు

ప్రస్తుత మెట్రో ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి?

అన్నీ కుదిరితే.. ఫిబ్రవరి మొదటివారంలో.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ శంకుస్తాపన పనులు ప్రారంబంకానున్నాయి.

ప్రస్తుతం నాగోల్ - మెట్టుగూడా వరకు 8 కిలోమీటర్ల వరకు.. మియాపూర్ - అమీర్ పేట్ వరకున్న 12 కిలోమీటర్ల వరకు.. మెట్రో పనులు ప్రారంభంకానున్నాయని.. హెచ్ఎంఆర్ వర్గాలంటున్నాయి. ఈ మార్గాల్లో రోడ్ల విస్తీర్ణం 100 ఫీట్లకు మించి ఉన్నాయి. అదీగాక.. రోడ్ల వెంబటి వ్యాపార సముదాయాలు.. ఇల్లు కూడా లేకపోవడంతో.. పనులకు ఎలాంటి అడ్డంకి లేకపోయింది. ఫిబ్రవరి నాలుగో తేదీన.. ప్రధాని మన్మోహన్ సింగ్ చేతులమీదుగా మెట్రో పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మెట్రోరైలు నిర్మాణానికి వీలుగా ఆయా మార్గాల్లో రోడ్డు విస్తరణతోపాటు ఆక్రమణలను తొలగించి.. ఎలాంటి అడ్డంకులు లేని స్థలాన్ని గతేడాది మేలోపే అప్పగించాల్సి ఉంది. ఇంతవరకు పూర్తిస్థాయిల.. స్థలాలను అప్పగించలేదు. ఎల్ అండ్ టి సంస్థకు.. హెచ్ఎంఆర్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. మెట్రో రైలు పట్టలనెక్కే పరిస్థితిలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ బాలారిష్టాలన్నింటిని అధిగమించి.. పట్టాలపైకి వచ్చేదెప్పుడని.. సగటు వాహనదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్నలకు ఇటు ప్రభుత్వం.. అటు మెట్రో అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

Saturday, January 21, 2012

ఆతిధ్య రంగం వెలవెల

ఆతిధ్య రంగం వెలవెల

ఈ ఏడాది హోటల్ పరిశ్రమకు (బ్రాండెడ్ హోటల్స్) కాలం నిరాశజనకంగానే గడిచింది. దేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. యూరో సంక్షోభం, అమెరికాలో అనిశ్చితి, రూపాయి బలహీనత పరిశ్రమపై నీలినీడలకు కారణం. రూమ్ ఆక్యుపెన్సీ రేటులో స్వల్ప వృద్ధి ఉన్నప్పటికీ రాబడుల్లో మాత్రం తేడా లేదు. పరిశ్రమలో పోటీ పెరిగడం. డిమాండ్‌ను మించి సప్లయ్ (గదుల సంఖ్య ) పెరగడం... ఇందుకు కారణం. మొత్తమ్మీద 2011 హోటల్ పరిశ్రమకు తేడా లేకుండా గడిచిపోయింది. ఈ ఏడాది దేశీయ మార్కెట్‌లో లాస్‌వెగాస్ కేంద్రంగా ఉన్న ఎంజిఎం హాస్పిటాలిటీ, బ్రిటన్‌కు చెందిన వైట్‌బ్రెడ్, బెస్ట్ వెస్ట్రన్ పెద్ద ఎత్తునే విస్తరించాయి.

దేశీయ దిగ్గజాలు ఒబెరాయ్, ఐటిసి, లీలావెంచర్స్ తరుచు బోర్డు రూమ్ పరిణామాల కారణంగా కారణంగా వార్తల్లోకి వచ్చాయి. ఈ ఏడాది ఆరంభంలోనే పరిశ్రమకు ప్రభుత్వం ఒక ఝలక్ ఇచ్చింది. ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్లలో సర్వీసు చేసే ఆహార పదార్ధాలపైనా, 1000 రూపాయలపై పడిన రూమ్‌రెంట్ ఉన్న హోటళ్లపైనా సర్వీసు టాక్స్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే స్టార్, ఏ గ్రూప్ హోటల్స్ కేటగిరీలో గదుల సంఖ్య పెరిగింది. దీనివల్ల డిమాండ్ కంటే సప్లయ్ పెరగడం వల్ల గదుల అద్దెల్లో మాత్రం మార్పురాలేదు. అయితే ఆక్యుపెన్సీ మాత్రం 4-5 శాతం మేర పెరిగింది. సగటు అక్యుపెన్సీ 67 శాతం ఉన్నట్టు పరిశ్రమవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది పరిశ్రమ మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. ఆర్థిక రంగంలోని మందగమన పరిస్థితులకు తోడుగా దేశంలో నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితి, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటం.. హోటల్ పరిశ్రమకు ప్రతికూలతను సూచిస్తున్నాయని వారు చెబుతున్నారు. పరిశ్రమకు సంబంధించి ఈ ఏడాది ముఖ్యాంశాలు

* దేశీయంగా 2011 నాటికి మొత్తం గదుల సంఖ్య 9130 పెరిగి 71,530కి చేరింది. 2015-16 నాటికి ఈ గదుల సంఖ్య 102438కి చేరుకునే అవకాశం ఉంది. * టూరిస్టులను ఆకర్షించడం కోసం భారత్ ఈ ఏడాది ఇన్‌క్రెడిబుల్ ఇండియా పేరుతో భారీ ఎత్తున క్యాంపెన్ జరిపింది. దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత టూరిస్ట్ వీసా జారీ చేసే స్కీమ్‌ను కొత్తగా వియత్నాం, ఫిలిప్పైన్స్, ఇండోనేసి యా, మయన్మార్, లావోస్, కాంబోడియా దేశాలకు కూడా వర్తింప జేశారు. అంతకు ముందు ఫిన్లాండ్, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, లగ్జెంబర్గ్ దేశాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. *కొత్త క్లీన్ ఇండియా పేరుతో కూడా టూరిస్టులను ఆకర్షించడం కోసం మరో క్యాంపైన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. * వ్యాపార రంగంలో మందగమనం కూడా హోటల్ పరిశ్రమను ప్రభావితం చేసింది. ఢిల్లీ, బెంగళూర్ మినహా ఇతర నగరాల్లో అక్యుపెన్సీ రేటులో పెద్దగా వృద్ది లేదు. *డాలర్ మారకంలో రూపాయి విలువ 20 శాతంపైగా పతనమైన నేపథ్యంలో విదేశీ టూరిస్టులకు భారత యాత్ర ఇప్పుడు చాలా చౌకగా మారింది. భవిష్యత్తులో విదేశీ టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే యూరో జోన్ సంక్షోభం పరిష్కారమైతే తప్ప విదేశీ టూరిస్టులపై ఆశలకు ఆస్కారం లేదు. * ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య దేశంలోకి వచ్చిన విదేశీ టూరిస్టుల సంఖ్య 55.75 లక్షలు. అంతకు ముందు ఏడాది కంటే ఇది 9 శాతం ఎక్కువ. * ఈ 11 నెలల్లో హోటల్ పరిశ్రమ ద్వారా ఆర్జించిన విదేసీ మారక ద్రవ్యం 1487.6 కోట్ల డాలర్లు. అంతకు ముందు ఏడాది కంటే ఇది 17.7 శాతం ఎక్కువ. * దేశీ టూరిస్టుల విదేశీ యాత్ర మాత్రం రూపాయి విలువ పతనం వల్ల ఖరీదైన వ్యవహరంగా మారింది. * ఇఐహెచ్ హోటల్స్‌లో నీతా అంబానీ, ముకేష్ అంబానీ సన్నిహిత మిత్రుడు మనోజ్ మోడి అడిషనల్ డైరెక్టర్లుగా చేరారు. * డిఎల్ఎఫ్ హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ ఈక్విటీలో భాగస్వామి హిల్టన్ ఇంటర్‌నేషనల్‌కు చెందిన 26 శాతం వాటాను 120 కోట్ల రూపాయలతో డిఎల్ఎఫ్ కొనుగోలు చేసిది. * లగ్జరీ హోటల్స్ గ్రూప్ లీలావెంచర్స్ దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల్లో లీలా గార్డెన్స్ పేరుతో త్రిస్టార్ హోటల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది. * ఒపి ముంజాల్ సారథ్యంలోని హీరో గ్రూప్ గూర్‌గావ్‌లో 280 గదుల స్టార్ హోటల్ నిర్మిస్తున్నట్టుగా ప్రకటించింది. * బ్రిటన్ సంస్థ బెస్ట్ వెస్ట్రన్ దేశీయంగా తమ హోటల్స్ సంఖ్యను 18 నుంచి 2017 నాటికి 100కు పెంచనున్నట్టుగా వెల్లడించింది. * స్టార్ఉడ్ 2015 నాటికి 100 హోటల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొంది. * దేశీయంగా హోటల్స్ ఏర్పాటుకు 535 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నట్టు వైట్‌బ్రెడ్ పేర్కొంది. * స్విస్ సంస్థ మూవ్ఎన్‌పిక్ హోటల్స్ వచ్చే ఐదేశ్ళలో 10 హోటల్స్ ఏర్పాటుకు వీలుగా ఎంఎస్ఆర్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో టైఅప్ కుదుర్చుకున్నట్టు తెలిపింది.

ఇన్వెస్టర్‌కూ.. కొలవెరి?!

ఇన్వెస్టర్‌కూ.. కొలవెరి?!
‘వై దిస్ కొలవెరి డి’?... ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచం మొత్తాన్నీ ఉర్రూతలూగిస్తున్న సాంగ్. గల్లీ నుంచి ఢిల్లీదాకా ఈ పాటకు వస్తున్న రీమిక్స్‌లు కూడా అంతే పాపులర్ అవుతుండటం విశేషం. ఇప్పుడు స్టాక్‌మార్కెట్‌లోనూ ఈ పాటకు రీమిక్స్‌లు వినబడుతున్నాయి. ఏంటి.. ఆశ్చర్యంగా ఉందా? అవునుమరి.. నిలువునా ముంచేసిన స్టాక్‌మార్కెట్ అంటే ఇన్వెస్టర్లకు ఉండదా కొలవెరి (చంపేయాలనేంత కోపం అని దీని అర్థం). ఇప్పటిదాకా ‘యూట్యూబ్’లో కొలవెరి పాటకు 2 కోట్ల హిట్లు(వీక్షణలు) వచ్చినట్లు అంచనా. మరి మార్కెట్లో అయితే ఈ ఏడాది ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద అక్షరాలా రూ. 20 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటోంది. ఇప్పుడు అర్థమైందా మార్కెట్‌ను కుప్పకూల్చిన ‘బేర్స్’ అంటే ఎందుకు అంత కొలవెరో? అందుకే భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలోనే అత్యంత పాపులర్ చార్ట్‌బస్టర్‌గా అవతరించిన కొలవెరి సాంగ్... ఈ ఏడాది మార్కెట్‌కు కూడా అనధికారిక ‘బ్లాక్’బస్టర్‌గా మారిపోయింది!

ప్రస్తుత డౌన్‌ట్రెండ్‌పై
మార్కెట్ వర్గాల కొలవెరి రీమిక్స్ ఇదీ...
‘వైటు స్కిన్నూ... బేరూ, బేరూ;
బేరు హార్టూ బ్లాకూ...
బుల్లు-బేరూ ఫైటూ, ఫైటూ...
అవర్ ఫ్యూచరు డార్కూ?
వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి!’

ముంబై: మరికొద్ది రోజుల్లో గుడ్‌బై చెప్పనున్న 2011... దలాల్ స్ట్రీట్‌కు మరో దారుణ సంవత్సరంగా మిగిలిపోతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా జరిగిన ట్రేడింగ్‌లో ప్రతి 10 సెకండ్లకూ మిలియన్ డాలర్ల(దాదాపు రూ.5 కోట్లు- గంటకు సుమారు రూ.1,800 కోట్లు) మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోవడమే ఇందుకు నిదర్శనం. ఇంకా అయిదు రోజుల ట్రేడింగ్ మిగిలివున్న నేపథ్యంలో... ఇంకెంత సొమ్ము ఆవిరవుతుందో వేచిచూడాలి. గతేడాదిలో అయితే, ప్రతి 20 ట్రేడింగ్ సెకండ్లకూ ఇన్వెస్టర్ల సంపద మిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. కాగా, 2011లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే ఇప్పటిదాకా ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు అంచనా. ప్రస్తుతం మొత్తం మార్కెట్ క్యాప్ రూ.54 లక్షల కోట్లకు తగ్గిపోయింది. 2010 ఏడాది చివరినాటికి లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.73 లక్షల కోట్లు కావడం గమనార్హం. రూపాయి మారకం విలువలో క్షీణత కారణంగా స్టాక్ మార్కెట్ సంపద విలువ ఒకానొక దశలో ట్రిలియన్ డాలర్ల(లక్ష కోట్ల డాలర్లు) మార్క్‌ను కోల్పోయినప్పటికీ.. మళ్లీ గత వారాంతానికి 1.02 ట్రిలియన్ డాలర్లను అందుకోగలిగింది.

