Wednesday, March 14, 2012

రైల్వే బడ్జెట్‌ 2012-13 హైలైట్స్‌


* ఇది కామన్ మ్యాన్ బడ్జెట్ : త్రివేది
* సామాన్యులపై ఎలాంటి భారం లేదు
* మౌలిక సదుపాయాలకు పెద్దపీట : త్రివేది
* భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించటమే మా లక్ష్యం : త్రివేది
* రైలు ప్రమాదాల నివారణకు అంతర్జాతీయ స్థాయిలో చర్యలు
* రైల్వే ప్రమాదాలు తగ్గించాం..ఇంకా తగ్గిస్తాం : త్రివేది
* రైల్వే భద్ర్రతపై కమిటీ వేశాం
* 60-70 శాతం వరకు వచ్చే ఐదేళ్ళలో లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాల నివారణకు రైల్ రోడ్డు ప్రత్యేక విభాగం ఏర్పాటు : త్రివేది
* ప్రమాదాల నివారణకు రైల్వే సేఫ్టీ అథారిటీ ఏర్పాటు
* వచ్చే ఐదేళ్ళలో రైల్వే ఆధునీకరణకు రూ.7.35 లక్షల కోట్లు
* ఇందులో కేంద్ర బడ్జెట్ నుంచి 2.5 కోట్ల మద్దతు ఆశిస్తున్నాం
* రైల్వే సేఫ్టీ ఫండ్ నుంచి రూ.16,842 కోట్లు
* ఎక్స్‌ట్రా బడ్జెట్ సపోర్ట్ రూ.2.18 లక్షల కోట్లు
* ఆధునీకరణ అమలు పర్యవేక్షణకు ప్రధాని సాంకేతిక సలహాదారు పిట్రోడా ప్రాతినిధ్యం : త్రివేది
* రిసెర్చ్ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్ ప్రతిపాదన : త్రివేది
* వచ్చే పదేళ్ళలో రైల్వే ఆధునీకరణకు రూ.14 లక్షల కోట్లు అవసరమవుతాయి - త్రివేది
* లక్ష కోట్లతో చేపట్టిన 487 ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి
* ప్రధాని రైల్ స్కీం నుంచి రూ. 5 లక్షల కోట్లు కేటాయించాలి
* రైలు ప్రమాదాలు పూర్తిగా తగ్గించాలనేది మా లక్ష్యం : త్రివేది
* ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూలో రైలు సేవలు విస్తరణపై ప్రత్యేక దృష్టి :త్రివేది
* 2012-13 రైల్వే బడ్జెట్ రూ. 60,100 కోట్లు
* రైల్వే ట్రాక్స్, బ్రిడ్జీలు, టెలికమ్యూనికేషన్, స్టేషన్ ఆధునీకరణకు ప్రాధాన్యం : త్రివేది
* 19 వేల కి.మీ రైల్వే లైన్లు, 11,200 బ్రిడ్జీల ఆధునీకరణ
* ఆధునిక టెక్నాలజీతో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ
* హై స్పీడ్ రైళ్ళ కోసం ప్రత్యేక కోచ్‌లపై దృష్టి
* 160 కి.మీ పైగా వేగంతో నడిచే రైళ్ళపై దృష్టి
* ఇండియన్ రైల్వేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
* కేరళలో 4 రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు
* కాశ్మీర్ వ్యాలీని కలిపే 11 కి.మీ భూగర్భ మార్గం పూర్తి
* ఈ ఏడాది 725 కొత్త మార్గాల ఏర్పాటుపై దృష్టి
* సర్వీలు పూర్తైన నివేదికలను ప్లానింగ్ కమిషన్‌కు పంపాం
* పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన కొత్త మార్గాలకు సర్వేలు చేపట్టాలని ఆదేశం
* కొత్త రైల్వే లైన్ల కోసం రూ. 6,278 కోట్లు కేటాయింపు
* 1,017 కి.మీ, 8 వేల కి.మీ గేజ్ మార్పిడి కోసం 1,950 కోట్లు కేటాయింపు
* సెంట్రల్ రైల్వే అంతటా డబ్లింగ్ పనులు పూర్తి చేస్తాం
* ప్రతి గరీబ్ రథ్‌లో వికలాంగుల కోసం ప్రత్యేక భోగి ఏర్పాటు
* ప్రయాణీకుల టికెట్ల ద్వారా రూ.28,360 కోట్ల ఆదాయం
* బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం
* ప్రయాణికుల సంఖ్య 5.6 శాతం పెరుగుతుందని అంచనా
* ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నా భవిష్యత్ బాగుంటుంది
* రూ.3,000 కోట్ల ఋణం ప్రకటించిన ప్రణబ్ కు కృతఙ్ఞతలు
* 929 స్టేషన్ల ఆధునీకరణ
* ఈ ఏడాది టికెట్ల ద్వారా రూ.36,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం
* హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్ -2 కు గ్రీన్ సిగ్నల్
* గత బడ్జెట్ నిధులు విడుదల చేస్తాం
* శ్రీనగర్ - బారాముల్లా లైన్ విద్యుదీకరణ
* రూ.2,500 కోట్లతో బయో టాయిలెట్లు