సెన్సెక్స్, నిఫ్టీ బోర్లా...
ఈ ఏడాది ప్రారంభం నాటి గరిష్టం నుంచి చూస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు 24 శాతం మేర కుప్పకూలాయి. క్రితం ఏడాదిలో ఇవే ఇండెక్స్‌లు 18 శాతం లాభాన్ని మూటగట్టుకున్నాయి. ఇక పాయింట్లవారీగా చూస్తే 2011లో ఇప్పటివరకూ సెన్సెక్స్ 4,770 పాయింట్లు పడిపోయింది (డిసెంబర్ 23 ముగింపు 15,739 పాయింట్లు). గతేడాది 2,000 పాయింట్లు ఎగబాకింది. మరోపక్క, రానున్న రోజుల్లో సెన్సెక్స్ 11,000-12,000 పాయింట్ల కనిష్ట స్థాయిలనూ చూడొచ్చని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎందుకీ పతనం...
మార్కెట్లు ఇంత ఘోరంగా పడిపోవడానికి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినేందుకు అధిక శాతం మంది చెబుతున్న ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక మందగమనమే. మరోపక్క, దేశీయంగా కూడా పాలసీపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వ అలసత్వం, వృద్ధిరేటు క్షీణత, పారిశ్రామికోత్పత్తి దారుణంగా దెబ్బతినడం, డాలరుతో రూపాయి మారకం విలువ భారీ క్షీణత(54 ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకడం) కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే కొందరు నిపుణులు మాత్రం భారత్ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం చాలా ఆకర్షణీయంగా కనబడుతోందని అంటున్నారు. 2009లో చాలా స్టాక్స్ వాటి బుక్ వేల్యూ కంటే నాలుగురెట్లకు పైగా ధరకు(అంతక్రితం ఏడాదిల్లో అంతకంటే ఎక్కువే) ట్రేడయితే... ప్రస్తుతం బుక్ వేల్యూకి మూడింతలు తక్కువ ధరకే ట్రేడవుతున్న విషయాన్ని వారు చూపుతున్నారు.

అయితే, ఇప్పుడు ఇన్వెస్టర్లకు ఈ లెక్కలేవీ బుర్రకెక్కడం లేదు. వాళ్లడిగేది ఒక్కటే... మాకు ఇంత ఘోరమైన నష్టాలెందుకు వచ్చాయా అని(కొలవెరి సాంగ్‌లో కూడా సింగర్ కూడా తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను ఇలాగే అడుగుతాడు(మరో అర్థంలో). ‘వై డిడ్ యూ డూ దిస్ టు మి?’ అని) అయితే సమాధానం మాత్రం రెండు చోట్లా ఎండమావే! ఈ సాంగ్ కొన్ని రోజుల క్రితమే యూట్యూబ్‌లో మిలియన్ హిట్‌లు దక్కించుకుంటే... మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు మాత్రం ప్రతి 10 ట్రేడింగ్ సెకండ్లకూ మిలియన్ డాలర్లు హుష్‌కాకి అయ్యాయి.

స్టాక్ మార్కెట్ 2011

స్టాక్ మార్కెట్ 2011

ఈ ఏడాదిని దలాల్‌ స్టీట్‌కు మరో 'బేర్‌ ఇయర్‌'గా చెప్పుకోవచ్చు. యూరోజోన్‌ రుణ సంక్షోభం, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, కీలక వడ్డీరేట్ల పెంపు, రూపాయి బలహీనం మన మార్కెట్లను ఎంతో ఇబ్బంది పెట్టాయి. దీంతో ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంపద దాదాపు 20లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఈ ఏడాది మొత్తం మీద మన మార్కెట్లు దాదాపు 25 శాతం కరెక్షన్‌కు గురయ్యాయి. దీంతో పాటు ఈ ఏడాది వచ్చిన ఐపీఓలన్నీ అట్టర్‌ ప్లాప్‌ అయ్యాయి.

గత రెండేళ్ళుగా లాభాలతో ముగిసిన మన స్టాక్‌ మార్కెట్లు 2011లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. రెండడుగులు ముందుకు వేస్తే... నాలుగడుగులు వెనక్కి మళ్ళినట్టు మార్కెట్లు ఈ ఏడాది భారీగా పతనమయ్యాయి. దీంతో ఈ ఏడాది ఇన్వెస్టర్ల సంపద దాదాపు 20 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ప్రధాన సూచీలన్నీ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దేశీయ, విదేశీ పరిణామాలు మన మార్కెట్లను భారీగా కృంగదీశాయి. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు, కీలక వడ్డీరేట్లను పలుమార్లు పెంచటం, యూరోజోన్‌ రుణ సంక్షోభం, రుపాయి బలహీనం, గోల్డ్‌పై పెట్టుబడులు పెరగటం మన మార్కెట్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చాయి. దీంతో ఈ ఏడాది సెన్సెక్స్‌ దాదాపు 5 వేల పాయింట్లు, నిఫ్టీ 15 వందల పాయింట్లు నష్టపోయాయి.

వచ్చే ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ స్టేబుల్‌ గా ఉంటాయని, సెకండ్‌ హాఫ్‌లో టెక్స్‌టైల్స్‌ స్టాక్స్‌ చక్కని రిటర్న్స్‌ ఇస్తాయని నిపుణులు అంటున్నారు.

ఇక ఐపీఓల విషయానికి వస్తే ఈ ఏడాది వచ్చిన ఐపీఓల్లో అధిక శాతం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో సెబీ అనుమతి ఉన్నప్పటికీ ఐపీఓకు రావాలంటేనే ఆయా కంపెనీలు భయపడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లన్నీ డౌన్‌ట్రెండ్‌లో ఉండటంతో ... సెబీ అనుమతి ఉన్నా పబ్లిక్‌ ఇష్యూకు రావాల్సిన దాదాపు 25 కంపెనీలు పరిస్థితులు చక్కబడ్డాక రావాలని ఆలోచిస్తున్నాయి.

ఈ ఏడాది 14 వేల 112 కోట్ల రూపాయలను సేకరించడానికి వివిధ కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఇందులో 5 ఐపీవోలు 80 శాతం పైగా విలువను కోల్పోయాయి. దాదాపు 10 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రీమియం ధర ఎక్కువగా ఉండటం... వివిధ కంపెనీలపై నెగిటివ్‌ వార్తలు రావడంతో ఆయా షేర్ల ధర భారీగా పతనమైంది. తక్‌శీల్‌ సొల్యూషన్స్‌ 92 శాతం, ఆర్‌డీబీ రసాయన్స్‌ 90 శాతం, ఇన్ఫో మీడియా 89 శాతం, అక్రోపిటెల్‌ 87 శాతం, శిల్పి కేబుల్స్‌ 85 శాతం కరెక్షన్‌కు గురయ్యాయి.

ఐపీఓలు అట్టర్‌ ఫ్లాఫ్‌ అయినా...ఈ ఏడాది ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ స్టాకుల్లో చక్కని ర్యాలీ వచ్చింది. అయితే మిగతా కౌంటర్లు కరెక్షన్‌కు లోనవడంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఏదేమైనా 2011 ఇన్వెస్టర్లకు ఒక పీడకలగా చెప్పొచ్చు.

పాము నోట ఇన్వెస్టర్

పాము నోట ఇన్వెస్టర్

ఇన్వెస్టర్ల నిరాసక్తత
ఎఫ్ఐఐ నిధుల ఉపసంహరణ
52 వారాల కనిష్ఠ స్థాయిల్లో ఇండెక్స్‌లు
మరో రెండు నెలలు ఇదే పరిస్థితి
2011 సంవత్సరం అంతా స్టాక్ మార్కెట్ రెండడుగులు ముందుకి, నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా నడిచింది. సగటు ఇన్వెస్టర్‌కు పీడకలగా మిగిలిపోయింది. ఇన్వెస్టర్ల సంపద 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న ద్రవ్యోల్బణం, భారీ వడ్డీ రేట్లు, యూరోజోన్ రుణ సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతలు స్టాక్ మార్కెట్‌ను కుంగదీశాయి. ప్రధాన ఇండెక్స్‌లన్నీ 52 వారాల కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా వరుస లాభాలతో నడిచిన భారత స్టాక్ మార్కెట్ దేశీయ, విదేశీ పరిణామాల వల్ల ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. ఏడాది మొత్తం మీద భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కరదీపిక అయిన బిఎస్ఇ సెన్సెక్స్ 26 శాతానికి పైగా నష్టపోయింది.

2010 సంవత్సరానికి 20,509.09 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి 5334.01 పాయింట్లు పతనమై (26 శాతం) 15.175.08 పాయింట్ల వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజిలోని 50 షేర్ల నిఫ్టీ అదే రోజుకి 1590.30 పాయింట్లు నష్టపోయి (25.92 శాతం) 4544.20 పాయింట్ల వద్ద ఉంది. ఆ తర్వాత జరిగిన నాలుగు సెషన్లలో ఇండెక్స్‌లు కొంత మేరకు పుంజుకున్నా మంగళ, బుధవారాల్లో ఏర్పడిన రివర్సల్ కారణంగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15,727.85 పాయింట్లు, నిఫ్టీ 4705.80 పాయింట్ల వద్ద కాస్తంత మెరుగైన స్థితిలో ట్రేడవుతున్నాయి.

కాని మార్కెట్‌లో సెంటిమెంట్ స్థూలంగా బలహీనంగానే ఉన్నదని, ఇన్వెస్టర్లు పెట్టుబడుల విషయంలో అప్రమత్త వైఖరి అనుసరిస్తున్నారని విశ్లేషకులంటున్నారు. 2009 సంవత్సరంలో సెన్సెక్స్ సాధించిన 7817.50 పాయింట్ల చారిత్రక రికార్డు లాభానికి (81.03 శాతం) ఇది పూర్తిగా వ్యతిరేక దిశ. 2010 సంవత్సరంలో కూడా సెన్సెక్స్ 3044.28 పాయింట్లు (17.43 శాతం) లాభపడింది. నిఫ్టీ 2009 సంవత్సరంలో 2241.90 పాయింట్లు (75.76 శాతం), 2010 సంవత్సరంలో 933.45 పాయింట్లు (17.95 శాతం) లాభపడింది.

అన్నీ ప్రతికూలతలే... నానాటికీ తీవ్రతరమైన యూరో రుణ సంక్షోభం, అమెరికా రేటింగ్ తగ్గింపు, పశ్చిమాసియా రాజకీయ సంక్షోభం, అంతర్జాతీయ విపణిలో కమోడిటీ ధరలు, దేశీయంగా గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, రూపాయి పతనం, దిగుమతి బిల్లు పెరగడం, అదుపు తప్పిన విత్తలోటు, భారీ వాణిజ్యలోటు ఇవన్నీ 2011 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ పయనాన్ని నిరోధించిన అంశాలే. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత మార్కెట్‌పై ఆకర్షణ కోల్పోయిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) డిసెంబర్ 19 నాటికి భారత మార్కెట్ నుంచి 2497.50 కోట్ల రూపాయల మేరకు నిధులు ఉపసంహరించారు. 2010 సంవత్సరంలో ఎఫ్ఐఐ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 1,33,266 కోట్ల రూపాయల మేరకున్నాయి. అదే రోజుకి ఎఫ్ఐఐలు దేశీయ రుణపత్రాల్లో 39,637.50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు.

నష్టాల్లో 12 ఇండెక్స్‌లు సర్వత్రా నెలకొన్న ప్రతికూల వాతావరణంలో 13 సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో 12 గత ఏడాదితో పోల్చితే నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండెక్స్‌లన్నీ 52 వారాల కనిష్ఠ స్థాయిలకు దిగజారాయి. ఒక్క ఎఫ్ఎంసిజి ఇండెక్స్ మాత్రమే 9 శాతం లాభాలతో ట్రేడవుతోంది. గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే క్రమంలో ఆర్‌బిఐ 19 నెలల కాలంలో 13 సార్లు వడ్డీరేట్లు పెంచడంతో పాటు ప్రభుత్వం, ఆర్‌బిఐ, రేటింగ్ సంస్థలు భారత వృద్ధిరేటు అంచనాలను కుదించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తీవ్రంగా ప్రభావితం అయింది. వడ్డీరేట్ల పెరుగుదల కారణంగా రుణసేకరణ భారం పెరిగి కార్పొరేట్ లాభదాయకత తగ్గుతుందన్న భయాలతో ఇన్వెస్టర్లు మార్కెట్ పెట్టుబడులకు పూర్తిగా విముఖంగా ఉన్నారు.

దీంతో వడ్డీరేట్ల ప్రభావం అధికంగా ఉండే రియల్టీ, బ్యాంకింగ్, ఆటో ఇండెక్స్‌లు విపరీతంగా దిగజారాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు 80 శాతం ఆదాయాన్ని సమకూర్చే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో మాంద్యం భయాల కారణంగా ఆ రంగానికి చెందిన షేర్లు భారీ నష్టాలు చవి చూశాయి. అయితే రూపాయి విలువ పతనం వారికి కొంత ఊరట ఇచ్చింది. ఆ మేరకు రూపాయి విలువలో మదించే లాభాలు, ఆదాయాలు పెరగడం వారికి కొంత ఉపశమనం కలిగించే అంశం. స్పెక్ట్రమ్ కుంభకోణం టెలికాం స్టాక్‌లను తిరోగమనంలోకి నెట్టింది. మొత్తం మీద డిసెంబర్ 20 నాటికి 52.13 శాతం పతనంతో రియల్టీ ఇండెక్స్ నష్టాల్లో అగ్రస్థానంలో ఉంది. యంత్రపరికరాలు (49.08 శాతం), మెటల్ (47.29 శాతం), పవర్ (41.91 శాతం), పిఎస్‌యు (34.28 శాతం), బ్యాంకెక్స్ (32.92 శాతం) నష్టాల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నష్టాల్లో భెల్‌కు అగ్రతాంబూలం డిసెంబర్ 20వ తేదీ నాటికి 50.80 శాతం పతనంతో భెల్ స్క్రిప్ సెన్సెక్స్‌లోని 30 షేర్లలో నష్టాల్లో అగ్రస్థానంలో ఉంది. జై ప్రకాష్ (49.34 శాతం), ఎల్ అండ్ టి (50.53 శాతం), ఎస్‌బిఐ (43.69 శాతం), టాటా పవర్ (40.25 శాతం), డిఎల్ఎఫ్ (36.53 శాతం), హిండాల్కో (51.57 శాతం), ఐసిఐసిఐ బ్యాంక్ (43 శాతం), జిందాల్ స్టీల్ (32.80 శాతం), మారుతి సుజుకి (35.64 శాతం), ఆర్ఐఎల్ (32.57 శాతం), స్టెరిలైట్ ఇండస్ట్రీస్ (52.76 శాతం), టాటా మోటార్స్ (33.05 శాతం) టాటా స్టీల్ (49.30 శాతం) భారీ నష్టాలు మూటగట్టుకున్న స్క్రిప్‌లలో ఉన్నాయి. హిందుస్తాన్ యునీలీవర్ (27.09 శాతం), ఐటిసి (14.36 శాతం), బజాజ్ ఆటో (4.08 శాతం) మాత్రం లాభపడ్డాయి.

భవిష్యత్తు అస్థిరమే ప్రస్తుతానికి అంతర్జాతీయంగాను, దేశీయంగాను నెలకొన్న వాతావరణంలో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించే సూచనలే అధికంగా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ వరకు మార్కెట్‌కు చెప్పుకోదగ్గ ఉత్తేజిత అంశాలేవీ ఉండకపోవచ్చునన్నది వారి అభిప్రాయం. అయితే తగ్గిన ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల తగ్గుదలకు సుగమమైన వాతావరణం మాత్రం కొంత సానుకూలించే అంశాలని వారంటున్నారు.

మౌళిక రంగం 2011

మౌళిక రంగం 2011

ఒకప్పుడు కళకళలాడిన మౌళిక రంగం ఈ ఏడాది నత్తనడక నడిచింది. 2011 ఈ రంగానికి కలసిరాలేదనే చెప్పాలి. ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశవ్యాప్తంగా కానీ ఈ aఏడాదిలో మేజర్ ప్రాజెక్టులేవీ మచ్చుకైనా కనిపించలేదు. వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్భణం, రాజకీయ అస్థిరత మౌళిక రంగాన్ని కుదేలు చేశాయి.

2011లోమౌళిక రంగం చతికిల బడింది. ఈ ఏడాది చెప్పుకోతగ్గ పెద్ద ప్రాజెక్టులేవీ రాలేదనే చెప్పాలి. సిమెంట్‌, విద్యుత్‌ ఉత్పత్తి, రిఫైనరీలు కొంత మెరుగ్గా కనిపించినా... ముడిచమురు, నేచురల్‌ గ్యాస్‌, ఎరువుల రంగాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఇన్‌ఫ్రాకి పెద్ద దెబ్బే తగిలింది. ఆర్‌బీఐ ద్రవ్యోల్భణం అదుపు పేరుతో వడ్డీరేట్లు పెంచుకుంటూ పోవడం ఒక కారణమైతే...మరో వైపు కోల్ ఇండియా పవర్ ప్రాజెక్టులకు అవసరమైనంత బొగ్గు అందించడంలో విఫలమౌవ్వడం, కోల్‌ లింకేజ్‌ ఇష్యూస్‌ ప్రధానం కారణంగా చెప్పవచ్చు. దాదాపు అన్ని మేజర్ పవర్ ప్రాజెక్టులు బొగ్గుని విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులను ఎదుర్కోక తప్పలేదు. దీంతో పవర్ జనరేషన్‌కు ఆటంకం ఎదురైంది. ఇక రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులు బాగానే వచ్చినా వడ్డీరేట్ల పెంపు, బ్యాంకర్ల జాప్యంతో నత్త నడకనే నడిచాయి. మొత్తమ్మీద ఈ ఏడాది మౌళిక రంగానికి కలసి రాలేదు.

ఇక మన రాష్ట్రం విషయాకొస్తే ఒకప్పుడు కళకళలాడిన పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ ఏడాది భారీగా నష్టపోయాయి. దేశవ్యాప్తంగా సుమారు 60 శాతం ఇన్‌ఫ్రా కంపెనీలు మన రాష్ట్రావే. ఈ సారి మాత్రం ఈ కంపెనీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జీఎమ్‌ఆర్, జీవీకే, లాంకో ఇన్‌ఫ్రా తో పాటు పలు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మరికొన్ని కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి బయట రాష్ట్రాల్లో చిన్నా చితకా ప్రాజెక్టులు చేపట్టాయి. రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ అనిశ్చితి, తెలంగాణ ఉద్యమ హోరుతో పాటు పవర్ ప్రాజెక్టుల కోసం బయట నుంచి బొగ్గుని దిగుమతి చేసుకోవాల్సి రావడంతో మన కంపెనీలు డీలా పడ్డాయి. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికొస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.

ఇక అర్భన్ ఇన్‌ఫ్రా విషయానికొస్తే ఈ ఏడాది ఈ సెక్టర్‌లో పురోగతి శూన్యమనే చెప్పాలి. వాటర్, వేస్ట్ మానేజ్‌మెంట్‌లలో ఒక్క మేజర్ ప్రాజెక్టు కూడా ఈ ఏడాది ప్రారంభం కాలేదు.
కోల్ పాలసీ రివైజ్‌, ఆయిల్ అండ్ గ్యాస్ పాలసీ రివైజ్ చేస్తే వచ్చే ఏడాది మంచి పురోగతి సాధించే అవకాశముందని విశ్లేషకులంటున్నారు.


రాజకీయ స్థిరత్వం, కేంద్రం తీసుకొనే వ్యూహాత్మక నిర్ణయాలతోనైనా వచ్చే ఏడాది మౌళిక రంగాన్ని గట్టెక్కుతుందని ఆశిద్దాం.

కమోడిటీ రంగం ధగధగా 2011

కమోడిటీ రంగం ధగధగా 2011

ఈ ఏడాది కమోడిటీ రంగం ధగధగా మెరిసింది. గోల్డ్‌ 36 శాతం, సిల్వర్‌ 28 శాతం రిటర్న్స్‌ ఇచ్చాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితి కారణంగానే ఇన్వెస్టర్లు బంగారం వైపు ఆసక్తి చూపారు.

ఈ ఏడాది అన్నింటికన్నా ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చింది ఏదంటే టక్కున గుర్తొచ్చేది గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌. ఎప్పటికప్పుడూ ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలుకొడుతూ జనం గుండెళ్ళో దడపుట్టించిన బంగారం, వెండి... ఇన్వెస్టర్లను మాత్రం ఆనందంలో ముంచెత్తింది. ఈ ఏడాది చివర్లో కొంత కరెక్షన్‌ వచ్చినా ఏడాది మొత్తం మీద బంగారంపై 36 శాతం, వెండిపై 28 శాతం రిటర్న్స్‌ వచ్చాయి.

ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర రూ.20,890గా ఉంది. జనవరి 28న 19 వేల 960 రూపాయల కనిష్టం... డిసెంబర్‌ 8న 29 వేల 540 రూపాయల గరిష్ట స్థాయిల మధ్య ట్రేడైంది. ఈ ఏడాది చివరి 20 రోజుల్లో వచ్చిన కరెక్షన్‌తో బంగారం ధర 27 వేల 300 రూపాయల సమీపంలోకి వచ్చింది.

ఇక వెండి విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో రూ.46,500గా ఉంది. ఏప్రిల్‌ 25న వెండి ధర 74 వేల 300 రూపాయల గరిష్ట స్థాయికి చేరి ఆల్‌టైమ్‌ హైకి చేరింది. సెప్టెంబర్‌ నుంచి వచ్చిన కరెక్షన్‌తో ఈ ఏడాది చివరి నాటికి వెండి ధర 49 వేలకు పడిపోయింది.

వచ్చే ఏడాది విషయానికి వస్తే గోల్డ్‌, సిల్వర్‌లు మళ్ళీ చక్కని రిటర్న్స్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ చాలా బెటరని, ఒకవేళ రిస్క్‌ తీసుకోదలిస్తే ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్‌ చేయాలని నిపుణులు అంటున్నారు.

ఏదేమైనా అంతర్జాతీయంగా బంగారంకు ఉన్న డిమాండ్ , ఎకనమిక్ క్రైసిస్‌లతో ఇన్వెస్టర్లలో పసిడి మీద నమ్మకాన్ని పెంచుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలవటం, నిలకడలేని స్టాక్‌మార్కెట్ల కన్నా ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం గోల్డ్‌ ఎంతో బెస్ట్‌ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బులియన్ ఢమాల్

బులియన్ ఢమాల్

సామాన్యుడికి అందనంత స్థాయికి దూసుకుపోయిన బంగా రం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో గురువారం దేశీయ బులియన్ మార్కెట్లో ఈ రెండు విలువైన లోహాల ధరలు భారీగా పతనమయ్యాయి. పది నెలల తరువాత వెండి ధర 50 వేల రూపాయల్లోకి వచ్చింది. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర (99.5 స్వచ్ఛత) ఒక్క రోజులో 845 రూపాయలు తగ్గి 27,415 రూపాయల (బుధవారం ముగిం పు) నుంచి 26,570 రూపాయలకు చేరుకుంది. అదే విధంగా 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర కూడా 845 రూపాయలు తగ్గి 27,540 రూపాయల నుంచి 26,695 రూపాయలకు చేరింది.

ఇక వెండి ధర గత 10 నెలల్లో ఎన్నడూ లేని విధంగా భారీ పతనాన్ని చవిచూసింది. కిలో వెండి ధర 2,815 రూపాయలు తగ్గి 51,955 రూపాయల నుంచి 49,140 రూపాయలకు దిగివచ్చింది. ఇక న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర (99.9 స్వచ్ఛత) 540 రూపాయలు తగ్గి 27,340 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత బంగారం ధర 27,200 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 3,100 రూపాయలు దిగివచ్చి 49,100 రూపాయల వద్ద స్థిరపడింది.

ఎందుకీ పతనం? అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరల కదలికలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. ప్రస్తుతం ఈ రెండు లోహాల పట్ల అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ధోరణి ప్రతికూలంగా మారింది. గురువారం బంగారం ధర మూడు నెలల కనిష్ఠస్థాయికి పడిపోయింది. డాలర్ క్రమంగా బలపడుతుండటంతో పెట్టుబడులు బులియన్ మార్కెట్ నుంచి డాలర్‌వైపు మళ్లుతున్నాయి. దీని ఫలితంగానే ఈ నెలలో బంగారం ధర 11 శాతం తగ్గింది. గత ఆరు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఔన్స్ బంగారం ధర తాజా గా 1.1 శాతం తగ్గి 1,547.50 డాలర్లకు చేరింది.

సెప్టెంబర్ 26 నుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ స్థాయిలో బంగారం ధర లేదు. అంతర్జాతీయ మార్కెట్లో మార్చి నెలకు వెండి కాంట్రాక్టు ఔన్స్ ధర 1.51 డాలర్లు క్షీణించి 27.23 డాలర్లకు చేరింది. వీటి ధరలు భవిష్యత్‌లో ఇంకా క్షీణిస్తాయని ఆందోళన చెందుతున్న దేశీయ స్పెక్యులేటర్లు, ఇన్వెస్టర్లు లాభా ల స్వీకరణకు దిగుతున్నారు. అందుకే ఇంత భారీ స్థాయిలో ధరలు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నా రు. మరో వైపు వెండికి పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ సన్నగిల్లింది. ఈ పరిణామం కూడా వెండి తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.

స్వల్పంగా పెరిగిన గిరాకీ బంగారం ధర రెండు నెలల క్రితం ఉన్న స్థాయికి దిగిరావడంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గురువారం నాడు భారీగా తగ్గిన ధర వల్ల కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. బుధవారంతో పోల్చితే గురువారం నాడు పసిడి కొనుగోళ్లు అధికంగా జరిగినట్లు ముంబైకి చెందిన ఒక డీలర్ తెలిపారు. అయితే ఏడాది చివర్లో డిమాండ్ కొంత బలహీనంగా ఉందంటున్నారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు బంగారం కొనుగోళ్లకు మంచి రోజులు కావని హిందువులు భావిస్తుండటంవల్లనే గిరాకీ తగ్గినట్టు ట్రేడర్లు చెబుతున్నారు. అయితే ధరలు తగ్గుతున్న నేపథ్యంలోరానున్న కాలంలో ఇంకా తగ్గుతాయని భావించి కొంత మంది కొనుగోళ్లు జరపడం లేదని చెబుతున్నారు.

Busi_Steave Jobs

Busi_Steave Jobs

కొత్త పుంతలు తొక్కిన టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను తీర్చేవిధంగా మలుస్తూ ఆపిల్ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిపెట్టిన ఘనుడు స్టీవ్ జాబ్స్. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఐపాడ్ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్ మరణం ఒక్క ఆపిల్ సంస్థకే కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు . 2011 సంవత్సరం స్టీవ్ లేడనే చేదు నిజాన్ని మిగిల్చింది.

ఏ రంగమైన పోటీ ఉంటేనే ఎదుగుతుంది. కంప్యూటర్ యుగం ఊహించని రీతిలో త్వరగా ముందుకు వెళ్ళడానికి ఆ పోటీనే కారణం. అలాంటి పోటీని సృష్టించిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది స్టీవ్ జాబ్స్ పేరే. స్టీవ్ జాబ్స్ మరణం ఆపిల్ కంపెనీకే కాదు యావత్ ప్రపంచానికి పెద్ద షాక్ మిగిల్చింది. టెక్నాలజీని మనం ఎంతగా ఉపయోగించుకుంటే అంతగానూ అది రాణిస్తుంది. మన ఆలోచనలను ఎంతగా పరుగులు పెట్టిస్తే అంతగానూ అది దేదీప్యమవుతుందని నిరూపించిన స్టీవ్‌జాబ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో మరణించటం సాంకేతిక రంగానికి తీరని లోటు. తన టెక్నాలజీతో యానిమేషన్ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసిన ఘనత జాబ్స్‌కే దక్కుతుంది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు గట్టి పోటీ ఇచ్చిన కంపెనీ ఆపిల్ కంపెనీ. సృజనాత్మకతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆపిల్ చరిత్రలో ఓ కీలక ఘట్టం ముగిసింది. మాక్ కంప్యూటర్స్, ఐపాడ్, ఐఫోన్ల సృష్టికర్త స్టీవ్ జాబ్స్ మరణం ఆపిల్‌కే కాదు యావత్ ప్రపంచానికే షాక్ కలిగించింది. యాపిల్ -4 రిలీజ్, స్టీవ్ మరణం ఒకేరోజు కాకతాళీయంగా జరిగింది.
ఆపిల్ సిఇఒ బాధ్యతల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రెండు నెలలకే స్టీవ్‌ తనువు చాలించారు.

స్టీవ్ జాబ్స్ చిన్నప్పటినుంచీ ఎదో సాధించాలనే తపనతో ఉండే వారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చెయ్యాలా అనే ఎప్పుడూ ఆలోచించేవారు. ఈ ఇంట్రెస్ట్‌తోనే తన 21వ ఏటే ఇంటి గ్యారేజిలోనే యాపిల్ కంప్యూటర్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బోర్డులో విభేదాల కారణంగా 1985లో కంపెనీ నుంచి బైటికి వచ్చారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ 1997లో కంపెనీకి తిరిగొచ్చారు. స్టీవ్ జాబ్స్ సీఈఓగా యాపిల్ కంపెనీ... సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆధిపత్యానికి గట్టి పోటీనిచ్చింది. ప్రస్తుతం సుమారు 350 బిలియన్ డాలర్ల మార్కెట్‌క్యాపిటల్‌తో ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది.

చనిపోయే కొద్ది రోజుల ముందు జాబ్స్ తన రాజీనామాను ప్రకటించారు. 'యాపిల్ సీఈవోగా నా బాధ్యతలను నిర్వర్తించలేనప్పుడు ఆ విషయం నేనే స్వయంగా వెల్లడిస్తానని ఎప్పుడో చెప్పాను. దురదృష్టవశాత్తూ ఆ రోజు రానే వచ్చింది' అంటూ తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. యాపిల్ మరింత ఉజ్వలంగా ఎదగాలని జాబ్స్ ఆకాంక్షించారు. 2003లోనే స్టీవ్ క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. ఆ తర్వాత 2009లో కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఒకవైపు క్యాన్సర్‌తో పోరాటం చేస్తూనే మరోవైపు ఆపిల్ కంపెనీని వృద్ధిరేటులో పరుగులు పెట్టించిన ఘనత స్టీవ్‌కే దక్కుతుంది.

ఎన్నో సంక్షోభాల నడుమ ఎంతో సమర్థవంతంగా, చాకచక్యంగా ఆపిల్‌ బాధ్యతలను నిర్వహించిన జాబ్స్ ఇకపై లేరనే వార్త అటు కంపెనీకి ఇటు కొత్త టెక్నాలజీని ఇష్టపడేవారికి తీరని లోటుని మిగ్చిల్చింది.

Busi_Mullapudi

Busi_Mullapudi

ఆంధ్రా బిర్లాగా పిలవబడే ప్రముఖ పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్‌ గత సెప్టెంబర్ 3న మరణించారు. మూత్రపిండాల వ్యాధితో కొంత కాలంగా బాధపడుతోన్న ఆయన తన 91వ ఏట కన్నుమూశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధిని చూపిన మహా మనిషి. ఆయన్ని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఎందరో యువ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శిగా నిలిచిన ముళ్ళపూడి జీవితం ఆదర్శప్రాయం.

ఆంధ్ర పారిశ్రామిక రంగానికి ఆద్యుడు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెద్దపట్నంలో 1921 జులై 8న హరిచంద్రప్రసాద్‌ జన్మించారు. కేవలం పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన ఆగస్ట్ 11, 1947 సంవత్సరంలో తణుకులో ఆంధ్రా షుగర్స్ స్థాపించారు. స్వతంత్ర భారతదేశంలో ప్రారంభించిన తొలి కంపెనీల్లో ఇది ఒకటి. గత 63 ఏళ్ళల్లో ఆంధ్రా షుగర్స్‌లో ఒక్క రోజు కూడా సమ్మె జరగలేదంటేనే ఆయనకి పని పట్ల ఉన్న దీక్ష, పట్టుదలకు నిదర్శనంగా నిలిచాయి.

ఫ్యాఫ్సీ ప్రెసిడెంట్‌గా, ఆంధ్రా పెట్రో కెమికల్స్ ఎండీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఆయన పలు కీలక బాధ్యతలు వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక పన్నును చెల్లించి పరిశ్రమ కూడా ఆయనదే. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధిని చూపారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న ఆయన సెప్టెంబర్ 3న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని కోల్పోవడం రాష్ట్రానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటు.




మైక్రోఫైనాన్స్‌ 2011

మైక్రోఫైనాన్స్‌ 2011

మైక్రోఫైనాన్స్‌ రంగం ఈ ఏడాది గడ్డుపరిస్థితిని ఎదుర్కొంది. ఒకప్పుడు రారాజుగా వెలిగిన మైక్రోఫైనాన్స్‌ కంపెనీలు ఈఏడాది వెలవెలబోయాయి. ఒకవైపు రిజర్వుబ్యాంక్‌ నిబంధనలు, మరోవైపు స్టేట్‌ గవర్నమెంట్‌ కొత్త చట్టం మైక్రో కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవడానికి మైక్రో కంపెనీలు కిందామీద పడుతున్నాయి.

వాయిస్‌ :
మైక్రో ఫైనాన్స్‌. ఒకప్పుడు ఈ రంగం ఎంతో వేగంగా వృద్ధి చెందింది. అయితే ఈ ఏడాది మాత్రం ఈ రంగం ఒక్కసారిగా ఢీలాపడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రంగం వృద్ధి ఏకంగా సగానికి సగం పడిపోయింది. దీనికి కారణం రిజర్వు బ్యాంక్‌ నిబంధనలు, మన రాష్ట్ర ప్రభుత్వ తెచ్చిన కొత్త చట్టమే.

అప్పుల మీద అప్పులు ఇచ్చి దానికి రెండు మూడు రెట్ల వడ్డీలను వసూలు చేస్తారని ఈ రంగ కంపెనీలు ఎంతో అపకీర్తిని మూటగట్టుకున్నాయి. అప్పుల రికవరీ పేరుతో పేదలను నానా ఇబ్బందులకు గురిచేసి ఏకంగా రిజర్వుబ్యాంక్‌ నుంచి... రాష్ట్ర ప్రభుత్వం నుంచి చివాట్లు తిన్నాయి మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు. అయినా పరిస్థితిలో మార్పు లేదు.

దీంతో ఈ కంపెనీల ఆగడాలను అరికట్టడానికి ఒకదశలో రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలకు జనం నుంచి వ్యతిరేకత ఎదురవడంతో మన రాష్ట్రప్రభుత్వం మైక్రోఫైనాన్స్‌పై కొత్త చట్టాన్ని తెచ్చింది. అలాగే రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొత్త నిబంధనలను విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తాము ఇచ్చిన అప్పులు వసూలు అవుతాయో లేదనే భయం మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలకు పట్టుకుంది. ఈ ఏడాది ఇచ్చిన అప్పుల్లో 20 శాతం కూడా రికవరీ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌పై ఆశలు వదులుకొని పక్క రాష్ట్రాలపై దృష్టి సారించాయి.

మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర రంగాల్లోకి ప్రవేశించడానికి పైలెట్‌ ప్రాజెక్టులను చేపట్టాయి. ఈ పైలెట్‌ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో పప్పులు ఉడకవని భావించి పొరుగు రాష్ట్రాలపై ఈ కంపెనీలు దృష్టిసారించాయి. పైకి ఈ రంగంలో ఉంటామని ధీమా వ్యక్తం చేసిన వారి ఆలోచన మాత్రం ఇతర రంగాలపైనే ఉందని విమర్శలు వస్తున్నాయి.

ఏదైమైనా 2011 మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలకు గడ్డుకాలం. ప్రభుత్వ కొత్త చట్టం, ఆర్‌బీఐ నిబంధనలు ఈ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వచ్చే ఏడాది అయినా ఈ రంగం వృద్ధి సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే...!

ఎస్‌కేఎస్‌ మైక్రో ఫైనాన్స్‌

ఎస్‌కేఎస్‌ మైక్రో ఫైనాన్స్‌

మైక్రో ఫైనాన్స్‌ రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఎస్‌కేఎస్‌ మైక్రో ఫైనాన్స్‌... ప్రస్తుతం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆంక్షలు, రిజర్వుబ్యాంక్‌ నిబంధనలతో...మన రాష్ట్రంలో ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోలేక ఈ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సంస్థ భారీ నష్టాల్లో ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర రంగాల్లోకి ప్రవేశించడానికి పైలెట్‌ ప్రాజెక్టులను చేపట్టింది. ఈ పైలెట్‌ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌లో పప్పులు ఉడకవని భావించి పొరుగు రాష్ట్రాలపై ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌ దృష్టిసారించింది.

వాయిస్‌ :
ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌... ఈ పేరు తెలియని వారు మన రాష్ట్రంలోనే లేరని చెప్పొచ్చు. అప్పుల మీద అప్పులు ఇచ్చి దానికి రెండుమూడు రెట్ల వడ్డీలను వసూలు చేశారన్న అపకీర్తిని ఈ కంపెనీ మూటగట్టుకుంది. దీంతో ఈ సంస్థ చేసిన ఆగడాలను అరికట్టడానికి ఒకదశలో ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎస్‌కేఎస్‌ నుంచి జనం నుంచి వ్యతిరేకత ఎదురవడంతో మన రాష్ట్రప్రభుత్వం మైక్రోఫైనాన్స్‌పై కొత్త చట్టాన్ని తెచ్చింది. అలాగే రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొత్త నిబంధనలను విధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తాము ఇచ్చిన అప్పులు వసూలు అవుతాయో లేదని భయపడుతోన్న ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌ ప్రస్తుతం తమ కార్యకలాపాలను పక్కరాష్ట్రాల్లో నిర్వహించడానికి కసరత్తు ప్రారంభించింది.

బైట్స్‌ :

అలాగే కంపెనీ లాభాలను పెంచడానికి గోల్డ్‌లోన్‌, మొబైల్‌లోన్స్‌, సంగమ్‌ స్టోర్స్‌ పేరుతో రిటైల్‌ మార్కెట్లోకి ఎంటర్‌ కానుంది. గోల్డ్‌ లోన్స్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షలు ఉండటంతో పక్కరాష్ట్రాల్లో పైలెట్‌ ప్రాజెక్టులను ప్రారంభించింది.

బైట్‌ :

ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాము మైక్రోఫైనాన్స్‌ రంగాన్ని వీడమని, ఈ రంగంలో తమ కార్యకలాపాలు 90 శాతంగా ఉంటుందని, కేవలం 10 శాతం మాత్రమే ఇతర రంగాలపై దృష్టిపెడుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.

బైట్‌ :

స్టేట్‌ గవర్నమెంట్‌ కొత్త చట్టం, రిజర్వుబ్యాంక్‌ ఆంక్షలతో తమ వ్యాపారం ఆంధ్రప్రదేశ్‌లో నెమ్మదించిందని, ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆ ప్రభావం లేదని కంపెనీ సీఎఫ్‌ఓ ఢిల్లీ రాజ్‌ అన్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ తిరిగి లాభాలబాటలోకి మళ్ళుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బైట్‌ :

ఒకప్పుడు స్టాక్‌ మార్కెట్లో 14 వందల స్థాయికి వెళ్ళిన ఎస్‌కేఎస్‌ షేర్‌ ప్రస్తుతం 150 రూపాయల వద్ద కదలాడుతోంది. కొత్త మేనేజ్‌మెంట్‌ తీసుకునే నిర్ణయాలు, విస్తరణ ప్రణాళికలు ఈ కంపెనీని ఏ మాత్రం గట్టెక్కిస్తాయో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే...!

Rupee Increase

Rupee Increase

గత ఏడాది చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రూపాయి ఈ ఏడాది మళ్ళీ పుంజుకోనుంది. కేంద్రం తీసుకుంటోన్న కీలక నిర్ణయాలతో ఈ ఏడాది ఆసియా కరెన్సీలను రూపాయి లీడ్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి రూపాయి మారకం విలువ మరింత బలపడే ఛాన్స్‌ ఉందని వార్తలు వస్తున్నాయి.


గత ఏడాది రూపాయి మారకం విలువ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంది. యూరో సంక్షోభంతో డాలర్‌ విలువ అమాంతం పెరగడంతో రూపాయి వెలవెలబోయింది. గత ఏడాది జులై చివరి వారంలో 43.85 స్థాయి దగ్గర ఉన్న రూపాయి ఒకానొక దశలో 54 మార్కుకు చేరువలోకి వచ్చింది. ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లో ఏమంత ఆశాజనకంగా లేకపోవడం, జపాన్‌, యూరో సంక్షోభమే రూపాయి విలువ ఇంతలా బలహీనపడటానికి ప్రధాన కారణం. డాలర్‌ పుంజుకోవడంతో ఐటీ రంగానికి పూర్వ వైభవం వచ్చినా దిగుమతులపై ఆధారపడిన ఫెర్టిలైజర్‌, ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, సిమెంట్‌ రంగాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి.

అయితే ఆల్‌టైమ్‌ హైకి చేరి దిగుమతిదారుల గుండెళ్ళో దడపుట్టిస్తోన్న రూపాయి మారకం విలువ క్రమక్రమంగా దిగివస్తోంది. స్పానిష్‌, ఇటాలియన్‌ రుణ వేలానికి ఊహించిన స్పందన లభించడం రూపాయి సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి రూపాయి విలువ మరింత రికవరీ అయ్యే ఛాన్స్‌ ఉంది. 2011లో ఆసియా బాండ్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు 6.84 బిలియన్ల నుంచి 2.8 బిలియన్లకు తగ్గాయి. దీంతో ఈ ఏడాది ఎఫ్‌ఐఐలు భారత్‌, తైవాన్‌, దక్షిణకొరియా మార్కెట్లలో ఉదారంగా పెట్టుబడులు పెట్టనున్నారని, దీంతో రాబోయే కాలంలో రూపాయి మారకం విలువ మరింత బలపడే ఛాన్స్‌ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.


ఏదేమైనా రూపాయి బలహీనంతో దిగుమతికి సంబంధించిన రంగాలన్నీ ఇబ్బందిపడుతున్నాయి. ఇప్పటికే రెండు నెలల గరిష్టానికి చేరిన రూపాయి మరో నాలుగైదు నెలల్లో మరింత బలపడటం ఖాయమని విశ్లేషకులంటున్నారు.

రూపాయి వెలవెల-డాలర్ కళ కళ

రూపాయి వెలవెల-డాలర్ కళ కళ

రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తుండటంతో కార్పొరేట్‌ ఇండియా గజగజా వణుకుతోంది. రాబడి భారీగా ఉన్నప్పటికీ లాభాలు స్వల్పంగా ఉండటంతో అనేక భారతీయ కంపెనీలు సతమతమవుతున్నాయి. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే రూపాయి మారకం విలుద దాదాపు 8 రూపాయల మేర బలహీనపడింది. దీంతో ఐటీ రంగం వృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ... మిగితా అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం పడింది.

ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు యూరో సంక్షోభం మన రూపాయిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యూరో సంక్షోభంతో డాలర్‌ విలువ అమాంతం పెరగడంతో రూపాయి వెలవెలబోతోంది. ఈ ఏడాది జులై చివరి వారంలో 43.85 స్థాయి దగ్గర ఉన్న రూపాయి ప్రస్తుతం 52 రూపాయలు దాటింది. ముఖ్యంగా గత నెల రోజులు వ్యవధిలోనే రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే దాదాపు 3 రూపాయల మేర బలహీనపడింది. ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లో ఏమంత ఆశాజనకంగా లేకపోవడం, జపాన్‌, యూరో సంక్షోభం నేపథ్యంలో రూపాయి విలువ భారీగా బలహీనపడిందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బైట్‌ : బాలసుబ్రమణ్యం, రిసెర్చ్‌ హెడ్‌, పీసీఎస్‌ సెక్యూరిటీస్‌ (గురువారంనాడు బిజీ-బాల పేరుతో ఇంజెస్ట్‌ అయింది)

రూపాయి ప్రస్తుతం బేరిష్‌ ట్రెండ్‌లో ఉందని, మున్ముందు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 54 రూపాయలకు చేరే అవకాశం ఉందని వారంటున్నారు. ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ ఇన్‌ఫ్లో బాగుంటేనే రూపాయి మారకం విలువ తిరిగి బలపడుతుందని, లేకుంటే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

డాలర్‌ పుంజుకోవడంతో ఐటీ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. అయితే ఐటీ ఎగుమతులు వృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికీ... దిగుమతుల మీద ఆధారపడే అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం పడింది. గత త్రైమాసికంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఇంపోర్ట్స్ మీద ఆధారపడే అన్ని రంగాలకూ ఈ దెబ్బ ఇప్పటికే పడింది. రూపాయి బలహీనం కావడం ఎగుమతిదారులకు ఊరటనిస్తున్నప్పటికీ... దిగుమతిదారులను మాత్రం బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు, రాగి, బంగారం, ఫెస్టిలైజర్‌ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పటికీ ... డాలర్‌ పుణ్యమా అని మన మార్కెట్లో ధరలు ఏమాత్రం తగ్గటం లేదు. అలాగే దిగుమతుల మీదే ఆధారపడిన ఫెల్టిలైజర్స్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్ రంగాలకు రూపాయి బలహీన పడటం పెద్ద దెబ్బేనని నిపుణులంటున్నారు..

ఏదైమైనా అమెరికా జిమ్మిక్కు పుణ్యమా అని ఇతర దేశాల కరెన్సీలన్నీ బలహీన పడుతున్నాయి. ఇది మరికొంత కాలం కొనసాగితే పెట్టుబడులు తగ్గి భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు లోనయ్యే ఆస్కారముంది.




Busi_Realty 2011

Busi_Realty 2011

ఈ ఏడాది రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైందని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను పలుమార్లు పెంచడంతో గృహరుణాలపై ఆసక్తి సన్నగిల్లింది. దీంతో పాటు స్టాక్‌మార్కెట్లు కూడా భారీ కరెక్షన్‌కు లోనవడంతో రియాల్టీని మరింత దెబ్బతీసింది. దీంతో ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న రియాల్టీ నుంచి ఇన్వెస్టర్లు ఇతర రంగాలకు మళ్ళుతున్నారు. రాజకీయ అస్థిరత, పాలన, భూమి కొనుగోలు సంబంధించిన సమస్యలు, నియంత్రణ ప్రక్రియలు, ప్రాజెక్ట్‌ స్పష్టతలో జాప్యాలుతో పాటు పెరుగుతున్న వడ్డీరేట్లు రియాల్టీ రంగం దెబ్బతినడానికి ప్రధాన కారణం. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం 20-40 శాతం వరకు క్షీణించింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా రియాల్టీ రంగం భారీగా దెబ్బతింది. నిర్మించిన ఇళ్ళు కొనేవారు లేకపోవడంతో షాంఘై, బీజింగ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 70 పెద్ద నగరాల్లో ఇళ్ళ ధరలు భారీగా తగ్గాయని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు, నాలుగు నెలల్లో రియాల్టీ జోరు భారీగా తగ్గిందని, ఇది ఇలాగే కొనసాగితే రియాల్టీ రంగానికి పెద్ద ఇబ్బందేనని ఈ సర్వేలలో ఆందోళన వ్యక్తమైంది.

ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే 2011లో రియల్టీ రంగంలో కరెక్షన్ వచ్చిందనే చెప్పాలి. అయితే గత ఏడాది అక్టోబర్ నుంచి పరిస్థితి కొంత మెరుగ్గా అనిపించినా మేజర్ ప్రాజెక్టులేవీ రాలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఓ వైపు సకల జనుల సమ్మె, తెలంగాణ వాదంతో బిజినెస్ లేకపోవడం మరోవైపు ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో డెవలపర్స్ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి జంకుతున్నారు. ముఖ్యంగా జీవో నెం 45 బిల్డర్స్‌కి కొరకరాని కొయ్యగా మారింది. దీంతో గత పది నెలలుగా రియల్టీ రంగంలో స్తబ్ధత నెలకొంది. దీంతో డిమాండ్‌కు తగ్గ సప్లై లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇక 2012 విషయానికొస్తే వచ్చే జనవరి నుంచి మంచి భూమ్ ఉంటుందని డెవలర్స్ ఆశిస్తున్నారు. ఫస్ట్ క్వార్టర్‌లో పెట్టుబడులు పెట్టే బైయ్యర్స్‌కు ఇది జాక్ పాట్ లాంటి అవకాశమని అని వారంటున్నారు. డాలర్ అనూహ్యంగా బలపడటంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, NRIలకు 15 నుంచి 20 శాతం మేర లాభపడుతున్నారు, వారు పెట్టుబడులు పెట్టేందుకు ఆశక్తి చూపుతున్నారు. దీంతో చాలా డిమాండ్ ఉండే అవకాశముందని అయితే డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో వచ్చే ఏడాది రెండవ త్రైమాశికం కల్లా రేట్లు 20 శాతం పైగా పెరిగే ఛాన్సుందని విశ్లేషకులంటున్నారు.

హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంటే విశాఖపట్టణంలో దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ గత రెండేళ్ళ నుంచి రియల్ భూమ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ ఏడాది కూడా ఇక్కడ మంచి రేట్లే పలుకుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సప్లై ఉన్నా ...జీవో 45తోనే అసలు తలనొప్పి అని డెవలపర్స్ వాపోతున్నారు.


మొత్తమ్మీద రియాల్టీ రంగం గాడిన పడినట్లు కనిపిస్తోన్నా ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు డెవలపర్స్‌కి నష్టం కలిగించేలా ఉన్నాయి. జీవో 45ని సవరించి ప్రభుత్వం సహకరించాలని రియాల్టీ రంగ నిపుణులంటున్నారు.

రాష్ట్రంలో ఐటీ రంగానికి గడ్డుకాలం

రాష్ట్రంలో ఐటీ రంగానికి గడ్డుకాలం
సెక్టార్‌పై సంక్షోభాల ప్రభావం
రాష్ట్ర ఐటీ రంగం
రాని కొత్త కంపెనీలు
బెంగళూరు, చెన్నై వైపు ఆసక్తి చూపుతున్న కొత్త కంపెనీలు

యాంకర్‌ :
రాష్ట్రంలో ఐటీ రంగానికి గడ్డుకాలం వచ్చింది. వరుస సంక్షోభాలతో ఐటీ సెక్టార్‌ కుదేలవుతోంది. 2008లో ఆర్థిక మాంద్యం, 2009 నుంచి తెలంగాణ ఆందోళన, తాజాగా అమెరికా మార్కెట్‌లో వచ్చిన ఆర్ధిక సంక్షోభం ఐటీ రంగాన్ని షేక్‌ చేస్తున్నాయి.

వాయిస్
క్షణాల్లో ప్రపంచ సమాచారాన్ని కళ్లముందుంచుతోంది ఐటీ రంగం. అంతే వేగంగా ఉద్యోగాల కల్పన-రెవెన్యూలో ఈ శాఖ అత్యధిక వృద్ధి రేటు సాధించింది. ఐటీలో ఒకప్పుడు బెంగుళూరు తరువాత హైదరాబాదే ఉండేది. అయితే, ఇప్పుడు నాలుగో స్థానంలో మన ఐటీ సెక్టార్ కొట్టి మిట్టాడుతోంది. వరుసగా దాపురిస్తున్న సంక్షోభాలు రాష్ట్ర ఐటీ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. 2006-07లో ఐటీ రంగంలో జాతీయ వృద్ధి రేటు 33 శాతం ఉండగా అప్పుడు రాష్ట్ర వృద్ధిరేటు 48 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత పరిస్థితులు మారాయి. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2009 సంవత్సరం చివర్లో ప్రారంభమైన తెలంగాణ ఆందోళనలు ఐటీ రంగాన్ని కుదిపేశాయి. అంతే అప్పటి నుంచి రాష్ట్రానికి కొత్త అంతర్జాతీయ కంపెనీలు వచ్చిన దాఖలాలు లేవు.

2010-11 ఆర్థిక సంవత్సరంలో 12.5 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రాష్ట్రప్రభుత్వం. అయితే దీనిలో మూడో వంతు అంటే కేవలం 4.5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. రాజకీయ అనిశ్చితతో రాష్ట్రంలో పెడదామనుకున్న కంపెనీలు ప్రత్యామ్నాయ ప్రాంతాలుగా పూణే, చెన్నైలపై ఆసక్తిని కనబరుస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాలతో చిన్నా-చితకా కంపెనీలు ఏర్పాటైనా అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాయి. చాలా ఐటీ కంపెనీలు హైదరబాద్‌ నుంచి బెంగుళూరుకు బిచాణా ఎత్తేశాయి. అయితే ఇదంతా శాంతి-భద్రతల కోణంలోకి వస్తే..తాజా వచ్చిన ఆమెరికా మార్కెట్ల సంక్షోభం ఎటు వైపు ఎవరెవర్ని కబళిస్తోందో అర్దం కావట్లేదు అంటున్నారు నిపుణులు.

కేంద్రం కూడా దీని ప్రభావం భారీగా ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. తక్షణమే ప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగపోతే..పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుందంటున్నారు నిపుణులు.

Busi_IPO

Busi_IPO

స్టాక్‌ మార్కెట్ల వరుస పతనాలతో ఐపీఓల జోరు కాస్త తగ్గింది. సెబీ అనుమతి ఉన్నప్పటికీ మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌లో ఉండటంతో ఆయా కంపెనీలు ఐపీఓలపై పునరాలోచిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల విస్తరణ కార్యక్రమాలు మరింత ఆలస్యం కానున్నాయి.

ఒకప్పుడు పబ్లిక్‌ ఇష్యూలంటే ఎంతో ఆసక్తి చేపే కంపెనీలు... ప్రస్తుతం ఆ పేరు వింటేనే ఆమడదూరం పరిగెడుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ వరుస పతనాలు సెకండరీ మార్కెట్‌తో పాటూ ఐపీఓలనూ ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో సెబీ అనుమతి ఉన్నప్పటికీ ఐపీఓకు రావాలంటేనే ఆయా కంపెనీలు భయపడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లన్నీ డౌన్‌ట్రెండ్‌లో ఉండటంతో ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన కంపెనీలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. మరోవైపు సెబీ అనుమతి ఉన్నా పబ్లిక్‌ ఇష్యూకు రావాల్సిన దాదాపు 25 కంపెనీలు పరిస్థితులు చక్కబడ్డాక రావాలని ఆలోచిస్తున్నాయి. సెబీ అనుమతి తీసుకున్నా ఏడాదిలోపు ఐపీఓకు రావాల్సిన కంపెనీలు కాలపరిమితి ముగుస్తుండటంతో ప్రస్తుతం రావాలా వద్దా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇష్యూకు రాని కంపెనీల్లో లోధా డెవలపర్స్‌, ఆంబియన్స్‌ రియల్‌ ఎస్టేట్‌, కుమార్‌ అర్బన్‌ డెవలపర్స్‌, నెప్ట్యూన్‌ డెవలపర్స్‌, బీపీటీపీ, రహేజా యూనివర్సల్‌ అండ్‌ లవాసా కార్పొరేషన్‌, స్టెర్‌లైట్‌ ఎనర్జీ, జిందాల్‌ పవర్‌, అవన్తా పవర్‌, ఇండ్‌ భారత్‌ పవర్‌ ఇన్‌ఫ్రాలు ఉన్నాయి.

స్పాట్‌...

ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, యూరోప్‌ సంక్షోభంతో ప్రస్తుతం ట్రేడర్లు, ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్‌కు దూరంగా ఉంటున్నారు. అలాగే బులియన్‌ మార్కెట్‌పై ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం కూడా మరో ప్రధాన కారణం. ఇతర దేశాలతో పోలిస్టే భారత ఆర్థిక వృద్ధి రేటు బలంగా ఉన్నప్పటికీ... అంతర్జాతీయ పరిణామాలు మన మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఐపీఓలు క్లిక్‌ కావడం లేదని విమర్శలు వస్తున్నాయి.

బైట్‌ :

మరోవైపు ఐపీఓలు అట్టర్‌ ఫ్లాప్‌ అవుతోన్న కంపెనీల పరిస్థితి మారటం లేదని విమర్శలు వస్తున్నాయి. కంపెనీ సామర్థ్యం, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌, కంపెనీ మార్జిన్స్‌తో నిమిత్తం లేకుండా తమకు ఇష్టం వచ్చిన రీతిలో కంపెనీలు ప్రీమియం ధరను నిర్ణయిస్తున్నాయి. మార్కెట్‌ మొత్తం స్పెక్యులేటర్స్‌ గుప్పిట్లోకి వెళ్ళడంతో నిజమైన పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయి... మార్కెట్‌ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు.

బైట్‌ :

ఏదైమేనా ఐపీఓలు క్లిక్‌ కాకపోవడంతో మిగతా కంపెనీలు తమ పబ్లిక్‌ ఇష్యూలను వాయిదా వేసుకుంటున్నాయి. దీంతో విస్తరణ కోసం అవసరమైన నిధుల సమీకరణ మరింత ఆలస్యమవుతోంది.

హార్డ్‌డిస్క్‌

హార్డ్‌డిస్క్‌

హార్డ్‌డిస్క్‌ ధరలు దిగిరాకపోవడంతో పర్సనల్‌ కంప్యూటర్ల ధరలకు రెక్కలు వస్తున్నాయి. వరదలతో థాయ్‌లాండ్‌ ఉక్కిరిబిక్కిరి కావడంతో హార్డ్‌డిస్క్‌ల ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గింది. దీంతో గత నాలుగు నెలల్లో హార్డ్‌డిస్క్‌ల ధరలు దాదాపు రెట్టింపు కావడంతో... పర్సనల్‌ కంప్యూటర్స్‌ రేట్లు దాదాపు 15 శాతం వరకు పెరిగాయి.

వాయిస్‌ :
కంప్యూటర్‌కు గుండెకాయ వంటిది హార్డ్‌డిస్క్‌. డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ లేకపోవడంతో గత నాలుగు నెలల్లో హార్డ్‌డిస్క్‌ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. చైనా తర్వాత హార్డ్‌డిస్క్‌లను ఎక్కువగా తయారు చేసే థాయ్‌లాండ్‌ను ఇటీవల వరదలు ముంచెత్తడమే దీనికి ప్రధాన కారణం. ప్రపంచంలో వినియోగిస్తోన్న హార్డ్‌డిస్క్‌లలో థాయ్‌లాండ్‌ వాటా 40 శాతం పైనే. వరదలు ముంచెత్తడంతో వెస్ట్రన్‌ డిజిటల్‌, సీగేట్‌, తోషిబా వంటి అగ్రశేణి కంపెనీలు తమ సరఫరాను అమాంతంగా తగ్గించాయి. దీనికితోడు డాలర్‌ మారకం విలువ కూడా పెరగడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో గత సెప్టెంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం హార్డ్‌డిస్క్‌ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి.

స్పాట్‌...

హార్డ్‌డిస్క్‌ ధరలు రెట్టింపు కావడంతో విడిభాగాలను విక్రయించే అడ్రెసబుల్‌ మార్కెట్‌ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. విడిభాగాలతో తయారు చేసే పర్సనల్‌ కంప్యూటర్స్‌ ప్రతినెలా దాదాపు 40 వేలకు పైగా అమ్ముడుపోగా ప్రస్తుతం అమ్మకాలు సగానికి సగం తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. గతంలో హార్డ్‌డిస్క్‌ 18వందల్లోపే లభించేదని ప్రస్తుతం ఇది దాదాపు 4 వేలకు చేరిందని, దీంతో కంప్యూటర్ల ధరలను పెంచాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు.

బైట్‌ : వ్యాపారి

గతంలో మంచి కాన్ఫిగరేషనల్‌ కలిగిన కంప్యూటర్లు 20 వేల రూపాయల లోపే లభించేవి. హార్డ్‌డిస్క్‌ ధరలు పెరగడంతో ప్రస్తుతం ఈ కంప్యూటర్ల ధరలు 23 వేల రూపాయలకు పెరిగాయి. దీంతో కంప్యూటర్స్‌ కొనుగోళ్ళను మరో రెండు నెలలు వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్టు కస్టమర్లు అంటున్నారు.

బైట్‌ : కస్టమర్‌

ఏదైమైనా హార్డ్‌డిస్క్‌ రేట్స్‌ హైరేంజ్‌లో ఉండటంతో కంప్యూటర్స్‌ ధరలు అమాంతం పెరిగాయి. ఈ ధరలు మరో రెండు నెలల్లో దిగివస్తాయని వార్తలు వస్తున్నా... బడ్జెట్లో కేంద్రం కొత్తగా విధించే సుంకాలతో ధరలు తగ్గుతాయో లేదా మరింత ప్రియమవుతాయో తెలియాలంటే మరో రెండునెలలు ఆగాల్సిందే...!

ఎండ్‌ విండ్‌ స్పాట్‌...



అడ్ వొలెరమ్ సిస్టమ్‌ బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు

అడ్ వొలెరమ్ సిస్టమ్‌ బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు

యాంకర్‌ :
బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు రానున్నాయి. గత నెల రోజులుగా దిగివస్తోన్న బంగారం, వెండి ధరలు... కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మళ్ళీ భగ్గుమననున్నాయి. దీనికితోడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్‌ ప్రారంభం కానుండటంతో త్వరలో బంగారం ధర 30 వేల రూపాయలను క్రాస్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

వాయిస్‌ :
బంగారం మళ్ళీ కొత్త రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతోంది. గత నెల రోజులుగా శాంతించిన బంగారం, వెండి ధరలు త్వరలోనే భారీగా పెరిగే ఛాన్స్‌ ఉంది. బంగారం, వెండిలపై విధించే కస్టమ్స్‌, ఎక్సైంజ్‌ సుంకాల విధానాన్ని కేంద్రం మార్చడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటివరకు ఫిక్స్‌డ్‌గా వసూలు చేస్తోన్న సుంకం స్థానంలో విలువ ఆధారంగా నిర్ణయించే సుంకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీంతో వెండి, బంగారం ధరలు చుక్కలనంటే అవకాశముంది.

స్పాట్‌...

అడ్ వొలెరమ్ సిస్టమ్‌లో వస్తువుల విలువను బట్టి పన్ను మొత్తం కూడా మారుతుంది. ఫిక్స్‌డ్‌ సిస్టమ్‌ నుంచి ఆడ్‌ వొలెరమ్‌ విధానానికి మారడం వల్ల కేవలం రెండు నెలల్లోనే సర్కారు ఖజానాకు అదనంగా 600 కోట్ల రూపాయల ఆదాయం జమకానుంది. సుంకాల్లో మార్పు వల్ల పది గ్రాముల బంగారం 250 రూపాయలు, కిలో వెండి దాదాపు 16 వందలు పెరిగే ఛాన్స్‌ ఉంది. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి ఈ భారాన్ని చివరకు మోయాల్సింది కస్టమర్లే. ధరతో పాటే సుంకం.. ఈ కొత్త విధానంతో అంతర్జాతీయ మార్కెట్లో వెండి, బంగారం రేటు పెరిగినప్పుడల్లా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు కూడా పెరుగుతాయి. ఇప్పటి వరకు బంగారంపై పది గ్రాములకు 300 రూపాయలు, కిలో వెండి దిగుమతిపై 1,500 రూపాయల స్థిర సుంకాన్ని వసూలు చేస్తున్నారు. ఇకపై బంగారంపై దాని విలువలో 2 శాతాన్ని, వెండి విషయంలో 6 శాతాన్ని దిగుమతి సుంకంగా వసూలు చేస్తారు. వజ్రాలపై కూడా 2 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేయనున్నారు. ఎక్సైజ్ సుంకాల విషయానికి వస్తే బంగారంపై 10 గ్రాములకు 1.5 శాతం, వెండిపై 4 శాతం సుంకాన్ని వసూలు చేస్తారు. ఇప్పటి వరకు పది గ్రాముల బంగారానికి 200 రూపాయల ఎక్సైజ్, కిలో వెండిపై 1,000 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నారు.


ఏదేమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు రానున్నాయి. ధరలు పెరగటం ఇన్వెస్టర్లలో ఆనందం కలిగిస్తున్నా... ఆర్నమెంట్ గోల్డ్ కొనేవారికి మాత్రం ఇది మింగుడు పడని విషయమే మరి...

ఫుడ్‌ 360 డిగ్రీస్‌

బ్యాంగ్‌ : ఫుడ్‌ 360 డిగ్రీస్‌
బీజీ : ఫుడ్‌ 360 డిగ్రీస్‌

యాంకర్‌ :
ఆధునిక వ్యవసాయానికి అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన ఫిక్కీ ఫుడ్‌ 360 డిగ్రీస్‌ సదస్సు సక్సెస్‌ అయింది. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, రాజకీయ నాయకులతో పాటు దాదాపు 2 వేల మంది హాజరయ్యారు. వ్యవసాయాభివృద్ధిలో భారత్‌ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుందని ఈ సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు.

వాయిస్‌ :
వ్యవసాయం మన జనాభాలో అత్యధికులకు జీవనాధారం. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి, లేదా జీడీపీలో 22 శాతం వాటా ఉన్న వ్యవసాయానికి మన ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యత అతి స్వల్పం. దేశ జనాభాలో సుమారుగా 60 శాతం ప్రజలు తమ జీవనాధారం కోసం ఆధారపడే వ్యవసాయానికి, వ్యవసాయ అధారిత పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్లు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ - ఫిక్కీ... ఫుడ్‌ 360 డిగ్రీస్‌ పేరుతో ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో రెండురోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది.


స్పాట్‌...

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి తమ ప్రభుత్వం ఎంతో చేయూత నిస్తోందని అన్నారు. అయితే ప్రస్తుతం రైతులు మద్దతు ధర అందక ఇబ్బందులు పడుతున్నారని, వారికి తమ ప్రభుత్వం తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఒకవైపు నూనె గింజల పంటకు మద్దతు ఇవ్వలేని ప్రభుత్వాలు, ఇతర దేశాల నుంచి మాత్రం 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దిగుమతి చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కాటన్‌, పండ్లు, కూరగాయలకు కూడా ఉందని, గోడౌన్లలో ధాన్యం ముక్కిపోతోందని, తాము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

బైట్‌ : కిరణ్‌ కుమార్‌ రెడ్డీ, ముఖ్యమంత్రి

ఈ సదస్సుకు హాజరైన భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో కోల్డ్‌ స్టోరేజీలను, ఆర్‌బెస్టింగ్‌ ప్రాసెస్‌లు, వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయిస్తోందని గీతారెడ్డి అన్నారు.

బైట్‌ : గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖా మంత్రి

360 డిగ్రీస్‌ పేరుతో హైదరాబాద్‌ ఇంటర్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశానికి జాతీయ స్థాయిలోని శాస్త్రవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. భవిష్యత్తులో వ్యవసాయాభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించనుందని నిపుణులు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉందని ఫిక్కీ రాష్ట్ర కౌన్సిల్‌ కో-ఛైర్మన్‌ జే.ఏ. చౌదరి అన్నారు.

బైట్‌: జె.ఏ.చౌదరి, కో-ఛైర్మన్‌, ఫిక్కీ రాష్ట్రకౌన్సిల్‌

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో సుంకాలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించడానికి కేంద్రం కృషి చేయాలని ఈ సదస్సులో పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గ్లోబలైజేషన్‌తో ఫుడ్‌ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రభుత్వం అగ్రీ బిజినెస్‌కు మరిన్ని రాయితీలు ప్రకటిస్తే ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై అవగాహన కోసం ఫిక్కీ ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలని వారు అంటున్నారు.

బైట్‌ :
బైట్‌ :

రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మొత్తం 53 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో 30 కంపెనీలు పాల్గొనగా... దాదాపు 5 వందల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఈ సదస్సుకు రైతులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ నిపుణులు, మొక్కల పెంపకందారులు, ఎగుమతిదారులు, పరిశోధకులు, రాజకీయనాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన 2 వేల మంది సందర్శకులు హాజరయ్యారు.
స్పాట్‌...
యాంకర్‌ :
ఫుడ్‌ 360 డిగ్రీస్‌లో ఇప్పుడో బ్రేక్‌ తీసుకుందాం.
-------------
సెకండ్‌ పార్ట్‌:
యాంకర్‌ :
వెలకమ్‌ టూ ఫుడ్‌ 360 డిగ్రీస్‌
యాంకర్‌ : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ కేటగిరీల్లో ఫిక్కీ అవార్డులను ప్రధానం చేసింది. ఇందులో భాగంగా న్యూజెన్‌ హెర్బల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ బి.రవీంద్రనాథ్‌ బెస్ట్‌ స్టార్ట్‌ అప్‌ అవార్డును అందుకున్నారు.

వాయిస్‌ : 2011-12 సంవత్సరానికిగాను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ కేటగిరీల్లో ఫిక్కీ అవార్డులను ప్రకటించింది. బెస్ట్‌ ఎంఎస్‌ఈ, బెస్ట్‌ బ్రాండ్‌, బెస్ట్‌ స్టార్‌అప్‌, బెస్ట్‌ ఎన్నోవేటివ్‌ పురస్కారాలను ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రధానం చేశారు. ఇందులో భాగంగా న్యూజెన్‌ హెర్బల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ బి.రవీంద్రనాథ్‌ బెస్ట్‌ స్టార్ట్‌ అప్‌ అవార్డును అందుకున్నారు.

స్పాట్‌ : ఎండీగారి అవార్డు స్పాట్‌ వేసుకోగలరు.
బైట్‌ : స్పెషల్‌ బైట్‌ ఉంటే వేసుకోగలరు. లేకుండా అవార్డ్‌ ఫంక్షన్‌లో ఉన్న బైట్‌ వాడాలి.

- మిగిలిన అవార్డుల వివరాలు - కంపెనీల వివరాలు ()

యాంకర్‌ :
వ్యవసాయ వినిమయ ఉత్పత్తుల నుంచి ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సదస్సు ఒక వేదికైంది. ప్రస్తుతం దేశీ జీడీపీలో డైరీ, ఫిషరీస్‌, ఆర్టికల్చర్‌కు 40 శాతం వాటా ఉండటంతో, ఈ రంగానికి నిధుల కేటాయింపును మరో ఐదారు శాతం పెంచితే ఎక్కువ లాభాలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. సో... ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బ్యాంగ్‌ :

భారతి ఎయిర్‌టెల్‌ మొబిట్యూడ్-2011

భారతి ఎయిర్‌టెల్‌ మొబిట్యూడ్-2011

టెక్నాలజీని వాడటంలో భారతీయులు చరిత్రను తిరగరాస్తున్నారు. కమ్యూనికేషన్‌ కోసం వినియోగించే మొబైల్‌ ఫోన్స్‌ నుంచి కుప్పలు తెప్పులుగా వీడియోలు, సాంగ్స్‌, ఫోటోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. మొబిట్యూడ్-2011 పేరుతో దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం రుజువైంది. వరుసగా మూడో ఏడాది నిర్వహించిన ఈ సదస్సులో 170 మిలియన్‌ కస్టమర్లు కేవలం ఏడాది వ్యవధిలో 2 కోట్ల ఫోటోలను డౌన్‌లోడ్‌ చేశారు.

వాయిస్‌:
దేశీయ అగ్రశ్రేణి టెలికాం కంపెనీ భారతి ఎయిర్‌టెల్‌ ... మొబిట్యూడ్‌ 2011 వార్షిక సర్వేను విడుదల చేసింది. వరుసగా మూడో ఏడాది మొబైల్‌ వైఖరి ఫలితాలను క్రోడీకరించి ఎయిర్‌టెల్‌ ఈ సర్వేను నిర్వహించింది. టాప్‌ సినీస్టార్స్‌, స్పోర్ట్స్‌ స్టార్స్‌, మ్యూజిక్‌ డౌన్‌లోడ్‌ సెగ్మెంట్లో నిర్వహించే ఈ సర్వే వివరాలను ప్రతి క్యాలెండర్‌ ఇయర్‌ చివర్లో భారతి ఎయిర్‌టెల్‌ విడుదల చేస్తోంది. ఈ సర్వేను దాదాపు 170 మిలియన్ల కస్టమర్ల ప్రాధాన్యతల ఆధారంగా నిర్వహించారు.

2011లో ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నుంచి దాదాపు 150 మిలియన్‌ మొబైల్‌ మ్యూజిక్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ ఏడాది రావన్‌ సినిమాలోని "చమక్‌ చలో" సాంగ్‌, వీడియోలు ఈ ఏడాది ఎక్కువ డౌన్‌లోడ్‌ అయ్యాయి. దక్షిణాధిలో సంచలనం సృష్టిస్తోన్న 'కొలవెరి డి' సాంగ్‌... ప్రారంభమైన 18 రోజుల్లోనే 2 లక్షల 10 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక తెలుగు సాంగ్స్‌ విషయానికి వస్తే "ఓ మై ఫ్రెండ్‌" మూవీలోని టైటిల్‌ సాంగ్‌ ఎక్కువగా పాపులర్‌ అయింది.

స్పాట్‌ : ఓ మై ఫ్రెండ్‌ మూవీ టైటిల్‌ సాంగ్‌

గత ఏడాది కాలంగా దాదాపు 2 కోట్ల ఫోటోలు, వాల్‌పేపర్స్‌ను ఎయిర్‌టెల్‌ వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక ఫిమేల్‌ సెలెబ్రిటీస్‌లో ఇండియన్‌ హార్ట్‌ బీట్‌ కత్రినా కైఫ్‌ ఇమేజెస్‌ను కస్టమర్లు భారీగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మెల్‌ సెలబ్రిటీస్‌లో షారుక్‌ఖాన్‌, టాప్‌ డౌన్‌లోడ్‌ సాంగ్స్‌లో చమక్‌ చలో అగ్రస్థానాన్ని ఆక్రమించాయి. స్పోర్ట్స్‌ స్టార్స్‌లో సచిన్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలువగా... ధోని, విరాట్‌ కోహ్లీ, రోజర్‌ ఫెడరర్‌, సానియా మిర్జాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఎండ్‌ విత్‌ స్పాట్‌...

బ్యాంకులు గోల్డ్‌ లోన్లు

బ్యాంకులు గోల్డ్‌ లోన్లు

గోల్డ్‌పై పెరుగుతోన్న ఆదరణను క్యాష్‌ చేసుకోవడానికి బ్యాంకులు కసరత్తు ప్రారంభించాయి. ఇందులో భాగంగా పలు బ్యాంకులు గోల్డ్‌లోన్‌ స్క్రీమ్‌లను ప్రారంభించి ఏకంగా గోల్డ్‌షాపులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. అతితక్కువ వడ్డీరేట్లతో కస్టమర్లకు గాలం వేసి తమ బిజినెస్‌ను మరింత పెంచుకోవాలనే ఆలోచనలో బ్యాంకులు ఉన్నాయి.

పెరుగుతోన్న పోటీని తట్టుకోవడానికి రోజుకో కొత్త ఆలోచన చేస్తున్నాయి బ్యాంకులు. ఇప్పటివరకు రియాల్టీ, వాహన తదితర రంగాలపై ఫోకస్‌ చేసిన బ్యాంకులు... ఆ రంగాలు ఢీలాగా ఉండటంతో తాజాగా ఇతర సెగ్మెంట్‌ల వైపు దృష్టిసారించాయి. ధరలు హై రేంజ్‌లో ఉండటంతో బంగారం జనం కొనడానికి తిప్పలు పడుతోన్న వైనాన్ని గుర్తించిన బ్యాంకులు గోల్డ్‌ లోన్లను ఇవ్వడానికి ఎగబడుతున్నాయి.

మూడేళ్ళ క్రితం గోల్డ్‌ లోన్‌ బిజినెస్‌లోకి ప్రవేశించిన దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బంగారంపై రుణాలను విరివిగా ఇస్తోంది. గత ఏడాదికాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెట్టింపు స్థాయిలో రుణాలు ఇచ్చింది. ఇటీవలే గోల్డ్‌లోన్‌ బిజినెస్‌లోకి ప్రవేశించిన యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా గోల్డ్‌ లోన్స్‌ ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మిగతా బ్యాంకులు కూడా ఇదే స్థాయిలో రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధంచేశాయి. ఫ్లోటింగ్‌ ఇంటరెస్ట్‌ బేసిస్‌లో గోల్డ్‌లోన్స్‌పై 11 నుంచి 15 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయనున్నాయి.

మిడిల్‌క్లాస్‌ పీపుల్స్‌ను ఆకర్షించేందుకు బంగారం కొనుగోలుపై రుణం ఇవ్వనున్నట్టు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రకటించింది. దీనికోసం ఈ సంస్థ ఖజానా జువెలరీ, కల్యాణ్‌ జువెల్సర్స్‌, ఆర్‌కేఎస్‌ గ్రాండ్‌, సువర్ణ లక్ష్మి జువెలర్స్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఎస్‌బీహెచ్‌ ప్రకటించింది. ఫ్లోటింగ్‌ ఇంటరెస్ట్‌ ప్రకారం రుణాలను ఇవ్వనున్నట్టు, కస్టమర్లు గరిష్టంగా 60 నెలలు వాయిదాలను కట్టాలని ఎస్‌బీహెచ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.భగవంతరావ్‌ అంటున్నారు.


కాలంతో పాటు మనం మారాలి అన్నట్టుగా ఉంది ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితి. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు రోజుకో కొత్త పథకానికి బ్యాంకులు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా వచ్చిన గోల్డ్‌లోన్‌ స్క్రీమ్‌ ఏ స్థాయిలో సక్సెస్‌ అవుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..!

ఆటో మొబైల్ 2011

ఆటో మొబైల్ 2011

ఈ ఏడాది ఆటో మొబైల్ రంగానికి జరిగినంత నష్టం ఏ రంగానికి జరగలేదనే చెప్పాలి. 2011 ఆటో సెక్టార్‌కు చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. ఓవరాల్‌గా ఆటో సెక్టార్ గత ఏడాదితో పోలిస్తే 5శాతం మేర పడిపోయింది. దేశీయంగా ఆటో రంగం ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంది. నవంబర్, డిసెంబర్లలో పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపించినా ...అంతకు ముందు మాత్రం సేల్స్ లేక వెలవెల పోయింది. దేశీయంగా మారుతీ సమ్మె ఆటో మొబైల్ రంగాన్ని మరింత దెబ్బతీసింది. ఆర్‌బీఐ గత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 13సార్లు వడ్డీరేట్లు పెంచడం, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు రూపాయి బలహీనపడటం వంటి అంశాలెన్నో ఆటో రంగాన్ని కుదేలు చేసాయి. నవంబర్, డిసెంబర్లలో పండగ సీజన్ కావడంతో సేల్స్ కాస్త ఆశాజనకంగా ఉన్నా వచ్చే ఏడాది చిన్న కార్ల ధరలు 5వేల నుంచి 25 వేల రూపాయలు దాకా పెరగటం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులంటున్నారు.

డాలర్ వాల్యూ ఈ ఏడాది 15 నుంచి 20 వరకూ పెరుగుతూ వచ్చింది. దీంతో ఇంపోర్ట్ కాస్ట్ భారీగా పెరగటంతో ఆటో మొబైల్ రంగానికి చావు దెబ్బతగిలినట్లైంది. ఒక్క మారుతీ కంపెనీకే ప్రొడక్షన్ కాస్ట్ 20 శాతం మేర పెరిగిందంటే డాలర్ తెచ్చిన తంట ఎంతో అర్ధమౌతుంది. దేశీయంగా ఆటో సెక్టార్‌లో అగ్రగామి అయిన మారుతీ 2011లో సుమారు 20శాతం మేర డీగ్రోత్ నమోదు చేసింది. కార్మికుల సమ్మెతో కొన్నాళ్ళు ఫ్యాక్టరీ మూసివేయవలసి రావడం మారుతీకి పెద్ద దెబ్బనే చెప్పాలి.

పెట్రోల్ ధరలు పెరగటం, డీజిల్‌కి డిమాండ్ పెరగటంతో కార్ల కంపెనీలు సీఎన్‌జీ వెహికిల్స్‌పై దృష్టిసారిస్తున్నాయి. నగరాల్లో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు పెంచితే సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం లేకపోలేదు.


2011 మిగిల్చిన చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆటో రంగం వచ్చే ఏడాది మరిన్ని సవాళ్ళను ఎదుర్కోబోతోంది. వడ్డీరేట్ల పెరుగుదల, ప్రభుత్వం వచ్చే ఏడాది లైఫ్ టాక్స్‌ను పెంచుతుందనే వార్తలు ఆటో రంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

వొడాఫోన్ విజయం

వొడాఫోన్ విజయం


ముంబై హైకోర్టు తీర్పును కొట్టి వేసిన సుప్రీం
దేశం వెలుపల జరిగిన డీల్‌పై పన్ను విధించే అధికారం ఐటి శాఖకు లేదని స్పష్టీకరణ
11 వేల కోట్ల రూపాయల భారీ పన్ను బకాయి కేసులో ఐటి శాఖ వాదన వీగిపోయింది. ఈ కేసులో వొడాఫోన్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పు వల్ల ఇదే తరహా డీల్స్‌కు సంబంధించి ఆదాయం పన్ను శాఖ భారీ మొత్తంలో ఆశిస్తున్న రాబడి కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ: వొడాఫోన్-హచీసన్ డీల్‌కు సంబంధించి సుదీర్ఘంగా సాగిన పన్ను బకాయి కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఎట్టకేలకు వొడాఫోన్‌కు అనుకూలంగా వచ్చింది. ఈ డీల్‌కు సంబంధించి ఆదాయం పన్ను శాఖ డిమాండ్ చేస్తున్న 11 వేల కోట్ల రూపాయల బకాయిలు వొడాఫోన్ చెల్లించాల్సిందేనంటూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. డీల్ కుదుర్చుకున్న రెండు కంపెనీలు హచీసన్-వొడాఫోన్ ఇంటర్‌నేషనల్ హోల్డింగ్స్.. భారత భూభాగం ఆవల ఏర్పాటైన కంపెనీలైనందున ఈ వ్యవహారం ఆదాయం పన్ను శాఖ పరిధిలోకి రాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ స్వతంతర్ కుమార్, జస్టిస్ రాధాకృష్ణన్ ఉన్నారు. జస్టిస్ రాధాకృష్ణన్ మిగిలిన ఇద్దరు న్యాయమూర్తుల తీర్పుతో ఏకీభవిస్తూ విడిగా తన తీర్పును వెలువరించారు. వొడాఫోన్ జమచేసిన 2500 కోట్ల రూపాయల డిపాజిట్‌ను 4 శాతం వడ్డీతో సహా రెండు నెలల్లో వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా ఐటి శాఖను సుప్రీంకోర్టు న్యాయమూర్తు లు ఆదేశించారు. అదే విధంగా కంపెనీ ఇచ్చిన 8500 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీని కూడా నాలుగు వారాల్లో తిరిగి ఇచ్చివేయాల్సిందిగా సుప్రీం కోర్టు రెజిస్ట్రీని న్యాయమూర్తులు ఆదేశించారు. వొడాఫోన్ హర్షం సుప్రీం కోర్టు తీర్పుపై వొడాఫోన్ హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు భారతీయ వ్యవస్థపై తమ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని వొడాఫోన్ పేర్కొంది. భారతీయ వినియోగదారుల లబ్దికోసం భారత్‌లో తమ ఇన్వెస్ట్‌మెంట్లను మరింత పెంచుతామని, వొడాఫోన్ సిఇఒ విటోరియో కొలో తెలిపారు. తాము మొదటి నుంచి హ చీసన్ - వొడాఫోన్ డీల్‌పై పన్ను విధించే అధికారం భారత్‌కు లేదని చెబుతున్నామని తమ మాటే చివరకు నెగ్గిందని ఆయన చెప్పారు. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లకు మేలు.. వొడాఫోన్ కేసులో సుప్రీం కోర్టు తీర్పువల్ల విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు అంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల ప్రభుత్వం, తాత్కాలికంగా భారీ రాబడి అవకాశం కోల్పోయేమాట నిజమే అయినా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఈ పరిణామం సానుకూల సంకేతాలను పంపుతుందని వారు భావిస్తున్నారు. సుదీర్ఘకాలంగా కోర్టులో నానుతు న్న వొడాఫోన్ కేసు, బహుళజాతి కంపెనీల ఇ న్వెస్ట్‌మెంట్స్ విషయంలో అనిశ్చితికి కారణమైననట్టుగా వారు చెబుతున్నారు. ఇలాంటి మరికొన్ని కేసుల్లో కూడా బహుళజాతి కంపెనీలకు ఊరట లభిస్తుందని వారు అంటున్నారు. వొడాఫోన్ తరహాలోనే దేశీయ కం పెనీలకు సంబంధించి విదేశాల్లోనే షేర్లు చేతులు మారిన మరికొన్ని డీల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఫోస్టర్‌ను ఎబి మిల్లర్ కొ నుగోలు చేయడం, హైదరాబాద్ సంస్థ శాంతా బయోటెక్‌ను సనోఫీ అవెంటీస్ చేజిక్కించుకోవడం, కెయిర్న్ ఇండియాను వేదాంత సొంతం చేసుకోవడం వగైరా ఉన్నాయి. సర్కారు కలవరం వొడాఫోన్ పన్ను బకాయిల కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రభుత్వ రాబడిపై ఈ తీర్పు ప్రభావాన్ని, పర్యవసానాలను అంచనా వేసేందుకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ శుక్రవారం సమావేశమయ్యారు. కోర్టు తీర్పువల్ల ఒడాఫోన్ కేసులోనే సర్కారుకు 11 వేల కోట్ల రూపాయల రాబడి అవకాశం పోయింది. ఇలాంటివే మరికొన్ని ఇతర కేసుల్లోనూ రావాల్సిన రాబడికి ప్ర భుత్వం నీళ్లు వదులుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా సుప్రీం కోర్టు తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా 10 మంది నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.


అసలేం జరిగింది?


వొడాఫోన్ పన్ను బకాయి కేసులో చాలా మలుపులు ఉన్నాయి. ప్రస్తుత వొడాఫోన్ గతంలో హచీసన్ - ఎస్సార్ టెలికామ్ పేరుతో ఉండేది. ఈ కంపెనీలో మెజార్టీ వాటాదారుగా ఉన్న హాంకాంగ్ సంస్థ హచీసన్ నుంచి 67 శాతం వాటాను వొడాఫోన్ 2007 మే నెలలో 1,120 కోట్ల డాలర్లతో కొనుగోలు చేసింది. వొడాఫోన్ ఇంటర్‌నేషనల్ హోల్డింగ్స్ ఈ షేర్లను నెదర్లాండ్స్ కేమన్ ఐలాండ్స్‌కు చెందిన తన అనుబంధ కంపెనీల ద్వారా కొనుగోలు చేసింది. భారీ మొత్తం చేతులు మారిన ఈ డీల్‌లో క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఎగవేశారన్నది ఐటి శాఖ ఆరోపణ. హచీసన్‌కు డీల్ విలువను చెల్లించేప్పుడే వొడాఫోన్ పన్నును మూలంలో మినహాయించుకుని తమకు చెల్లించకపోవడంపై ఐటి శాఖ కన్నెర్ర చేసింది.

పన్ను, పెనాల్టీలు అంతా కలిపి 11 వేల కోట్ల రూపాయలను కట్టాల్సిందిగా వొడాఫోన్‌కు నోటీసులు జారీ చేసింది. డీల్ భారత్ భూభాగం వెలువల రెండు కంపెనీల మధ్య జరిగిందని దీనితో ఐటి శాఖకు నిమిత్తం లేదని తాము పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదని వొడాఫోన్ (ఇండియా) వాదించింది. డీల్ ఎక్కడ జరిగినా, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీకి సంబంధించిన డీల్ కనుక పన్ను చెల్లించాల్సిందేనని ఐటి శాఖ స్పష్టం చేసింది. డీల్ జరిగింది హచీసన్-వొడాఫోన్ ఇంటర్‌నేషనల్ మ«ధ్యే అయినప్పటికీ వొడాఫోన్ ఇండియాను డిఫాల్డ్ అసెసీగా పరిగణిస్తూ పన్ను బకాయి చెల్లింపునకు ఐటి శాఖ నోటీసు జారీ చేసింది.

అప్పటి నుంచి వరస పరిణామాలు..... 2008 : తమను డిఫాల్ట్ అసెసీగా పరిగణిస్తూ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ నోటీసులను సవాలు చేస్తూ వొడాఫోన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. వొడాఫోన్ అప్పీల్‌ను డిసెంబర్‌లో ముంబై హైకోర్టు కొట్టివేసింది. 2009: బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జనవరిలో వొడాఫోన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు కూడా వొడాఫోన్ అప్పీల్‌ను కొట్టివేస్తూ, హచీసన్ - వొడాఫోన్ లావాదేవీపై పన్ను వేసే అధికారం ఉందా లేదా తేల్చి చెప్పాలని ఐటి శాఖను ఆదేశించింది. అదే సమయంలో ఐటి శాఖ నిర్ణయం వ్యతిరేకంగా వస్తే అప్పుడు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని వొడాఫోన్‌కు సలహా ఇచ్చింది.

2010: హెచీసన్-ఎస్సార్ డీల్‌లో పన్ను విధించే పూర్తి అధికారాలు తమకు ఉన్నాయని ఐటి శాఖ స్పష్టం చేసింది. ఈ డీల్‌లో వొడాఫోన్ ఇంటర్‌నేషనల్ హోల్డింగ్ అసలు అసెసీ అయినప్పటికీ వొడాఫోన్‌ను డిఫాల్డ్ అసెసీగా పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వొడాఫోన్ ముంబై హైకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు వొడాఫోన్ అభ్యంతరాలను తోసిపుచ్చుతు, డీల్ సారం హచీ సన్-ఎస్సార్‌లో యాజమాన్య నియంత్రణ మారడమేననీ, ఈ డీల్‌లో చేతులు మారిన సొమ్ము మూలం భారత్‌లోనే ఉందని సెప్టెంబర్ 8న స్పష్టం చేసింది. దీనిపై వొడాఫోన్ మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లింది.

హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరిస్తూ, అసలు వొడాఫోన్ ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో లెక్కతేల్చాల్సిందిగా ఐటి శాఖను సెప్టెంబర్ 14న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఐటి శాఖ నుంచి సమాచారం అందిన తర్వాత, నవంబర్ 15న కేసు విచారణ ప్రారంభానికి ముందు 2500 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని 8500 కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని వొడాఫోన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. 2011: ఆగస్టు నుంచి కేసులో విచారణ ప్రారంభమైంది. అక్టోబర్ 19న సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.

Monday, January 2, 2012

సహాయంతో "వికాస్‌"ను బతికిద్దాం

సహాయంతో "వికాస్‌"ను బతికిద్దాం

బుడిబుడి అడుగులతో పాఠశాలకు వెళ్ళి విద్య అభ్యసించాల్సిన ఐదేళ్ళ వికాస్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని "రెయిన్‌బో" ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధికి తోడు బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌ రావడంతో వికాస్‌ కోమాలోకి వెళ్ళి చావుతో పోరాడుతున్నారని వికాస్‌ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న "సేవ్‌ ఏ లైఫ్‌" ఫౌండేషన్‌ తన వంతుగా రూ.25,000 విరాళాన్ని ప్రకటించి ఆ చెక్కును నల్గొండ పార్లమెంట్‌ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతుల మీదుగా వికాస్‌ తల్లిదండ్రులకు ఈరోజు అందించారు. వికాస్‌కు ఖరీదైన వైద్యసేవలు అందిస్తుండటంతో రూ.7 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఇంకా రూ.10 లక్షలు కావాలని వికాస్‌ తల్లిదండ్రులు ఎంపీకి వివరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు ఇప్పించి, వికాస్‌కు వైద్య సేవలు అందించాలని ఫౌండేషన్‌ ఎంపీని కోరింది. అందుకు ఎంపీ అంగీకరించారు. వికాస్‌ను కాపాడేందుకు "సేవ్‌ ఏ లైఫ్‌" ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ఫౌండేషన్‌ మరిన్ని ప్రాణాలను కాపాడాలని కోరారు. వికాస్‌కు సహాయం అందించాలనుకునే వారు 9010807788 నెంబరును సంపద్రించాలని ఫౌండేషన్‌ అధ్యక్షులు శ్రీధర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు శ్రీరామశర్మ, హనుమాండ్లు, గుర్రం సుదర్శన్‌, సుభాష్‌రెడ్డి, బుర్రా శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.